
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు సీఎండీగా సీనియర్ ప్రభుత్వ అధికారి రాజీవ్ బన్సాల్‌ను ప్రభుత్వం గురువారం నియమించింది. నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్సాల్.. గతంలో విజయవంతంగా సంస్థను నడిపించారు. 2017లో మూడు నెలలపాటు మధ్యంతర సీఎండీగా సేవలందించారు. ఆ సమయంలో వ్యయాలను గణనీయంగా తగ్గించి, సమయానికి విమానాలు నడిచేలా చేశారు. దీంతో ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టేందుకు ఆయన్ని మళ్లీ నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment