రెబ్బెన: మాట్లాడుతున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సీతారాం
రెబ్బెన : మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 28న చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సీతారాం ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్‌సీ, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు పల్స్ పోలియోపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ సంతోష్, పావని, హెల్త్ అసిస్టెంట్లు కమలాకర్, ప్రవీన్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, అంగన్‌వాడీ, అశ వర్కర్లు పాల్గొన్నారు.
జైనూర్ మండలంలో..
జైనూర్ : పల్స్ పోలియో కార్యక్రమం 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం జైనూర్ ఆస్పత్రిలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలకు అవగాహన కల్పించారు. మండలంలో ఐదు సంవత్సరాల లోపు 3543 మంది పిల్లలు ఉన్నారని వైద్యుడు నరేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
వాంకిడిలో..
వాంకిడి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పల్స్‌పోలీయో నిర్వహణపై అంగన్‌వాడీలు, ఆయాలు, ఏఎన్‌ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 మూడు రోజుల పాటు పల్స్ పోలీయో కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సదస్సులో పీహెచ్‌ఎన్ తెరిసా, సూపర్‌వైజర్ సంతోష్ తదితరులు ఉన్నారు.
తిర్యాణిలో..
తిర్యాణి : పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైద్యాధికారి శ్యాంకుమార్ అన్నారు. మండలంలోని ఎమ్మార్సి కార్యాలయం సమావేశ మందిరంలో పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమంపై వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఈ శ్రీహరి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడి టీచర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment