ఆధునిక కాలంలో సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది, దీనితో పాటు బల్క్ కనెక్షన్‌లను కూడా నిలిపివేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
రూ. 10 లక్షల జరిమానా..
ఇప్పుడు డీలర్లందరికి పోలీసు వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్ర టెలికాం మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని కూడా ప్రకటించారు. సంచార్ సాథి పోర్టల్‌ను ప్రారంభించినప్పటి నుంచి సుమారు 52 లక్షల మోసపూరిత కనెక్షన్లను ప్రభుత్వం గుర్తించి వాటిని డీయాక్టివేట్ చేసినట్లు వైష్ణవ్ వెల్లడించారు.
మొబైల్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న 67,000 మంది డీలర్లను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసిందని.. 2023 మే నుంచి 300 మంది సిమ్ కార్డ్ డీలర్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు కూడా మంత్రి తెలిపారు. గతంలో ప్రజలు సిమ్ కార్డులను విరివిగా కొనుగోలు చేశారని, ఆ విధానానికి స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. మేము మోసపూరిత కాల్‌లను ఆపడంలో సహాయపడే సరైన బిజినెస్ కనెక్షన్ నిబంధనను తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: అసాధారణ విజయాలు.. రోజుకు రూ. 72 లక్షలు జీతం.. అంతేకాదు..
నివేదికల ప్రకారం.. 10 లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నారని, వారికి పోలీస్ వెరిఫికేషన్ కోసం తగిన సమయం ఇస్తామని వైష్ణవ్ చెప్పారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కూడా బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసిందని, బదులుగా బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మోసపూరిత కాల్స్ పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment