Sim Cards
-
మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండి
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సిమ్ కార్డును కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా చెల్లుబాటు అయ్యే చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. దీనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. ఈ ఆధారాలను ఉపయోగించి కొందరు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.ఆర్ధిక నేరాలను తగ్గించడానికి.. ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడటానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ (DoT) టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు లేదా ఫోన్ నెంబర్లు లింక్ అయ్యాయో తెలుసుకోవచ్చు.ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?సంచార్ సతి అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి.అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తుంటారు. ఇలాంటి నెంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడకు చెందిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేశారు.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!సిమ్ కార్డులను ఉపయోగించిన తరువాత, ఎక్కడపడితే అక్కడ పడేయడం మంచిది కాదు. వాటిని కొంతమంది మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. అంతే కాకుండా మీ ఆధార్ కార్డు లేదా ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించే తెలియనివారికి ఎట్టిపరిస్థితుల్లో సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇవ్వొద్దు. వారు ఏదైనా నేరాలకు పాల్పడితే.. దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. -
సిమ్ కార్డులతో సైబర్ నేరం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నకిలీ, కాలం చెల్లిన ఆధార్ కార్డులలో చిన్నారుల ఫొటోలను పెట్టి తయారు చేసిన పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని వాటిని సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరి టీ బ్యూరో (సీఎస్బీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. సిమ్ కార్డుల రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 64.5 శాతం మంది కస్టమర్లు మాత్రమే డిజిటల్ కేవైసీని ఆధార్‌తో లింక్ చేసుకుంటున్నట్టు నివేదిక తేల్చింది.‘టెలికామ్ సిమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రాడ్స్–గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రికమండేషన్స్’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం టీజీ సీఎస్బీ కార్యాలయంలో ఐఎస్బీ ప్రొఫెసర్లతో కలిసి విడుదల చేశారు. సీఏఎఫ్ (కస్టమర్ అక్విజేషన్ ఫారమ్స్)లోని సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు.హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల్లో ఉన్న ఫోన్ నంబర్లకు సంబంధించి మొత్తం 1,600 సీఏఎఫ్ల వివరాలు విశ్లేషించినట్టు తెలిపారు. సైబర్ నేరగాళ్లు వినియోగించిన ఫోన్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్స్‌తో రియల్ టైంలో విశ్లేషించినట్టు వివరించారు. సిమ్ కార్డులు పోతే సమాచారం ఇవ్వాలి: సీఎస్బీ డైరెక్టర్సైబర్ నేరాల్లో సిమ్‌కార్డు సంబంధిత మోసాలు పెరుగు తున్నాయని, వీటిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనం అభిప్రా యపడింది. వినియోగదారుడి వివరాలు వెరిఫికేషన్‌లో చాలా లోపాలు ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఓటీపీ అథెంటికేషన్లోనూ లోపాలు ఉన్నట్టు వెల్లడించింది. ప్రజలు సిమ్ కార్డులు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా శిఖా గోయల్ సూచించారు.పోగొట్టుకున్న సిమ్ కార్డులను వినియోగించి సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అందులో మన వివరాలు ఉంటాయి కాబట్టి మనం చిక్కుల్లో పడతామని హెచ్చరించారు. అదేవిధంగా వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఈ నివేదిక రూపకల్పనలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్లు మనీశ్ గంగ్వార్, డా.శ్రుతిమంత్రిలు పాల్గొన్నారు. -
కొత్త సిమ్ కార్డ్ రూల్స్!.. ఇలా చేస్తే రూ.2 లక్షలు జరిమానా..
ఒకే పేరుతో అనేక సిమ్ కార్డులను తీసుకోవడం వల్ల ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెలికామ్ చట్టంలో పేర్కొన్నదానికంటే కూడా ఎక్కువ సిమ్ కార్డులను తీసుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పదేపదే నిబంధనను ఉల్లంఘిస్తే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవచ్చు. ఒక పేరు మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయని ఎలా తెలుసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవాలి అనే అంశం, వారు ఎక్కడ సిమ్ కార్డు తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు. అయితే జమ్మూ & కాశ్మీర్, అస్సాం, ఈశాన్య లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాలలో అయితే ఒక వ్యక్తి ఆరు సిమ్ కార్డులను మాత్రమే తీసుకోవాలి. కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ఈ నిబంధనలను అమలులోకి తెచ్చింది.కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ఈ నిబంధనలను ఉల్లంఘించి.. నిర్ణయించిన సంఖ్యకంటే ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉంటే వారికి జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ తరువాత మళ్ళీ ఈ రూల్ అతిక్రమిస్తే మొదటిసారి నేరానికి రూ. 50000 వరకు జరిమానా విధిస్తారు. ఆ తరువాత మళ్ళీ రిపీట్ అయితే.. రూ. 2 లక్షల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంది.కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ప్రకారం.. మోసం, చీటింగ్ చేయడానికి సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తే, అటువంటి వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 50000 జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ పడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రభుత్వం 'సంచార్ సాథీ' అనే ప్రత్యేక పోర్టల్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు రిజిస్టర్ అయ్యాయో చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. -
మ్యూల్ సిమ్‌కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్‌కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్‌కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్‌కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్‌లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్‌కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్‌కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. -
Ministry of Telecom: తప్పుడు సిమ్‌లు 21 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అనుమానం వ్యక్తంచేసింది. రీ–వెరిఫికేషన్ చేసి బోగస్ సిమ్‌లుగా తేలిన వాటిని వెంటనే రద్దుచేయాలని భారతీ ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ టెలికం సంస్థలకు డీఓటీ హెచ్చరికలు జారీచేసింది. సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐ, డీఐయూ) విశ్లేíÙంచింది. దీంతో దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నట్లు డీఓటీ విశ్లేషణలో తేలింది. మనుగడలో లేని, తప్పుడు, ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ సిమ్‌కార్డులను సంపాదించి యాక్టివేట్ చేసి ఉంటారని ఏఐ, డీఐయూ విశ్లేషణలో వెల్లడైంది. దేశంలో తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకున్న వారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. 21 లక్షల సిమ్ కార్డుల్లో కొన్ని అనుమానాస్పద ఫోన్ నంబర్ల జాబితాను విడుదల ఆయా టెలికం కంపెనీలకు డీఓటీ పంపించింది. వాటి ధృవీకరణ పత్రాలను సరిచూసి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీవెరిఫికేషన్లో ఆ సిమ్‌లు తప్పుడు పత్రాల ద్వారా తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ నంబర్లను తక్షణం రద్దు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని డీఓటీ అధికారులు చెప్పారు. అనుమానాస్పద నంబర్లపై దర్యాప్తును సరీ్వసు ప్రొవైడర్లు వేగవంతం చేయాలని డీవోటీ తుది గడువు విధించింది. సైబర్ నేరాలకు దుర్వినియోగం! తప్పుడు పత్రాలతో పొందిన సిమ్‌లను ఆయా వ్యక్తులు సైబర్ నేరాలకు వాడుతున్నట్లు డీఓటీ అనుమానం వ్యక్తంచేసింది. ఒక ప్రాంతంలో తీసుకున్న బోగస్ సిమ్‌ను సుదూర ప్రాంతాల్లో వాడున్నట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో సేకరించిన సిమ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొట్టే ప్రమాదముంది. సిమ్‌లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు ఫోన్‌నూ పనికిరాకుండా చేస్తామని హెచ్చరించింది. -
‘న్యూ ఇయర్ నుంచి జరిగే మార్పులు ఇవే’.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
మరికొద్ది రోజుల్లో 2023 ముగిసి.. 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో రోజూవారి జీవితంతో ముడిపడి ఉన్న ఆర్ధికపరమైన అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్, స్టాక్ మార్కెట్ మార్కెట్, బ్యాంక్ లాకర్, ఆధార్‌లో మార్పులు వంటి అంశాలు ఉన్నాయి. అయితే, డిసెంబర్ 31 ముగిసి న్యూఇయర్‌లోకి అడుగు పెట్టిన అర్ధరాత్రి నుంచి చోటు చేసుకునే మార్పుల కారణంగా ఎలాంటి ఆర్ధికరపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే డిసెంబర్ నెల ముగిసే లోపు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాటిల్లో ప్రధానంగా డీమ్యాట్ అకౌంట్‌కు నామిని : మీరు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా.. లేదంటే కొత్త ఏడాది నుంచి మొదలు పెట్టాలనే ప్రణాళికల్లో ఉంటే మాత్రం తప్పని సరిగా డీమ్యాట్ అకౌంట్లో నామిని వివరాల్ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా పెట్టుబడిదారులు స్టాక్స్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా.. సెక్యూరిటీస్‌ని అమ్మాలన్నా, కొనాలన్నా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 లోపు నామినీ వివరాల్ని అందించపోతే ఇకపై మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసేందుకు అర్హులు, పైగా స్టాక్స్‌ను అమ్మలేరు, కొనలేరు. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ : ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ లాకర్ అగ్రమిమెంట్లో డిసెంబర్ 31,2023లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించాలి. నిబంధనల్ని పాటించకపోతే లాకర్ ఫ్రీజ్ అవుతుంది. ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉంటుందని అంచనా. ఆధార్ కార్డ్‌లో మార్పులు : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డ్‌లో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఉచితంగా చేసుకోవచ్చని సెప్టెంబర్ 14, 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆధార్ కార్డ్‌దారుల సౌలభ్యం మేరకు ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆధార్‌లో మార్పులు చేసుకోవాలంటే రూ.50 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 సర్వీస్ ఛార్జీ అంటే సులభంగా తీసుకోవద్దు. దేశంలో రోజూవారి కార్మికులు ఎంత సంపాదిస్తున్నారని తెలుసుకునేందుకు ప్లీటాక్స్ ఆనే సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో దినసరి కూలి రూ.178 అని తేలింది. కాబట్టే డిసెంబర్ 31 లోపు ఆధార్‌లో మార్పులు ఉంటే చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. సిమ్ కార్డ్‌లో మార్పులు : వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ తీసుకోవడం మరింత సులభతరం కానుంది. ఇప్పుడు మనం ఏదైనా టెలికాం కంపెనీ సిమ్ కార్డ్ కావాలంటే పేపర్లకు పేపర్లలో మన వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ ప్రాసెస్ అంతా అన్లైన్లోనే జరుగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) తెలిపింది. కెనడాలో మారనున్న నిబంధనలు : ఈ నిర్ణయంతో జనవరి 1 నుంచి భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందే అని చెప్పుకోవాలి. కెనడాలో చదువుకునేందుకు స్టడీ పర్మిట్ కావాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్ధుల వద్ద 10వేల డాలర్లు ఉంటే సరిపోయేదు. కానీ జనవరి 1,2024 ఆ మొత్తాన్ని 20,635 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. -
ఇక ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్ నంబర్!
సాక్షి, అమరావతి: సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి ‘యూనిక్ ఐడీ(ప్రత్యేక గుర్తింపు) నంబర్’ కేటాయించాలని నిర్ణయించింది. ఓ వ్యక్తికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నా, ఎన్ని సిమ్ కార్డులు ఉన్నా సరే.. ఐడీ నంబర్ మాత్రం ఒకటే ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది చివరినాటికే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. జనాభా కంటే సిమ్కార్డులే అధికం..! మొబైల్ టెక్నాలజీ ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉందో.. సైబర్ నేరస్తులకు అంత ఉపయోగకరంగా మారిందన్నది వాస్తవం. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో జనాభా కంటే మొబైల్ ఫోన్లు/సిమ్ కార్డులే అధికంగా ఉండటం గమనార్హం. 2022 డిసెంబర్ నాటికి దేశంలో 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 10.7 కోట్లుండగా.. ప్రైవేటు టెలికాం కంపెనీల కనెక్షన్లు 102 కోట్లకుపైనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న టెలికాం నిబంధనల మేరకు జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్ కార్డులు ఉండవచ్చు. జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్టంగా 6 సిమ్ కార్డులు ఉండవచ్చు. కానీ ప్రైవేటు టెలికాం కంపెనీల ఫ్రాంచైజీలు కొన్ని సిమ్ కార్డుల విక్రయంలో నిబంధనలను పాటించడం లేదు. దీంతో సైబర్ నేరస్తులు వేర్వేరు పేర్లతో ఫోన్ కనెక్షన్లు, సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. 2022లో భారత్‌లో జరిగిన సైబర్ మోసాలు, వేధింపుల్లో 65 శాతం దొంగ సిమ్‌కార్డులతో చేసినవేనని నేషనల్ సైబర్ సెల్ నివేదిక వెల్లడించింది. వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో నమోదైన మొత్తం నేరాల్లో.. సోషల్ మీడియాకు సంబంధించినవే 12 శాతం ఉండటం గమనార్హం. 14 అంకెలతో యూనిక్ ఐడీ నంబర్.. సోషల్ మీడియా వేధింపులు, ఆన్లైన్ మోసాల కట్టడికి దేశంలో మొబైల్ ఫోన్ల కనెక్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. టెలికాం శాఖతో కలసి కార్యాచరణను రూపొందించింది. మొబైల్ వినియోగదారులు అందరికీ యూ నిక్ ఐడీ నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఇది 14 అంకెలతో ఉండనుంది. ఓ వ్యక్తి పేరిట ఎన్ని ఫోన్ కనెక్షన్లు ఉన్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మా త్రం ఒక్కటే ఉంటుంది. దేశంలో ఎక్కడ సిమ్ కార్డు కొనుగోలు చేసినా.. ఏ ప్రాంతంలో ఫోన్‌ను ఉపయోగిస్తున్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మాత్రం అదే ఉంటుంది. వినియోగదారుల ఫోన్‌కు మెసేజ్ పంపించి.. ఓటీపీ ద్వారా నిర్ధారించి.. యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని కేంద్ర టెలికాం శాఖ భావిస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. ‘అస్త్ర’ అప్డేట్.. సిమ్‌కార్డు మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన కేంద్ర టెలికాం శాఖకు చెందిన ‘అస్త్ర’ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించనున్నారు. మొబైల్ కనెక్షన్ల కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, ఫొటోలు సక్రమంగా ఉన్నాయో, లేదో గుర్తించడంతోపాటు సంబంధిత దరఖాస్తుదారులకు అప్పటికే యూనిక్ ఐడీ నంబరు కేటాయించారా, లేదా అనే విషయాలను కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించనున్నారు. తద్వారా నకిలీ సిమ్‌కార్డులు, వేర్వేరు పేర్లతో ఉన్న సెల్‌ఫోన్ కనెక్షన్లకు చెక్ పెడతాఱు. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సైబర్ కేసు నమోదవ్వగానే.. నిందితులను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సిమ్ కార్డు ఎవరి పేరుతో ఉంది.. యూనిక్ ఐడీ నంబర్‌తో సరిపోలుతోందా, లేదా అనే విషయాలను నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. -
సిమ్ కార్డ్స్ నిబంధనలు మరింత కఠినం - ఉల్లంఘిస్తే..
SIM Cards Rules: భారత ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో చాలా కఠినమైన నిబంధలనలను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దుకాణాలకు కఠినమైన నియమాలు.. సిమ్ కార్డులను విక్రయించే దుకాణాలు మునుపటి కంటే కూడా రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి టెలికామ్ ఆపరేటర్లు రిజిస్టర్డ్ డీలర్ల ద్వారా మాత్రమే సిమ్ కార్డులను విక్రయించాయి. దీనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే వారికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీల బాధ్యత.. ఎయిర్టెల్, జియో వంటి పెద్ద టెలికామ్ కంపెనీలు తప్పకుండా తమ సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలి. అంతే కాకుండా దుకాణాలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలి. పోలీసు తనిఖీలు.. పటిష్టమైన భద్రతలను అమలుపరచడానికి పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అస్సాం, కాశ్మీర్ వంటి కొన్ని ప్రదేశాలలో కొత్త సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలపై పోలీసు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. కావున విక్రయదారులు ఖచ్చితంగా నియమాలను అనుసరించాలి. ధృవీకరణ.. వినియోగదారులు కొత్త సిమ్ కార్డుని కొనుగోలు చేయాలన్నా.. లేదా పాతది పోయినప్పుడు & పనిచేయనప్పుడు ఖచ్చితంగా వివరణాత్మక ధృవీకరణ అందించాల్సి ఉంది. ఈ ప్రక్రియ సరైన వ్యక్తులకు మాత్రమే సిమ్ కార్డ్ యాక్సెస్ ఉందని నిర్థారిస్తుంది. కొత్త రూల్స్ సిమ్ కార్డులను సురక్షితం చేయడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మోసగాళ్ల భారీ నుంచి కూడా కాపాడంలో సహాయపడతాయి. -
సిమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం
న్యూఢిల్లీ: నమోదు చేసుకోని డీలర్ల ద్వారా సిమ్ కార్డులను విక్రయించి, కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని టెల్కోలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనికి ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయని, టెలికాం ఆపరేటర్లు సెప్టెంబర్ 30 లోపు అన్ని ‘పాయింట్ ఆఫ్ సేల్’ (PoS) నమోదు చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొంది. సిమ్ కార్డుల మోసపూరిత విక్రయాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు అన్ని పాయింట్ ఆఫ్ సేల్స్‌ను (పీవోఎస్) సెప్టెంబర్ 30లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పీవోఎస్‌లు తగు పత్రాలను సమర్పించి, రిజిస్టర్ చేయించుకోవాలి. -
వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా!
ఆధునిక కాలంలో సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది, దీనితో పాటు బల్క్ కనెక్షన్లను కూడా నిలిపివేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రూ. 10 లక్షల జరిమానా.. ఇప్పుడు డీలర్లందరికి పోలీసు వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్ర టెలికాం మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని కూడా ప్రకటించారు. సంచార్ సాథి పోర్టల్‌ను ప్రారంభించినప్పటి నుంచి సుమారు 52 లక్షల మోసపూరిత కనెక్షన్లను ప్రభుత్వం గుర్తించి వాటిని డీయాక్టివేట్ చేసినట్లు వైష్ణవ్ వెల్లడించారు. మొబైల్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న 67,000 మంది డీలర్లను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసిందని.. 2023 మే నుంచి 300 మంది సిమ్ కార్డ్ డీలర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు కూడా మంత్రి తెలిపారు. గతంలో ప్రజలు సిమ్ కార్డులను విరివిగా కొనుగోలు చేశారని, ఆ విధానానికి స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. మేము మోసపూరిత కాల్‌లను ఆపడంలో సహాయపడే సరైన బిజినెస్ కనెక్షన్ నిబంధనను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: అసాధారణ విజయాలు.. రోజుకు రూ. 72 లక్షలు జీతం.. అంతేకాదు.. నివేదికల ప్రకారం.. 10 లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నారని, వారికి పోలీస్ వెరిఫికేషన్ కోసం తగిన సమయం ఇస్తామని వైష్ణవ్ చెప్పారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కూడా బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసిందని, బదులుగా బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మోసపూరిత కాల్స్ పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
విజయవాడ లో సిమ్ కార్డుల దందా కలకలం
-
విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు..
సాక్షి, విజయవాడ: నగరంలో సిమ్‌కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు జారీ కావడం కలకలం రేగుతోంది. డాట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్) ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను సీపీ రానా ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఒకే ఫొటోతో ఓ నెట్వర్క్ సంస్థకు 658 సిమ్‌లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు. అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ చేసినట్లు గుర్తించారు. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా సిమ్ కార్డుల దందా బయటపడింది. చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. \ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించారు. ఈ సిమ్‌లు ఎక్కడికి వెళ్లాయి.. ఎవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అక్రమ సిమ్‌కార్డుల దందాపై ఉక్కుపాదం..మీ పేరు మీద ఎన్ని ఉన్నాయ్?
సాక్షి, హైదరాబాద్: టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్, హత్య చేసిన నిందితులు బేగంబజార్, సికింద్రాబాద్‌ల నుంచి నాలుగు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు కొన్నారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లతో, గుర్తింపుతో ఉన్నవే. వీటిని వినియోగించే అభయ్ కుటుంబీకులతో బేరసారాలు చేశారు. ► జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఉగ్రవాదులు సంప్రదింపులు జరపడానికి ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్నే వినియోగించారు. 2016 నాటి ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఫహద్ ఈ తరహాకు చెందిన తొమ్మిది సిమ్‌కార్డుల్ని చారి్మనార్ వద్ద ఉన్న ఔట్లెట్లో ఖరీదు చేశాడు. ► పంజగుట్టలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో ఎర వేసి, నిరుద్యోగులు, ప్రధానంగా మహిళల నుంచి డబ్బు కాజేసిన చక్రధర్ గౌడ్ సైతం పెద్ద సంఖ్యలో ప్రీ–యాక్టివెటెడ్ సిమ్‌కార్డులు వాడాడు. నేరగాళ్లతో పాటు అసాంఘికశక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. అందులో భాగంగానే చక్రధర్ గౌడ్‌కు వీటిని అందించిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్... సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏ సరీ్వసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అనేక మంది సిమ్కార్డ్స్ విక్రేతలు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డులు ఇస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరు మీద సిమ్‌కార్డులు ముందే యాక్టివేట్ చేస్తున్నారు. అరెస్టులతో పాటు డీఓటీ దృష్టికీ.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందుతున్నారు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సరీ్వస్ ప్రొవైడర్లు కచి్చతంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందే. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయన్నది నిపుణులు చెబుతున్నారు. ఈ దందా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల్ని డీఓటీ దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. ఎవరికి వారు తనిఖీ చేసుకోవచ్చు.. ప్రతి వినియోగదారుడూ తన పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. www.sancharsaathi.gov.in వెబ్సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులోకి ప్రవేశించిన తర్వాత టాఫ్‌కాప్ పేరుతో ఉండే నో యువర్ మొబైల్ కనెక్షన్స్ లింక్‌లోకి ఎంటర్ కావాలి. అక్కడ కోరిన వివరాలు పొందుపరిచి, ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరుతో ఎన్ని ఫోన్లు ఉన్నాయో కనిపిస్తాయి. అవన్నీ మీకు సంబంధించినవి కాకపోతే ప్రీ–యాక్టివేటెడ్‌విగా భావించవచ్చు. దీనిపై అదే లింకులో రిపోర్ట్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయించవచ్చు. చదవండి: డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు -
సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!
స్మార్ట్ఫోన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సాధారణ సిమ్‌కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్‌లు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 14, 14ప్రో మోడల్‌లలో ఇప్పటికే ఈ-సిమ్ టెక్నాలజీ ఉంది. అంటే ఈ ఫోన్లలో ప్రత్యేకంగా సిమ్ ట్రేలు ఉండవు. ఇదే క్రమంలో మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది. క్వాల్కామ్ (Qualcomm), థేల్స్ (Thales) సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్(ఐ-సిమ్) సర్టిఫికేషన్‌ను ప్రకటించాయి. దీంతో ఫోన్లలో సాధారణ సిమ్ కార్డులతో పని ఉండదు. Snapdragon 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్ల ప్రధాన ప్రాసెసర్‌లో ఈ ఐ-సిమ్‌ను పొందుపరుస్తారు. దీంతో ఇక ప్రత్యేకమైన చిప్ అవసరం ఉండదు. ఈ ఐ-సిమ్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న ఈ-సిమ్ల మాదిరిగానే డిజిటల్ సైనప్‌లు, సేఫ్టీ ఫీచర్స్‌ను అందిస్తుంది. కానీ దీంతో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్ కూడా ఈ-సిమ్ లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫోన్లను ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేయనవసరం లేదు. ఫోన్లలో సిమ్ స్లాట్ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) జీఎస్ఎం అసోసియేషన్ ఆమోదించిన ఈ ఐ-సిమ్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్‌కాం టెక్నాలజీస్, థేల్స్ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఈ-సిమ్‌తో పాటు థేల్స్ 5జీ ఐ-సిమ్ టెక్నాలజీ.. తమ కస్టమర్లకు మెరుగైన ఎయిర్-ది-ఎయిర్ కనెక్టివిటీ, ఉత్సాహకరమైన ఉత్పత్తులను అందించేందుకు మొబైల్ తయారీదారులు, ఆపరేటర్లకు మరింత అవకాశాన్ని ఇస్తుందని థేల్స్ మొబైల్ ఉత్పత్తుల విభాగం వైస్ ప్రెసిడింట్ గుయిలామ్ లాఫయిక్స్ పేర్కొన్నారు. -
భారత్‌లోనూ ‘ఈ–సిమ్’ సేవలు.. స్పెషల్ ఏంటో తెలుసా?
సాక్షి, అమరావతి: సెల్ఫోన్లలో ఉపయోగించే సిమ్(సబ్స్రై్కబర్ ఐడెంటిటీ మాడ్యూల్) కార్డు మాయమైపోతోంది. పెద్ద సైజు నుంచి క్రమంగా నానో సైజుకు వచ్చేసిన సిమ్ కార్డు.. ఇప్పుడు కంటికి కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోయింది. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక సెల్ఫోన్లు, వాచ్‌లతో పాటే ‘ఈ–సిమ్’లూ విస్తృతంగా వినియోగంలోకి వచ్చేస్తున్నాయి. కొన్నేళ్ల కిందటే ఇది మార్కెట్లోకి వచ్చినా.. అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ‘ఈ–సిమ్’పై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మొబైల్ స్టోర్‌కు వెళ్లకుండానే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండడం ఇందులో ప్రత్యేకత. సిమ్ కార్డులతో పెరిగిన మోసాలు కొన్నేళ్లుగా ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలా కేసులు సిమ్ స్వాప్ మోసాలకు సంబంధించినవే. ఇందులో నేరగాళ్లు మొదట ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీల వంటివి సేకరిస్తారు. వివిధ ఆకర్షణీయ ఈ–మెయిల్స్, మెసేజ్‌లు పంపించి, ఫోన్ కాల్స్ చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత.. ఫోన్ పోగొట్టుకున్నామని, లేదా పాత సిమ్ పాడైపోయిందని చెప్పి నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకుంటారు. టెలికాం ఆపరేటర్ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే.. మోసగాడు సులువుగా బాధితుడి నంబర్‌తో కొత్త సిమ్ తీసుకుంటాడు. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత పూర్తి కంట్రోల్ హ్యాకర్ చేతికి వెళ్లిపోతుంది. ఇక సులువుగా మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బుతో పాటు ఫోన్లోని రహస్య సమాచారమంతా లాగేస్తాడు. ఈ–సిమ్‌తో అడ్డుకట్ట.. ఈ–సిమ్ అనేది ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగిస్తున్న ఫిజికల్ సిమ్‌కు డిజిటల్ రూపం. దీన్ని యాక్టివేట్ చేయాలంటే వ్యక్తిగత వివరాలతో పాటు పర్సనల్ ఐడెంటిఫియబుల్ ఇన్ఫర్మేషన్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ–సిమ్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవడానికి ఫేస్ ఐడీ లేదా బయోమెట్రిక్ విధానంలో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఒకరు ఈ–సిమ్ వాడుతున్నప్పుడు మరొకరు సిమ్ పోయిందని లేదా పాడైపోయిందని నెట్వర్క్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయడానికి కుదరదు. అదే నంబర్‌తో మరో సిమ్‌ను తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా అలా చేస్తే.. వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్–14 మోడల్స్‌కు సిమ్ స్లాట్స్ లేవు. ఇవి ఈ–సిమ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సులభంగా యాక్టివేషన్.. డీ–యాక్టివేషన్ వీటిని సులభంగా యాక్టివేట్ చేయడంతో పాటు డి–యాక్టివేట్ కూడా చేయవచ్చు. మలి్టపుల్ ఫోన్ నంబర్లు, ప్లాన్లను ఒకే డివైజ్‌లో వినియోగించుకోవచ్చు. అంటే సింగిల్ సిమ్ మాత్రమే సపోర్టు చేసే లేటెస్ట్ ఫోన్లలో అదనంగా ఈ–సిమ్ కూడా వినియోగించుకోవచ్చన్నమాట. వీటిని పోగొట్టుకోవడం, పాడవడం లేదా దొంగిలించడం వంటివి సాధ్యం కాదు. వివిధ నెట్‌వర్క్‌లకు, ప్లాన్లకు సులువుగా మారవచ్చు. పైగా నెట్వర్క్ ప్రొవైడర్ స్టోర్‌కు వెళ్లే అవసరం కూడా ఉండదు. అన్నీ రిమోట్ విధానంలోనే ఎస్ఎమ్ఎస్, ఈ–మెయిల్ ద్వారానే యాక్టివేట్ చేయవచ్చు. అయితే, మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఈ–సిమ్‌ను సపోర్ట్ చేస్తుందా.. టెలికాం ఆపరేటర్ ఈ తరహా సదుపాయాలు అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. మనదేశంలో ఐఫోన్, శామ్సంగ్, హానర్, గూగుల్ ఫ్లిక్స్, సోనీ, షావోమీ, నోకియా, మొటొరోలా తదితర కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్ఫోన్లకు మాత్రమే ఈ–సిమ్‌ను సపోర్టు చేస్తున్నాయి. మొదటిసారిగా శామ్సంగ్లో.. ప్రపంచంలో మొట్టమొదట ఈ–సిమ్‌ను 2016లో శామ్సంగ్ గేర్ ఎస్2 3జీ స్మార్ట్‌వాచ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం 2017లో యాపిల్ స్మార్ట్ వాచ్‌లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అతి తక్కువ కాలంలోనే పలు స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు తమ ఫోన్లలో ఈ–సిమ్ సపోర్టును ఏర్పాటు చేయగా.. పలు టెలికాం సంస్థలు ఈ–సిమ్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్–ఐడియా ఈ–సిమ్ సేవలను అందిస్తున్నాయి. -
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. నచ్చినవారికి ఎక్కడంటే అక్కడే! ఫిర్యాదుకు రెడీ?
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో డిప్యుటేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఫైనల్. ఉద్యోగులు ఇదేమని ప్రశ్నిస్తే దశాబ్దాల క్రితం వచ్చిన ఆకాశ రామన్నల ఫిర్యాదులను మళ్లీ తెరమీదకు తెస్తామంటూ హెచ్చరిస్తుంటారు. డిప్యుటేషన్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని ఆధారాలతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అందులో డిప్యుటేషన్లకు సంబంధించి వికలాంగులు, మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలున్నా అవేవి పట్టించుకోకుండా అస్మదీయులకు మాత్రమే కోరుకున్నచోట డిప్యుటేషన్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, ఒకరోజు విధులకు వెళ్లి వస్తే మూడురోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని, దూరభారంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే డిప్యుటేషన్ ఇవ్వాలని వేడుకున్నా కనికరించలేదు. ఎలాంటి ఇబ్బందిలేని ఓ అధికారికి మాత్రం వైరా నుంచి ఖమ్మం జిల్లాకేంద్రానికి డిప్యుటేషన్ ఇచ్చారు. కుటుంబసభ్యుల అనారోగ్యం కారణంగా మంచిర్యాల నుంచి క్లియర్ వేకెన్సీ ఉన్న వైరాకు డిప్యుటేష¯న్ ఇవ్వాలని కోరితే కనీస స్పందన లేదని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో పనిచేస్తున్న మరో అవివాహిత ఉద్యోగి క్లియర్ వేకెన్సీ ఉన్న సంగారెడ్డికి డిప్యుటేషన్‌పై పంపాలని చాలాకాలంగా వేడుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. మానవతాదృక్పథంతో డిప్యుటేషన్లు పరిశీలించి చర్య తీసుకోవాలని ఆర్థికమంత్రి పేషీ సిఫారసు చేసినా డైరెక్టరేట్‌లో మాత్రం బుట్టదాఖలవుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. (చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..) సిమ్‌కార్డుల పితలాటకం తరచూ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మారుస్తుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. తాజాగా మరో కంపెనీకి సెల్ నెట్‌వర్క్‌ను మార్చటంతో గ్రామీణప్రాంతాలు, కార్యాలయ ఆవరణల్లోనూ సిగ్నల్స్ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కార్యాలయాలకు రాగానే విధుల్లో లాగిన్ కావాలంటే వారి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీయే ఆధారం. కానీ, ఓటీపీ వచ్చేందుకు గంటల సమయం పడుతుండటంతో ఒక్కపూట మొత్తం అవస్థలు పడుతున్నామని, సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సీనియర్ ఐఏఎస్ అండ ఉందన్న ధీమాతో నిబంధనలన్నీ బేఖాతర్ చేస్తున్న ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఆపై ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని ఉద్యోగులు, సంఘాలనేతలు భావిస్తున్నారు. రూ.23.8 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను స్వాధీనం చేసుకోకపోవటం, కొత్త కంప్యూటర్ల మొరాయింపు అంశంపైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. (చదవండి: పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్) -
ఐఫోన్లలో అదిరిపోయే ఫీచర్, సిమ్‌కార్డ్‌తో పనిలేకుండా..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. టెక్ మార్కెట్లో ప్రత్యర్ధుల్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. విడుదల చేసే ప్రతి గాడ్జెట్‌లో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటూనే..మార్కెట్‌ను శాసిస్తుంది. తాజాగా యాపిల్ ఐఫోన్15 సిరీస్‌లో సిమ్ స్లాట్ లేకుండా ఈ-సిమ్(ఎలక్ట్రానిక్ సిమ్)తో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెక్ బ్లాగ్లు కథనాల్ని ప్రచురించాయి. యాపిల్ ఐఫోన్ 13సిరీస్ విడుదల నేపథ్యంలో ఐఓఎస్‌ను అప్ డేట్ చేసింది. త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో నాచ్ డిస్ప్లే కాకుండా సెల్ఫీ కెమెరా, ఫ్రంట్ సెన్సార్లతో హోల్ పంచ్ డిస్ప్లేతో పరిచయం చేయనుంది. ఇక వాటికంటే భిన్నంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ను సిమ్ స్లాట్ లేకుండా విడుదల చేయనున్నట్లు టెక్ బ్లాగ్లు కథనాల్లో పేర్కొన్నాయి. జీఎస్ఎం అరీనా కథనం ప్రకారం..2023లో విడుదల కానున్న ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఫోన్లలో ఫిజకల్ సిమ్ ఉండదని, ఇకపై యాపిల్ విడుదల చేయబోయే ఐఫోన్ సిరీస్‌లన్నీ ఈ-సిమ్‌తో వస్తాయని తెలిపింది. మరికొన్ని నివేదికలు..ఐఫోన్లు డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్‌తో వస్తాయని, యూజర్లు ఏకకాలంలో రెండు ఈ-సిమ్‌లను వినియోగించుకునే సౌకర్యం ఉన్నట్లు పేర్కొన్నాయి. అయినప్పటికీ, నాన్-ప్రో మోడల్‌లలో పూర్తిగా ఈ-సిమ్ స్లాట్లు ఉంటాయా లేదా ఫిజికల్‌గా సిమ్ కార్డ్‌లను కొనసాగిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా యాపిల్ సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా ఐఫోన్‌ను లాంఛ్ చేసినప్పటికీ, ఈ-సిమ్‌లను ఉపయోగించలేని దేశాల్లో ఫిజికల్ సిమ్ స్లాట్ వెర్షన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ-సిమ్ అంటే ఏమిటి? ఈ-సిమ్ అనేది ఎలక్ట్రానిక్ సిమ్ కార్డ్. ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగించే ప్లాస్టిక్ సిమ్ కార్డ్‌లా కాకుండా చిప్ తరహాలో ఉంటుంది. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లలో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. వాటిలో ఈ-సిమ్‌ను ఇన్సర్ట్ చేయడం చాలా సులభం. అందుకే టెక్ కంపెనీలు ఈ-సిమ్‌ను వినియోగించేందుకు సుమఖత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా యాపిల్ సైతం ఐఫోన్ 15లో ఈ ఈ-సిమ్‌ను ఇన్సర్ట్ చేయనుంది. చదవండి: షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే! -
పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటున్నారా..! అయితే..
న్యూఢిల్లీ: సిమ్ కార్డు కనెక్షన్లు ఒక్కరి పేరుతో 9కి మించి ఉంటే మళ్లీ ధ్రువీకరించాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్లను టెలికం శాఖ ఆదేశించింది. ధ్రువీకరణ లేకపోతే కనెక్షన్లను తొలగించాలని కోరింది. జమ్మూ అండ్ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, అసోమ్లకు ఈ పరిమితి 6 సిమ్కార్లులుగా పేర్కొంది. తమకున్న కనెక్షన్లలో వేటిని యాక్టివ్‌గా ఉంచుకోవాలి, వేటిని డీయాక్టివేట్ చేయాలన్నది చందాదారులకు ఆప్షన్ ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. టెలికం శాఖ డేటా విశ్లేషణ చేసిన సమయంలో వ్యక్తిగత చందాదారులు 9కంటే ఎక్కువ కనెక్షన్లను కలిగి ఉన్నట్టు గుర్తిస్తే.. వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ఫ్లాగ్ చేయనున్నట్టు టెలికం శాఖ తెలిపింది. ఇటువంటి కనెక్షన్లకు అవుట్గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లోపు నిలిపివేయాలని, ఇన్కమింగ్ కాల్స్ సదుపాయాని 45 రోజుల్లోపు తొలగించాలని ఆదేశించింది. ఆర్థిక నేరాలు, ఇబ్బంది పెట్టే కాల్స్, మోసపూరిత చర్యలకు చెక్ పెట్టేందుకే టెలికం శాఖ తాజా ఆదేశాలు తీసుకొచ్చింది. -
కొత్తరకం మోసం: ఆధార్‌కు రూ.200.. పాన్‌కు రూ.500
పెదగంట్యాడ(గాజువాక): ఆధార్ కార్డు ఉందా.. ఆ నంబరు చెప్పండి.. ఇక్కడ వేలి ముద్ర వేయండి.. ఇదిగో తీసుకోండి రూ.200.. పాన్ కార్డు ఉందా అయితే దీనికి ఇవిగో రూ.500 అంటూ కొంతమంది వ్యక్తులు కొత్తరకం మోసానికి తెరతీశారు.. అంతేకాకుండా పేదలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి.. వారి పేరుతో సిమ్ కార్డులు విక్రయానికి పథకం పన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి హార్బర్ ఏసీపీ శ్రీరాముల శిరీష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రాంబిల్లి మండలానికి చెందిన కొవిరి జగన్నాథం, జానకి రామిరెడ్డి, బండియ్య, కొవిరి నాని అనే నలుగురు వ్యక్తులు శనివారం మండలంలోని వికాస్‌నగర్ సెంటర్, బీసీ రోడ్డుకు ఆనుకొని ఉన్న కమ్మలపాకల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామంటూ పేదలను నమ్మబలికారు. ఆధార్ కార్డు, పాన్‌కార్డు ఉన్న వారి వివరాలు సేకరించి, వారితో వేలిముద్ర వేయించి వారికి డబ్బులు ఇవ్వడం మండలంలో సంచలనమైంది. కొవిరి నాని అనే వ్యక్తి కొత్తపట్నంలో సెల్ షాప్ నడుపుతున్నాడు. అతను ఓ ప్రయివేటు కంపెనీ సిమ్‌కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొత్తరకం మోసానికి తెరలేపాడు. ఇందుకు మరో ముగ్గురితో కలిసి పేదలకు డబ్బులు ఇప్పించి.. వారి ఆధార్, పాన్ కార్డుల ద్వారా సిమ్‌కార్డులను ఎక్కువధరకు అమ్ముకునేలా పథకం రచించాడు. ఆ సిమ్‌లను ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుకునే వారికి అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. ఆధార్ వివరాలు సేకరించి డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో కొంతమంది వ్యక్తులు అది మోసం అని గ్రహించి వెంటనే 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే న్యూపోర్టు పోలీసులు వారు ఉన్న స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే నలుగురిలో ముగ్గురు పరారయ్యారు. కొవిరి జగన్నాథంను శనివారం అదుపులోకి తీసుకున్నారు. జానకి రామిరెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యూపోర్టు సీఐ ఎస్.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో.. -
మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!
సాక్షి, గచ్చిబౌలి: నైజీరియాలో సూత్రధారి..ముంబైలోని మీరా రోడ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పాత్రధారులు కలిసి 2011 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ స్వాపింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరిన ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. తమ పరిధిలో నమోదైన రెండు నేరాల్లో ఈ గ్యాంగ్ రూ.11 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వీరి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ⇔ ముంబయ్‌లోని మీరా రోడ్‌కు చెందిన అశి్వన్ నారాయణ్ షరేగర్ అక్కడ ఓ డాన్సింగ్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి అనేక మంది నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో నేరాలు చేసే వారికి సహకరించడానికి మీరా రోడ్ వాసులు పరిచయం చేస్తుండేవాడు. ⇔ ఒకప్పుడు ముంబైలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ఉంటున్న జేమ్స్‌ను మీరా రోడ్‌కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లేతో పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు జమీర్ అహ్మద్ మునీర్ సయీద్, షోయబ్ షేక్, ఆదిల్ హసన్ అలీ సయీద్, జునైద్ అహ్మద్ షేక్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఇలానే పశి్చమ బెంగాల్లోనూ ఓ ముఠా పని చేస్తోంది. ⇔ జేమ్స్ అక్కడ ఉంటూనే దేశంలోని వివిధ నగరాలకు చెందిన సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ఇంటర్నెట్ నుంచి సంగ్రహిస్తాడు. వాటిని ఐటీ రిటన్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. వీటిని అందుకునే సంస్థలు తెరిచిన వెంటనే మాల్వేర్ వాళ్ళ కంప్యూటర్/ఫోన్లోకి ప్రవేశిస్తుంది. దీంతో అది పరోక్షంగా జేమ్స్ ఆదీనంలోకి వెళ్ళిపోతుంది. ⇔ ఆపై వాటిలో ఉన్న ఈ–మెయిల్స్ తదితరాల్లో వెతకడం ద్వారా వారి అధికారిక సెల్‌ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంటారు. ఈ వివరాలను అతడు వాట్సాప్ ద్వారా చంద్రకాంత్‌కు పంపిస్తాడు. వీటి ఆధారంగా ఇతగాడు తనకు ఆయా సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయాల్లో ఉన్న పరిచయాలను వినియోగించి ఆ బ్యాంకు ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ ⇔ ఈ వివరాలను వినియోగించే చంద్రకాంత్ నకిలీ ఆధార్ వంటి గుర్తింపుకార్డులు తయారు చేస్తాడు. ఈ గుర్తింపు కార్డులపై పేర్లు అసలు యజమానివే ఉన్నప్పటికీ... ఫొటోలు మాత్రం జమీర్ లేదా ఆదిల్వి ఉంటాయి. వీటితో పాటు ఆయా సంస్థల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్, స్టాంపులు, సీళ్ళు కూడా చంద్రకాంత్ రూపొందిస్తాడు. వీటిని ఒకప్పుడు జమీర్‌కు ఇచ్చి సరీ్వస్ ప్రొవైడర్లకు చెందిన స్టోర్స్‌కు పంపేవాడు. ⇔ గతంలో కోల్‌కతా ముఠాతో పాటు అతడు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని జునైద్, ఆదిల్ నిర్వర్తిస్తున్నాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోర్స్‌కు తిరిగే వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి సిమ్‌కార్డు తీసుకుంటారు. తమ చేతికి చిక్కిన సిమ్‌ను చంద్రకాంత్‌కు అప్పగిస్తారు. ఇతడు ఈ వివరాలను జేమ్స్ వాట్సాప్ ద్వారా చేరవేస్తాడు. మరోపక్క షోయబ్ షేకర్, అష్విన్లు బోగస్ పేర్లు, వివరాలతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటి వివరాలనూ చంద్రకాంత్ ద్వారా జేమ్స్‌కు పంపిస్తారు. ⇔ తన వద్ద ఉన్న నకిలీ సిమ్‌కార్డుల్ని చంద్రకాంత్ తక్కువ రేటుతో కొనుగోలు చేసే ఫోన్లలో వేసుకుంటాడు. ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ ముఠా కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తోంది. ఆ రోజుల్లో రాత్రి పూట జేమ్స్ ఆ ఫోన్ నెంబర్లతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల ఇంటర్నెట్ బ్యాకింగ్లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఖాతా నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తన వద్ద... సిమ్ కార్డు చంద్రకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్‌లో పాస్వర్డ్ మార్చి.. ⇔ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి జేమ్స్ దాని పాస్వర్డ్ మార్చేస్తాడు. అందుకు అవసరమైన పిన్ను తన వద్ద ఉన్న ఫోన్ నెంబర్‌కు అందుకునే చంద్రకాంత్ తక్షణం వాట్సాప్ ద్వారా జేమ్స్‌కు చేరవేస్తాడు. ఇలా పాస్వర్డ్ మార్చే అతగాడు ఆ బ్యాంకు ఖాతాను యాక్సస్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని రెండుమూడు దఫాల్లో చంద్రకాంత్ అందించే నకిలీ ఖాతాల్లోకి జమ చేస్తాడు. తాము తెరిచిన నకిలీ ఖాతాల్లోకి వచ్చే ఈ మొత్తాలను అషి్వన్, షోయబ్ డ్రా చేసి చంద్రకాంత్‌కు ఇస్తారు. ⇔ వీళ్ళు, చంద్రకాంత్ 50 శాతం కమీషన్లు తీసుకుంటూ మిగిలిన మొత్తాన్ని హవాలా లేదా బిట్కాయిన్ల ద్వారా జేమ్స్‌కు పంపింస్తాడు. ఈ అంతర్జాతీయ గ్యాంగ్ గత ఏడాది జూన్, అక్టోబర్‌ల్లో సైబరాబాద్ పరిధిలో ఉండే రెండు కంపెనీలకు చెందిన ఖాతాలను టార్గెట్ చేశారు. వాటి నుంచి రూ.11 లక్షలు ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సరీ్వసెస్ (ఐఎంపీఎస్) ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. ⇔ దాదాపు ఆరు నెలల పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు ముంబై వెళ్ళివచ్చారు. ఎట్టకేలకు జేమ్స్, షోయబ్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. -
‘గత నెల సుశాంత్ 50 సిమ్‌లు మార్చాడు’
పట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు వారాలకు పైనే అయినప్పటికి.. ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు.. బాలీవుడ్ స్టార్లపై విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలో టెలివిజన్ హోస్ట్, నటుడు శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లోని బంధుప్రీతి వల్ల సుశాంత్ మరణించలేదని.. ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే అతడు ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కలిసిన శేఖర్ సుమన్ దీని గురించి చర్చించానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటికి కనిపించే దాని కంటే ఎక్కువగా ఏదో జరిగినట్లు సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటిని గమనిస్తే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి’ అన్నారు. అంతేకాక ఓ సిండికేట్, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయని అన్నారు. ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిండికేట్‌లో భాగస్వాములైన స్టార్లందరు తనకు తెలుసని.. కానీ సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదన్నారు.(‘సుశాంత్ మరణాన్ని ముందే ఊహించా’) ‘సుశాంత్ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్ కార్డులు మార్చాడు. ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు. వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా తెలియాలి. బంధుప్రీతి వల్ల సుశాంత్ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలోనే గ్యాంగ్‌ల వల్లే సుశాంత్ మరణించాడు’ అంటూ శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ కుటుంబాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరామర్శించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.(‘నా భర్త కూడా బాధితుడే.. నేను చూశాను’) -
ఒకే నంబర్‌తో రెండు సిమ్‌లు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరుసగా వెలుగులోకి వచ్చిన సిమ్‌కార్డుల బ్లాక్ స్కామ్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయా వ్యాపారులు వినియోగిస్తున్న సిమ్‌కార్డు సర్వీస్ ప్రొవైడర్ల నిర్లక్ష్యం ఉందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరి సిమ్‌కార్డు యాక్టివ్‌గా ఉండగా..దాన్ని బ్లాక్ చేసే మరొరికి అదే నెంబర్‌తో సిమ్‌కార్డు జారీ చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఎయిర్టెల్ సంస్థకు సోమవారం నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువు లోపు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి రికార్డులు సమర్పించాల్సిందిగా వాటిలో ఆదేశించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఈ సిమ్బ్లాక్స్కామ్కు నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారులు బలయ్యారు. ఒకరి ఖాతాల నుంచి రూ.38 లక్షలు, మరొకరి ఖాతాల నుంచి రూ.50 లక్షల్ని సైబర్ నేరగాళ్ళు కాజేసిన విషయం విదితమే. రెండు వారాల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి చెందిన రెండు ఖాతాల నుంచి రూ.38 లక్షలు కాజేసిన ఉదంతం మరువక ముందే... గత గురువారం మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ ఖాతా నుంచి రూ.50 లక్షలు సైబర్ నేరగాళ్ళు తమ ఖాతాల్లోకి మళ్ళించేసుకున్నారు. ఈ ఇద్దరు వ్యాపారులు తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఖాతాలకు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన లావాదేవీలు, వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సహా ఇతర అలెర్ట్స్ కోసం తాము వినియోగిస్తున్న ఎయిర్టెల్ సంస్థ నెంబర్లను అనుసంధానించారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి ఫోన్ హఠాత్తుగా పని చేయలేదు. ఆయన తేరుకునే లోపే రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.38 లక్షలు సైబర్ నేరగాళ్ళకు చేరాయి. అమీర్‌పేట వ్యాపారి మాత్రం తన సిమ్‌కార్డు బ్లాక్ అయిన విషయం గుర్తించి తన సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎయిర్టెల్ సంస్థను సంప్రదించారు. (హైదరాబాద్ ప్రజలకు ఎయిర్టెల్ శుభవార్త) మీ నెంబర్‌తో చెన్నైలో కొత్త సిమ్ యాక్టివేట్ అయిందని, అందుకే ఇక్కడిది బ్లాక్ అయిందంటూ ఆ సంస్థ నుంచి సమాధానం వచ్చింది. అలా ఎందుకు జరిగిందని శ్రీహర్ష ఆరా తీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన తన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే వాటి నుంచి రెండు దఫాల్లో రూ.50 లక్షలు మాయమైనట్లు తేలింది. ఈ రెండు నేరాలు చోటు చేసుకువడానికి వ్యాపారులు వినియోగిస్తున్న నెంబర్‌తోనే మరో సిమ్‌కార్డు జారీ కావడమే కారణమని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇలా జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్తున్న అధికారులు ఎలా జరిగిందనే దానిపై దృష్టి పెట్టారు. ఏ పత్రాల ఆధారంగా మరో సిమ్‌కార్డు జారీ అయింది? దానికి ప్రామాణికాలు ఏంటి? తదిరాలు తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ విషయాలు తెలిస్తేనే ఈ కేసుల దర్యాప్తు ముందుకు వెళ్ళడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చోటు చేసుకోకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి రికార్డులతో తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్టెల్ సంస్థకు ఈ రెండు కేసుల్లోనూ వేర్వేరు నోటీసులు జారీ చేశారు. కేసుల దర్యాప్తులో భాగంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్కడి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా సైబర్ నేరగాళ్ళు ఈ ఖాతాలకు యాక్సస్ చేశారనే అంశాన్నీ సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. -
హైదరాబాద్ ప్రజలకు ఎయిర్టెల్ శుభవార్త
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ వినుత్న అలోచనకు అంకురార్పణ చేసింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎయిర్టెల్ వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా ఇంటర్నెట్, డీటీఎచ్(టీవీ రీచార్జ్) తదితర సేవలను వినియోగదారులు ఇంటి నుంచే పొందవచ్చని పేర్కొంది. తాజా సేవలపై ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ స్పందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిమ్‌కార్డు జారీ, ఇంటర్నెట్, డీటీఎచ్ తదితర సేవలను కస్టమర్లకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హోమ్ డెలివరీ చేసే ఉద్యోగులకు ప్రుభుత్వ నియమాల ప్రకారం శిక్షణ ఇచ్చామని అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించామని.. విస్తృత సేవలందిస్తున్న ఎయిర్టెల్ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఎయిర్టెల్ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుత కష్ట కాలంలో రీచార్జ్ చేసుకోలేనివారి కోసం ‘సూపర్ హీరోస్’ అనే ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. రీచార్జ్ చేసుకోలేని వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే 10 లక్షల మంది కస్టమర్లు ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావడంతో పాటు అవసరమైన వారికి రీచార్జ్ చేశారని గోపాల్ విట్టల్ కొనియాడారు. చదవండి: డిస్నీ+హాట్‌స్టార్ విఐపీ ఫ్రీ: ఎయిర్టెల్ కొత్త ప్యాక్ -
వీకెండ్లో సిమ్ బ్లాకా?
సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్‌లోనో.. వరుసగా సెలవులు ఉన్నప్పుడో హఠాత్తుగా మీ సిమ్‌కార్డు పని చేయకుండా బ్లాక్ అయిందా? మీ బ్యాంకు ఖాతా లావాదేవీలతో అది ముడిపడి ఉందా? ఆర్టీజీఎస్ వంటి ప్రక్రియలకు సంబంధించిన పిన్ ఆ నంబర్‌కే వస్తుంటుందా? అయితే ఇది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా అనుమానించాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరికైనా ఇలా బ్లాక్ అయి ఉంటే తక్షణం స్పందించి సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. ‘బ్లాక్’తో డమ్మీవి తీసుకుంటున్నారు.. ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ పట్టణాలు, నగరాలకు పంపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్న నైజీరియన్లు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ తర్వాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితులు సిమ్‌కార్డుల్ని వీరు చాకచక్యంగా బ్లాక్ చేయిస్తున్నారని తేలింది. దీనికోసం అతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో అక్కడకు వెళ్లి సర్వీస్ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడిని సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా వీరివద్దకు చేరి ఉంటోంది. ఈ వివరాలతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్‌కార్డు పోయిందని, మరోటి ఇప్పించమంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. దీంతో సెల్ కంపెనీల వారు అసలు ఆ నెంబర్‌తో పని చేస్తున్న సిమ్‌ను బ్లాక్ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందించేస్తున్నారు. ఈ పనిని ఎక్కువగా వారాంతాల్లో, సెలవు దినాల్లో చేస్తుండటంతో సిమ్ బ్లాక్ అయినట్లు దాని యజమానులు గుర్తించినా... సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించడానికి కొంత సమయం తీసుకుంటున్నారు. అదను చూసుకుని భారీ మొత్తం స్వాహా.. అసలు వ్యక్తి వివరాలతు డూప్లికేట్ సిమ్ తమ చేతికి వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్లు అసలు అంకం ప్రారంభిస్తున్నారు. అప్పటికే ‘వెబ్సైట్’ ద్వారా బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలను సంగ్రహించే ఈ– కేటుగాళ్లు వాటిని తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇక తీసుకున్న సిమ్‌ను వినియోగించి బ్యాంకుకు కాల్ చేస్తున్న నేరగాళ్లు ఖాతాదారుడి మాదిరిగానే మాట్లాడుతూ... ఓ సంస్థకు రియల్– టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పద్ధతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం వన్–టైమ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ (ఓటీపీడబ్ల్యూ) పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నంబర్ నుంచే ఫోన్ రావడం, వారు అడిగిన అన్ని వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీడబ్ల్యూ ఇచ్చేస్తున్నారు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్ చేసిన ఖాతాను ఆన్లైన్ ద్వారా యాక్సిస్ చేస్తున్న నేరగాళ్లు అప్పటికే తెరిచి ఉంచిన బోగస్ కరెంట్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స్ ఖాతాలనూ ఇదే పంథాలో వివరాలు, సిమ్ సంగ్రహించడం ద్వారా ఖాళీ చేస్తున్నారు. డ్రా చేయడం సాధ్యం కాకపోయినా.. సైబర్ నేరగాళ్లు ఈ కరెంట్, సేవింగ్స్ ఖాతాలను తమ అధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్ ధ్రువీకరణలు తయారు చేయించి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్స్ఫర్ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేయించేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్‌గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్లుగా ఇస్తున్నారు. ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్లి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా కేవలం ఈ మనీ మ్యూల్స్ మాత్రమే చిక్కుతారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకి రారు. అనేక సందర్భాల్లో అసలు వ్యక్తులైన బాధితులు మోసం, నగదు బదిలలీ జరిగిన విషయాలను గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వీరు వాడేవన్నీ బోగస్ వివరాలతో తీసుకున్నవి కావడంతో చిక్కడం కూడా కష్టంగా మారుతోంది. కేంద్ర తాజాగా తీసుకున్న ‘కరెన్సీ నిర్ణయం’తో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు వచ్చాయి. దీంతో సైబర్ నేరగాళ్లు నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అయినప్పటికీ ఆన్లైన్లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్ చిరునామాల్లోనే, కొరియర్ వారిని తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మైక్రో సిమ్‌కార్డుల ఆధారంగా మరోలా... ఇటీవల కాలంలో అన్ని సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు మైక్రో సిమ్‌కార్డుల్ని అందిస్తున్నారు. సెల్ఫోన్లన్నీ ఇవి పట్టే విధంగానే డిజైన్ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ–ప్లేస్’ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం సైబర్ నేరగాళ్లు తమను అనుకూలంగా మార్చుకుంటున్నారు. అప్పటికే ‘వెబ్సైట్ల’ ద్వారా వినియోగదారుడి పూర్తి వివరాలు సంగ్రహిస్తున్న సైబర్ నేరగాళ్లు సిమ్ బ్లాకింగ్ కోసం మైక్రో కార్డు ‘విధానాన్ని’ అవలంబిస్తున్నారు. ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్‌కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సిమ్ ఐడెంటిటీ (ఐసీఐడీ) నంబర్‌ను పాత పెద్ద సిమ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్ నేరగాళ్లు మైక్రో సిమ్ తీసుకుంటున్నారు. అప్పటికే సంగ్రహించిన వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదిస్తున్నారు. అనివార్య కారణాలు చెప్తూ అప్పటికే వారు వినియోగిస్తున్న పాత సిమ్‌కార్డు నుంచి తాము పంపే నెంబర్‌ను (ఐసీఐడీని) సర్వీసు ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయమని చెప్తున్నారు. అలా చేసిన వెంటనే కొన్ని గంటల పాటు సిమ్ పని చేయదని, ఆపై అప్డేట్ అవుతుందని నమ్మబలికుతున్నారు. వీరి వలలో పడిన వినియోగదారులు అలా చేసేసరికి నేరగాళ్లు తీసుకున్న మైక్రో సిమ్ యాక్టివేట్ అవుతోంది. వినియోగదారుల మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. -
పేలుళ్లకు పన్నాగం.. 10 సిమ్‌కార్డులు కొనుగోలు
బెంగళూరుకు భారీ పేలుళ్లు ముప్పు తప్పినట్లయింది. సకాలంలో ఉగ్రవాద ముఠా పట్టుబడడంతో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ఖాకీలు అడ్డుకున్నారు. దక్షిణాదిలో జిహాదీ ఉగ్రవాదాన్ని మూలమూలలకూ విస్తరించడం, యువతను అందులోకి చేర్చుకోవడం, విధ్వంసం సృష్టించడమే ముఠా అజెండాగా వెల్లడైంది. వీరు కొనుగోలు చేసిన సిమ్‌కార్డులు పశ్చిమబెంగాల్లో పనిచేస్తుండడం గమనార్హం. ముఠాకు చెందిన ఇద్దరు మాస్టర్మైండ్లు శివమొగ్గ జిల్లా నుంచి పరారైనట్లు గుర్తించారు. కర్ణాటక, బనశంకరి: ఉద్యాన నగరంలో జనసమ్మర్ధం కలిగిన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, ఓ వర్గానికి చెందిన ముఖ్య నేతల హత్యలకు పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో మహబూబ్ పాషా వెల్లడించాడు. సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రహస్య స్థలంలో అతన్ని విచారిస్తున్నారు. భయానకమైన అంశాలను వెల్లడించడంతో విచారణను తీవ్రతరం చేశారు. అంతేగాక ముఖ్యమంత్రి సొంత జిల్లా శివమొగ్గ తీర్థహళ్లిలో ఇద్దరు మాస్టర్‌మైండ్స్ ఉన్నట్లు ఇతడు బయటపెట్టాడు. ఓ ఎంపీ హత్యకు, విధ్వంసానికి కుట్రపన్నిన ఆరుగురిని శుక్రవారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఈ ముఠాలో ముఖ్యమైన మహబూబ్‌పాషాను ఖాకీలు లోతుగా విచారిస్తున్నాడు. ఇతడు విప్పిన గుట్టుమట్ల ఆధారంగా మాస్టర్ మైండ్స్ కోసం సీసీబీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 10 సిమ్‌కార్డులు కొనుగోలు దక్షిణ భారతదేశంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థను బలోపేతం చేయడానికి ఈ జిహాదీ గ్యాంగ్ పనిచేస్తోందని గుర్తించారు. 10 మొబైల్ సిమ్‌కార్డుల కొనుగోలు ఆధారంగా విచారణ చేపట్టి సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. కీలక నిందితుడు మహబూబ్‌పాషా ఐసిస్ దక్షిణ భారత కమాండర్‌గా గుర్తించారు. 2019 ఏప్రిల్‌లో తమిళనాడు హిందూనేత సురేశ్ హత్య కేసులో నిందితుడు అనుమానిత ఉగ్రవాది మోహినుద్దీన్‌ఖాజా జామీను తీసుకున్న అనంతరం పరారీలో ఉన్నాడు. సేలంలో మోహినుద్దీన్ ఖాజా శిష్యుడు ఒకరు నకిలీ పత్రాలు అందించి 10 సిమ్‌కార్డులు కొనుగోలు చేశాడు. ఈ సిమ్‌కార్డులు కోలారు, పశ్చిమబెంగాల్లోని బురŠాద్వన్‌లలో పనిచేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. తక్షణం ఐఎస్డీ, సీసీబీ పోలీసులు అప్రమత్తమై సుద్దగుంటెపాళ్యలోని ఓ ఇంటిలో మహబూబ్‌పాషా అనుచరుడిని అరెస్ట్ చేశారు. సీసీబీ, ఐఎస్డీ పోలీసులు అప్రమత్తమై జరగబోయే భారీ ముప్పు నుంచి తప్పించగలిగారు. శ్రీలంక పేలుళ్లతో సంబంధం? మహబూబ్ పాషా కేవలం యువకులనే నియమించుకుని వారికి శిక్షణనిచ్చేవాడు. శ్రీలంకలో గుడ్‌ఫ్రైడే నాడు చర్చిలు, హోటళ్లలో జరిగిన బాంబుదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఈ ముఠాలో ఉన్నారనే అనుమా నం వ్యక్తమౌతోంది. మహబూబ్ పాషా అరెస్టైన అనంతరం తీర్థహళ్లిలో ఉన్న ఇద్దరు మా స్టర్‌మైండ్స్ ఉడాయించినట్లు తెలిసింది. ఒక వర్గం యువకులను ఉగ్రవాద కార్యకలాపాలకోసం నియామకాలు, శిక్షణను మహ బూబ్‌పాషా చూసేవాడు. చివరికి తన ఇద్దరు కు మారులను కూడా ఉగ్రవాద శిక్షణనిచ్చాడు. -
కామారెడ్డి నుంచి ‘సిమ్’లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన హనీట్రాప్ (వలపు వల) కేసు లో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు మూలాలు కామారెడ్డిలో ఉన్నా యని పోలీసులు గుర్తించారు. భారత ఆర్మీ అధికారులే లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ విసిరిన వలపువల హైదరాబాద్‌లో బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబం ధించి బుధవారం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా పొల్కంపేటకు చెందిన మహమ్మద్ వాహెద్ పాషా, మహమ్మద్ అహ్మద్ పాషా అనే సోదరులు, మెదక్‌కు చెందిన మహమ్మ ద్ నవీద్ పాషాలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో అన్నదమ్ములిద్దరూ సిమ్‌కార్డులు విక్రయించే ఔట్లెట్ నిర్వాహకులు. నవీద్ ఓ ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీలో టెలికం మేనేజర్. వీరు ముగ్గురూ ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్ జాఫర్‌లకు సిమ్‌కార్డులు సరఫరా చేసినట్లు గుర్తించామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రభాస్క ర్, డీఐ ప్రసాదరావు బుధవారం మీడి యాకు తెలిపారు. కాగా, విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ను వీఓఐపీ సాంకేతికతతో లోకల్‌కాల్స్‌గా మార్చడంతో తమ సంస్థ ఆదాయానికి భారీగా గండిపడిందని బీఎస్ఎన్ఎల్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు బుధవారం చాంద్రాయణగుట్ట పోలీసులకు బీఎస్ఎన్ఎల్ సంస్థ టెక్నికల్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎలా చేశారంటే? పాషా సోదరుల వ్యాపారంలో పెద్దగా లాభాల్లేవు. సిమ్‌కార్డులు సమకూరిస్తే రెట్టింపు డబ్బులు ఇస్తానని నవీద్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఒక్కో సిమ్‌కార్డును రూ.300 చొప్పున 160 సిమ్‌కార్డులు విక్రయించారు. తమ వద్ద సిమ్‌లు తీసుకున్న వారి ధ్రువీకరణ పత్రాలతోనే కొత్త సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశారు. సదరు సిమ్‌లను నవీద్ తీసుకెళ్లి రూ.500ల చొప్పున ఇమ్రాన్‌ఖాన్‌కు విక్రయించాడు. వీటితోనే హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ఇస్మాయిల్‌నగర్ సమీపం లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెక్నాలజీతో ప్రైవేటు టెలిఫోన్ ఎక్సే్చంజ్‌ని ఏర్పాటు చేశాడు. అలా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మారుస్తూ.. స్థానిక టెలికం కంపెనీల ఆదాయానికి గండికొట్టాడు. పాకిస్తాన్ నుంచి వచ్చే కాల్స్‌ను ఆర్మీ అధికారులకు మళ్లించడం గుర్తించడంతో వీరి వ్యవహారం వెలుగుచూసింది. ప్రధాన నిందితులైన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, మహమ్మద్ జాఫర్ పరారీలో ఉండగా.. ఈ కేసులో ఇమ్రాన్ భార్య రేష్మాసుల్తానాపైనా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
నేరగాడు.. బిచ్చగాడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నివసించే ఓ ఉద్యోగికి బ్యాంకు అధికారుల మాదిరిగా కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.లక్ష స్వాహా చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఝార్ఖండ్‌లోని జమ్‌తార వరకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక ఆ సిమ్ ఒక బిచ్చగాడిదని, ఈ నేరంతో అతడికి ఎలాంటి సంబంధం లేదని తెలిసి కంగుతిన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో సిమ్ కార్డుల కోసం ఈ పంథా అనుసరిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. వీరు ఒక్కో నేరానికి ఒక్కో సిమ్‌కార్డు, సెల్‌ఫోన్ వాడుతూ ‘పని’ పూర్తి కాగానే వాటిని ధ్వంసం చేస్తున్నారని వివరిస్తున్నారు. నేరగాళ్ల అడ్డా.. జమ్‌తార పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోస్ జిల్లా దాటి ఝార్ఖండ్‌లోకి ప్రవేశించగానే వచ్చేది జమ్‌తార జిల్లా. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. పూర్తి స్థాయిలో విద్యుదీకరణ సైతం జరగని ఆ జిల్లా కేంద్రంలో జనరేటర్లకు మంచి డిమాండ్ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీటి సాయంతో ల్యాప్టాప్స్, సెల్ఫోన్లను వినియోగించే యువత దేశవ్యాప్తంగా అనేక మందికి కాల్స్ చేసి కార్డుల వివరాలు సహా ఓటీపీల కోసం గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత... ప్రస్తుతం సొంతంగా నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. జమ్‌తారలో ఉన్న కొందరు కీలక వ్యక్తులు ఫోన్లలో ఎదుటి వారితో మాట్లాడడం ఎలా? అనే అంశంపై తమ యువతకు శిక్షణ కూడా ఇస్తుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. రూటు మార్చి... కేవలం ఫోన్ల ఆధారంగా ఈ నేరాలు చేసే వారికి సిమ్‌కార్డుల అవసరం ఎంతో ఉంటుంది. అలాగని తమ పేర్లు, చిరునామాలతో తీసుకుంటే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు దర్యాప్తులో చిక్కే ప్రమాదం ఉంటుందన్నది వారి భావన. దీంతో సిమ్‌కార్డుల కోసం ఈ సైబర్ నేరగాళ్లు గతంలో నకిలీ పేర్లు, బోగస్ చిరునామాలను వినియోగించేవాళ్లు. అయితే కొన్నాళ్లుగా సిమ్‌కార్డుల జారీ నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన జమ్‌తార నేరగాళ్లు... బిచ్చగాళ్లు, అడ్డా కూలీలపై దృష్టిసారించారు. జమ్తారతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారిని సంప్రదిస్తూ వారికి అసలు విషయం చెప్పట్లేదు. కేవలం తమకు తక్షణం సిమ్‌కార్డు అవసరం ఉందంటూ రూ.200 నుంచి రూ.500 వరకు వారికి చెల్లించి, వాళ్ల పేరు మీద సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఆపై తమ ప్రాంతానికి చేరుకొని కాల్స్ చేసి ఎదుటి వారిని నిండా ముంచుతున్నారు. డేటా ఎలా వస్తోంది? ఈ సైబర్ నేరగాళ్లకు ఆయా బ్యాంకు వినియోగదారులకు చెందిన డేటా ఎక్కడి నుంచి అందుతోందనేది ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టంగా తెలియట్లేదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో కిందిస్థాయి, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డేటా పొందుతున్నారని ప్రాథమికంగా భావిస్తున్నామని చెబుతున్నారు. ఈ డేటా వినియోగించి అప్పటికే సిద్ధంగా ఉన్న సిమ్‌కార్డులను బేసిక్ మోడల్, తక్కువ ఖరీదున్న ఫోన్లలో వేసి వినియోగదారులకు కాల్స్ చేసి ఎర వేస్తున్నారు. ‘ట్రూకాలర్’ యాప్‌లో తాము వినియోగిస్తున్న నంబర్లను బ్యాంక్ హెడ్–ఆఫీస్/బ్యాంక్ మేనేజర్ లేదా ఆయా బ్యాంకు పేర్లతో రిజిస్టర్ చేస్తున్నారు. దీంతో కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులు అవి బ్యాంకు నుంచే వస్తున్నట్లు భ్రమపడి తమ వ్యక్తిగత, కార్డు వివరాలు, ఓటీపీలు చెప్పేస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డును ధ్వంసం చేసేస్తున్నారు. దర్యాప్తులో సవాళ్లు... క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే ఈ నేరగాళ్లు ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఏ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి... ఆ బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలనో వారిని నమ్మిస్తారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకొని వినియోగదారుడి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకొని టోకరా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు సైతం తయారు చేసి డ్రా చేసుకుంటున్నారని వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. జమ్‌తార ప్రాంతంలో ఒక్కో సెల్‌టవర్ పరిధి కిలోమీటర్ మేర విస్తరించి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లి సాంకేతికంగా దర్యాప్తు చేయడం సైతం పెను సవాలుగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. గుడ్డిగా నమ్మొద్దు ఈ తరహా వ్యవహారాలే కాదు ఎలాంటి సైబర్ నేరంలో అయినా మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్ చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు. సైబర్ నేరాలను కొలిక్కి తీసుకురావడానికి, నేరగాళ్లను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి.– సైబర్ క్రైమ్ అధికారులు -
సెల్‌ఫోన్ సిమ్ల భద్రత డొల్లేనా..?
పశ్చిమగోదావరి , ఏలూరు (టూటౌన్): మనం వినియోగిస్తున్న సెల్ ఫోన్ సిమ్ల భద్రత డొల్లేనా..? అనే అనుమానం వినియోగదారుల్లో వ్యక్త మవుతోంది. ఒక సర్వీస్ నుంచి మరో సర్వీస్‌కు పోర్టబులిటీ ద్వారా మారినా రెండు సర్వీసులు పనిచేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించి రీచార్జ్ అవడం, కాల్ వెయిటింగ్ రావడం, ఆఖరుకు కాన్ఫరెన్స్ కాల్స్ కలవడంతో ఇదేమీ విచిత్రమంటూ వినియోగదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా పోర్టబులిటీ ద్వారా వేరే నెట్ వర్క్‌కు మారేటప్పుడు గతంలో ఉన్న నెట్ వర్క్ కట్ అయిన తర్వాతనే కొత్తగా తీసుకున్న నెట్ వర్క్ మనుగడలోకి వస్తుంది. కానీ ఏలూరులో పై విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. ఏలూరు రామచంద్రరావు పేటకు చెందిన కేవీ శేఖర్ అనే వ్యాపారి వారం క్రితం తను వాడుతున్న బీఎస్ఎన్ఎల్ సెల్ నెంబర్‌ను ఎంఎన్‌పీ(పోర్టబులిటీ) ద్వారా జియో నెట్‌వర్క్‌లోకి మారాడు. రీచార్జ్ కూడా చేయించాడు. ఈ సందర్భంగా జియో నెట్ వర్క్ నిర్వాహకులు మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కట్ అయిన వెంటనే మారిన జియో నెట్ వర్క్ పనిచేస్తుందని చెప్పారు. మారిన నాలుగు రోజులకు అనగా శనివారం ఉదయం నుంచి జియో నెంబర్ 94403 29002 పనిచేస్తుంది. అయితే విచిత్రంగా కట్ అవ్వాల్సిన బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సైతం ఇదే నెంబర్‌పై పనిచేస్తుండటంతో ఇదెలా సాధ్యమంటూ ఆ వినియోగదారుడు విస్తుపోయాడు. అంటే ఈ లెక్కన మనం ఇచ్చే వివరాలు ఆయా సెల్‌ఫోన్ సంస్థల వద్ద భద్రమేనా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై టెలికాం అధికారిని వివరణ కోరగా ఒకే నెంబర్‌పై రెండు నెట్ వర్క్‌లు పనిచేయడం సాధ్యం కాదని, ఎక్కడో ఏదో లోపం జరిగిందంటూ చెప్పారు. -
మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల తెలంగాణలో భారీ సిమ్‌కార్డు స్కాం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నకిలీ వేలిముద్రలు, ఆధార్‌తో వేలాది సిమ్‌కార్డులను అక్రమంగా యాక్టివేట్ చేశాడు ఓ మొబైల్ షాపు యజమాని. మన ఆధార్ కార్డుతో ఒకే సిమ్‌కార్డు తీసుకున్నామనే అనుకున్నా, వాటిని నకిలీ చేసి వాటి నుంచి ఎన్ని సిమ్‌కార్డులు తీసుకున్నారో ఎవరికి తెలుసు? ఇటీవల తెలంగాణలో వెలుగు చూసిన సంఘటనతో మన వివరాలతో ఎవరు ఏ దారుణాలకు ఒడిగడుతున్నారో? అనే భయం ఇప్పుడు ప్రతిఒక్కరిలో ఉంది. అందుకే ఆ భయం పోవడానికి, మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండి. పలు టెలికం కంపెనీల్లో మన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి. యూఐడీఏఐ ఆదేశాల మేరకు, గతంలో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుడు తన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా ఎస్ఎంఎస్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా చేరింది. ఒక్క మెసేజ్‌తో వివరాలను అందిస్తోంది. జియో తన యాప్‌లో ఆ వివరాలను పొందుపరుస్తుంది. అయితే ఐడియా, వొడాఫోన్, డొకోమో, టెలీనార్, రిలయన్స్ కంపెనీలు మాత్రం ఈ సర్వీసులను అందించడం లేదు. మీఆధార్ మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండి ఇలా.. మీరు ఎయిర్టెల్ వినియోగదారుడు అయితే మీఫోన్ నుంచి ADCHK స్పేస్ ఆధార్‌కార్డు నెంబర్ టైప్ చేసి 121కి మెసేజ్ చేయాలి. మరుక్షణమే మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్ల జాబితా వస్తుంది. జియో వినియోగదారుడు అయితే మై జియో యాప్, మై అకౌంట్లో లింక్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. అలా కనుక లేకపోతే మీ పేరు మీద ఒక జియో సిమ్ ఉన్నట్లే లెక్క. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే ALIST స్పేస్ ఆధార్ నెంబర్ టైప్ చేసి 53734 అనే నెంబర్‌కు మెసేజ్ చేయాలి. రిప్లై మెసేజ్‌లో మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన బీఎస్ఎన్ఎల్ నంబర్లు వస్తాయి. -
ఆ కేసుల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఏటా చోటు చేసుకుంటున్న నేరాల్లో వేలిముద్రల ద్వారా కొలిక్కి వస్తున్న వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ కేసుల్లో నిందితులపై అభియోగాలు మోపడం, నేరం నిరూపించడంలోనూ ఈ వేలిముద్రలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ‘ఆధార్’గోప్యతపై దేశ వ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యవస్థల్లో ఉన్న లోపాలపై మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన ‘వేలికి ‘నకిలీ’ముద్ర!’కథనం తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన పాత సంతోష్ కుమార్ సిమ్‌కార్డుల యాక్టివేషన్ కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై మంగళవారం పోలీసులతో పాటు మరికొన్ని విభాగాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. నష్టనివారణ చర్యలతో పాటు విచారణ దశలో ఉన్న కేసుల అంశాన్నీ చర్చించాయి. వివిధ కేసుల పరిశోధన, నేర నిరూపణలో వేలిముద్రల పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒకేలా ఉండవనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే సంతోష్ సృష్టించిన నకిలీ ‘వేలి ముద్రలు’దీన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ప్రభావం కేసుల దర్యాప్తు, విచారణ తీరుపై ఉండే అవకాశం లేకపోలేదని, అనేక కేసులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీడిపోయే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నేర స్థలిలో సేకరించిన వేలిముద్రలు నిందితులవే అని పక్కాగా నిర్ధారించడానికి అవసరమైన పరిజ్ఞానం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ వ్యక్తి పూర్తి పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర... ఇవి అసాంఘిక శక్తుల చేతికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పడానికి సంతోష్‌దే పెద్ద కేస్ స్టడీగా పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క నకిలీ వేలిముద్రలు తయారు చేయడానికి సంతోష్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన వివరాలనే వినియోగించడంతో ఆ శాఖకు ఓ లేఖ రాయాలని పోలీసులు భావిస్తున్నారు. డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లోకి అప్లోడ్ చేసే సమయంలో ఆధార్ వివరాలు, వేలిముద్రల కాలమ్స్ కనిపించకుండా చేసేలా సిఫార్సు చేయనున్నారు. మరోపక్క సంతోష్ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీలో ప్రతి 3 నెలలకు ఓసారి జరిగే మల్టీ ఏజెన్సీస్ కమిటీ (మ్యాక్) సమావేశం మరో వారంలో జరుగనున్నట్లు తెలిసింది. ఇందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. ఇందులో ఈ కేసును ఓ స్టడీగా చూపించి దేశ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి లోపాలు గుర్తించడంతో పాటు వాటిని సరిచేయడానికి మార్గాలు అన్వే షించాల్సిందిగా అన్ని విభాగాలను కేంద్రం కోరనున్నట్లు సమాచారం. సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా? ధర్మారం (పెద్దపల్లి): నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా అని ధర్మారం వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సిమ్‌కార్డుల టార్గెట్ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల నివ్వెరపోతున్నారు. కాగా.. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో సంతోష్ వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటున్నారు. -
టెలికాం మార్కెట్లోకి పతంజలి బ్రాండు
-
జియోకు పోటీనా? పతంజలి సిమ్ కార్డులు
హరిద్వార్ : టెలికాం మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు గట్టి పోటీ వచ్చేసింది. దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్ గూడ్స్ బ్రాండ్‌గా పేరులోకి వచ్చిన రాందేవ్ బాబా పతంజలి బ్రాండు ఆదివారం టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను రాందేవ్ బాబా లాంచ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంలో ఈ సిమ్ కార్డులను ప్రవేశపెట్టారు. తొలుత ఈ సిమ్ కార్డు ప్రయోజనాలను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్ బాబా చెప్పారు. రిలయన్స్ జియో కూడా తొలుత తన జియో సిమ్ కార్డును లాంచ్ చేసినప్పుడు, ఉద్యోగులకే మొదట దాని ప్రయోజనాలను అందజేసింది. అనంతరం కమర్షియల్‌గా మార్కెట్లోకి లాంచ్ అయి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పతంజలి లాంచ్ చేసిన ఈ సేవలు పూర్తిగా మార్కెట్లోకి వచ్చిన అనంతరం, ఈ కార్డులతో పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. కేవలం 144 రీఛార్జ్‌తో దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకునే సౌకర్యం, 2జీబీ డేటా ప్యాక్, 100 ఎస్ఎంఎస్లను కంపెనీ ఆఫర్ చేయనుంది.వాటితో పాటు ప్రజలకు ఈ సిమ్ కార్డులపై వైద్య, ప్రమాద, జీవిత బీమాలను పతంజలి అందించనుంది. బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ నెట్వర్క్’ అని ఈ సందర్భంగా రాందేవ్ అన్నారు. పతంజలి, బీఎస్ఎన్ఎల్ ఇరు కంపెనీల ఉద్దేశ్యం కూడా దేశ సంక్షేమమేనని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న ఐదు లక్షల కౌంటర్లలో, పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డులు ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పతంజలితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంపై బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునిల్ గార్గ్ ఆనందం వ్యక్తం చేశారు. -
సిమ్ కార్డు అవసరం లేని ఫోన్
సిమ్ కార్డు లేకుండా ఫోన్ పనిచేస్తుందా? అంటే, అది అసాధ్యమని చెప్పేస్తాం. లక్ష రూపాయల ఫోన్ అయినా.. అది పనిచేయాలంటే సిమ్ కావాల్సిందే. అయితే సిమ్ కార్డులు అవసరం లేని ఫోన్ కూడా మార్కెట్లోకి రాబోతుందట. ఆర్మ్ టెక్నాలజీ సంస్థ ఈ వినూత్నాన్ని ఆవిష్కరించబోతుంది. మొబైల్ ఫోన్లలో వాడే సిమ్‌కి బదులుగా ఐసిమ్ కార్డుని(ఇంటిగ్రేటెడ్ సిమ్ కార్డును) ఆర్మ్ సంస్థ, ఎండబ్ల్యూసీ 2018లో ప్రదర్శించబోతుంది. ఈ సిమ్ కార్డు, ప్రాసెసర్‌తోనే చిప్‌సెట్‌లో ఇంటిగ్రేటెడ్ పార్ట్‌గా ఉండబోతుంది. ప్రాసెసర్ చిప్సెట్లోనే ఇంటిగ్రేటెడ్ అయ్యే ఐసిమ్ నెంబర్‌ను, ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ఐసిమ్ నెంబర్ నెట్వర్క్ కంపెనీలకు చెబితే, వాళ్లు దానికి మొబైల్ నెంబర్‌ను అనుసంధానిస్తారు. దీంతో సిమ్ కార్డుకు కేటాయించే అదనపు స్థలం మిగిలిపోతుంది. ఈ కొత్త ఐసిమ్ కార్డు చదరపు మిల్లిమీటర్ కంటే తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. ఈ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డ్ అవసరం ఉండదు. నెట్వర్క్ కంపెనీలకు కూడా సిమ్ కార్డ్ ఖర్చు తగ్గిపోతుంది. దీనికితోడు ప్రస్తుతం సిమ్ కార్డ్ స్లాట్ కోసం ఉపయోగిస్తున్న స్థలంలో మరికొన్ని ఆప్షన్స్‌తో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటానికి మొబైల్ తయారీ కంపెనీలకు అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో మెరుగైన వాయిస్ క్లారిటీ ఉంటుందని ఆర్మ్ టెక్నాలజీ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ దారులు, నెట్ వర్క్ సంస్థలు ఆమోదిస్తే, ఏడాది కాలంలోనే ఈ టెక్నాలజీ ఇండియాలోకి అందుబాటులోకి రానుందని సమాచారం. -
13 అంకెల మొబైల్ నంబర్లు త్వరలో..అయితే
సాక్షి, ముంబై: దేశంలో 13 అంకెల మొబైల్ నెంబర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలోని అన్ని టెలికామ్ ఆపరేటర్లకు టెలికాం శాఖ (డిఓటి) ఆదేశాలను జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమలు కానుంది. అయితే సాధారణ 10అంకెల మొబైల్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం కేవలం మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డు నంబర్లకు మాత్రమే వర్తిస్తుంది. రోబోటిక్స్, కార్లు, ట్రాఫిక్ కంట్రోల్, లాజిస్టిక్ సేవలు, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, విమానాల నిర్వహణ, టెలీమెడిసిన్ లాంటి వాటిల్లో కమ్యూనికేషన్స్ కోసం ఈ మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డులు వినియోగిస్తారు. సెక్యూరిటీ నేపథ్యంలో ఈ సిమ్ కార్డ్‌ల 13 అంకెల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేసిక్ కాన్సెప్ట్ అయిన ఈ విధానంలో నెంబర్ పోర్టల్ గడువు 2018 డిసెంబర్ 31తో ముగియనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జనవరి 8న వచ్చినట్టు చెప్పారు. 13 అంకెల (మెషిన్ టు మెషీన్) నంబరింగ్ ప్లాన్ జూలై ప్రారంభం కానుందని తెలిపారు. దీంతో జూలై 1 తరువాత 13 అంకెల మొబైల్ నంబర్లను మాత్రమే కొత్త వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు. కాగా మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత పెంచే ప్రయత్నంలో, కేంద్రం 13 అంకెల మొబైల్ నంబర్ విధానాన్ని ప్రవేశపెట్టనుందన్నవార్త కోట్లాదిమంది దేశీయ మొబైల్ వినియోగదారులకు కలవర పెట్టింది. సోషల్ మీడియాలో నెంబర్ పోర్టింగ్ అంశంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఇక స్మార్ట్ పాలన..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన కొత్త పుంతలు తొక్కనుంది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘స్మార్ట్’గా పరిపాలన నిర్వహించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శైలేంద్ర కుమార్ జోషి ఈ దిశగా సరికొత్త ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తరహాలో సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసేందుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వాటి అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా ఈ కంట్రోల్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు మొదలు రాష్ట్రస్థాయి వరకు ప్రతి సమాచారం అందుబాటులో ఉండేలా డేటాబేస్‌ను రూపొందిస్తున్నారు. తదుపరి ప్రక్రియలో గ్రామ, జిల్లాస్థాయి నుంచి ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును సచివాలయం నుంచే ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, పనుల పురోగతి, నీటి నిల్వలు, నీటి విడుదల తదితర వివరాలన్నీ సచివాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా డిజిటల్ మానిటరింగ్ విధానంలో జిల్లాల కలెక్టరేట్లు, జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలను సచివాలయం నుంచే అనుసంధానిస్తారు. ఇంటిగ్రేటేడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో కొత్త పరిపాలన విధానానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. సిమ్ కార్డులు.. స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ పరిపాలనలో భాగంగా అధికారులందరికీ స్మార్ట్ఫోన్లు, శాశ్వత సిమ్ కార్డులు అందించనున్నారు. సీఎస్, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల హెచ్వోడీలు మొదలు కలెక్టర్లు, జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులంద రూ ఒకే నెట్‌వర్క్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ ఐడియా సిమ్ కార్డులను అందజేయాలని నిర్ణయించారు. 711 సిరీస్‌తో ఈ నంబర్లు ప్రారంభమవుతాయి. అధికారులు బదిలీపై వెళ్లినా ఆ హోదాలో ఉన్న అధికారికి తిరిగి అదే నంబర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ప్రజలకు అధికారుల నంబర్లు తెలియడంతోపాటు ఎప్పటికప్పుడు సమాచారం పంచుకునే వీలుంటుందని భావిస్తున్నారు. వేగంగా సమాచార మార్పిడి జరిగేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొం దించాలని నిర్ణయించారు. స్మార్ట్ఫోన్లను సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. అత్యవసరమైతే నేరుగా సీఎస్ సంబంధిత అధికారితో వీడియో కాల్లో మాట్లాడేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. -
జియో సిమ్‌లిచ్చారు.. సిగ్నల్ లేదు
కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల్లో అంతరాయాలను నిరోధించేందుకు ప్రభుత్వం జియో హాట్‌స్పాట్‌కు చెందిన రూటర్, సిమ్‌లను పంపిణీ చేసింది. జిల్లాలో తొలి విడతగా 95 ప్రభుత్వ, 8 కస్తూర్బా పాఠశాలలకు అందించింది. కానీ కొన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో జియో నెట్వర్క్ సేవలు అందటం లేదు. కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాల్లో అసలు జియో నెట్ వర్క్‌ను ఆ కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. ములకలపల్లి, దమ్మపేట, పినపాక, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి వంటి చోట్ల మండల కేంద్రాల్లో తప్ప ఇతర గ్రామాల్లో జియో ఊసే లేదు. ఈ క్రమంలో జియో సిమ్, హాట్స్పాట్లను పంపిణీ చేసినా ఉపయోగంలేకుండా పోయింది. జియో సిగ్నల్స్ లేని చోట ఇతర నెట్వర్క్ సిమ్‌లను ఉపయోగించే అవకాశం లేకపోవడంతో ఇవి వృథాగా మారనున్నాయి. ప్రజాధనమూ ఖర్చయిపోయింది. సమయమూ వృథా.. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్ తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో డిజిటల్ పాఠాల్లో అంతరాయం కలుగుతోంది. పాఠశాలల సమాచారం కూడా ఆన్లైన్లోనే ఎంఈవో, డీఈఓ కార్యాలయాలకు అందజేస్తున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో సమాచారం పంపేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. దీంతో విలువైన బోధన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ నెట్‌వర్క్‌కు చెందిన జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వైపై హాట్‌స్పాట్ రూటర్‌ను, జియో నానో సిమ్‌లను జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లకు అనుసంధానం చేసి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఆదేశాలను జారీ చేసింది. కానీ సిగ్నల్స్ లేనికారణంగా మళ్లీ అదే సమస్య ఏర్పడింది. సిగ్నల్స్ ఉంటే ఉపయోగమే.. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మిగిలిన కొద్దిరోజులు విద్యార్థులకు చాలా అమూల్యమైనవి. మోడల్ టెస్టుల అనంతరం వెనుకబడిన సబ్జెక్టులలో పునశ్చరణ, ముఖ్యమైన పాయింట్లు, బిట్లు, ఇతర సబ్జెక్టు వివరాలను బోధించేందుకు డిజిటల్ తరగతులు చాలా ఉపయోగపడతాయి. సైన్స్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టులను ప్రాక్టికల్‌గా, యానిమేషన్ చిత్రాల ద్వారా సులభరీతిలో బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందచేసిన వైఫై సేవలు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుండగా, మరికొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపయోగపపడం లేదు. జిల్లాలో వైఫై సేవలు పాక్షికంగానే మిగిలిపోనున్నాయి. వైఫై సామగ్రిఅందచేసిన పాఠశాలలు ఇవే: కరకగూడెం – 02 కొత్తగూడెం –06 పినపాక –04 లక్ష్మీదేవిపల్లి –04 చర్ల –04 పాల్వంచ –10 దుమ్ముగూడెం –03 బూర్గంపాడు –07 అశ్వాపురం –04 భద్రాచలం –03 మణుగూరు –02 ములకలపల్లి –03 గుండాల –01 దమ్మపేట –07 ఆళ్లపల్లి –01 అశ్వారావుపేట –06 ఇల్లెందు –06 టేకులపల్లి –06 జూలూరుపాడు –04 చండ్రుగొండ –03 అన్నపురెడ్డిపల్లి –02 చుంచుపల్లి –04 సుజాతనగర్ –03 -
డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలను పక్కాగా చెబుతారు
బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తారు. డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలను పక్కాగా చెబుతారు. ఓటీపీ సైతం సంగ్రహించి ఖాతాలోని సొమ్మును కొట్టేస్తారు. ఈ మోసాల్లో ముందుండే ‘జమ్తారా’ నేరగాళ్లు మరింత తెలివి మీరారు. ఒక్కో నేరానికి ఒక్కో సిమ్‌కార్డు, సెల్‌ఫోన్‌ను వాడుతున్నారు. తమ ‘పని’ కాగానే వాటిని ధ్వంసం చేస్తున్నారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన నేరాల్లో నిందితుల కోసం ఇన్స్పెక్టర్ వీపీ తివారి ఇటీవల జమ్తారాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడి నేరగాళ్ల కొత్త పంథా వెలుగులోకి వచ్చింది. సాక్షి, సిటీబ్యూరో: జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి యువత ఇంట్లో కూర్చునే ల్యాప్టాప్స్, సెల్ఫోన్లతో దేశ వ్యాప్తంగా అనేక మందికి గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, కాల్ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్తారా యువత గ్రామాల్లో సొంతంగా ‘కాల్ సెంటర్లను’ ఏర్పాటు చేసుకుని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. జమ్తారాలోని కొందరు వ్యక్తులు.. ఫోన్లలో ఎదుటి వారితో మాట్లాడటం ఎలా? అనే అంశంపై యువతకు శిక్షణ కూడా ఇస్తుంటారు. ‘బ్యాంకుల’ నుంచే అందుతున్న డేటా ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వాటి కాల్ సెంటర్లు వంటి మార్గాల్లో డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా ఈ సైబర్ నేరగాళ్లకు చేరుతోంది. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్తారా యువత వీటిని వినియోగించడానికి బేసిక్ మోడల్, తక్కువ ఖరీదు సెల్ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల చాలామంది ఫోన్లలో ‘ట్రూకాలర్’ వంటివి వాడుతుండడంతో అవతలివారి వివరాలు తెలిసిపోతోంది. దీంతో బోగస్ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్తారా యువత.. ముందుగానే ఆ నంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్నట్టు భావించి వలలో పడుతున్నారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే జమ్తారా సైబర్ నేరగాళ్లు అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డును ధ్వంసం చేస్తున్నారు. దర్యాప్తులో ఎన్నో సవాళ్లు.. క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారికి ఫోన్లు చేసే ఈ నేరగాళ్లు ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఏ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి.. బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెబుతుంటారు. ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు సైతం తయారు చేసి డ్రా చేసుకుంటున్నట్టు వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. జమ్తారాలో ఒక్కో సెల్‌టవర్ పరిధి దాదాపు 25 కి.మీ. విస్తరించి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడకు వెళ్లి సాంకేతికంగా దర్యాప్తు చేయడం సైతం పెను సవాలుగా మారుతోందని అధికారులు అంటున్నారు. ఆ ఊరంతా కలిసికట్టుగా.. సైబర్ నేరాల ద్వారా వస్తున్న ‘ఆదాయాన్ని’ జమ్తారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగతంగాను, గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలిసినప్పటికీ ఊరంతా కలిసి కట్టుగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరూ నేరాల బాటపట్టేలా ప్రోత్సహిస్తుంటారట. బయటి నుంచి ఎవరైనా పోలీసులు వచ్చి అక్కడి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే.. గ్రామం మొత్తం అడ్డుకోవడంతో పాటు దాడులకూ వెనుకాడదు. స్థానిక పోలీసులు సైతం శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ అరెస్టులకు పూర్తి స్థాయిలో సహకరించరు. దీంతో వీరి నుంచి రికవరీలు సాధ్యం కావట్లేదని అధికారులు చెబుతున్నారు. బ్యాంకులు ఫోన్లు చేయవు ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టం. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్లు చేయదు. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి. – విజయ్ ప్రకాష్ తివారి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ -
అంతా ఫ్రీ అంటూ ఎక్స్ట్రా ఛార్జీల బాదుడు
జీరోకే జియో ఫోన్.. ఇప్పుడు రూ.1500 కట్టండి, మూడేళ్ల తర్వాత వాటిని రీఫండ్ చేసుకోండి... ఇలా వినూత్న కాన్సెప్ట్‌తో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ ఛార్జీలు బాదుడు మామూలుగా లేదు. రిజిస్ట్రర్ చేసుకుని ఫోన్ పొందిన వారికి కేవలం రూ.1500తోనే అన్ని రావడం లేదు. ఆ 1500 రూపాయలకి అదనంగా మరింత చెల్లించాల్సి వస్తుంది. వాటిని సిమ్ ఛార్జీలుగా, రీఛార్జ్ మొత్తాలుగా జియో బాదుడు షురూ చేసింది. జియో ఫోన్‌తో పాటు సిమ్ కూడా ఉచితమని ఇప్పటి వరకు వినియోగదారులు భావించి ఉంటారు. కానీ జియో ఫోన్లో వాడే జియో సిమ్ కోసం అదనంగా రూ.110 చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఆ సిమ్‌ను వాడుకోవడానికి అపరిమిత డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి వాటి కోసం రూ.153తో లేదా రూ.309తో రీఛార్జ్ చేయించుకోవాలి. అంటే మొత్తంగా మరో 400 రూపాయల మేర అదనంగా యూజర్లు చెల్లించాలి. ఇలా ఈ మొత్తాలన్నింటినీ కలుపుకుంటే జియో ఫోన్‌కు రూ.2000 మేర ఖర్చు అవుతుందని తెలుస్తోంది. కాగ, చిన్న పట్టణాలకు దసరా నుంచే ఈ ఫోన్ల డెలివరీని ప్రారంభించిన జియో, ప్రస్తుతం మెట్రో నగరాలకు అందిస్తోంది. హైదరాబాద్‌లో జియో ఫోన్ల డెలివరీ ప్రారంభమైంది. దీపావళి తర్వాత మలి విడత జియో ఫోన్ల బుకింగ్‌ను కంపెనీ చేపట్టబోతుంది. జియో ఫోన్ పూర్తిగా ఉచితమని, ప్రారంభంలో రూ.1500 డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిన కంపెనీ, ఆ తర్వాత నిబంధలను కాస్త సడలించింది. మొదటి ఏడాది తర్వాత ఆ ఫోన్‌ను వెనక్కి ఇచ్చేస్తే రూ.500, రెండో ఏడాది తర్వాత రూ.1000, మూడేళ్ల తర్వాత అయితే మొత్తం పొందవచ్చని తెలిపింది. -
హనీ హైడింగ్ వెనక..
సాక్షి, పంచకుల : రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్.. 38 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించున్న విషయాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. గుర్మీత్ సింగ్‌పై పంచకుల సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన ఆగస్టు 25న అల్లర్లు జరిగాక.. హనీప్రీత్ అదృశ్యమైంది. ఈ మధ్యే కోర్టులో లొంగిపోయిన హనీప్రీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చేశాయి. ఆగస్టు 25 తరువాత అదృశ్యమైన హనీప్రీత్.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రెండు రకాల సెల్ఫోన్లు వినియోగించినట్లు తెలిసింది. అంతేకాక 2 ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు, 16 స్థానిక సిమ్ కార్డులను మార్చిమార్చి వినియోగిస్తూ.. తప్పించుకున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనూ హనీప్రీత్ వాట్సప్‌ను ఉపయోగించిందని.. అయితే అందులోని డేటా ఇంకా లభించలేదని సిట్ పోలీసులు తెలిపారు. హనీప్రీత్ కాల్‌డేటాను సంపాదించే పనిలో ఉన్నామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా హనీప్రీత్ ఏ మాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఒకరకంగా ఆమె మా సహనాన్ని పరీక్షిస్తోందని సిట్ అధికారులు అంటున్నారు. -
పాత సిమ్‌కార్డులతో జర జాగ్రత్త
మహబూబ్‌నగర్ క్రైం: ఏవరి వద్ద చూసిన రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో జనాభా సంఖ్య 7లక్షలు ఉంటే.. 6లక్షలమేర వివిధ కంపెనీల ఫోన్లు విని యోగిస్తుంటే..8లక్షల సిమ్‌కార్డులను వాడుతున్నారు. ఒకప్పుడు కేవలం 3లక్షలలోపు పరిమితమైన ఈ సంఖ్య గడిచిన మూడేళ్ల కాలంలో ఈ స్థాయిలో పెరిగింది. ఇది ఆయా కంపెనీలకు శుభవార్త అయినప్పటికీ.. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు సిమ్‌కార్డులు వినియోగించటం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉచితం పెరిగింది.. గడిచిన నాలుగైదేళ్ల నుంచి సిమ్‌కార్డులను పలు కంపెనీలు ఉచితంగా అందించాయి. దీనివల్ల ఒక్కొక్కరు ఒకే కంపెనీకి చెందిన ఐదు సిమ్‌లను కూడా తీసుకుంటున్నారు. గతంలో రూ.500 చెల్లించిన సిమ్‌కార్డు దొరికేది కాదు. పోటీలో కంపెనీలు ఆఫర్స్ ప్రకటించడంతో పాటు అంతర్జాల సేవల వినియోగం పెరగటంతో అమాంతం సిమ్‌కార్డుల విక్రయాలు పెరిగాయి. దుర్వినియోగం ఇష్టారాజ్యంగా సిమ్‌కార్డులను జారీ చేయడంతో అంతకు రెండింతలు దుర్వినియో గం అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా నేరాలకుపాల్పడే వారితో పాటు ప్రముఖులకు బెదిరింపు కాల్ చేసేవారు ఎటువంటి ఆధారాలు లేకుండా సిమ్‌కార్డులు పొందుతున్నారు. అదేలా సాధ్యమన్నది గతంలో అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. కానీ తాజాగా తప్పుడు పేర్లమీద సీమ్‌కార్డులు తీసుకొని నేరాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసే సమయంలో పాత సిమ్‌కార్డును బ్లాక్ చేయకపోతే చేయని నేరంలో ఇరుక్కునే అవకాశం ఉంది. -
ఆ సిమ్‌లను జియో బ్లాక్ చేస్తుందట!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ధృవీకరించని రిలయన్స్ జియో కార్డులను బ్లాక్ చేసేందుకు జియోసిద్ధమవుతోంది. మీడియా నివేదికలు ప్రకారం త్వరలోనే అనేక నాన్ వెరిఫైడ్ సిమ్ కార్డులను నిషేధించనుందని తెలుస్తోంది. జియో సిమ్ కార్డు యూజర్లకు అందించే సమయంలో ఆధార్ కార్డు ను సబ్మిట్ చేసినప్పటికీ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నాన్ వెరిఫికేషన్ సిమ్‌లను బ్లాక్ చేయనుంది. అలాగే ఇ-కేవైసీ సమర్పించని ఖాతాదారులను ఎస్ఎంఎస్ల ద్వారా హెచ్చరిస్తుంది. లేదంటే ప్రస్తుతం వాడుతున్న జియో సిమ్ ద్వారా 1977 నెంబర్ కాల్ చేసిన టెలీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. అయితే లోకల్ అధార్ కార్డుతో జియో సిమ్ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నాన్ లోకల్ ఆధార్ తో తీసుకుంటే మాత్రం టెలీ వెరిఫికేషన్‌ను ఎంచుకోవాల్సిందే. జియో ఇప్పటికే ఈ స్క్రూట్నీ ప్రక్రియ మొదలు పెట్టిందని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు కొంతమంది యూజర్లకు ఈ మేరకు ఎస్ఎంఎస్లను పంపిస్తోంది. -
ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?
న్యూఢిల్లీ : ఇప్పటివరకు రిలయన్స్ జియో సిమ్ కార్డు కొనలేదా? ఉచిత ఆఫర్లను వినియోగించుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారా? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదట. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ద్వారా ఇంటి వద్దకే జియో సిమ్ డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద జియో సిమ్‌లను ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే సిమ్ కార్డు కోసం ముందస్తుగా కస్టమర్లు ఈ-కామర్స్ వెబ్సైట్లో వివరాలను నమోదుచేసుకుంటే చాలట. స్నాప్‌డీల్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసులో వివరాలు నమోదుచేసుకున్న అనంతరం యూజర్లకు డెలివరీ టైమ్, ప్రోమోకోడ్తో ఓ మెసేజ్‌ను పొందుతారు. రిలయన్స్ జియో సిమ్‌ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలనుకునే కస్టమర్లు, ప్రోమోకోడ్‌ను, ఆధార్ నెంబర్‌ను స్నాప్‌డీల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో పంచుకుంటే వెంటనే సిమ్ యాక్టివేట్ ప్రక్రియ కూడా అయిపోతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.. ఇప్పటికే స్నాప్ డీల్ తన కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించిందని, సిమ్ కార్డులను ఇంటింటికి డెలివరీ చేయనున్నామని తెలిపినట్టు తెలిసింది. స్నాప్‌డీల్ నుంచి ఈ-మెయిల్స్ అందిన కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా జియో సిమ్ కార్డును ఇంటివద్దే పొందవచ్చు. సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదట. సిమ్ కార్డు పొందిన వెంటనే వారు వాలిట్ లోకల్ ఆధార్ కార్డులను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎంపికచేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉందని రిపోర్టులు చెప్పాయి. ఇటీవలే జియో ఉచిత సేవలను 2017 మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇంటివద్దకే జియోసిమ్ లు అందిస్తూ మరో ప్రయోగం చేయబోతున్నారు. -
మళ్లీ పాత కథే..?
► బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఫెరుుల్ ►మళ్లీ వినిపించనున్న ఎస్సార్, ప్రెజెంట్ సార్ పదాలు ► యంత్రాలు పని చేయడం లేదా.. ఉద్దేశపూర్వకంగానా..? సిమ్‌లు రాలేదు.. 9హాస్టల్స్‌లో బయెమెట్రిక్ విధానాన్ని ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసేందుకు ట్యాబ్‌లు ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్‌ల్లో వేసేందుకు సిమ్ కార్డులు రాలేదు. అలాగే వీటి కోసం మూడు నెట్‌వర్క్‌ల సిమ్ కార్డులు ఇచ్చారు. ఇందులో ఎరుుర్ టెల్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలే ఎక్కువగా ఉన్నారుు. కానీ వచ్చిన సిమ్‌లు మాత్రం ఐడియా, బీఎస్ఎన్ఎల్ కావడంతో ట్యాబ్‌ల్లో వేయలేదు. జిల్లాలోని 4 డివిజన్లలో ఒక్కో హాస్టల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించాల్సి ఉండగా అలా జరగలేదు. విజయనగరం కంటోన్మెంట్ : సంక్షమే హాస్టళ్లలో బయోమెట్రిక్‌ను అమలు చేసి తద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆశయం నెరవేర లేదు. ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు హాస్టళ్లకు ఆదేశాలిచ్చినప్పటికి ఆచరణకు మాత్రం అరుుష్టత వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నారుు. 2 నెలల క్రితం జిల్లాకు 97 బయోమెట్రిక్ డివైస్‌లు రాగా వాటిలో 38 మెషీన్లు పనిచేయడం లేదు. మిగతా మెషీన్లకు సిమ్‌కార్డులు ఇవ్వలేదు. జిల్లాలో 88 బీసీ హాస్టల్స్ ఉండగా వీటిలో 28 కాలేజ్ విద్యార్థులవి. మిగిలిన 60 స్కూల్ విద్యార్థులవి. ఈ హాస్టళ్లలో హాజరును తప్పుగా చూపిస్తున్నారనే అనుమానాలు కలగడంతో పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు తలచారు. దీనిలో భాగంగా కార్వే సంస్థ ద్వారా జిల్లాకు బయోమెట్రిక్ పరికరాల్ని పంపిణీ చేశారు. సెప్టెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ఎందుకో అమల్లోకి రాలేదు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా.. జిల్లాలోని 60 బీసీ బాలుర హాస్టల్స్‌కు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతో పాటు జిల్లాలోని 2 రెసిడెన్షియల్ స్కూళ్లకూ ఒకేసారి ఈ బయోమెట్రిక్ డివైస్‌లు అమర్చాలని నిర్ణరుుంచారు. చీపురుపల్లి, కోరపు కొత్తవలసల్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలకు ఈ పరికరాలు పంపిణీ చేశారు. కానీ అక్కడ కూడా నేటికి ఈ విధానం అమలు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ మెషీన్లు, పరికరాలు వచ్చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నారుు. అన్ని కార్యాలయాలు, సంస్థల్లోనూ బయోమెట్రిక్ విధానం సక్రమంగా పనిచేస్తుంటే ఇక్కడే ఎందుకు పని చేయడం లేదన్న విమర్శలూ ఉన్నారుు. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తాం. కార్వే సంస్థ ప్రతినిధులు ఇదిగో అదిగో అంటున్నారు. త్వరలోనే వారితో సమావేశం ఏర్పాటు చేసి డెమో నిర్వహిస్తాం. అనంతరం వాటిని ఆయా వసతి గృహాలకు తరలించి సక్రమంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటాం.- సీహెచ్. హరిప్రసాద్, డీబీసీడబ్లూ ్యఓ, విజయనగరం. -
పోలీసులకు డాటా సిమ్‌కార్డ్
► పతి నెలా ఫ్రీగా 1 జీబీ ఇంటర్నెట్, 100 రూపాయల టాక్ టైమ్ ► ప్రతిపాదనలు ఆమోదించిన సీఎం కేసీఆర్ ► దీపావళి కానుకగా త్వరలో పంపిణీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో క్షేత్ర స్థారుు సిబ్బందితో అధికారుల సమన్వయం మరింత పెరిగేందుకు రాష్ట్రంలోని పోలీసు సిబ్బంది అందరికీ ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సిమ్ కార్డు అందజేయనున్నారు. దీపావళి పండుగ కానుకగా రాష్ట్రం లోని యాభై వేల పోలీసు సిబ్బందికి సీయూజీ సిమ్‌కార్డులను అందజేయనున్నారు. ఈ సీయూజీ ద్వారా ప్రతీ నెలా ఒక జీబీ ఇంటెర్నెట్, వంద రూపాయల ఉచిత ప్రీ పెయిడ్ టాక్ టైం సౌకర్యాన్ని కల్పించనున్నారు. పోలీసు సిబ్బందిని ఒకే తాటిపైకి తీసుకురావాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారని డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఓ ప్రకనటలో తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసు సిబ్బంది చక్కటి పనితీరు కనపరుస్తూ శాంతి భధ్రతల నిర్వహణలో విశేష కృషి చేస్తున్నారని డీజీపీ కొనియాడారు. ఇంటర్నెట్ సౌకర్యంతో కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగై మరింతగా ఉత్తమ ఫలితాలను సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పోలీసు సిబ్బందికి డీజీపీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. -
పాక్ గూఢచారి పట్టుబడ్డాడు
పాకిస్తాన్‌కు గూఢచారిగా వ్యవహరిస్తున్న వారు ఒక్కరినొక్కరుగా పట్టుబడుతున్నారు. ఆగస్టు నెల మొదట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ గూఢచారి రాజస్తాన్‌లో పట్టుబడగా.. నిన్న జమ్మూకశ్మీర్‌లో సాంబ సెక్టార్లో మరోవ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర్నుంచి రెండు పాకిస్తానీ సిమ్ కార్డులు, భద్రతా దళాలు మోహరించి ఉన్న చిత్రపట్టాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని జమ్మూ జిల్లాకు చెందిన అర్నియా ప్రాంత నివాసి బోద్రాజ్గా గుర్తించారు. అతిపెద్ద గూఢచర్య నెట్‌వర్క్‌లో ఇతను కూడా ఓ భాగమేమో అనే అనుమానంతో భద్రతా దళాలు విచారణ చేస్తున్నాయి. ఆగస్టులో రాజస్తాన్‌లో అదుపులోకి తీసుకున్న పాక్ గూఢచారి నుంచి కూడా బోర్డర్ ప్రాంత చిత్ర పటాలు, పలు ఫోటోగ్రాఫ్‌లను పోలీసులు స్వాధీన పరుచుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పాక్ గూఢచారిని అరెస్టు చేసిన రోజునే కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో భారత్ పోస్టులపై పాకిస్తానీ రేంజర్లు దాడులు జరిపారు. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఏడుగురు పాకిస్తానీ రేంజర్లను హతమార్చింది. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేని పాకిస్తాన్ పేర్కొంటోంది. నిన్న జరిగిన ఈ సంఘటనతో బీఎస్ఎఫ్ పోస్టులపై పాకిస్తాన్ ఎక్కువగా గురిపెట్టినట్టు తెలుస్తోంది. గత నెల కశ్మీర్‌లోని ఉడీ ఆర్మీ బేస్‌పై దాడులు జరిపి 19మంది మన జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. వెంటనే పాకిస్తాన్‌కు షాక్‌గా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడులు నిర్వహించింది. 30 నుంచి 50 మంది ఉగ్రవాదులను ఈ దాడిలో చనిపోయినట్టు భారత ఆర్మీ పేర్కొంది. కానీ ఆ దాడులపై పాకిస్తాన్ మళ్లీ దుష్ఫచారమే చేయడం ప్రారంభించింది. అవి అసలు సర్జికల్ స్ట్రైక్సే కావని, తరుచూ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే కాల్పులేనని పేర్కొంది. -
బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు ఉచితం
అనంతపురం రూరల్: నేటి నుంచి రెండు రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ సిమ్‌లను ఉచితంగా అందజేస్తున్నట్లు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నానో సిమ్‌లు మినహా మిగిలిన అన్ని సిమ్‌లను బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తామన్నారు. అనంతపురం నగరంలో రోడ్డు షోలో ఏర్పాటు చేసి సిమ్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. -
జగదీష్ మార్కెట్ లో పోలీసుల దాడులు
హైదరాబాద్: నకిలీ ధ్రువ పత్రాలతో సిమ్ కార్డులు జారీ చేసే షాపులపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోమవారం అబిడ్స్, జగదీష్ మార్కెట్, బోయిన్పల్లి సహా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అబిడ్స్ షాపుల్లో సోదాలు చేపట్టారు. ఇటీవల నగరంలో సంచలం రేపిన అభయ్ హత్య కేసులో నిందితులు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు పొందినట్టు విచారణలో తేలడంతో పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ-వీసాతో వస్తే సిమ్ కార్డు కానుక
న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యటనకు ఈ-టూరిస్ట్ వీసాతో వచ్చే విదేశీయులకు మొబైల్ సిమ్ కార్డులు కానుకగా ఇవ్వాలన్న పర్యాటకశాఖ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ గురువారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ-వీసాతో వచ్చే విదేశీ పర్యాటకులకు సిమ్ కార్డు, దేశంలోని పర్యాటక ప్రాంతాల వివరాలతో కూడిన మ్యాపు, సీడీలతో గిఫ్ట్ కిట్‌ను అందించాలని ప్రతిపాదించింది. -
భారత్‌లో నేపాల్ సిమ్ కార్డులు
నభిడాంగ్(ఉత్తరాఖండ్): భారత్‌లో నేపాల్ సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా ఇదే వ్యవహారం జరుగుతుంది. నేపాల్ సరిహద్దులోని ఉత్తరాఖండ్‌కు చెందిన కొన్ని గ్రామాలకు చెందిన స్థానికులతోపాటు ఆఖరికి సరిహద్దు భద్రతా బలగాలు కూడా నేపాల్ సిమ్ కార్డులను ఉపయోగిస్తుండటం గమనార్హం. అదికూడా భరించలేని స్థితిలో ఎక్కువ ధరలకు ఐఎస్డీ కాల్స్ కు చెల్లించే మొత్తంలో చెల్లిస్తు. భారత్‌కు చెందిన ఏ ప్రైవేటు సంస్థగానీ, ప్రభుత్వ సంస్థగానీ ఆ ప్రాంతాల్లో టెలికం సేవలు అందించకపోవడం ఇందుకు కారణమైంది. పితోర్ ఘడ్ జిల్లాలోని దార్చులా మండలంలోగల గంజ్, నభితోపాటు పలు గ్రామాల ప్రజలు చాలా ఏళ్లుగా నేపాల్ సిమ్ కార్డులనే ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు కనుచూపు మేరలో కనిపించబోవంటే ఆశ్చర్యపోక తప్పదు.కాగా, తాము ఆ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ను ఏర్పాటుచేశామని అధికారులు చెప్తుండగా టవర్ మాత్రం ఉందికానీ, సిగ్నల్సే కరువయ్యాయని దానికంటే నేపాల్ సిమ్ కార్డులకే తొందరగా సిగ్నల్స్ వస్తున్నాయని అందుకే తాము నేపాల్ సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నామని వారు చెప్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోమౌలిక సదుపాయాలతోపాటు, టెలికం సేవలు విస్తృతం చేస్తామని ఎన్డీయే చేసిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
సత్తెనపల్లిలో ‘సిమ్’ల రాకెట్
తప్పుడు చిరునామాలతో సిమ్ కార్డులు విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లు సత్తెనపల్లి : తప్పుడు చిరునామాతో సత్తెనపల్లిలో సిమ్ కార్డులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టణంలో విజయ్ అనే ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఐదుగురు సబ్ డిస్ట్రిబ్యూటర్లు సిమ్‌లను తీసుకొచ్చి తప్పుడు చిరునామాలతో అమ్మకాలు చేపడుతున్నారు. ఓ డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి అర్బన్ సీఐ ఎస్.సాంబశివరావు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రత్యేకంగా ఓ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్, ఆధార్, రేషన్ కార్డుల్లోని ఫొటోలను మార్చేసి, అదే చిరునామాలతో సిమ్‌లను విక్రయిస్తున్నారు. ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక్కొక్కరు 350 సిమ్‌లు తీసుకుని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వీటిలో మొత్తం సిమ్‌లను విక్రయిస్తే ఒక్కో సిమ్‌కు రూ.10 చొప్పున, 350 సిమ్‌లకు రూ.3,500 కమీషన్ రూపేణా వస్తుంది. సబ్ డిస్ట్రిబ్యూటర్ కేవలం 349 సిమ్‌లు మాత్రమే విక్రయాలు జరిపితే అన్ని సిమ్‌లకు కమిషన్ నిలిచి పోతుంది. దీంతో వినియోగదారులు కొనుగోలు చేయగా మిగిలిన సిమ్‌లను తప్పుడు అడ్రస్సులతో యాక్టివేట్ చేసి విక్రయాలు జరిపినట్లు చూపుతున్నారు. చిరునామా లేని సిమ్‌లను విద్యార్థులు, యువకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని ఐదుగురు సబ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేకంగా ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడ ఈ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లతో పాటు వారి నుంచి 4,300 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని, పూర్తి స్థాయిలో వారి నుంచి యంత్రాలు, సిమ్ కార్డులు స్వాధీనపరుచుకోవాల్సి ఉందని సీఐ సాంబశివరావు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు పోలీసుల అదుపులో ఉండటంతో రిటైల్ వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరిని ఎప్పుడు పోలీసులు రమ్మంటారోనని భయాందోళన చెందుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ రాకెట్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి వారి అక్రమ విక్రయాలకు ఫుల్స్టాప్ పెడతామని సీఐ చెప్పారు. -
సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు మా కంపెనీ సిమ్ కొంటే... టాక్ టైం ఫ్రీ... మెసేజ్ బ్యాలెన్స్ ఫ్రీ... డేటా ఫ్రీ అంటూ ప్రచారం చేసిన మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కొత్త బాట పట్టాయి. మా కంపెనీకి చెందిన సిమ్ కొనుగోలు చేస్తే ఓ కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ అని బ్యానర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో బ్యానర్లు వెలిశాయి. -
మహా మాయగాడు
కదిరి : ‘నేను అశోక్.. 2 ఏళ్ల క్రితం బొరుగులు అమ్ముకుని జీవనం సాగించేవాణ్ణి. ఇప్పుడు రూ కోట్లు సంపాదించాను. అదికూడా గదిలో కూర్చునే. అందరిలాగా ఎండలో తిరగలేదు.. వానలో తడవలేదు.. చమటోడ్చి కష్టపడలేదు.. కేవలం సిమ్ కార్డులతోనే రూ కోట్లు సంపాదించాను’ అని చెప్పిన 2 రోజులకే కదిరి పోలీసుల వలలో చిక్కాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తలుపుల మండలం పెన్నబడివాండ్లపల్లికి చెందిన అశోక్ 2 ఏళ్ల క్రితం ఆ మండల కేంద్రంలో బొరుగులు అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ తర్వాత చిన్న బంకు పెట్టుకుని వివిధ కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులు, రీచార్జి కార్డులు అమ్మడం మొదలెట్టాడు. తర్వాత ఆ మండలానికి ఎయిర్టెల్, వొడాఫోన్ ఏజెన్సీ తీసుకున్నాడు. సిమ్‌కార్డులు అధికంగా అమ్మిన వారిని ప్రోత్సహించేందుకు ఆయా కంపెనీలు విదేశీ పర్యటనకు పంపడం, కార్లు లాంటి బహుమతులు ఇవ్వడం అశోక్ దృష్టిని ఆకర్షించింది. ఎలాగైనా తాను విదేశీ పర్యటనతో పాటు ఓ కారును బహుమతిగా కొట్టేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇందుకు సక్రమబాటలో వెళ్తే సాధ్యం కాదని.. అక్రమ బాట ఎంచుకున్నాడు. విదేశీ పర్యటనకు వెళ్లిరావడంతో పాటు కారును కూడా గిఫ్ట్‌గా అందుకున్నాడు. తలుపుల లాంటి చిన్న మండల ఏజెంట్ ఈ స్థాయికి ఎదగడం పలువురు సిమ్ కార్డుల ఏజెంట్లు, డీలర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయా కంపెనీలు సైతం అతన్ని ప్రశంశలతో ముంచెత్తాయి. అశోక్ ఎదుగుదల ఇలా: ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు కష్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ఇవ్వడం మొదలెట్టాయి. ఇందులో బాగంగా ట్రాయ్ ఆదేశాలతో ఆయా కంపెనీలు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని తీసుకొచ్చాయి. అదే అశోక్ పాలిట వరంగా మారింది. 6 నెలల క్రితం తలుపుల నుండి కదిరికి తన మకాంను మార్చేసి మున్సిపల్ పరిధిలోని సైదాపురంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. తనకు తోడుగా మరికొందరు యువకులను సాయంగా తీసుకుని వారికి ఆకర్షణీయమైన వేతనాన్ని ఇస్తూ తన చీకటి వ్యాపారాన్ని మొదలెట్టాడు. ఉదాహరణకు ఒక కష్టమర్ మొదట ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే ఆ కంపెనీ ఏజెంట్ అశోక్ రూ 50 కంపెనీ అందజేస్తుంది. ఇదే కష్టమర్ 3 నెలల తర్వాత ఎంఎన్‌పీ (మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ)ద్వారా వొడాఫోన్ నెట్‌వర్క్‌లోకి మారితే అశోక్‌కు రూ 150 కంపెనీ నుంచి వస్తుంది. ఇదే కష్టమర్ మరో 3 నెలల తర్వాత ఇంకో నెట్‌వర్క్‌లోకి మారితే అశోక్‌కు మరో రూ 300 వస్తుంది. ఇలా 100 మంది లోపు అయితే ఓ రేటు.. 100 నుండి 200 మధ్య మరో రేటు 1000 దాటితే ఇంకో రేటు ఆయా కంపెనీల నుండి అశోక్ ఖాతాలో పడుతోంది. ఇంతకీ అశోక్ అంతమంది కష్టమర్లను పోర్టబిలిటీ ద్వారా మార్చాడా అంటే మీరు పప్పులో సిమ్ వేసినట్లే. నకిలీ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఈ వ్యవహారమంతా ఆ అద్దె గదిలో కూర్చునే రాత్రింబవళ్లు నడిపాడు. దీనికోసం భారీ సంఖ్యలో ఫోన్లు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ కొనుగోలు చేశాడు. తాను ఎలాగో ఎయిర్టెల్, వొడాఫోన్ ఏజెంటు కాబట్టి తానే కష్టమర్ పాత్ర కూడా పోషించాడు. 100 సెల్‌పోన్లకు ఒక కంపెనీ సిమ్‌లు వే యడం.. 3 నెలల తర్వాత ఆ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినట్లు చేయడం.. మరో 3 నెలల తర్వాత ఇంకో కంపెనీకి మారడం.. ఎవరికీ అనుమానం రాకుండా పాత సిమ్ కార్డులను నిప్పు పెట్టి కాల్చివేస్తూ ఇలా తన చీకటి సిమ్ల వ్యాపారంతో ఇప్పటికే రూ కోట్లు సంపాదించాడు. ఇదే వ్యాపారాన్ని జిల్లాలో పలు పట్టణాలకు వ్యాపింపజేశాడు. ఆయా కంపెనీలు కూడా పసిగట్టలేని వ్యవహారాన్ని కదిరి పోలీసులు డేగకన్నుతో పసిగట్టి ‘అశోక్’ ‘సిమ్’హాన్ని బందించారు. దీనిపై తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మరికొంద రు ఉన్నట్లు సమాచారం రాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు కదిరి, తలుపుల, ముదిగుబ్బ, నల్లమాడ, కొత్తచెరువు, పుట్టపర్తి, హిందూపురం ఇంకా పలు పట్టణాల్లో ఉన్న అశోక్ ముఠా సభ్యులు సుమారు 20 మందిని అదుపులోకి తీసుకుని వేల సంఖ్యలో వివిధ కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై వివరాలు వెల్లడించడానికి కదిరి పోలీసులు నిరాకరించారు. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతారని తెలిసింది. -
సిమ్ కార్డులతో అయ్యప్ప దేవాలయం..
సిమ్‌కార్డులతో అయ్యప్ప భక్తుడు చిరంజీవి తయారు చేసిన అయ్యప్ప దేవాలయం మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు గోసుకొండ చిరంజీవి సిమ్‌కార్డులతో అయ్యప్పస్వామి దేవాలయం నమూనా తయారు చేసి అందరి దృష్టి ఆకర్షింస్తున్నాడు. సెల్‌షాప్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న చిరంజీవి షాపులో పనికిరాని సిమ్‌కార్డులను పోగుచేసి ఫెవికాల్, ఫెవిస్టిక్, వైట్ టేప్ సహాయంతో శబరిలోని అయ్యప్పస్వామి దేవాలయం నమూనాను తయారు చేశాడు. దీనిని రంగురంగు కాగితాలతో అలంకరించాడు. -
రాజీవ్‌గృహకల్పలో అలజడి
* పోలీసుల కార్డన్ సర్చ్ * 32 ద్విచక్రవాహనాల స్వాధీనం * పోలీసుల అదుపులో 12 మంది అనుమానితులు కుత్బుల్లాపూర్/ జగద్గిరిగుట్ట: అర్ధరాత్రి పోలీసుల బూట్ల చప్పుళ్లు.. ఒక్కసారిగా అలజడి.. తేరుకునే సరికి కార్డన్ సర్చ్ పేరిట పోలీసుల హడావుడి.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుని పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ అనుమానాలు నివృత్తి చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న కార్డన్ సర్చ్‌లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్పలో బాలానగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో విసృ్తత సోదాలు నిర్వహించారు. పోలీసులు వచ్చి ఇలా ఆకస్మాత్తుగా సోదాలు చేయడం శుభ పరిణామమేనని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు ఇటువంటి సోదాలు జరిపితే సంఘ విద్రోహశక్తుల్లో భయం పుడుతుందని వారన్నారు. మూడు గంటలు.. అష్ట దిగ్బంధం.. జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్ప సముదాయంలో సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ ఆర్.శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోలీసులు బృందాలుగా విడిపోయి ఇంటింటినీ సోదా చేశారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఐదుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 420 మంది పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. గృహకల్ప చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని బయటకు, లోనికి వెళ్లకుండా అష్టదిగ్బంధం చేసి మొత్తం 32 ద్విచక్ర వాహనాలు, పది ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకొని 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వందల కొద్దీ సిమ్‌కార్డులు... కార్డన్ సర్చ్ సందర్భంగా రాజీవ్ గృహకల్పలో ఉంటున్న ఓ వ్యక్తి వద్ద ఎయిర్‌సెల్‌కు సంబంధించిన వందల సిమ్‌కార్డులు దొరికాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరింత సోదా చేయగా అతని వద్ద పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు వేరే వ్యక్తుల డాక్యుమెంట్లు లభించాయి. వీటి వివరాలు పరిశీలించిన తర్వాత సిమ్ కార్డుల బాగోతంపై దృష్టి పెడతామని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. -
సిమ్ కార్డే ‘క్లూ’ !
పోస్ట్‌మార్టం * మిస్సింగ్ కేసు విచారణలో వెలుగు చూసిన మర్డర్... * అదృశ్యం అయ్యాడనుకున్న యువకుడు హత్యకు గురయ్యాడు * మృతుని సిమ్‌కార్డు వాడుతూ చిక్కిన హంతకులు * కూతురిని ప్రేమించడం ఇష్టంలేక హత్య చేయించిన తల్లి * పదిరోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు * కటకటాలపాలైన హంతకులు కామారెడ్డి : అశోక్ అనే యువకుడు కామారెడ్డిలో అదృశ్యం అయ్యాడని ఆయన బావ ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్ హత్యకు గురైనట్టు కనుగొని, నిందితులను అరెస్టు చేశారు. అశోక్ ప్రేమించిన అమ్మాయి తల్లే అశోక్‌ను హత్య చేయించినట్టు తేల్చారు. ఈ కేసును తేల్చడంలో మృతుడి సిమ్‌కార్డే పోలీసులకు ‘క్లూ’గా ఉపయోగపడింది. ఈ కేసులో అసలేం జరిగిందన్న అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. కేసు నమోదు చేసిన పది రోజుల్లో నిందితులందరూ అరెస్టయ్యారు. కామారెడ్డి పట్టణ సీఐ కృష్ణ, ఎస్సై మధుతో పాటు పోలీసు సిబ్బంది ఈ కేసు తేల్చడంలో కృషి చేశారు. అశోక్ అదృశ్యంపై కామారెడ్డి ఠానాలో మిస్సింగ్ కేసు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడుకు చెందిన అశోక్(25) కొన్నేళ్లుగా తల్లితో కలిసి ఆర్మూర్ పట్టణంలో నివసించేవారు. కొంతకాలంగా మేడ్చల్ సమీపంలోని సుగుణ పౌల్ట్రీస్‌లో లైన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత నెల 29న అశోక్ సుగుణ పౌల్ట్రీస్‌లో పనిచేసే మార్కెటింగ్ సూపర్వైజర్ టి.శ్యాంసుందర్‌తో కలిసి ఆయన బైకుపై బయలుదేరి ఉదయం 10.30 గంటలకు కామారెడ్డికి చేరుకున్నాడు. అక్కడ అశోక్ బస్టాండ్ వద్ద దిగి తన ఊరికి బస్సులో వెళ్లాడు. అయితే ఇంటికి వస్తున్నానని చెప్పి ఆరోజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అశోక్ గురించి ఆరాతీశారు. అశోక్ స్నేహితుడు శ్యాంసుందర్‌ను సంప్రదించగా కామారెడ్డి వరకు తనతోనే వచ్చాడని తెలిపారు. ఈ నెల ఒకటిన అశోక్ బావ గాండ్ల రాజేందర్, అశోక్ కామారెడ్డిలో అదృశ్యం అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ నంబరు ఆధారంగా విచారణ అశోక్‌కు సంబంధించిన 9502136620 నంబరు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సిమ్‌కార్డును నందిపేట సెల్‌టవర్ పరిధిలో వాడకంలో ఉన్నట్టు ఈ నెల 11న పోలీసులు గుర్తించారు. ఆ సిమ్‌ను నందిపేటకు చెందిన కండెల్లి రాజేందర్ అనే యువకుడు వాడుతున్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించారు. విచారణ అశోక్‌ను హతమార్చినట్టు రాజేందర్ వెల్లడించాడు. దీంతో పట్టణ సీఐ కృష్ణ ఈ కేసుకు సంబంధించి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి రాజేందర్‌ను విచారించారు. తనతో పాటు ఆకుల గంగాధర్ కలిసి అశోక్‌ను హతమార్చినట్లు వెల్లడించాడు. పథకం ప్రకారం హత్య.... కండెల రాజేందర్ వద్ద అశోక్ చీటి వేశాడు. చీటి డబ్బులు ఇస్తామని రాజేందర్ అశోక్‌ను రమ్మన్నాడు. దీంతో గత నెల 29న అశోక్ నందిపేటకు బయలుదేరాడు. అయితే అప్పటికే పథకం వేసుకున్న కండెల రాజేందర్, ఆకుల గంగాధర్‌లు నందిపేట సమీపంలోని పలుగుగుట్ట వద్ద ఉన్న రాజేందర్ పొలం వద్ద ఉన్నారు. అశోక్ అక్కడికి రాగానే రాజేందర్ మందు తాగమన్నాడు. తాను మద్యం తాగనని అశోక్ చెప్పడంతో కూల్‌డ్రింక్ తెప్పించుకుని తాగారు. అప్పుడే ఆకుల గంగాధర్ అక్కడ దాచి ఉంచిన కట్టెను తీసుకుని అశోక్ తలపై కొట్టగా, రాజేందర్ పారతో బాదాడు. తీవ్రంగా కొట్టిన తరువాత గోనెసంచిలో కుక్కి అంతకుముందు రోజే రాజేందర్ పంట చేనులో తవ్వి ఉంచిన గోతిలో తలకిందులుగా పడేశారు. చనిపోయాడో లేదోనని బండరాయిని పైన వేశారు. తరువాత మట్టికప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అశోక్‌కు సంబంధించిన సిమ్‌కార్డును రాజేందర్ తన ఫోన్లో వేసుకుని వాడసాగాడు. సిమ్‌కార్డు ద్వారా రాజేందర్‌ను పట్టుకున్న పోలీసులు మిస్సింగ్ అయినట్టు భావించి, అశోక్ హత్యకు గురైనట్టు తేల్చారు. అశోక్ ప్రేమించే అమ్మాయి తల్లే హత్య చేయించింది.... ఈ కేసును విచారించిన పోలీసులు హత్యకు కారణాన్ని కనుగొన్నారు. ఆర్మూర్‌లో నివసించే బొడ్డు విజయకు ఒక కూతురు ఉంది. పక్క ఇంట్లో అశోక్ తల్లి నివసించేది. అశోక్‌తల్లి, బొడ్డు విజయలు స్నేహితులయ్యారు. అయితే కొంతకాలంగా అశోక్ బొడ్డు విజయ కూతురిని ప్రేమించసాగాడు. పెళ్లి చేసుకుంటామని కూతురు విజయకు చెప్పింది. కులాంతర వివాహం ఇష్టంలేని విజయ అడ్డు చెప్పింది. అయితే విజయ కూతురితో అశోక్ ప్రేమ వ్యవహారం ముదరడంతో ఎలాగైనా అశోక్‌ను తప్పించాలనుకున్న విజయ తన బంధువైన కండెల రాజేందర్‌తో మాట్లాడింది. అశోక్‌ను హతమారిస్తే రూ. లక్ష ఇస్తానని చెప్పింది. డబ్బుల ఆశతో రాజేందర్ తన స్నేహితుడు ఆకుల గంగాధర్‌తో కలిసి అశోక్‌ను పథకం ప్రకారం హతమార్చారు. గత నెల 11న కండెల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేయగా, 14న ఆకుల గంగాధర్, బొడ్డు విజయలను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. -
నిరంతర విద్యుత్‌కు సన్నద్ధం
‘మోడెం’తో సిబ్బంది సాకులకు చెక్ నర్సీపట్నం టౌన్ : విద్యుత్ అంతరాయాన్ని చిటికెలో తెలుసుకోవడానికి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) మోడెం విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 2 నుంచి గృహ, వ్యవసాయ అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. సరఫరాలో అంతరాయానికి కారణాలను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మోడెం వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సరఫరా నిలిచిపోయే పరిస్థితికి ఈ వ్యవస్థ చెక్ పెడుతుంది. సిబ్బంది వివిధ సాకులు చూపి కోతలు విధించడానికి అవకాశం ఉండదు. మోడెం విధానం ద్వారా కారణాన్ని తెలుసుకొని ప్రశ్నించడానికి వీలుంటుంది. ఇప్పటికే ఈ విధానం నర్సీపట్నం మున్సిపాలిటీలో అమలవుతోంది. రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని పూర్తి చేశారు. ఈపీడీసీఎల్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయడం ద్వారా పట్టణంలో విద్యుత్ సరఫరా ఉన్న సమయం, లేని సమయం నమోదవుతుంది. విద్యుత్ ఉపకేంద్రాల్లో ఉన్న ఫీడర్లకు ప్రత్యేక మీటర్లు, సిమ్‌కార్డులు ఉన్న మోడెంలను అమర్చారు. దీంతో ఇవి ఇప్పటికే అన్లైన్లో అనుసంధానమై సరఫరా వివరాలు అందుబాటులోకి వచ్చాయి. నర్సీపట్నం డివిజన్లోని 14 మండలాల్లో 2.20 లక్షల కనెక్షన్లున్నాయి. వీటిలో గృహ వినియోగ కనెక్షన్లు లక్షా 92 వేలు, వాణిజ్య కనెక్షన్లు 13,500, పరిశ్రమలు 837, వ్యవసాయ 14,200 కనెక్షన్లకు 110 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీతో పాటు గొలుగొండ, నాతవరం, కోటవురట్ల, ఎస్.రాయవరం, మాకవరపాలెం, రోలుగుంట, రావికమతం, చీడికాడ, వడ్డాది, కొయ్యూరు. చోడవరం, కె.కోటపాడు, మాడుగుల, మోడెం విధాన పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్త నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తారు. అక్టోబర్ 2 నుంచి డివిజన్లో నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నద్ధమవుతున్నామని డివిజనల్ ఇంజినీర్ ఎన్.రమేష్ తెలిపారు. -
‘స్మార్ట్’ రూట్లో సిమ్ కార్డ్...
మొబైల్ ఫోన్లకు ఊపిరిగా నిలిచే సిమ్ కార్డులు ఇప్పుడు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. సరికొత్త ఫీచర్లు, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఖాతాదారులను ఆకట్టుకునేందుకు టెలికం కంపెనీలు ఈ కొత్తతరం సిమ్‌లను అందిస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లలో మొబైల్స్ ప్రస్థానానికి అనుగుణంగానే ఈ సిమ్‌లు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ మార్పు చెందుతున్నాయి. అయితే, ఇప్పుడు సెల్ ఫోన్లను కేవలం మాట్లాడుకోవడానికే కాకుండా.. బ్యాంకింగ్, మొబైల్ షాపింగ్ ఇతరత్రా అనేక రోజువారీ కార్యకలాపాలకు కూడా కీలకంగా ఉపయోగించడం పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ల హవాయే దీనికి ప్రధాన కారణం. దీంతో టెల్కోలు సిమ్‌లకు మరిన్ని హంగులు, ఫీచర్లను జతచేస్తున్నాయి. సబ్స్క్రయిబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్‌నే సంక్షిప్తంగా సిమ్గా పిలుస్తారు. దీనిలోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కస్టమర్లకు సంబంధించిన వివరాలు ఇతరత్రా డేటాను టెల్కోలు నిక్షిప్తం చేస్తాయి. నిర్ధాయక(వెరిఫికేషన్) కోడ్లకు అనుగుణంగా యూజర్లు సేవలు పొందేందుకు వీలవుతుంది. సిమ్‌లను ఒకప్పుడు మొబైల్ హ్యాండ్సెట్లలోనే వాడేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన డాంగిల్స్, ట్యాబ్లెట్స్ పీసీల్లోనూ వీటి వాడకం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ‘వెరిఫికేషన్ కోడ్స్‌తో పాటు ఇప్పుడు సిమ్‌లలో వినియోగదారుల సమాచారానికి మరింత భద్రతను కల్పించేలా టెల్కోలు మార్పులు ప్రవేశపెడుతున్నాయి. సమాచార మార్పిడి వేగంగా జరిగేలా అత్యాధునిక సర్క్యూట్లను వాడటం.. మరింత ఎక్కువ డేటా నిల్వ సామర్థ్యం వంటివి కూడా ఇందులో ప్రధానమైనవి’ అని జీఎస్ఎం టెలికం ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్. మాథ్యూస్ పేర్కొన్నారు. నయా రూట్: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అనువుగా చిన్న అప్లికేషన్లు/యుటిలిటీ ప్రోగ్రామ్(యాప్లెట్స్)లను సిమ్‌లలో ముందుస్తుగా నిక్షిప్తం చేసి ఇస్తున్నారని ఐఎంఐ మొబైల్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ మేనేజ్మెంట్) సుదర్శన్ ధరమ్‌పురి చెబుతున్నారు. టెలికం ఆపరేటర్లకు మొబైల్ డేటా ప్లాట్‌ఫామ్ ఇతరత్రా సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ యాప్లెట్స్ను సిమ్‌లను తీసుకున్న తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సంగీతం, ఇంటర్నెట్ వినియోగం, సెల్ఫ్‌కేర్ అప్లికేషన్లకు ఈ యాప్లెట్స్ కీలకంగా నిలుస్తాయని సుదర్శన్ అంటున్నారు. మొబైల్ వినియోగదారుడు తను వినియోగిస్తున్న టారిఫ్ ప్లాన్లపై అవగాహన పెంచుకోవడానికి, ఇంటర్నెట్ డేటా వినియోగం, టాప్అప్ అవసరాలు వంటివన్నీ ఈ సెల్ఫ్‌కేర్ అప్లికేషన్లతో సులువుగా చక్కబెట్టుకోవచ్చు. మాటిమాటికీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం వల్ల అయ్యే వ్యయాలను ఇది గణనీయంగా తగ్గిస్తుంది కూడా. పోటీని తట్టుకోవడానికి టెల్కోలు అనేక రకాల అప్లికేషన్లను సిమ్‌కార్డుల్లో పొందుపరుస్తున్నాయని సీడీఎంఏ, యూనిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్ల సంఘం సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ చెప్పారు. ప్రస్తుతం స్టాండర్డ్, మైక్రో, నానో ఫార్మాట్లలో మూడు రకాల సిమ్ కార్డులు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగంతోపాటు ప్రీ-లోడెడ్ డేటాతో వస్తున్నాయి. గతంలో 16 కేబీలకే పరిమితమైన డేటా సామర్థ్యం ఇప్పుడు 32 కేబీలకు పెరిగింది కూడా. కొన్ని టెల్కోలు 64 కేబీ సిమ్లనూ సరఫరా చేస్తున్నాయి. మరోపక్క అధిక సామర్థ్యం, ఫీచర్లున్న సిమ్ కార్డులను ఇవ్వడం వల్ల టెల్కోలకు వ్యయం పెరుగుతోంది. చాలా కంపెనీలు కొత్త కనెక్షన్‌తో పాటు ఉచితంగా సిమ్‌లను ఇస్తున్న(కొన్ని సర్కిళ్లు, స్కీమ్‌లు, డేటా యూజర్లకు) విషయం విదితమే. -
నకిలీ ఏటీఎం కార్డులతో రూ.50 కోట్ల లూటీ
మల్కన్‌గిరి (ఒడిశా) న్యూస్‌లైన్ : నకిలీ ఏటీఎం కార్డుల సాయంతో ఏటీఎంలను కొల్లగొడుతున్న 9 మంది సభ్యుల దొంగల ముఠాను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లాప్‌టాప్‌లు, మూడు డేటా కార్డులు, నాలుగు సెల్ఫోన్లు, 50 సిమ్‌కార్డులు, వివిధ బ్యాంకుల పేరుతో ఉన్న నకిలీ ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లు, పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. ఈ ముఠా సభ్యులు 2006 నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి, గజపతి, కోరాపుట్, కేంద్రపడా, కటక్, బాలసోర్, రాయగడ, నబరంగపుర్ ప్రాంతాలతోపాటు ఢిల్లీ, బరోడాలలోని ఏటీఎంల నుంచి సుమారు రూ.50 కోట్లను స్వాహా చేసినట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్సింగ్ శుక్రవారం చెప్పారు.