పాక్ గూఢచారి పట్టుబడ్డాడు
శుక్రవారం పాక్ గూఢచారిని అరెస్టు చేసిన రోజునే కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భారత్ పోస్టులపై పాకిస్తానీ రేంజర్లు దాడులు జరిపారు. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఏడుగురు పాకిస్తానీ రేంజర్లను హతమార్చింది. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేని పాకిస్తాన్ పేర్కొంటోంది. నిన్న జరిగిన ఈ సంఘటనతో బీఎస్ఎఫ్ పోస్టులపై పాకిస్తాన్ ఎక్కువగా గురిపెట్టినట్టు తెలుస్తోంది.
గత నెల కశ్మీర్లోని ఉడీ ఆర్మీ బేస్పై దాడులు జరిపి 19మంది మన జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. వెంటనే పాకిస్తాన్కు షాక్గా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడులు నిర్వహించింది. 30 నుంచి 50 మంది ఉగ్రవాదులను ఈ దాడిలో చనిపోయినట్టు భారత ఆర్మీ పేర్కొంది. కానీ ఆ దాడులపై పాకిస్తాన్ మళ్లీ దుష్ఫచారమే చేయడం ప్రారంభించింది. అవి అసలు సర్జికల్ స్ట్రైక్సే కావని, తరుచూ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే కాల్పులేనని పేర్కొంది.