న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా కలిసి ఉండేందుకు ఇస్లామాబాద్ మార్గాన్ని వెతకాలని, లేదంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.
అయతే జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. గురువారం కూడా బారాముల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. అంతకు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్‌ను ఉగ్రవాదులను కాల్చి చంపారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడులకు పరిష్కారం కనుగొనే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని, సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. వీటికి మూలాలు తమకు తెలుసని, అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నానని అన్నారు. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు.
‘ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ఎందుకు పాకిస్థాన్ ఈ దాడులకు విధ్వంసానికి పాల్పుడుతోంది. వారి స్వంత భవిష్యత్తునే ఎందుకు నాశనం చేసుకుంటుంది. మేమేమీ పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment