terror attacks
-
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్‌లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్‌తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్‌బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్‌క్లబ్‌లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్‌లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
కశ్మీర్లో కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, స్థానిక పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగతున్నాయి. ఈ ఎదురుకాల్పులల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. డచిగామ్‌లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం డచిగామ్‌లో టెర్రరిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మృతిచెందినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గగన్‌గీర్, గందేర్బల్ సహా పలు ప్రాంతాల్లో దాడులకు సూత్రధారి జునైద్ అని పోలీసులు చెబుతున్నారు. అక్కడ టెర్రరిస్టుల దాడుల కారణంగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. In the ongoing operation, one terrorist was killed and has been identified as Junaid Ahmed Bhat (LeT, Category A). The said terrorist was involved in civilians killing at Gagangir, Ganderbal and several other terror attacks. Operation continues in the upper reaches of Dachigam by… pic.twitter.com/8JhMfc1qMH— ANI (@ANI) December 3, 2024ఈ ఏడాది అక్టోబర్ నెలలో కశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్‌గిర్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జునైద్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడితో పాటు, ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్‌గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగం పనుల్లో పాల్గొంటున్న క్రమంలో ఉగ్రదాడి జరిగింది. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
బీరూట్: లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు మరోసారి భీకర దాడులకు దిగారు. ఆదివారం ఇజ్రాయెల్ భూభాగంపై 250 రాకెట్లు, ఇతర డ్రోన్లు ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతుండడంతో ప్రతీకార చర్యగా మిలిటెంట్లు రాకెట్లతో దాడి దిగారు. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఆర్మీ సెంటర్‌పై దాడికి పాల్పడింది. నైరుతి కోస్తా తీర రహదారిపై టైర్, నఖౌరా మధ్య ఈ దాడి జరిగినట్లు లెబనాన్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో ఒక సైనికుడు మృతిచెందాడని, 18 మంది గాయపడ్డారని తెలియజేసింది. -
‘అది ఎప్పటికీ జరగదు’.. పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా వార్నింగ్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా కలిసి ఉండేందుకు ఇస్లామాబాద్ మార్గాన్ని వెతకాలని, లేదంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.అయతే జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. గురువారం కూడా బారాముల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. అంతకు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్‌ను ఉగ్రవాదులను కాల్చి చంపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడులకు పరిష్కారం కనుగొనే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని, సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. వీటికి మూలాలు తమకు తెలుసని, అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నానని అన్నారు. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు.‘ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ఎందుకు పాకిస్థాన్ ఈ దాడులకు విధ్వంసానికి పాల్పుడుతోంది. వారి స్వంత భవిష్యత్తునే ఎందుకు నాశనం చేసుకుంటుంది. మేమేమీ పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
నువ్ తొత్తువి నిన్ను లేపేస్తా!
నువ్ తొత్తువి నిన్ను లేపేస్తా! -
ఈ తోక వంకర తీసేదెట్లా?
కొత్త ఏడాది ఇలా ఆరంభమవుతుందని కశ్మీర్ ప్రజలు ఊహించలేదు. అందరూ శాంతి, సంతోషాలను కోరుకుంటున్న వేళ జమ్ములో తీవ్రవాదం జడలు విప్పి, 12 గంటల్లో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న తీరు మనసును కలచివేస్తుంది. కశ్మీర్ లోయతో పోలిస్తే ప్రశాంతమైన జమ్ములో ఇలాంటి ఘటన జరగడం విషాదం. 2019లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ప్రకటించిన జమ్ము– కశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా తీవ్రవాదులు ఈ దుశ్చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. ఇది పాక్ ప్రేరేపిత తీవ్రవాద చర్య అని అర్థం చేసుకోవడం బ్రహ్మవిద్యేమీ కాదు. కాకపోతే, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ, తీవ్రవాద కేంద్రస్థానంగా పాకిస్తాన్‌ను ప్రస్తావించి, ఈ ధోరణిని మార్చుకోవాలంటూ హితవు చెప్పిన పక్షం రోజులకే ఈ ఘాతుకం జరగడం శోచనీయం. మారని పాక్ వక్రబుద్ధికి మరో తార్కాణం. తాజా ఘటన పూర్వాపరాలు దిగ్భ్రాంతికరం. జమ్ము–కశ్మీర్ సరిహద్దు జిల్లాలో రజౌరీ పట్నానికి 8 కిలోమీటర్ల దూరంలోని ధాంగ్రీలో జనవరి 1 సాయంత్రం 7 గంటల వేళ ఖాకీ దుస్తులు ధరించిన తీవ్రవాదులు అక్కడి అల్పసంఖ్యాక వర్గానికి చెందిన మూడు ఇళ్ళలోకి జొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి, నలుగురు పౌరుల ప్రాణాలు తీశారు. పలువురిని గాయపరిచి, అక్కడ నుంచి ఉడాయించారు. ఆ తుపాకీ దాడులు ముగిసిన కొద్ది గంటల్లోనే ఆ ఇళ్ళ దగ్గరే ఒక చోట తీవ్రవాదులు ఉంచిన బాంబులు పేలి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. దర్యాప్తుకు వచ్చే భద్రతాదళ ఉన్నతాధికారులే లక్ష్యంగా ఆ బాంబులు పెట్టడం, ఆధార్ కార్డుల ద్వారా గుర్తుపట్టి మరీ ఎంపిక చేసినవారినే తుపాకీ కాల్పులతో చంపడం తీవ్రవాదుల కక్షను తేటతెల్లం చేస్తోంది. కశ్మీర్లో తీవ్రవాదం వైపు కొత్తగా ఆకర్షితులవుతున్నవారిని వేగంగా నిర్వీర్యం చేస్తున్నామని అక్కడి ఉన్నతాధికారుల ఉవాచ. నిన్న గాక మొన్న ముగిసిన 2022లో 100 మంది కొత్తగా తీవ్రవాద మార్గంలోకి రాగా, 65 మందిని ఎన్కౌంటర్ చేశామనీ, వారిలోనూ 58 మందిని (89 శాతం) చెడు దోవ తొక్కిన తొలి నెలలోనే మట్టికరిపించామనీ లెక్కలు చెబుతున్నారు. ఎంతమంది తీవ్ర వాదులు కొత్తగా వస్తున్నదీ, పోతున్నదీ మన పాలకులు, పోలీసులు ఇంత నిర్దుష్టంగా చెప్పగలగడం ఆశ్చర్య మైతే, వారి ప్రతి అడుగూ ఇంత తెలిసినవారు అడ్డుకట్ట వేయలేకపోవడం అమితాశ్చర్యం. పైగా, ఆదివారం దాడి తర్వాత ఆ రాత్రి అణువణువూ జల్లెడ పట్టామని భద్రతా దళాలు చెప్పినా, ఆ దగ్గరే దుండగులు పెట్టిన బాంబులు మర్నాడు పేలి మృతులు పెరగడం మన పనితీరును ప్రశ్నిస్తోంది. రజౌరీ జిల్లాలో కొన్నిచోట్ల ముప్పుందని కొంతకాలంగా అనుమానిస్తున్నారు. గాలింపులూ జరిగాయి. అయినా సరే ఇలా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు సాగడం అటు తీవ్రవాదుల తెగింపుకూ, ఇటు మన భద్రతా వైఫల్యానికీ నిలువుటద్దం. జిల్లాలో ఓ సైనిక శిబిరం బయట కాల్పుల్లో ఇద్దరు పౌరుల ప్రాణాలు పోయిన రెండు వారాల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. సరిహద్దులోని అల్పసంఖ్యాకులే గురిగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు చేస్తున్న ఈ అరాచకం దాయాది దేశం సాధించదలుచుకున్నదేమిటో చెప్పకనే చెబుతోంది. పొరుగు దేశాలన్నిటితో భారత్ సదా సత్సంబంధాలే కోరుకుంటుంది. అలాగని తీవ్రవాదాన్ని బూచిగా చూపించి మనల్ని చర్చలకు తలొగ్గేలా చేయాలనుకుంటే కుదిరేపని కాదు. ఆ మాటే ఆ మధ్య జైశంకర్ కుండబద్దలు కొట్టారు. జైశంకర్ సోమవారం వ్యాఖ్యానించినట్టు, అనేక దశాబ్దాలుగా సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పద్ధతులను యూరోపియన్ దేశాలు సహా అంతర్జాతీయ సమాజం నిర్ద్వం ద్వంగా ఖండించకపోవడం మరీ ఘోరం. తీవ్రవాదాన్ని సహించబోమని జబ్బలు చరిచే అమెరికా సైతం భారత్‌తో భుజం భుజం కలుపుతూనే, పాక్‌తోనూ మంచిగా ఉంటోంది. 2018లో ట్రంప్ హయాంలో పెట్టిన నిషేధాన్ని తొలగిస్తూ, బైడెన్ హయాంలో అమెరికా గత ఏడాది పాక్‌తో ఎఫ్16 విమానాల ఒప్పందం పునరుద్ధరించింది. తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్ భాగస్వామి గనకనే ఈ సైనిక, రక్షణ సాయమన్న అమెరికా మాట అతి పెద్ద జోక్. ఇక, ఇటీవలే భారత్, పాక్‌లలో దేన్నీ తాము వదులుకోలేమంటూ విదేశాంగ ప్రతినిధి చేసిన వ్యాఖ్య అగ్రరాజ్యపు నైజానికి తార్కాణం. మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారం సహా అంతర్జాతీయ నేరాలెన్నో ముడిపడిన సీమాంతర తీవ్రవాదాన్ని కేవలం ఫలానా దేశపు తలనొప్పి లెమ్మని ఊరకుంటే ముప్పు మీదకొ స్తుంది. రోజూ తీవ్రవాదుల్ని భారత్‌కు ఎగుమతి చేస్తున్న పొరుగుదేశం పక్కలో పాము లాంటిదే. గతంలో హిల్లరీ క్లింటన్ అన్నట్లు, ‘పెరట్లో పాములను పెట్టుకొని, అవి కేవలం పొరుగువాణ్ణే కాటేస్తాయనుకుంటే పొరపాటే!’ ఆ సంగతి అమెరికా సహా అంతర్జాతీయ దేశాలన్నీ గ్రహించాలి. భారత్ సైతం పాక్‌పై అంతర్జాతీయ వేదికలపై ధ్వజమెత్తుతూనే, అమెరికా పైనా కన్నేసి ఉంచాలి. మన పాలకులు కశ్మీర్ లోయలో పండిట్లు సహా స్థానికులపై తీవ్రవాద దాడులు 2019 తర్వాత పెరిగిన చేదునిజాన్ని గుర్తించాలి. తీవ్రవాదుల్ని కాక తీవ్రవాదాన్ని అంతం చేసే పనికి దిగాలి. స్థానికుల ఆశలు, ఆకాంక్షలకు పెద్ద పీట వేస్తూ, వారే పాలకులయ్యేలా చూడాలి. సానుకూల వాతావరణం కల్పించి, ఇప్పటికే అపరిమితంగా ఆలస్యమైన అసెంబ్లీ ఎన్నికలను జరిపించి, స్థానిక ప్రభుత్వ ఏర్పాటుతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మార్గం. -
Targeted Attacks: నిన్న ఇంట్లోకి చొరబడి కాల్పులు.. నేడు బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది. రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం.. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆందోళనలు.. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
'2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి'
2009లో పాకిస్తాన్లో పర్యటనకు వచ్చిన లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు బస్సుపై కురిసిన బులెట్ల వర్షానికి లంక జట్టులో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో థిల్లాన్ సమరవీర, తిలకరత్నే దిల్షాన్, అజంతా మెండిస్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, సురంగ లక్మల్, చమిందా వాస్ సహా మరికొంత మంది క్రికెటర్లు ఉన్నారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోగా.. ఇద్దరు పౌరులు బలయ్యారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. అప్పటినుంచి దాదాపు 2019 వరకు అంటే పదేళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి ఇష్టపడలేదు. పాక్ ఏదైనా హోం సిరీస్ ఆడాలంటే యూఏఈకి రావాల్సిందే. దీంతో పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు జరగక అక్కడి మైదానాలన్ని వెలవెలబోయాయి. బోర్డు నుంచి సహాయం లేకపోవడంతో క్రికెట్ మైదానాలను మూసే పరిస్థితి కూడా వచ్చింది. తాజా పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో కాస్త మార్పు కనిపిస్తుంది. 2019లో శ్రీలంక రెండు టెస్టులు ఆడేందుకు పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే.. పాక్‌లో ఆడేందుకు జంకిన ఇతర దేశాలు లంకతో సిరీస్‌ను పాక్ నిర్వహించిన తీరుపై నమ్మకం వచ్చి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు కూడా పాక్ గడ్డపై పర్యటించాయి. దశాబ్దం నుంచి క్రికెట్ మ్యాచ్‌లు లేక మూగబోయిన మైదానాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ అంశంపై స్పందించాడు. ''2009లో లంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మా దేశంలోని మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారిపోయాయి. మా మైదానాల్లో క్రికెట్ ఆడాలని మాకున్నప్పటికి పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మైదానాల్లో ప్రేక్షకులు మిస్సయ్యాం. అప్పటి బాధ వర్ణణాతీతం. ఈ పదేళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు దేశ ప్రభుత్వం క్రికెట్‌ను బతికించేందుకు చొరవ తీసుకుంది. మేము కూడా విదేశీ లీగ్‌ల్లో ఆడే సమయంలో విదేశీ ఆటగాళ్లతో మాట్లాడేవాళ్లం. వాళ్లను క్రికెట్ ఆడేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాం. పాక్‌లో మళ్లీ క్రికెట్ ఆడేందుకు పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో పాకిస్తాన్ నుంచి మిగతా దేశాలకు క్రికెట్ సురక్షితంగా ఆడుకోవచ్చు అనే భరోసా కల్పించేలా చేశాం. ఇప్పుడు ఆ ఇబ్బందికర దశ మారింది. పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు పర్యటించాయి. రానున్న కాలంలో మరిన్ని జట్లు పర్యటనకు వస్తాయని ఆశిస్తున్నా. ఇక క్రికెట్ గ్రౌండ్స్ ప్రేక్షకులతో నిండిపోతుండడం సంతోషంగా అనిపిస్తుంది. ''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. బెన్ స్టోక్స్, సామ్ కరన్‌లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టాల్సిన పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ చేరడం.. అక్కడ కివీస్‌ను ఓడించడం.. ఆపై ఫైనల్‌కు వెళ్లింది. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన పాక్ రన్నరప్‌గా నిలిచింది. చదవండి: టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..! -
Targeted Attacks: కశ్మీర్లో నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేయగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది. షోపియాన్‌లోని హర్మెన్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి టెర్రరిస్టులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో హర్మెన్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది. గత శనివారం ఇదే షోపియాన్ ప్రాంతంలో పురాన్ క్రిషన్ భట్(56) అనే కశ్మీరీ పండిట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్ గ్రామంలో పూరాన్ భట్ తన ఇంటి వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రకటించింది. భట్ హత్యతో కశ్మీర్ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్ 2న మునీర్ ఉల్ ఇస్లామ్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్.. పూజలు వికటించడంతో కక్షగట్టి! -
Russia-Ukraine war: రష్యా ధ్వంస రచన
కీవ్/మారియూపోల్: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు దిగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. తూర్పు ప్రాంతంలోని రైల్వే కార్యాలయాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం సోమవారం క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమ ప్రాంతంలోనూ రెండు చమురు కేంద్రాలపై దాడికి దిగింది. మధ్య, పశ్చిమ ఉక్రెయిన్‌లో ఐదు రైల్వే కార్యాలయాలపై దాడులు చేసింది. క్రెమెన్‌చుక్‌లోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేశాయి. రష్యా యుద్ధ విమానాలు ఆదివారం రాత్రి 56 చోట్ల దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ చెప్పింది. రష్యా ఆయిల్ డిపోలో మంటలు ఉక్రెయిన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రష్యా నగరం బ్రియాన్స్క్లో ఆయిల్ డిపోలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దానికి కారణాలు తెలియరాలేదు. ఈ అయిల్ డిపో నుంచి యూరప్‌కు పైప్‌లైన్ ద్వారా ముడి చమురు సరఫరా అవుతూంటుంది. పశ్చిమ దేశాల కుట్రలు సాగవు: పుతిన్ తమ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు కుట్ర పన్నుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఆరోపించారు. రష్యాను అంతర్గతంగా ధ్వంసం చేసేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. యుద్ధ పరిస్థితిపై సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆ బాలలకు ఈస్టర్ బహుమతులు మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ బంకర్లో క్షణమొక యుగంలా గడుతుపున్న ఉక్రెయిన్ బాలల ముఖాల్లో ఈస్టర్ బహుమతులు వెలుగులు నింపాయి. ఉక్రెయిన్ సైన్యం వారికి బహుమతులు అందించింది. మరోవైపు నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ మే 22 తర్వాత దరఖాస్తు సమర్పించనున్నాయి. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సోమవారం టర్కీలో పర్యటించారు. ఆయన మంగళవారం రష్యా వెళ్లి పుతిన్‌తో సమావేశమవుతారు. 28న ఉక్రెయిన్‌కు వెళ్తారు. రష్యా ప్రభుత్వం 40 మంది జర్మనీ దౌత్య అధికారులను తమ దేశం నుంచి బహిష్కరించింది. -
ఐపీఎల్ 2022కు ఉగ్రదాడి ముప్పు..?!
ఐపీఎల్ 2022కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెర లేననున్న సమయంలో ఈ వార్త కాస్త ఆందోళన కలిగించింది. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది సీజన్‌ను ముంబై, పూణేల్లోనే నిర్వహించాలని లీగ్ నిర్వాహకులు భావించారు. అందుకు అనుగుణంగానే వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వాంఖడే స్టేడియాన్ని పరిశీలిస్తున్న ఆదిత్యా ఠాక్రే కాగా ఈసారి ఐపీఎల్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు బాంబు దాడులకు దిగనున్నట్లు గురువారం వార్తలు వచ్చాయి. ఉగ్రదాడి ముప్పు ఉందని క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్వ్కాడ్ టీమ్ ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేగాక కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మహారాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తమ బలగాలతో మార్చి 26 నుంచి మే 22 వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐతో పాటు ఐపీఎల్ నిర్వాహకులుకు సమాచారం అందించారు. ఇక మార్చి 26న సీఎస్కే, కేకేఆర్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరలేవనుంది. కాగా ఈసారి ఐపీఎల్ సీజన్‌కు 25 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఉగ్రదాడి ముప్పు నేపథ్యంలో అధికారులు విడుదల చేయనున్న గైడ్‌లైన్స్‌లోని కొన్ని ముఖ్య విషయాలు.. ►ఐపీఎల్లో జట్లను తరలించే బస్సులకు ప్రత్యేక భద్రత కల్పిస్తూ కంబాట్ వాహనాలు ఎస్కార్ట్‌గా వెళ్లనున్నాయి. ►ఆటగాళ్లు ఉండనున్న హోటల్స్ ముందు కఠినమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు స్టేడియం నుంచి హోటల్ పరిసరాల వరకు ఎలాంటి కార్లను పార్క్ చేయడానికి వీల్లేదు. ►ప్లేయర్లను సురక్షితంగా తరలించాడానికి వారికంటూ ప్రత్యేక ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ►ఆటగాళ్లను స్టేడియాలకు, హోటల్ రూంకు తరలించే బస్ డ్రైవర్లతో పాటు మిగతా సిబ్బందిని రోజువారిగా చెక్ చేస్తారు. ఐపీఎల్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లడానికి వీలేదు. ►ఎవరైనా ఆటగాడు తమకు తెలిసిన వ్యక్తిని కలవాలనుకుంటే కచ్చితంగా జట్టు మేనేజర్ అనుమతి తీసుకోవాల్సిందే. ►సరైన ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా హోటల్ స్టాఫ్‌ను ఆటగాళ్ల వద్దకు అనుమతించరు. కాగా ఐపీఎల్ 2022కు ఉగ్రదాడి ముప్పు ఉందన్న వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఇంటలిజెన్స్ నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. ఆ వార్తల్లో నిజమెంత అనేది తేలుస్తామని.. ముందు జాగ్రత్త చర్యగా స్టేడియం, ఆటగాళ్లు ఉండనున్న హోటల్స్ పరిసరాల్లో భద్రత పెంచనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. చదవండి: MS Dhoni: ధోని ఎందుకీ నిర్ణయం.. కెప్టెన్‌గా ముగిస్తే బాగుండేది! IPL 2022: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్ -
Russia-Ukraine war: ప్రధాన నగరాలే టార్గెట్
కీవ్/లెవివ్/మాస్కో/వాషింగ్టన్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్ శివార్లతో పాటు పశ్చిమాన లెవివ్ సిటీపై శుక్రవారం ఉదయం భీకర దాడులు జరిపింది. లెవివ్ నడిబొడ్డున బాంబుల మోత మోగించింది. కొన్ని గంటలపాటు దట్టమైన పొగ వ్యాపించింది. క్షిపణి దాడుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో యుద్ధ విమానాల మరమ్మతు కేంద్రం, బస్సుల మరమ్మతు కేంద్రం దెబ్బతిన్నాయి. రష్యా నల్ల సముద్రం నుంచి లెవివ్‌పై క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. క్రామాటోర్స్క్ సిటీలో ఇళ్లపైనా క్షిపణులు వచ్చి పడుతున్నాయి. ఖర్కీవ్‌లో మార్కెట్లను కూడా వదలడం లేదు. చెర్నిహివ్‌లో ఒక్కరోజే 53 మృతదేహాలను మార్చురీలకు తరలించారు. మారియుపోల్‌లో బాంబుల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బాంబు దాడులకు గురైన థియేటర్ నుంచి 130 మంది బయటపడగా 1,300 మంది బేస్మెంట్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. రష్యా కల్నల్, మేజర్ మృతి ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సెర్గీ సుఖరెవ్, మేజర్ సెర్గీ క్రైలోవ్ కూడా వీరిలో చనిపోయినట్టు రష్యా అధికారిక టెలివిజన్ కూడా దీన్ని ధ్రువీకరించింది. రష్యా ఇప్పటిదాకా 7,000 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు సమాచారం. బైడెన్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తమకు అదనపు సైనిక సాయం అందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని రష్యా సరిగా అంచనా వేయలేకపోయిందన్నారు. ఆపేయండి: హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని ప్రఖ్యాత హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ రష్యాకు సూచించారు. పుతిన్ స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ‘‘నా తండ్రి కూడా కొందరి మాయమాటలు నమ్మి హిట్లర్ తరపున రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. భౌతికంగా, మానసికంగా గాయపడి ఆస్ట్రియాకు తిరిగొచ్చారు’’ అన్నారు. మానవత్వం చూపాల్సిన సమయం: భారత్ రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, సామాన్యులు మృత్యువాత పడుతున్నారని ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. నిరాశ్రయులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరముందని భద్రతా మండలి భేటీలో ఆయనన్నారు. భారత్ తనవంతు సాయం అందిస్తోందని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో సామాన్యులు చనిపోతుండడం తీవ్ర ఆందోళనకరమని ఐరాస పొలిటికల్ చీఫ్, అండర్ సెక్రెటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 60.6 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా ఉక్రెయిన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని రష్యా తరపు బృందానికి సారథ్యం వహిస్తున్న వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. ఉక్రెయిన్‌కు తటస్థ దేశం హోదా ఉండాలని తాము కోరుతున్నామని, ఈ విషయంలో ఒక ఒప్పందానికి ఇరుపక్షాలు దగ్గరగా వచ్చినట్లు వెల్లడించారు. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ఉద్దేశం పట్ల ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు. ర్యాలీలో పాల్గొన్న పుతిన్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాజధాని మాస్కోలో భారీ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పం రష్యాలో విలీనమై 8 ఏళ్లయిన సందర్భంగా మాస్కోలోని లుఝ్నికీ స్టేడియం చుట్టూ ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న తమ సైనిక బలగాలపై ఈ సందర్భంగా పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లో నాజీయిజంపై పుతిన్ పోరాడుతున్నారని వక్తలన్నారు. రష్యా చమురుపై జర్మనీ ఆంక్షలు! ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు ముకుతాడు వేయక తప్పదన్న సంకేతాలను జర్మనీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా బెయిర్‌బాక్ చెప్పారు. చమురు కోసం తాము రష్యాపై ఆధారపడుతున్నప్పటికీ ఇది మౌనంగా ఉండే సమయం కాదన్నారు. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో ఫోన్లో దాదాపు గంటపాటు మాట్లాడారు. ఉక్రెయిన్‌లో కాల్పులు విరమణకు వెంటనే అంగీకరించాలని కోరారు. -
కాబుల్‌లో మరో ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా హెచ్చరిక
-
తాలిబన్లతో జైషే మహ్మద్ చీఫ్ భేటీ, జమ్మూలో హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో జమ్మూలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా సంస్థలు హెచ్చరికలతో హైఅలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, కాందహార్‌లో తాలిబన్ల పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్, ఇతర నాయకులతతోనూ భేటీ అయిన నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ అయింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు భద్రతా చర్యలు చేపట్టాలని తీవ్రవాద వ్యతిరేక విభాగాలను కూడా అప్రమత్తం చేయాలని నిఘా అధికారులు హెచ్చరించారు. జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై లభించిన సమాచారం ఆధారంగా నిఘా సంస్థలు అధికారులను అప్రమత్తం చేశాయి. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే, సమర్ధవంతంగా తిప్పికొట్టేలా ఈ సమాచారాన్ని రాష్ట్ర నిఘా, భద్రతా సంస్థలతో పంచుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. సోషల్ మీడియాలో నిఘా ఉంచాలని కూడా ఆదేశించినట్టు ప్రకటించారు. ఆగస్టు మూడో వారంలో కందహార్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహ్మద్ (జేఈఎం) నాయకులు, తాలిబాన్ నాయకుల సమావేశ మైనట్టు తమ దృష్టికి వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు జేఈఎం తాలిబన్ మద్దతుకోరిందనీ, పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించాయి. కాగా అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాతనుంచీ వేలాది మంది వేలాదిమంది దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అనేక హృదయవిదాకరదృశ్యాలు ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టాయి. ఈ క్రమంలో గురువారం కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి సంచలనం రేపింది. మరోవైపు ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కాబూల్ ఉగ్రదాడిని ఖండించిన భద్రతా మండలి
ఐక్యరాజ్యసమితి: కాబూల్‌లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పదుల సంఖ్యలో సామాన్య పౌరులు, చిన్నారులు, సైనికులను బలిగొన్న ఈ దాడులను శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు చాలా కీలకమైందనీ, అఫ్గాన్ భూభాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు గానీ, దాడి చేసేందుకు గానీ ఉపయోగించరాదని మండలి ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. భారత్ అధ్యక్ష స్థానంలో ఉన్న భద్రతా మండలి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఐసిస్–కె పాల్పడినట్లుగా చెబుతున్న ఈ దాడిలో పౌరులు, చిన్నారులు, ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గర్హనీయం’ అని పేర్కొంది. పౌరుల తరలింపులో సాయ పడుతున్న ఆర్మీని, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అని స్పష్టం చేసింది. -
పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదుల కుట్ర
న్యూఢిల్లీ : జమ్మూ,కశ్మీర్ పోలీసులు పుల్వామా తరహా ఉగ్రవాద దాడి కుట్రను భగ్నం చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకోవటంతోపాటు పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేస్తున్నారు. పుల్వామా దాడి జరిగి నేటికి రెండేళ్లు అవుతున్న సందర్బంగా అదే తరహా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని మూడు రోజులక్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూ,కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పుల్వామా జిల్లాలో సుహాలి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి ఆరున్నర కేజీల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌నుంచి వచ్చిన మెసేజ్‌తో పుల్వామాలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు విచారణ సందర్భంగా సుహాల్ తెలిపాడు. చంఢీఘడ్‌లో ఖాజీ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ( అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ) అంతేకాకుండా సాంబ జిల్లాలో 15 చిన్నచిన్న ఐఈడీలు, ఆరు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను డ్రోన్‌నుంచి పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై జమ్మూ,కశ్మీర్ డీజీపీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు జైషే ఈ మహ్మద్, లష్కర్లు ‘ది రెసిస్టంట్ ఫ్రంట్, లష్కర్ ఈ ముస్తఫా’ అనే రెండు కొత్త గ్రూపులను తయారు చేశాయి. గతవారం లష్కర్ ఈ ముస్తఫా చీఫ్ హిదయతుల్లాను ఆరెస్ట్ చేశాం. ఇతడు న్యూఢిల్లీలోని ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ ఆఫీసుపై రెక్కీ నిర్వహించాడు’’ అని తెలిపారు. -
విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..
వాషింగ్టన్ : అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై (2001 సెప్టెంబరు 11) బీన్ లాడెన్ టీమ్ జరిపిన ఉగ్ర దాడులు చరిత్ర మరవలేదు. ఉగ్రవాదలు సృష్టించిన రక్తపాతానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఆల్‌ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. 9/11 దాడులు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. వేలమంది అమాయక పౌరులను పొట్టనపెట్టకుంది. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు తర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు ముగిసింది. ఈ సందర్భంగా అమెరికాలో 9/11 మృతులకు నివాళి అర్పించారు. ఏం జరిగింది.. ఆ రోజు ఉదయం 10 మంది ఆల్‌ఖైదా తీవ్రవాదులు.. వాణిజ్య సేవలందించే నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించారు. హైజాకర్లు రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)కు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. ఈ ఘటనతో వేలమంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి ఘటనలో ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు. రెండు సౌధాలు(భవనాలు) అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు ధ్వంసం అవడం, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన దాడుల్లో దుర్మరణం పాలైన 2,752 మంది బాధితుల్లో 343 మంది అగ్నిమాపకదళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం మరియు పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు.. ఇక మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు మరియు విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. విమానాల్లో ప్రయాణించిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు నివేదించాయి. తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించడం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రతిస్పందించింది. అల్‌ఖైదా తీవ్రవాదులకు సాయం చేసే తాలిబన్లను తుదముట్టించే విధంగా ఆఫ్గనిస్తాన్‌పై దండెత్తింది. అంతేకాక ఉగ్రవాదాన్ని ఏరివేతకు కఠిన చట్టాన్ని అమలుచేసింది. పలు ఇతర దేశాలు కూడా వాటి తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని బలోపేతం చేసుకోవడం మరియు చట్టం యొక్క అమలు అధికారాలను విస్తరించుకున్నాయి. కొన్ని అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు దాడుల నేపథ్యంలో వారంలోని మిగిలిన రోజుల్లో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయి. ఫలితంగా తిరిగి ప్రారంభించే సమయానికి తీవ్ర నష్టాలను చవిచూశాయి. బిలియన్ల డాలర్లు విలువ చేసే కార్యాలయ ప్రాంతం ధ్వంసమవడం ద్వారా లోయర్ మన్‌హట్టన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. చదవండి: 9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు తెర వెనుక ఇంత జరిగిందా.. సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్ మరియు అల్‌ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు బిన్ లాడెన్ 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది. డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా యూఎస్ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా రక్షణ శాఖ ఎంతో శక్తివంతమైనది, సీఐఏ ఎంతో ముందుచూపు కలిగి ఉన్నదైనప్పటికీ ఆల్‌ఖైదా టీమ్ పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన దాడులు జరపగలిగింది. ప్రపంచ దేశాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
ట్రంప్ ఓడిపోతే, 9/11 తరహా దాడి!
వాషింగ్టన్ : నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున రెండోసారి అధ్యక్ష పదవికి నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై 9/11 దాడుల తరహా సూత్రధారి, దివంగత ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ మేనకోడలు నూర్ బిన్‌లాడెన్ మద్దతుగా నిలిచారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దేశాన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుండి రక్షించగలరని, ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలవాలని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నూర్ బిన్ లాడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ప్రమాదమని, ట్రంప్ గెలిస్తేనే మరోసారి భయంకరమైన 9/11 తరహా దాడులు జరగకుండా అడ్డుకోగలరన్నారు. అమెరికా మాజీ అధ్యక్షడు ఒబామా, వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బాగా విస్తరించిందని ఆరోపించిన ఆమె బైడెన్ అధ్యక్షుడైతే అమెరికాకు ప్రమాదమని హెచ్చరించారు. అంతేకాదు బైడెన్ గెలిస్తే 9/11 తరహా దాడి మరొకటి అమెరికాపై జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షవాదులు ఎప్పుడూ రాడికలిజంతో పొత్తు పెట్టుకున్నారని నూర్ ఆరోపించారు. ట్రంప్ తన హయాంలో ఉగ్రవాదులను నిర్మూలించడంద్వారా అమెరికాను భయంకరమైన ఉగ్రదాడుల నుంచి కాపాడారని నూర్ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తల్లితో కలసి మూడేళ్ల వయస్సు నుంచి అనేకమార్లు అమెరికాకు వెళ్లానన్నారు. 2015లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీకి నిలిచినప్పటినుంచి ఆయనకు తాను ఫ్యాన్ అయిపోయానని, ఇపుడు కూడా ట్రంప్‌ను కచ్చితంగా ఎన్నుకోవాలన్నారు. తద్వారా అమెరికాకు మాత్రమే కాదు, మొత్తం పాశ్చాత్య నాగరికత భవిష్యత్తుకు చాలాముఖ్యమైనదన్నారు. సెప్టెంబర్ 11 దాడుల 19వ వార్షికోత్సవానికి ముందు ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా పెన్సిల్వేనియాలో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీపడుతున్న జో బైడెన్ పాల్గొననున్నారు. -
ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నారు. జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులో ఢిల్లీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమచారం అందించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ స్పెషల్ సెల్‌కు చెందిన బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. తొమ్మిది ప్రాంతాలతో సోదాలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలలో పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నారు. (చదవండి : ‘భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చు’) ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఇతర ప్రాంతాల వారి వివరాలు సేకరిస్తున్నారు. హోటళ్లలో తనిఖీలు చేపట్టి కొత్తగా గదులు బుక్ చేసుకున్నవారిపై ఆరా తీస్తున్నారు. అలర్ట్‌గా ఉండాలని 15 జిల్లాల డీసీపీలకు పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేశారు. పేలుడు పదార్థాలలో ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నేషనల్ కాపిటల్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. -
‘భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చు’
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు జరుపొచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలను పాక్ కట్టడి చేయపోతే ముష్కరులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఆర్టికల్ 370 రద్దు చేస్తు భారత ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని ఉగ్రవాదులు వ్యతిరేకిస్తున్నారు. భారత్‌లో పాక్ ఉగ్రవాదులు దాడులు చేయడానికి కుట్రలు పన్నారనే అనుమానం కలుగుతోంది. ఉగ్ర సంస్థలను పాక్ కట్టడి చేయపోతే భారత్‌లో కచ్చితంగా దాడులు జరుగుతాయి. ఈ విషయంలో పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇవ్వకపోవచ్చు. దౌత్య, రాజకీయ పరంగానే పాక్‌కు చైనా మద్దతు ఇవ్వొచ్చు కానీ ఉగ్రసంస్థలను పోషించడంలో సహకరించకపోవచ్చు’ అని అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ శ్రీవర్ అభిప్రాయ పడ్డారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు విషయంలో పాక్ చేస్తున్న ఆరోపణలకు చైనా మద్దతుపై స్పందిస్తూ శ్రీవర్ పై విధంగా స్పందించారు. దౌత్య, రాజకీయ అంశాలలో మాత్రమే పాక్‌కు చైనా మద్దతు ఇస్తుందని తాము భావిస్తున్నామన్నారు. భారత్‌తో స్నేహానికి చైనా సిద్దంగా ఉందన్నారు. కొన్ని విషయాలో మాత్రమే చైనా పాక్‌కు మద్దతు ఇస్తుందని శ్రీవర్ అభిప్రాయపడ్డారు. -
దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రముప్పు
-
దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రముప్పు!
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ మన దేశంపై రగులుతూనే ఉంది. ఎలాగైనా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఉగ్రవాదులతో భారత్‌పై దాడులకు తెగబడాలని చూస్తోంది. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో అక్కడ పాక్ పన్నాగాలు పారడంలేదు. ఎల్వోసీ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడానికి చేస్తున్న ప్రయత్నాలను సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. దీంతో ఉత్తర భారతంలో తమ ప్రయత్నాలు బెడిసికొడుతుండటంతో తాజాగా ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రముప్పు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కీలక సమాచారం అందిందని తెలిపారు. అరేబియా సముద్రంలోని సర్‌క్రీక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దీంతో దక్షిణాది తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన సైన్యం కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తనిఖీలను ముమ్మరం చేసింది. కాగా, పాకిస్తాన్ రహస్యంగా లష్కరే తోయిబా నాయకుడు మసూద్ అజర్‌ను విడుదల చేయడంతో భారత సైన్యం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఇక జమ్మూకశ్మీర్‌లో సైనిక స్థావరాలే లక్ష్యంగా ఎల్ఈటీ ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. చదవండి : భారీ కుట్రకు పాక్ పన్నాగం.. మసూద్ విడుదల! -
శ్రీలంక అనూహ్య నిర్ణయం
కొలంబో : శ్రీలంక ప్రభుత్వం మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశంలో కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 21 ఉగ్రదాడి అనంతరం దేశంలో విధించిన ఎమర్జెన్సీ నేటి (జూన్ 22) తో ముగియనున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ డిక్రీ జారీ అయ్యింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇంకా అత్యవసర పరిస్థితి ఉందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజా భద్రత చట్ట నిబంధనలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దేశ రాజధాని కొలంబో నగరంలో ఈస్టర్ సండే రోజు హోటళ్లు, చర్చిలపై దాడులు నేపథ్యంలో శ్రీలంక అతలాకుతలమైంది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 258కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల సంఘటన తరువాత దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే. -
అయోధ్యలో టెర్రర్ అలర్ట్
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో హై అలర్ట్ జారీ అయింది. నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులు అయోధ్యలో అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద రామజన్మభూమి పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలతో పాటు ఇంటిలిజెన్స్ అధికారులు రైల్వే స్టేషన్, బస్టాండ్, హోటళ్లలో ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సివిల్ దుస్తులోఉన్న నిఘా వర్గాలు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని ఎస్పీ అనిల్ కుమార్ సిసోడియా తెలిపారు. కాగా శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే జూన్ 16 న తన పార్టీ ఎంపీలతో కలిసి అయోధ్య పర్యటనకు రానున్నారు. అలాగే 2005 రామజన్మభూమి దాడి అంశం జూన్ 18న విచారణకు రానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా భద్రతను మరింత పెంచినట్టు తెలుస్తోంది. -
మోదీని సాగనంపే సమయం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల మోదీ పాలన అత్యంత వినాశకరంగా, బాధాకరంగా సాగిందని విమర్శించారు. ప్రజాస్వామ్య సంస్థలతో పాటు యువత, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మోదీకి అనుకూలంగా ఎలాంటి ఊపులేదన్న మన్మోహన్, ఆయన్ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ఈ విషయంలో ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన మన్మోహన్, ఆర్థిక వ్యవస్థతో పాటు పెద్దనోట్ల రద్దు, ఉగ్రదాడులు సహా పలు అంశాలపై ముచ్చటించారు. నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం.. ఎన్డీయే పాలనలో అవినీతి పతాక స్థాయికి చేరిందని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ‘పెద్దనోట్ల రద్దు స్వతంత్ర భారత చరిత్రలోనే పెద్ద కుంభకోణంగా నిలిచింది. నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాగా, సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. అచ్ఛే దిన్(మంచి రోజులు) తీసుకొస్తామని వారు అధికారంలోకి వచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ భవిష్యత్ భారత్ సురక్షితంగా ఉండేందుకు బీజేపీని తిరస్కరించాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని మన్మోహన్ విమర్శించారు. విదేశీ విధానంలో అస్థిరత.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని మన్మోహన్ తప్పుపట్టారు. ‘మన విదేశాంగ విధానం ఇప్పటివరకూ దేశ ప్రయోజనమే పరమావధిగా సాగింది తప్ప నేతల వ్యక్తిత్వ నిర్మాణం, పేరు–ప్రఖ్యాతుల కోసం జరగలేదు. ఇతర దేశాలతో సున్నితత్వం, నిగ్రహం పాటించడం, వారి ఆందోళనను అర్థం చేసుకోవడం, అంతిమంగా భారత ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేయడం విదేశాంగ విధానంలో భాగం. దురదృష్టవశాత్తూ ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇవే అదృశ్యమయ్యాయి. పాక్‌తో భారత విదేశాంగ విధానాన్నే చూసుకుంటే స్థిరమైన ఆలోచన, వ్యూహం అన్నది లోపించింది. ఆహ్వానం లేకుండానే పాకిస్తాన్‌కు వెళ్లడం, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు పాక్ నిఘాసంస్థ ఐఎస్ఐ ప్రతినిధుల్ని ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం’ అని దుయ్యబట్టారు. ఉగ్రదాడులు అమాంతం పెరిగాయి.. ఐదేళ్లలో ఉగ్రదాడులు తగ్గిపోయాయన్న ప్రధాని వ్యాఖ్యలను మన్మోహన్ ఖండించారు. ‘ఓ అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. ఐదేళ్లలో ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. ఒక్క జమ్మూకశ్మీర్లోనే ఉగ్రదాడులు 176 శాతానికి చేరుకున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు వెయ్యింతలు దాటాయి. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సమయంలో ప్రధాని మోదీ భద్రతా కేబినెట్ కమిటీతో అత్యవసర భేటీ నిర్వహించకుండా జిమ్‌కార్బెట్ జాతీయ పార్కులో సినిమా షూటింగుల్లో గడపడం దురదృష్టకరం. జాతీయభద్రత విషయంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని విమర్శించారు. మోదీకి దార్శనికత లేదు.. మోదీకి ‘ఆర్థిక దార్శనికత’ ఏమాత్రం లేదని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘మోదీ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం అతిగా నియంత్రిస్తోంది. ఆర్థిక విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి’ అని తెలిపారు. జీఎస్టీ 2.0 తెస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తుసేవల పన్ను చట్టాన్ని(జీఎస్టీ) సమీక్షిస్తామని మన్మోహన్ తెలిపారు. ‘ఎన్డీయే తెచ్చిన జీఎస్టీ చట్టాన్ని సమీక్షించి దాని స్థానంలో జీఎస్టీ 2.0(కొత్త చట్టం) తీసుకొస్తామని తెలిపారు. కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్) వల్ల మధ్యతరగతి ప్రజలకు అదనపు పన్నుభారం పడబోదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. -
పరుగులు పెట్టించిన ఫోన్ కాల్
సాక్షి, బెంగళూరు/కుప్పం(చిత్తూరు జిల్లా): కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడబోతున్నట్లు బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్ కాల్ సంచలనం రేపింది. ఫోన్ చేసిన వ్యక్తిని మాజీ సైనిక ఉద్యోగి స్వామి సుందరమూర్తిగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం పేలుళ్ల సమాచారం ఉత్తిదే అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం స్వామి సుందరమూర్తి బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తానొక లారీ డ్రైవర్నంటూ పరిచయం చేసుకున్నాడు. అతడు తమిళం, కొంచెం హిందీ భాషల్లో మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు జరుపుతారనే సమాచారం తన వద్ద ఉందన్నాడు. ముఖ్యంగా రైళ్లలో దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతూ తమిళనాడు రామనంథపురంలో 19 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపాడు. ఆ ఫోన్ కాల్ వచ్చిన లొకేషన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బెంగళూరు శివార్లలోని ఆవలహళ్లి సమీపంలోని ఇంటి నుంచి ఆ కాల్ వచ్చిందని గుర్తించారు. శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లి సుందరమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఇక్కడ కూడా ఇదేవిధంగా జరిగే అవకాశం ఉండొచ్చని ఊహించి తాను ఫోన్ కాల్ చేసినట్లు సుందరమూర్తి అంగీకరించాడు. మరింత లోతైన విచారణ కోసం అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీలో 20 ఏళ్ల పాటు సుందరమూర్తి విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుందరమూర్తి ఇద్దరు పిల్లలు కూడా జవాన్లుగా పనిచేశారు. వీరిలో ఒకరు కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందారు. దక్షిణాది రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు పేలుళ్ల వార్త నేపథ్యంలో కర్ణాటక డీజీపీ నీలమణి ఎన్.రాజు ముందస్తు హెచ్చరికలతో కూడిన అత్యవసర ఫ్యాక్స్‌ను దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. అలాగే కర్ణాటకలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దాడులపై కర్ణాటక పోలీసులు హెచ్చరిస్తూ విడుదల చేసిన నోటీసులు మూడు రాష్ట్రాల కూడలి ప్రదేశంలో ఉన్న కుప్పంలో హల్చల్ చేస్తున్నాయి. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. వాటిని చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
సాయిదత్త పీఠంలో శ్రీలంక మృతులకు నివాళి
న్యూజెర్సీ : ఈస్టర్డే రోజు భారత్‌కి పొరుగు దేశమైన శ్రీలంకలో ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబోలోని ఎనిమిది చోట్ల బాంబులు పేల్చడంతో 359 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయపడిన విషయం తెలిసిందే. మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్టీటీఈ తుడిచిపెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది. శ్రీలంకలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సాయి దత్త పీఠం సభ్యులు ప్రగాఢ సంతాపం తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధించారు. ఈ సందర్భంగా న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు అమరులైన వారికి నివాళులర్పించారు. ఫ్రాంక్లిన్ టౌన్షిప్ నుండి శ్రీలంకకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హఛ్చి మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని అన్ని మతాలవారూ ఖండించాలని శ్రీలంక ప్రజల కోసం సాయి దత్త పీఠం నిర్వహించిన క్రొవ్వొత్తి ప్రదర్శన, మౌన ప్రదర్శనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ యార్క్‌లో శ్రీలంక అంబాసిడర్‌కు చెబుతానని వివరించారు. సుమారు 200 మంది భక్తులు క్రొవ్వొత్తి ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. -
అందుకు ప్రతీకారంగానే శ్రీలంకలో బాంబుదాడులు!
కొలంబో: శ్రీలంకలోని చర్చ్‌లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా గత ఈస్టర్ ఆదివారం నాడు భీకరమైన బాంబు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఎల్టీటీఈ తిరుగుబాటు అణచివేత అనంతరం ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ఒక్కసారిగా ఈ ఉగ్రవాద బాంబుదాడులు ఎందుకు జరిగాయి? స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఎందుకు ఇంత తీవ్రమైన ఆత్మాహుతి, బాంబు దాడులకు తెగబడింది? అన్నది ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ.. శ్రీలంక సీనియర్ మంత్రి ఒకరు మంగళవారం దేశ పార్లమెంటులో కీలక విషయాలు వెల్లడించారు. న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. బాంబు దాడుల నేపథ్యంలో పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో గత ఆదివారం జరిగిన భీకరమైన ఉగ్రవాద దాడుల్లో 321మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. -
ఏపీ, తెలంగాణలో అదనపు బలగాలు
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఉగ్రఘాతుకం నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవాలోని సున్నితమైన ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా భద్రతను పెంచారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చర్చిల వద్ద భారీగా అదనపు బలగాలను మోహరించారు. కాగా, ఉగ్రదాడి జరగొచ్చని భారత నిఘావర్గాలే శ్రీలంకను ముందుగా హెచ్చరించాయా? అన్న విషయమై భారత నిఘా సంస్థలు మౌనం పాటిస్తున్నాయి. (శ్రీలంకలో మారణ హోమం; ఆగని కన్నీళ్లు) శ్రీలంకలో చిక్కుకున్న ఏలూరు వాసులు అంతా క్షేమమని సమాచారం ఏలూరు టౌన్: శ్రీలంకలోని ట్రిన్‌కోమలి శక్తిపీఠం సందర్శనకు వెళ్లిన 18 మందితో కూడిన భక్త బృందం వరుస బాంబు పేలుళ్ల ఘటనతో అక్కడ చిక్కుకుపోయింది. ఏలూరు, పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది శ్రీలంకలోని జాఫ్నా, కొలంబో, ట్రిన్‌కోమలి శక్తిపీఠం, అశోకవనం తదితర క్షేత్రాలను సందర్శించేందుకు ఈనెల 18న బయలుదేరి వెళ్లారు. వీరితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 15 మంది భక్తులు శ్రీలంక వెళ్లినట్టు ఇక్కడకు సమాచారం అందింది. ఈస్టర్ రోజున కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. భక్త బృందంలోని మురళీకృష్ణతో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ‘సాక్షి’ విలేకరి మాట్లాడగా.. ఏలూరుకు చెందిన 18 మంది భక్తులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. తామంతా కొలంబో ఎయిర్ పోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. మంగళవారం తామంతా ఏలూరు చేరుకుంటామని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లు జరగటానికి ముందు రోజున తామంతా కొలంబోలోని హోటల్లో ఉన్నామని తెలిపారు. భగవంతుడి దయతో శనివారం రాత్రి ఆ ప్రాంతం నుంచి బయలుదేరి జాఫ్నాకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు. (చదవండి: లంకకు ఇప్పట్లో వద్దు బాబోయ్ ..!) -
మృతుల్లో ఐదుగురు భారతీయులు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో శుక్రవారం రెండు మసీదుల వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులున్నారని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ ఆదివారం ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి జాత్యహంకారంతో అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరపగా, 50 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లో 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని శుక్రవారమే హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. ఐదుగురు భారతీయులు ఈ కాల్పుల్లో చనిపోయారని తాజాగా ధ్రువీకరించింది. మరణించిన భారతీయులను మహబూబ్ ఖోఖర్, రమీజ్ వోరా, అసీఫ్ వోరా, అన్సీ అలిబవ, ఓజైర్ ఖదీర్‌గా గుర్తించామంది. వీరిలో ఓజైర్ ఖదీర్ హైదరాబాద్ వాసి. కాగా, మరో ఇద్దరు హైదరాబాదీలు హసన్ ఫరాజ్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్లు కూడా మృతి చెందినట్లు శనివారం సమాచారం వచ్చినా, ఆదివారం హై కమిషన్ విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం. క్రైస్ట్ చర్చ్ బాధితుల కుటుంబ సభ్యులకు వీసాలను త్వరగా మంజూరు చేసేందుకు న్యూజిలాండ్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిందని హై కమిషన్ కోరింది. కాగా, తమ కుటుంబ సభ్యుడు టారంట్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తమకు విభ్రాంతి కలిగించిందనీ, తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం టారంట్ సోదరి, తల్లిపై ఎవరూ దాడి చేయకుండా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారని టారంట్ నానమ్మ చెప్పారు. కాగా, టారంట్ కాల్పుల ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని అడ్డుకోలేకపోవడంపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాధానాల కోసం వేచి చూస్తున్నానని ప్రధాని జసిండా తెలిపారు. బుల్లెట్లు లేని తుపాకీతో తరిమాడు కాల్పుల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి గుండ్లు లేని తుపాకీతో హంతకుడిని తరిమిన ఓ వ్యక్తిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చి న్యూజిలాండ్‌లో శరణార్థిగా ఉంటున్న అబ్దుల్ అజీజ్.. లిన్‌వుడ్ మసీదులో హంతకుడు టారంట్ మరింత మందిని కాల్చకుండా నిలువరించి ఈ ఘటనలో హీరోగా నిలిచాడు. కాల్పుల శబ్దం వినపడగానే అజీజ్ తొలుత కేవలం క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్‌ను తీసుకెళ్లి టారంట్ పైకి విసిరి అతని దృష్టిని మళ్లించాడు. అనంతరం టారంట్ కాల్పులు జరిపి, బుల్లెట్లు అయిపోవడంతో పడేసిన తుపాకీ ఒకటి అతనికి దొరికింది. ఆ తుపాకీతో అజీజ్ బెదిరించడంతో టారంట్ తన తుపాకీని కింద పడేశాడు. టారంట్‌ను అజీజ్ వెంటాడుతూ వెళ్లి, కారులో పారిపోతుండగా, కారు వెనుక అద్దాన్ని పగులగొట్టాడు. అజీజ్ ఈ సాహసం చేయకపోయుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. -
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
-
ఉగ్రవాద దాడిపై కఠిన వైఖరి అవశ్యం
ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో అవంతిపురం ప్రాంతంలో సిఆర్పీఎఫ్ వారి కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. ఆదిల్ అహ్మద్ ధార్ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు పక్కదారి నుంచి వచ్చి సిఆర్పిఎఫ్ శకటాల శ్రేణిలో 5వ క్రమసంఖ్యలో ఉన్న వాహనాన్ని తన వాహనంతో కొట్టి తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ మారణహోమంలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైనారు. ఈ దాడిని నిర్వహించింది తనేనని ఆదిల్ అహ్మద్ ధార్ రూపొందించిన ముందస్తు వీడియో ఒకటి వెనువెంటనే విడుదలైంది. పాకిస్తాన్లో స్థావరం ఏర్పరచుకుని ఉగ్ర దాడులు ప్రేరేపిస్తున్న జైషే మొహమ్మద్ సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ శతాబ్దిలో ఇంతే తీవ్రమైన దాడులు ఇంతకుముందు మూడు జరిగాయి. 2001 సంవత్సరంలో భారత పార్లమెంటు లక్ష్యంగా ఒక దాడి జరిగింది. 2008లో ముంబాయి మహానగరంలో పలు పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. 2016 సంవత్సరంలో ఉడీ విభాగంలో సైన్యంపై దాడి ఆ తర్వాత పఠాన్ కోట్లో మరొక దాడీ జరిగాయి. ఇంతకు ముందు జరిగిన దాడుల సమయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు సైనికపరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయంగా ఉగ్రవాద నిరో ధం కోసం పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచటానికే భారత ప్రభుత్వ చర్యలు పరిమితమైనాయి. పాకిస్థాన్ సైన్యం పూర్తి సహాయ సహకారాలతో ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయని పూర్తి సమాచారం ఉన్న భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచడం వరకే తన చర్యలను పరిమితం చేసింది. పాక్ నిఘా విభాగమైన ఐఎస్ఐ ఈ ఉగ్రవాద సంస్థలతో కలిసి మెలిసి పనిచేస్తుందనేది నిర్వివాదాంశం. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో జుల్ఫీకర్ అలీ భుట్టో భారతదేశంపై 1000 సంవత్సరాల జిహాద్ జరుపుతామని ప్రకటించారు. బహిరంగ యుద్ధంలో చాలామార్లు ఓటమి చవి చూసిన తర్వాత నాటి పాకిస్తాన్ సైన్యం అధిపతి జియావుల్ హక్ భారతదేశానికి 1000 ఏళ్లు నష్టం కలిగించే విధంగాగా ఉగ్రవాద సంస్థల చర్యలు ప్రోత్సహిస్తూ పరోక్షంగా భారత్‌పై చర్యలు చేపట్టడానికి ఒక విధానాన్ని రూపొందించారు. దానిలో భాగంగానే పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం, మద్దతుతో ఈ సంస్థలు ఉగ్రవాద కార్యక్రమాలను భారతదేశంలో నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14 సంఘటన తర్వాత భారత ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఇంతకుముందు లాగానే పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగేటట్లుగా చూడటం. ఈ ఒత్తిడి మూలంగా పాక్ ఉగ్రవాద సంస్థలపై చర్య తీసుకుంటుందని ఆశించటం. ఈ సమస్యను భారత్లేవనెత్తిన ప్రతిసారీ తనకు సరైన సాక్ష్యాధారాలు ఇవ్వమని పాక్ మనల్ని కోరటం, ఆ పైన ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోలేదని పేర్కొనటం పరిపాటి అయిపోయింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా ఈ ఉగ్రవాద సంస్థలపై తగిన ఆధారాలు సేకరించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందనే విషయాన్ని పాక్ ఎప్పుడో మర్చిపోయింది. ఈ సంస్థలు పాక్ ప్రభుత్వ కనుసన్నల్లోనే పని చేస్తున్నప్పుడు వారిపై అంతర్జాతీయ ఒత్తిడి మూలంగా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించటం అవివేకమే అవుతుంది. ఈసారి భారత ప్రభుత్వం ఇంతకుముందు కన్నా భిన్నంగా వ్యవహరించటానికి నిర్ణయించుకుంది. దీనికనుగుణంగా చక్కని ప్రణాళిక రచించింది. భారత యుద్ధ విమానాలు పాక్‌లో చాలా లోపలికి చొచ్చుకుని పోయి బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యాన్ని ఛేదించి ఎటువంటి నష్టం లేకుండా వెనక్కి తిరిగి వచ్చాయి. మర్నాడు ఈ సంఘటనకు సంబంధించి పాక్ స్పందన గంట గంటకు మారిపోతూ వచ్చింది. భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను మాత్రమే దాటాయని బాలాకోట్ దాకా రాలేదని ఉదయాన్నే ప్రకటించింది. సాయంత్రానికి మాట మార్చి భారత్ విమానాలు బాలాకోట్ దాకా వచ్చాయి కానీ పాక్ యుద్ధ విమానాలు నిలువరించే సరికి గమ్యరహితంగా తమ బాంబులను వదిలిపెట్టి వెళ్ళిపోయాయని ప్రకటించారు. రెండవ రోజు ప్రపంచ మీడియాను తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూపెడతామని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ ఈరోజు వరకు ప్రపంచ మీడియాను ఆ ప్రాంతాలకు రాకుండా కట్టడి చేయడం గమనార్హం. భారతదేశంపై ఎదురుదాడి ఆలస్యం ఎందుకు అయింది అని అడిగిన ప్రశ్నకు జరిగిన నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాతనే ఎదురుదాడికి దిగాము అని ఇమ్రాన్‌ఖాన్ సమాధానమిచ్చారు. వీటన్నిటిని బట్టి చూస్తే భారత యుద్ధ విమానాలు తీవ్రవాదుల స్థావరాలకు తీవ్ర నష్టాన్ని కలిగించినట్లే ఉంది. భారత వైమానిక అధిపతి మార్చి 4న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చాలా సమాచారం సేకరించిన తర్వాతనే లక్ష్యాలను నిర్ధారిం చుకోవడం జరిగిందని లక్ష్యాలను అనుకున్న విధంగానే ఛేదించామని ఎంతమంది చనిపోయారు అనేది అక్కడ ఉన్న వారి సంఖ్యను బట్టి ఉంటుంది కానీ ఇదమిద్ధంగా చెప్పలేమని చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. పాకిస్తాన్ రెండోరోజు తన అస్తిత్వాన్ని చాటుకోవడానికి వైమానిక దాడికి తలపెట్టడం, దానిని తిప్పికొట్టే యత్నాల్లో రెండవసారి భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకొనిపోవడం వెంటవెంటనే జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఒక ఎఫ్–16 విమానాన్ని, ఒక పైలట్‌ను కోల్పోయింది. భారత్‌కు చెందిన మిగ్–21 విమానం కూలి పోయి ఆ విమాన పైలెట్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి దొరికారు. అతని విడుదల తర్వాత రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ప్రస్తుతానికి ఉపశమించింది. ఈ మొత్తం సంఘటనలో ప్రతిపక్షాల పాత్ర చాలా విచి త్రంగానూ బాధ్యతారహితంగానూ ఉంది. దాడులు చేసింది మేము అని జైషే మొహమ్మద్ సంస్థ ఒప్పుకున్న తర్వాత కూడా ఈ మొత్తం పుల్వామా సంఘటనపై తమకు అనుమానాలున్నాయని మమతా బెనర్జీ, చంద్రబాబు వ్యాఖ్యాని స్తారు. తీవ్రవాదులపై విమాన దాడులను గురించి సాక్ష్యాలు చూపెట్టమని కాంగ్రెస్ మరికొందరు అడుగుతారు. దేశ రక్షణ అంశంలో అందరూ కలిసి పనిచేయాలనే మౌలిక అంశాన్ని ప్రతిపక్షాలు విస్మరించినట్లున్నాయి. అదే బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఆ నాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్‌పేయి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఇచ్చిన మద్దతు వారి దార్శనీక నాయకత్వ లక్షణాలు తెలియజేస్తున్నాయి! పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక రక్షిత ప్రాంతంగా ఉండి ఇతర దేశాలపై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న సమయంలో దానిని ఏ విధంగా దీర్ఘకాలంలో ఎదుర్కోవాలి అనే అంశంపై స్పష్టత అవసరం. ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ రక్షక దళాల పూర్తి సహాయ సహకారాలతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అనేది స్పష్టమే. గతంలోనే ఇలాంటి ఉగ్ర దాడులు జరిగినప్పుడు తగిన ప్రతీకార చర్యలు తీసుకుని ఉంటే ఈ ఉగ్రవాద సంస్థలు మళ్లీ మళ్లీ ఇటువంటి కార్యక్రమాలకు విజృంభించి ఉండేవి కావు. చాలా స్పష్టంగా భారతదేశంలో జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా సరే.. భారతదేశం మీద యుద్ధంగా పరిగణించి స్పందిస్తామనే సందేశాన్ని పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రధాని ఈ మధ్య ప్రతి ఉగ్రవాద దాడికి అవసరమైతే పాకిస్తాన్లో చొరబడి అయినా సమాధానం చెబుతామని పేర్కొనటం హర్షణీయం అయిన విషయం. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చెప్పిన విషయం గుర్తు చేసుకుందాం. ‘పిరికితనం’ హింస మధ్య ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటే నేను హింసనే ఎంచుకుంటాను. భారతదేశం తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం అవసరమైతే ఆయుధాలను చేపట్టడాన్ని నేను సమర్థిస్తాను. తనపట్ల జరుగుతున్న అగౌరవానికి పిరికితనంతో సాక్షిగా ఉండే బదులు ఆయుధాలు చేపట్టడమే ఉత్తమం’. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
పోరాడే మందులు
న్యూఢిల్లీ: పర్వతాలు, అటవీ ప్రాంతాల్లో సైనిక చర్యలు, ఉగ్రదాడుల సమయంలో గాయపడే భద్రతా సిబ్బందిలో 90 శాతం మంది తక్షణ వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జవాన్లను ఆస్పత్రికి తరలించేలోగా ఎంతో కీలకమైన ఆ గంట సమయంలో అందించాల్సిన అత్యవసర ప్రథమ చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం సంస్థ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్ లేబొరేటరీ (ఐఎన్ఎంఏఎస్) సరికొత్త వైద్య సాధనాలను రూపొందించింది. గ్లిజరేటెడ్ సెలైన్.. ఇది అతి శీతలమైన –18 డిగ్రీల సెల్సియస్‌లో గడ్డకట్టదు. దీని ద్వారా గాయాల వాపు తగ్గిపోతుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే లోగా ఇది సమర్ధవంతంగా పనిచేస్తుంది. సెల్యులోజ్ ఫైబర్ డ్రెస్సింగ్.. గాయాలకు కట్టుకట్టే మామూలు డ్రెస్సింగ్ కంటే 200 రెట్లు అధికంగా శరీరంలో కలిసిపోయి రక్తాన్ని తక్కువగా శోషించుకునే గుణం ఉన్న డ్రెస్సింగ్ మెటీరియల్ ఇది. ఇది రక్తస్రావాన్ని ఆపడమే కాదు, యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. చిటోసన్ జెల్.. గాయం నుంచి రక్తస్రావాన్ని నిలిపి వేసేలా కవర్ మాదిరిగా పనిచేస్తుంది. -
మన పోరాటం కశ్మీర్ గురించే
-
రెండు రోజుల్లో మరిన్ని ఆత్మాహుతి దాడులు!
-
పుల్వామా దాడి మాస్టర్ మైండ్ హతం
-
విధ్వంసకర వీబీఐఈడీ
వెహికల్ బార్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (వీబీఐఈడీ) అంటే వాహనాలతో ఐఈడీ దాడు లని అర్థం. ఇది ఇప్పుడు కశ్మీర్లో గస్తీ కాస్తున్న భద్రతాదళాలను అప్రమత్తం చేసింది. ఒక్కొక్కరుగా కశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల ముఖ్యనాయకులను ఏరిపారేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉగ్రమూకలు సాంకేతిక పద్ధతిలో భారత సైన్యంపై దాడులకు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వీబీఐఈడీలతో దాడులు ఈ విషయంపై మిలటరీ ఇంటెలిజెన్స్ గతంలో హెచ్చరించింది. ఇలాంటి పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను రూపొందించడం తేలిక కాదు. అందుకే అలాంటి నిపుణులు దొరికినప్పుడే ఉగ్రవాదులు నాలుగైదు వాహనాలను సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. సమస్యాత్మక ప్రాం తాల్లో, యుద్ధ జోన్లలో భారీ విధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు ఇలా కారు బాంబుల్ని వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.‘ఇలాంటి దాడుల్లో పేలుడు పదార్థాల ద్వారా జరిగే విధ్వంసంతో పాటు.. ఆ వాహన భాగాలు తునాతునకలవడం వల్ల కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక కారులో ఉండే పెట్రోల్, డీజిల్ వంటివి ఇంధనాలు పేలుడు తీవ్రతను మరిన్ని రెట్లు పెంచుతాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపద నుంచి బయటపడలేమా? అందుకే పోలీసులు ఆర్డీఎక్స్, ప్రాణహాని తలపెట్టే రసాయనాలు అధిక మొత్తంలో ఎక్కడైనా అమ్ముడవుతున్నట్లు తెలిస్తే అప్రమతమై నిఘా పెంచి ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు వీలుంటుంది. సున్నితమైన ప్రాంతాల్లో బాంబు డిస్పో జింగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించడం.. అనుమానిత ప్రాంతాల్లో వాహనాల కదలికలను జాగ్రత్తగా గమనించడం ద్వారా వీబీఐఈడీలను గుర్తించేందుకు వీలుంటుంది. వీబీఐఈడీ దాడులు జరపడానికి ఒక్కసారి ఆ వాహనం కదిలిందంటే చాలు.. దానిని నియంత్రించడం చాలా కష్టసా«ధ్యమైన విషయం. భద్రతా దళాలు వాటిని ఆపడానికి ప్రయత్నించినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. ఒక పరిమితికి మించి కారు స్పీడు పెంచినా, తగ్గించినా అవి పేలిపోతాయి. అంతేకాదు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసినా, ఇగ్నిషన్ కీ ఆన్/ఆఫ్ చేసినా వాహనం పేలిపోతుంది. అందుకే సెక్యూరిటీ పికెట్స్ వద్ద వాహనాల చెకింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో కారు బాంబు దాడులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కశ్మీర్లో కూడా అలాంటి దాడులు మొదలవడం దడ పుట్టిస్తోంది. ‘కపిల్ శర్మ షో’ నుంచి సిద్దూ ఔట్! ముంబై: సోనీ టీవీలో ప్రజాదరణ పొందిన ‘కపిల్ శర్మ షో’నుంచి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్దూ ఉద్వాసనకు గురయ్యారు. 40 మంది సీఆర్పీఎఫ్ ప్రాణాలు బలి గొన్న పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ పాత్ర లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో ‘సోనీ’ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కమెడియన్ కపిల్ శర్మ షోలో కొన్నేళ్లుగా సిద్దూ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. పుల్వామా దాడి ఘటనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు వ్యక్తులు చేసిన పనికి మొత్తం ఆ దేశానికే ఆపాదిస్తారా? ఉగ్ర వాదుల పిరికి చర్యలపై దేశాలను బాధ్యులుగా చేయడం తగదు’ అంటూ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతుండగా ఆయన ఆ దేశాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఆయన్ను కపిల్‌శర్మ షో నుంచి తప్పిస్తున్నట్లు సోనీ టీవీ తెలిపింది. వీబీఐఈడీ ఎలా పేలుతుంది? ► డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆత్మాహుతి బాంబర్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని సైడ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే పేలిపోతుంది. ► యాక్సిలరేటర్ రైజ్ చేయడం లేదంటే స్లోచేయడం ద్వారా కూడా ఈ బాంబులను పేల్చవచ్చు. ► ఇగ్నీషన్ కీ ఆన్, ఆఫ్‌ల ద్వారా కూడా పేలుడు జరిగేలా చేయొచ్చు. ► ఇక ఏదైనా ప్రాంతంలో పార్క్ చేసి ఉంచిన కారుని టైమర్ ద్వారా పేల్చేందుకు వీలుంటుంది. ► పేలుడు పదార్థాలను కార్లో ఎక్కడ పెడతారు? ► తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలైతే ముందు సీటులో అమరుస్తారు. ► భారీ పేలుడు పదార్థాలను వినియోగించాల్సి వస్తే డిక్కీలో పెడతారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారత్‌కు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి ఆత్మరక్షణ చర్యలు తీసుకున్నా, దాన్ని సమర్థిస్తామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ బోల్టన్ ప్రకటించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు బోల్డన్ శుక్రవారం ఫోన్ చేశారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాడిని ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం.. తమ భూభాగంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న సాయాన్ని పాక్ నిలిపివేయాలని హెచ్చరించింది. పాక్ మూల్యం చెల్లించక తప్పదు: ఇరాన్ ఇస్ఫాహన్(ఇరాన్): తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. పాక్– ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ఆ సైనికుల అంతిమ యాత్రలో ఇరాన్ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్) కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ బద్ద విరోధి, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం నుంచి పాక్ పర్యటన ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడటం గమనార్హం. తమ సైనికులపై దాడికి పాక్ ప్రోత్సాహంతో నడుస్తున్న ‘జైషే ఆదిల్’ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. -
‘భారత్ కే వీర్’కు రూ.7 కోట్లు
న్యూఢిల్లీ: జవాన్ల కుటుంబాల కోసం ప్రజలు ఇప్పటి వరకు రూ.7 కోట్ల సాయం ప్రకటించారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ‘భారత్ కే వీర్’ ద్వారా ఈ విరాళాలు పోగయ్యాయి. ‘కొన్ని నకిలీ సంస్థలు కూడా సాయుధ దళాలకు సాయం పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నాయి. వాటిపై అప్రమత్తంగా ఉండండి. భారత్ కే వీర్ మాత్రమే విరాళం ఇవ్వండి’ అని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రజలను కోరారు. షిర్డీ ట్రస్టు సాయం 2.51 కోట్లు సాక్షి ముంబై: అమరుల కుటుంబీకులకు రూ. 2.51 కోట్ల సాయం చేస్తామని షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ సురేశ్ హావరే చెప్పారు. ఇప్పటికే ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధి వినాయక ఆలయ ట్రస్టు రూ. 50 లక్షల సాయం ప్రకటించింది. ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. -
పాక్ వస్తువులపై 200% పన్ను పెంపు
న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన చర్యలను కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి. తాజా చర్యతో భారత్‌లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ‘పుల్వామా దాడికి ఆ దేశమే కారణమని భావిస్తూ అత్యంత ప్రాధాన్యం గల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకున్నాం. దీంతోపాటు పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని ఆర్థిక మంత్రి జైట్లీ ట్విట్టర్లో ప్రకటించారు. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానమైన తాజా పండ్లపై ప్రస్తుతం 50% వరకు, సిమెంట్‌పై 7.5% కస్టమ్స్ డ్యూటీ ఉంది. -
కోహ్లి అవార్డుల కార్యక్రమం వాయిదా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కోహ్లి తన అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఏటా అవార్డులు అందజేస్తారు. ఆర్పీ-ఎస్జీ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ అవార్డులను అందజేస్తారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ‘ఆర్పీ-ఎస్జీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. The RP-SG Indian Sports Honours has been postponed. At this heavy moment of loss that we all find ourselves in, we would like to cancel this event that was scheduled to take place tomorrow. — Virat Kohli (@imVkohli) 15 February 2019 -
ఉగ్రవాదంపై రెండేళ్ల తర్వాత అఖిలపక్ష భేటీ
-
వీరులకు వందనం
-
పాక్‌కు అమెరికా హెచ్చరిక
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, ఆశ్రయం కల్పించడాన్ని తక్షణం మానుకోవాలని పాకిస్తాన్‌ను అమెరికా గట్టిగా హెచ్చరించింది. పుల్వామా ఉగ్రదాడిని అగ్ర దేశం ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ శాండర్స్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండడాన్ని పాక్ విరమించుకుని ఆ దేశంలో ఉన్న అన్ని ఉగ్రవాద సంస్థలకు మద్దతును నిలిపేయాలి. పుల్వామాలో దాడి వల్ల అమెరికా, భారత్‌ల మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారం, సమన్వయం మరింత పెరుగుతాయి’ అని తెలిపారు. బాధిత కుటుంబాలు, భారత ప్రభుత్వం, ప్రజలకు తాము సానుభూతి తెలుపుతున్నామన్నారు. -
పాక్‌పై దౌత్య యుద్ధం
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ వంటి ఉగ్రమూకలకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, జపాన్ సహా 25 దేశాల దౌత్యాధికారులకు పుల్వామా ఉగ్రదాడి జరిగిన తీరును భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని విదేశీ విధానంగా మలుచుకున్న పాక్ వ్యవహారశైలిని ఎండగట్టింది. ఢిల్లీలోని తన కార్యాలయానికి రావాల్సిందిగా పాక్ హైకమిషనర్ సోహైల్ మహమూద్‌కు భారత విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. దాడిపై ఆయన తీవ్ర నిరసనను తెలియజేశారు. జైషేకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సత్వరం, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసూద్‌కు చైనా మద్దతు బీజింగ్: దాడికి పాల్పడిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ప్రపంచ ఉగ్రవాదిగా ముద్ర వేయించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు తెలపబోమని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడారు. మసూద్ అజార్‌పై ‘పంచ ఉగ్రవాది’ ముద్ర వేసే విషయంలో చైనా వైఖరేంటని ప్రశ్నించగా, ‘ఐరాస భద్రతా మండలి నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. జైషే మహ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే భద్రతా మండలి గుర్తించి ఆంక్షలు విధించింది’ అని చెప్పారు. మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు భద్రతా మండలిలో వీటో అధికారాలున్న చైనా అడ్డుతగులుతోంది. -
దాడి పిరికిపందల చర్య
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామాలో జరిగిన దాడి పిరికిపందల చర్య అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి పిరికి పందల చర్య. వీరులైన జవాన్లకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. శోకంలో ఉన్న అమరవీరుల జవాన్ల కుటుంబాల పరిస్థితికి నా హృదయం ద్రవిస్తోంది. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. -
గర్వపడుతున్నాం.. కానీ!
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి యువ సైనికులను అందించిన హమీర్పూర్ నుంచి కర్ణాటకలోని గుడిగెరె వరకు ఎన్నో గ్రామాల్లో శుక్రవారం విషాదం అలుముకుంది. ‘మా కొడుకు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం పట్ల గర్వంగా ఉంది. కానీ దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం ఉపేక్షించొద్దు’ అని బాధిత కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పలు గ్రామాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌ను విడిచిపెట్టొద్దు.. ‘మేం కొడుకును కోల్పోయాం. పాకిస్తాన్‌ను విడిచిపెట్టొద్దు. ఇలాంటి దాడులకు దిగకుండా ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జవాలికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ తిలక్‌రాజ్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్ల తిలక్‌రాజ్ మూడ్రోజుల క్రితమే ఇంటికి వచ్చి వెళ్లి సైన్యంలో చేరారు. ఇంతలోపే ఈ దారుణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తిలక్‌రాజ్ కుటుంబానికి సీఎం జయరామ్ ఠాకూర్ రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. 11నే ఇంటి నుంచి వెళ్లాడు.. ‘శ్రీనగర్ 115వ బెటాలియన్‌లో కొత్త పోస్టింగ్‌లో చేరడానికి ఈ నెల 11నే నా తమ్ముడు నాగ్‌పూర్ నుంచి వెళ్లాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఫోన్ చేసి మాట్లాడాను. కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జమ్మూ నుంచి బయల్దేరినట్లు చెప్పాడు. మధ్యాహ్నంలోపే అంతా జరిగిపోయింది’ అని అమర జవాన్ సంజయ్ రాజ్‌పుత్ సోదరుడు రాజేశ్ వాపోయారు. మహారాష్ట్ర బుల్డానా జిల్లాలోని మాల్కాపూర్కు చెందిన సంజయ్(45) నాలుగేళ్లుగా నాగ్‌పూర్‌లోని సీఆర్పీఎఫ్ 213వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. వెళ్లిన మూడ్రోజులకే నిర్జీవంగా.. పుల్వామా దాడిలో అసువులు బాసిన వారిలో ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ హర్పూర్ గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠి ఒకరు. 2 నెలల సెలవుల్ని తమ కుటుంబంతో సరదాగా గడిపిన పంకజ్ మూడ్రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరేందుకు కశ్మీర్‌కు వెళ్లాడు. ఇంతలోనే ఆ కుటుంబం అతడి మరణ వార్తను వినాల్సి వచ్చింది. ‘అధికారులు మాకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. మాతృభూమి కోసం నా కొడుకు ప్రాణాలర్పించడం చాలా గర్వంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు ప్రభుత్వం కచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే’నని పంకజ్ త్రిపాఠి తండ్రి ఓం ప్రకాశ్ త్రిపాఠి అన్నారు. చెట్టంత కొడుకే పోయాక ఏముంది? బిహార్‌కు చెందిన జవాన్లు సంజయ్‌కుమార్ సిన్హా, రతన్ఠాకూర్ సిన్హా ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల వేదన వర్ణనాతీతంగా ఉంది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాక ఇక తమకు దిక్కెవరంటూ విషణ్ణ వదనుడైన సంజయ్‌కుమార్ సిన్హా తండ్రి మహేంద్ర ప్రసాద్ సిన్హా రోదిస్తున్నారు. సంజయ్‌కుమార్‌కు పెళ్లీడొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. బాగల్పూర్కు చెందిన రతన్ఠాకూర్కు నాలుగేళ్ల కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భిణి. దియోరాలోని 30 ఏళ్ల విజయ్ కుమార్ మౌర్య ఇంటిలో రోదనలు మిన్నంటాయి. ఏడాదిన్నర కొడుకు, భార్యతో సంతోషంగా స్వగ్రామంలో గడిపిన మౌర్య ఫిబ్రవరి 9నే జమ్మూకు తిరిగి వెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లోని చక్కాసి రాజ్బంగ్షీపుర గ్రామానికి చెందిన జవాను బబ్లూ సాంత్రా కుటుంబ సభ్యుల ఆవేదన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఆధార్, పాన్ కార్డులతో మృతుల గుర్తింపు న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలు ముక్కలై చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టమైంది. దీంతో సిబ్బంది బ్యాగులు, వారి దుస్తులకున్న జేబుల్లోని ఆధార్, పాన్ కార్డులు, సీఆర్పీఎఫ్ గుర్తింపు కార్డులు, సెలవు దరఖాస్తు పత్రాలతోనే గుర్తించారు. మరికొందరిని వారు ధరించిన చేతి గడియారాలు, వారి పర్సులు తదితరాల ద్వారా సహోద్యోగులు గుర్తించారు. మరికొంతమంది చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుని ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారని ఓ అధికారి చెప్పారు. మరోవైపు ఆ సమయంలో కాన్వాయ్‌లో వెళ్తున్న జవాన్లందరి ఇళ్లకు అధికారులు ఫోన్లు చేసి.. జవాన్లలో ఎవ్వరూ గల్లంతు కాలేదనీ, చనిపోయినట్లుగా ప్రకటించిన జాబితా కచ్చితమైనదేనని చెప్పి, బతికున్న వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు. -
దాడిలో 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్
న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిలో జైషే మొహమ్మద్ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ దాదాపు 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్ను వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఐఈడీని ఈ దాడి కోసం వాడుంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు. కశ్మీర్లో ఇప్పటివరకూ కాన్వాయ్‌ల రాకపోకల విషయంలో పాటిస్తున్న ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను తాజా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై 272వ మైలురాయి వద్ద ఆదిల్ తన కారుతో సీఆర్పీఎఫ్ బస్సు ఎడమవైపు ఢీకొట్టించి తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన హెచ్ఆర్ 49 ఎఫ్ 0637 బస్సు తునాతునకలు అయ్యిందన్నారు. కాన్వాయ్ వరుసలో ఐదో బస్సును ఉగ్రవాది ఆదిల్ లక్ష్యంగా చేసుకున్నాడన్నారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో ప్రమాద సమయంలో మొత్తం 16 బుల్లెట్ ప్రూఫ్ బంకర్ వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 4న 2,871 మంది జవాన్లు 91 వాహనాల్లో ఇదే రోడ్డుపై శ్రీనగర్ నుంచి జమ్మూకు వచ్చారనీ, అప్పుడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో యూపీకి చెందిన 12 మంది జవాన్లు అమరులు కాగా, రాజస్తాన్(5), పంజాబ్(4), పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, బిహార్ నుంచి ఇద్దరు చొప్పున, అస్సాం, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రాలకు చెందిన ఒక్కో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. -
జమ్మూ ఆందోళన హింసాత్మకం
శ్రీనగర్ / జమ్మూ / న్యూఢిల్లీ: దాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జమ్మూలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా పలుచోట్ల రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో తొలుత జమ్మూ పట్టణంలో కర్ఫ్యూ విధించిన జమ్మూ అధికారులు, చివరకు ఆర్మీ సాయాన్ని అర్థించారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. జమ్మూలోని గుజ్జర్‌నగర్ ప్రాంతంలో ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు కార్లను ధ్వంసం చేశారు. మరోవైపు జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(జేసీసీఐ) గురువారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పూర్తిస్థాయి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ(సీవోఐ)కి సీఆర్పీఎఫ్ ఆదేశించింది. ఈ విషయమై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. దాడిలో చనిపోయినవారంతా సీఆర్పీఎఫ్ రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ)కి చెందినవారనీ, కాన్వాయ్కి వీరు రక్షణ కల్పించేవారని చెప్పారు. -
పౌర వాహనాలను రానివ్వడంతోనే..
జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై సైనికులు ప్రయాణిస్తున్న సమయంలో పౌరుల వాహనాలనూ అనుమతించడంతో దాడి సాధ్యమైందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సైనికులు రాకపోకలు సాగించే మార్గాన్ని ముందుగా రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ) తనిఖీ చేస్తుంది. దారిలో మందుపాతరలు, బాంబులు ఉన్నాయేమో తనిఖీ చేయడం ఈ పార్టీ పని. మరో బృందం దారి పక్కన పొంచి ఉండి ఉగ్రవాదులు కాల్పులు జరిపే లేదా బాంబు దాడి చేసే అవకాశాలను పరిశీలిస్తుంది. తర్వాతే సైనికుల రాకపోకలకు అనుమతిస్తారు. ఈ తనిఖీల్లో ప్రజలు వాడే వాహనాలను పెద్దగా పట్టించుకోరు. వాటి రాకపోకలకు అభ్యంతరాలు చెప్పరు. గురువారం జమ్ము–శ్రీనగర్ జాతీయ రహదారిని క్షుణ్ణంగా పరిశీలించాకే సైనిక వాహనాలకు ఉత్తర్వులిచ్చారు. చుట్టు పక్కల గ్రామాలను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ సర్వీసు రోడ్లు ఉన్నాయి. స్థానికులు వాటి ద్వారా వాహనాల్లో జాతీయ రహదారిపై వస్తూ పోతూ ఉంటారు. ప్రతిసారీ తనిఖీ చేయడం వారికి ఇబ్బందిగా ఉంటుందన్న భావనతో సైన్యం వారి రాకపోకలను పట్టించుకోదు. జైషే ఉగ్రవాది ఆదిల్ ఇదే అవకాశాన్ని వాడుకున్నాడు. పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సర్వీసు రోడ్డుపై వేచి ఉండి సైనికుల వాహన శ్రేణి కనిపించగానే జాతీయ రహదారిపైకి దూసుకొచ్చాడు. హిమపాతం కారణంగా ఆరు రోజులుగా మూసి ఉన్న జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిని గురువారం తెరవడంతో సాధారణం కంటే రద్దీ ఎక్కువగానే ఉందని సైనికాధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఐఈడీ దాడులు చేసే అవకాశం ఉందంటూ ఈ నెల 8వ తేదీన ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అదనపు జాగ్రత్తలు కూడా తీసుకున్నామని, అయినా ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) జుల్ఫికర్ హసన్ చెప్పారు. ‘ఆ ఉగ్రవాది తన వాహనంలో చాలా దూరం నుంచి వస్తూ ఉండి ఉంటే దారిలో ఎక్కడో అక్కడ తనిఖీ పాయింట్లో దొరికేవాడు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి చెప్పారు. ఈ అనుభవంతో ఇకపై సైనికులు ప్రయాణించే సమయంలో జాతీయ రహదారిపై పౌరులకు అనుమతించకుండా ఉండాలని ఆయన అన్నారు. ప్రతీకారం తప్పదు: సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను క్షమించం, ప్రతీకారం తీర్చుకుంటాం’ అని సీఆర్పీఎఫ్ ప్రతినబూనింది. దేశంలోని అతిపెద్ద పారామిలటరీ బలగం సీఆర్పీఎఫ్ శుక్రవారం ట్విట్టర్లో ‘ ఉగ్రవాదులను క్షమించబోం. పుల్వామా దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు వందనం. అమరుల కుటుంబాలకు తోడుగా ఉంటాం. హేయమైన ఈ దాడికి మూల్యం తప్పదు’ అని పేర్కొంది. అమర జవాన్ల స్మృత్యర్థం సీఆర్పీఎఫ్ కేంద్ర కార్యాలయంలో జెండాను అవనతం చేయడంతోపాటు రెండు నిమిషాలు మౌనం పాటించినట్లు తెలిపింది. కశ్మీర్లో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులతో జరిగే పోరులో 3.60 లక్షల మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. సైన్యం వెళ్లే సమయంలో పౌర వాహనాల నిలిపివేత కశ్మీర్ రోడ్లపై అమలు: రాజ్‌నాథ్ శ్రీనగర్: కశ్మీర్లో ఇకపై ప్రధాన రహదారులపై సైనిక, భద్రతా దళాల వాహన శ్రేణులు వెళ్తున్నప్పుడు సాధారణ పౌరుల వాహనాలను కొద్దిసేపు నిలిపేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో రాజ్‌నాథ్ పర్యటించారు. భద్రతా దళాల వాహన శ్రేణులు వెళ్తున్న సమయంలో పౌరుల వాహనాలను నిలిపేయడం ఇబ్బందిని కలిగించే చర్యేననీ, కానీ జవాన్ల భద్రత కోసం ఇది తప్పదని ఆయన పేర్కొన్నారు. తర్వాత రాజ్‌నాథ్ సీఆర్పీఎఫ్ క్యాంపస్‌కు చేరుకున్నారు. సైనికుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ఓ జవాన్ భౌతిక కాయాన్ని విమానంలోకి ఎక్కిస్తుండగా, ఆ శవపేటికను రాజ్‌నాథ్ తన భుజాలపై మోశారు. -
దెబ్బకు దెబ్బ..!
భరతమాత కన్నీరు పెడుతోంది. కోట్లాది భారతీయుల గుండెలకు లోతైన గాయమైంది. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు పిరికిపందలు చాటుమాటున నక్కి చేసిన దాడితో దేశానికి రక్షణగా నిలిచే వీరాధివీరులే నిర్జీవంగా నేలకొరిగిన దృశ్యాలు చూసి మనసు చలించిపోతోంది. కుట్ర కుతంత్రాలతో తన నీచ బుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకునే జిత్తులమారి దాయాది దేశానికి బుద్ధి చెప్పాలనే ఆరాటం, పగ , ప్రతీకారంతో భారతీయుల గుండెలు రగిలిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లోనే కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతమే సరైనదే అనిపిస్తుంది.. అలాగంటే అదేదో యుద్ధోన్మాదం కాదు. అమరులైన వీర జవాన్లకు న్యాయం జరగాలి. భారతీయులు ఇప్పుడు కోరుకుంటున్నదదే. ఇక మీదట త్యాగాలకు విలువ లేదు. వాటికెప్పుడో కాలం చెల్లిపోయింది. మన దేశ సైనిక సత్తా, ఆర్థిక బలానికి కూడా కాలం చెల్లిపోయిందా ? పచ్చటి పచ్చికలపై పారే ఎర్రటి నెత్తురు మరకలు చూస్తుంటే మరిగిపోయిన రక్తం చప్పున చల్లారిపోతుందా? ఇంత నరకయాతనని కొద్ది రోజుల్లోనే మనం మర్చిపోతామా? కొన్ని వారాల్లోనే మళ్లీ సాధారణ మనుషులమైపోతామా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలిచి, ప్రజాప్రతినిధుల వేషాల్లో ఉన్నవారే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూ, బయటకి కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే, శాంతి నెలకొనాలన్న భారత్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉంటే, కేంద్రం అడుగులు ఎటువైపు వేయాలి? ఇప్పుడు కశ్మీర్ భూతల స్వర్గం కాదు. మండుతున్న మంచుగోళం. శవాల దిబ్బల్ని చూసే ఓపిక లేదు. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే సహించే పరిస్థితి లేదు. దాడి చూసాకైనా కేంద్రం సత్వర చర్యలు చేపట్టాలి. జాతి యావత్తూ అందుకోసమే ఎదురుచూస్తోంది. న్యూఢిల్లీ: ‘భారతీయుల రక్తం మరుగుతోంది. రోజూ వారీ ఖర్చులు వెళ్లదీయడానికి ఇతర దేశాల ముందు బిచ్చమెత్తుకుంటూ మన పొరుగుదేశం ఎంతో దిగజారింది. ఆ నిరాశ, నిస్పృహల ఫలితంగానే పుల్వామాలో దాడికి తెగబడింది. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదొక కొత్త సంప్రదాయం’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రచర్యలతో భారత్‌ను పాకిస్తాన్ బలహీనపరచలేదని, పుల్వామా దాడికి బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మరోవైపు, పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్–ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ వెనక్కి తీసుకుంది. భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ సొహైల్ మహమూద్‌ను పిలిపించుకుని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే నిరసన వ్యక్తం చేశారు. పెద్ద తప్పు చేశారు..మూల్యం తప్పదు ఢిల్లీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపాక మోదీ మాట్లాడారు.‘ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులకు మద్దతునిస్తూ, వారిని ప్రేరేపిస్తున్న వారికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. వారు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ దుశ్చర్యకు వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. పుల్వామా దాడికి పాల్పడిన, ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని దేశానికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకి అయిన మన పొరుగుదేశం ఉగ్రదాడులతో మన దేశంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతోంది. కానీ వాళ్ల ప్రణాళికలు సఫలం కావు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మన బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం’ అని అన్నారు. అనంతరం ఝాన్సీలో జరిగిన మరో సభలో ప్రసంగిస్తూ..పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథాగా పోదని పేర్కొన్నారు. ‘ ఉగ్రమూకల ఆటకట్టించేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యూహం రచించాలో ఆ బాధ్యతను సైన్యానికే వదిలిపెట్టాం. ఇదే మన దేశ కొత్త విధానం, సంప్రదాయం’ అని పేర్కొన్నారు. అమరులకు మోదీ, రాహుల్ నివాళి పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలను వైమానిక దళ విమానం శుక్రవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. హోం మంత్రి రాజ్‌నాథ్ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అమరవీరుల భౌతికకాయాలను స్వీకరించారు. 40 శవపేటికలను పక్కపక్కన ఉంచారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం: రాహుల్ భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ఆత్మపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి స్థాయి మద్దతునిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ‘దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలన్న టెర్రరిస్టుల ఆశయం ఎన్నటికీ నెరవేరదు. మరో రెండు రోజులపాటు ఇతర విషయాలేవీ మాట్లాడదలచుకోలేదు’ అని తర్వాత మీడియా సమావేశంలో అన్నారు. ‘జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. టెర్రరిజంపై ఐక్యంగా పోరాడాలి’ అని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అత్యంత అనుకూల దేశం హోదా రద్దు దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత అనుకూల దేశం’(ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ రద్దుచేసింది. ప్రధాని నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాలు పెంచే చాన్సుంది. సుమారు 49కోట్ల డాలర్ల పాక్ ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చు. పాక్‌కు అత్యంత అనుకూల దేశం హోదాను భారత్ 1996లో ఇవ్వగా, ఇంకా భారత్‌కు పాక్ ఆ హోదాను ఇవ్వలేదు. పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ప్రధానంగా ముడిపత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్, రంగులు తదితరాలున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాలు తమలో తాము వివక్షాపూరిత వాణిజ్య విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ఎంఎఫ్ఎన్ హోదాను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ హోదా కలిగిన దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉంటాయి. నివాళి కార్యక్రమంలో రాజ్‌నాథ్, నిర్మల, కేజ్రీవాల్, రాహుల్, సైన్యాధికారులు జమ్మూలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ -
అమృత్సర్ దాడి ఉగ్రచర్యే
అమృత్సర్: అమృత్‌సర్‌లోని నిరంకారీ భవన్లో భక్తులపై దాడి ఉగ్రచర్యేనని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఆదివారం దాడికి గురయిన ఆద్లివాల్లోని నిరంకారీ భవన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ ఘటనలో లభ్యమైన ఆధారాల సాయంతో బాధ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. దాడికి కారకులైన వారిపై సమాచారం అందించిన వారికి రూ.50లక్షల పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. ‘నిరంకారీ భవన్‌పై దాడి వెనుక పాకిస్తాన్ ప్రోద్బలం ఉంది. ఈ దాడిలో వాడిన గ్రెనేడ్ పాక్ ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన గ్రెనేడ్ మాదిరిగానే ఉంది’ అని అమరీందర్ అన్నారు. ‘ఇలాంటి హెచ్‌జీ–84 రకం గ్రెనేడ్ ఒక దానిని గత నెలలో ఉగ్ర స్థావరాలపై దాడిలో రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్నిబట్టి ఈ ఘటన ఐఎస్ఐ ప్రోద్బలంతో ఖలిస్తాన్ లేదా వేర్పాటువాదుల పనేనని భావిస్తున్నాం.’ అని చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
సైనిక కవాతుపై ఉగ్ర దాడి
టెహ్రాన్: ఇరాన్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతుండగా నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 29 మంది చనిపోగా, 57 మంది గాయపడ్డారు. ఇరాక్‌కు సరిహద్దుగా ఉన్న కుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఆవాజ్ పట్టణంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారిలో సైనికులతో పాటు కవాతు వీక్షించడానికి వచ్చిన ప్రజలు, అధికారులున్నారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు అక్కడే మట్టుబెట్టగా, ఒకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు. అమెరికా మిత్ర దేశమే దాడికి బాధ్యత వహించాలని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ అన్నారు. సౌదీ అరేబియా పాత్ర ఉంది.. 1980–88 మధ్య ఇరాక్‌తో జరిగిన యుద్ధానికి స్మారకంగా ఇరాన్ ఏటా సైనిక కవాతు నిర్వహిస్తోంది. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్ వెనక వైపు నుంచి దుండగులు లోనికి చొరబడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సంఘటనా స్థలంలో సాయం కోసం అరుస్తున్న బాధితుల చిత్రాలను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. తమ శత్రువైన సౌదీ అరేబియా ఈ దాడికి నిధులు సమకూర్చిందని ఇరాన్ సైన్యం ఆరోపించింది. -
ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి
-
పాక్‌తో యుద్ధం తప్ప.. మరో ఆప్షన్ లేదు!
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిత్యం పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగబడటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి ముగింపు పలకపోతే పాక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించడం, వారికి ఆశ్రయమిస్తూ భారత్‌పై దాడులు ఇలాగే కొనసాగిస్తే పాక్‌పై యుద్ధం తప్ప మనకు మరో ఆప్షన్ లేదన్నారు. శనివారం తెల్లవారుజామున సంజ్వాన్‌లోని ఆర్మీ శిబిరంపైనే పాక్ ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా ఈ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రతిరోజు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతోందని, అసలు దాయాది ఉగ్రవాదులు దాడులు భారత్‌పై దాడులు చేయని రోజే లేదని ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. భారత్ నుంచి కేవలం శాంతిని మాత్రమే కోరుకున్నట్లయితే పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో భారత్ నుంచి యుద్ధమే సమాధానం అవుతుందని పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలు మెరుగు చేసుకోవాలంటే పాక్ తన వైఖరిని మార్చుకుని, ఉగ్రవాదానికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెప్పారు.. యుద్ధం వల్ల రెండు దేశాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కానీ పాక్ చర్యల వల్ల యుద్ధ వాతావరణం నెలకొంటుందన్నారు. -
న్యూ ఇయర్ వేడుకలపై ఉగ్ర నీడ
సాక్షి,న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు, పండుగ సీజన్ నేపథ్యంలో ఉగ్ర ముప్పు పొంచిఉందని రాష్ట్ర పోలీస్ చీఫ్‌లకు సమాచారం అందింది. మరోవైపు విమానాశ్రాయాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు, వివిధ పండుగలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే క్రమంలో ఉగ్రవాదులు, సంఘవ్యతిరేక శక్తులు పేట్రేగే ప్రమాదం నెలకొందని, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేసింది. దేశంలో ఉగ్రదాడులపై ఈ ఏడాది పాక్‌కు చెందిన ఉగ్రసంస్థలు ఇప్పటికే సంకేతాలు పంపాయని, ఐఎస్ ప్రేరేపిత సంస్థలు పలు దేశాల్లో భీకర దాడులతో చెలరేగాయని గుర్తుచేసింది. ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడులతో జనసమ్మర్థ ప్రాంతాలపై విరుచుకుపడతారని బీసీఏఎస్ చీఫ్ రాజేష్ కుమార్ చంద్ర ఈ నోట్లో హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాల పోలీస్ చీఫ్‌లనూ బీసీఏఎస్ అప్రమత్తం చేసింది. విమానాశ్రయాల టెర్మినల్ బిల్డింగ్ లోపలికి ప్రవేశంపై కఠిన నియంత్రణలు పాటించాలని, నిర్వహణా ప్రాంతం, విమానయాన ప్రాంగణంలో అడుగడుగునా నిఘాను తీవ్రతరం చేయాలని సూచించింది. కారు బాంబు దాడులను నివారించేందుకు కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేయాలని పేర్కొంది. క్విక్ రియాక్షన్ టీమ్‌లు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సూచించింది. -
పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ ఝలక్
వాషింగ్టన్ : పాకిస్తాన్లో ప్రయాణించడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత సురక్షితం కాదని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పాకిస్తాన్లో అమెరికన్లపై దాడులు జరిగే అవకాశ ముందని.. అందువల్ల ఆ దేశంలో ప్రయాణాలు చేయరాదని అమెరికా ప్రకటించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. ఈ మధ్యకాలంలో క్వెట్టా, చమన్, ఖైబర్, ఫక్తున్వా ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులను అమెరికా ఉదాహరణులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్‌లలోని అమెరికా రాయబార కార్యాలయాలు చాలా వరకూ వివిధ సేవలను నిలిపేశాయి. ప్రధానంగా పెషావర్‌లో ఉన్న రాయబార కార్యాలయంలో ఇప్పటికే కాన్సులర్ సేవలను అందించడం లేదు. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలు.. దేశంలో ఉగ్రవాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వాషింగ్టన్కు నివేదికఅందిచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, మానవతా దృక్ఫథంతో సేవలు చేస్తున్న ఎన్జీఓలు, విదేశీ రాయబారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయని వైట్‌హౌస్‌కు పంపిన నివేదికలో పేర్కొన్నాయి. అంతేకాక అమెరికా దౌత్యాధికారులపై ఉగ్రవాదులు కక్షను పెంచుకున్నారని అందులో పేర్కొన్నారు. -
227 ఓడరేవుల్లో భద్రతా తనిఖీలు
న్యూఢిల్లీ: దేశంలోని ఓడరేవులను ఉగ్రదాడుల బారిన పడకుండా ఉంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 227 చిన్న ఓడరేవుల్లో కూడా ఇటీవల భద్రతా తనిఖీలను నిర్వహించింది. 26/11 నాడు ముంబైలో జరిగిన ఉగ్రదాడి ఘటనకు తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో..ఆదివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దేశంలో ఓడరేవులు, తీరప్రాంతంలోని భద్రత గురించి మీడియాకు వివరించారు. తీరప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో) సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. తీరప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బోట్లు, పెద్ద పెద్ద పడవలను కూడా ఉపగ్రహ చిత్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాండ్ల, ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్టు, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, పారదీప్, విశాఖపట్టణం, కోల్‌కతా, హల్దియా ఓడరేవుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేసినట్లు తెలిపారు. -
ఉగ్రదాడి నుంచి బయటపడ్డ హీరోయిన్
న్యూయార్క్ : ఉగ్రదాడి నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రా బయటపడ్డారు. ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయేలా చేసిన ట్రక్కు బీభత్సం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి ప్రియాంక ఇంటికి మధ్య దూరం కేవలం ఐదు బ్లాకులేనట. ఇదే విషయాన్ని ప్రియాంక ట్విటర్ వెల్లడించింది. ‘‘హాలీవుడ్ టీవీ సీరియల్ క్వాంటికో -3 సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నా.. ఇంటి దగ్గర అంతా కోలాహలం, సైరన్ల మోత, ఎటు చూసినా పోలీసులు.. నాకు అప్పడే తెలిసింది కొన్ని క్షణాల కిందట ఇక్కడ ట్రక్కు దాడి జరిగిందని’’ అని ఆమె ట్విటర్లో తెలిపారు. ట్రక్కు దాడిని ప్రియాంక చోప్రా తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో మరణించివారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న ఆమె ట్వీట్ చేశారు. This happened 5 blocks from my home,As I drive back home from work,Dreary sirens remind me that this is the state of the world #nyc #peace 😞 — PRIYANKA (@priyankachopra) 1 November 2017 Nyc.. As resilient as ever. I❤️u. My condolences to everyone affected by this tragedy. — PRIYANKA (@priyankachopra) 1 November 2017 -
భారీ ఉగ్రదాడి జరగబోతోంది
న్యూఢిల్లీ : భారత్‌పై భారీ ఉగ్రదాడి జరగబోతోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం హెచ్చరించారు. దేశంలోని మారుమూల ప్రదేశాల్లో భద్రత లోపించిందని, ఉడి తరహా ఉగ్రదాడి మరోమారు జరగుతుందనే ఇంటిలిజెన్స్ సమాచారం వచ్చినట్లు చెప్పారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేయడం, ఇంటిలిజెన్స్ గ్రూప్‌ను బలపరచడం, భారత ఆర్మీని దుర్భేద్యంగా సాధ్యమైనంత త్వరగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ బలపడాలని అన్నారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్‌ను వినియోగించే యోచనలో కూడా ఉన్నట్లు చెప్పారు. కాగా, గతేడాది ఉడి ఉగ్రదాడి అనంతరం.. భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రావత్ అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని కూడా చెప్పారు. -
లోయలో పేట్రేగుతున్న ఉగ్రవాదులు
శ్రీనగర్ : ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భారీగా దాడులకు తెగబడ్డారు. భద్రతా బలగాలపై హతమార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడుల వివరాలు. జూన్ 13 : పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పది మంది జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. భధ్రతాబలగాలు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. జూన్ 16 : అనంతనాగ్ జిల్లాలోని అచాబల్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుమంది పోలీసులు మృతి చెందారు. జూలై 10 : అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. ఆగస్టు 14 : బుద్గామ్ జిల్లాలో స్వతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న భద్రతా దళాలపై మిలిటెంట్లు గ్రెనేడ్లతో దాడి చేశారు. అయితే ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఆగస్టు 27 : పుల్వామా జిల్లాలోని హై సెక్యూరిటీ పోలీస్ జోన్‌పై మిలిటెంట్ల దాడి.. ఈ ఘటనలో ఎనిమిది మంది అధికారులు మృతి. ఈ దాడి చేసేంది మేమేని జైషే మహమ్మద్ ప్రకటన. సెప్టెంబర్ 1 : బద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనంపై మిలిటెంట్ల దాడి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సెప్టెంబర్ 9 : అనంతనాగ్ పట్టణంలోని బస్‌స్టాండ్ వద్ద మిలిటెంట్ల దాడి. ఈ ఘటనలో ఒక జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. సెప్టెంబర్ 21 : బనిహాల్ పట్టణంలోని జమ్మూ-శ్రీనగర్ హైవే మీద భద్రతా బలగాలపై మిలిటెంట్ల దాడి. కొత్తగా ఉగ్రవాద గ్రూపులలో చేరిన ముగ్గురు యువకులు ఈ దాడికి పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇదే రోజు పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 4 : శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంప్‌పై మిలిటెంట్ల దాడి. భధ్రతా బలగాలు మిలిటెంట్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాయి. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఒక బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. -
భారత్‌లో ఏకంగా 927 ఉగ్రదాడులు..
న్యూఢిల్లీ: భారత్‌కు ఉగ్రముప్పు రోజురోజుకు పెరుగుతోంది. 2016లో ప్రపంచంలో ఉగ్ర పీడిత దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి వచ్చింది. భారత్ కంటే పాకిస్తాన్ మెరుగైన స్థానంలో ఉంది. అమెరికా విదేశాంగ శాఖ వివరాల ప్రకారం భారత్‌లో 2016లో దాడులు పెరిగాయి. ఉగ్రవాద బాధిత దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఉండగా మూడో స్థానంలో ఇండియా ఉంది. ప్రపంచంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్ కంటే వెనుకుండటం విశేషం. 2016లో ప్రపంచం మొత్తం మీద 11,072 ఉగ్రదాడులు జరిగాయి. 2015లో భారత్‌లో 798 ఉగ్రదాడులు జరగ్గా 2016లో ఏకంగా 927 (16శాతం) దాడులు జరిగాయి. ఈదాడుల్లో 2015లో 289 మంది మృత్యువాత పడగా 2016లో మాత్రం వారి సంఖ్య 337కు చేరింది. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య 500 నుంచి 636కు పెరిగింది. దాయాది దేశం పాకిస్తాన్లో మాత్రం 2015లో 1010 ఉగ్రదాడులు నమోదవ్వగా, 2016లో మాత్రం గణనీయంగా 734కు తగ్గింది. ఆశ్చర్యకరంగా అమెరికా పర్యవేక్ష సంస్థ ప్రమాదకర ఉగ్రవాద జాబితాలో నక్సలిజంను చేర్చింది. అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, తాలిబన్ల తర్వాత నక్సలిజం ద్వారా ఎక్కువ దాడులు జరిగినట్టు తెలిపింది. భారత్‌లో జరిగిన ఈ దాడుల్లో 93శాతం ఒక్క జమ్మూ కశ్మీర్లో జరిగినట్టు ప్రకటించింది. 2016-17 భారత హోంమంత్రిత్వ శాఖ నివేదికి ప్రకారం జమ్మూ కశ్మీర్లో ఏకంగా 54.81శాతం ఉగ్రదాడుల పెరిగాయి. అంతేకాకుండా ఉగ్రవాదులు చేసే కిడ్నాప్‌ల సంఖ్య 866 నుంచి 317కు చేరింది. మోడీ ప్రభుత్వం ఉగ్రదాడులపై కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే ప్రాణనష్టం దేశంలో 0.4 శాతంగా ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా 2.4గా ఉంది. భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 73శాతం వాటిలో ప్రాణనష్టం తక్కువగా ఉంది. 104 ఉగ్రపీడిత దేశాల్లో జరిగిన దాడుల్లో ఏకంగా 55శాతం దాడులు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్లో జరిగినవే. -
భారత్‌లో ఉగ్రదాడులు చేశాం: సలాహుద్దీన్
లాహోర్/న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకు చాలాసార్లు ఉగ్ర దాడులకు పాల్ప డినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్(71) అంగీకరించాడు. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన అనంతరం ఆయన జియో చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మేం ఇప్పటివరకు కశ్మీర్‌లోని భారత బలగాలే లక్ష్యంగా దాడులు నిర్వహించాం. భవిష్యత్తులో కూడా వారిపైనే దాడులు కొనసాగుతాయి’ అని చెప్పాడు. కశ్మీర్‌ను తన ఇంటిగా అభివర్ణించిన ఆయన.. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాతే లోయలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. భారత్‌లో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దాడి చేయగల సామర్థ్యం తమకుందని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచే తాము ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు భారత్‌లో చాలామంది మద్దతుదారులు ఉన్నారని వెల్లడించారు. తమ ఉద్యమానికి పాక్, చైనాలు దౌత్యపరంగా నైతికంగా మద్దతు ఇచ్చాయని వెల్లడించారు. -
పాక్‌కు భారత్, అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!
వాషింగ్టన్: దాయాది పాకిస్థాన్‌కు భారత్, అమెరికా ఉమ్మడిగా గట్టి సందేశాన్ని ఇచ్చాయి. తన భూభాగాన్ని వేదికగా చేసుకొని సీమాంతర ఉగ్రవాద దాడులు జరపకుండా పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించాయి. 26/11 ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారులను చట్టం ముందుకుతెచ్చి సత్వరమే శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని, ఉగ్రవాదుల స్వర్గధామలాలను నిర్మూలిస్తామని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉమ్మడిగా ప్రతిన బూనారు. 'ఉగ్రవాద నిర్మూలనే మాకు అత్యంత ప్రాధాన్య విషయం' అని ట్రంప్‌తో కలిసి సంయుక్త ప్రకటన చేస్తూ మోదీ పేర్కొన్నారు. తన భూభాగం వేదికగా చేసుకొని ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులు జరగకుండా పాక్ చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతల తమ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. 'మేం ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదం గురించి చర్చించాం. ఈ విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాం' అని మోదీ చెప్పారు. ఉగ్రవాద సంస్థలను, వాటిని నడిపించే భావజాలాన్ని ధ్వంసం చేయాలని ఇరుదేశాలూ నిశ్చయించినట్టు ట్రంప్ తెలిపారు. -
భారత్‌పై ఉగ్రదాడికి కుట్ర.. అమెరికాలో ఎన్నారైకి 15 ఏళ్ల జైలు
భారతదేశం మీద ఉగ్రదాడి చేసేందుకు కుట్ర పన్నిన నేరం రుజువు కావడంతో అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారైకి అక్కడి కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఖలిస్థాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ప్రభుత్వాధికారిని చంపేందుకు కూడా అతడు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. దాంతో బల్వీందర్ సింగ్ (42) అనే ఎన్నారైకి అమెరికా జిల్లా జడ్జి లారీ హిక్స్ 180 నెలల జైలు శిక్ష విధించారు. ఉగ్రవాదులకు కేవలం మద్దతు ఇవ్వడం, కుట్ర పన్నడమే కాక.. వాళ్లకు కావల్సిన వనరులను కూడా ఇతడు సమకూర్చినట్లు తేలింది. రెనో ప్రాంతానికి చెందిన బల్వీందర్ సింగ్ రెండు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడని, భారత ప్రభుత్వాన్ని వణికించేందుకు, అక్కడి అమాయక ప్రజలను హతమార్చేందుకు కావల్సిన సామగ్రిని ఇతడు వాళ్లకు అందించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇతడికి బల్జీత్ సింగ్, ఝాజీ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. అమెరికాలో శాశ్వత నివాస హోదా ఉంది. 2013 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య ఇతడు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఉగ్రవాద దాడులు చేయడానికి కావల్సిన సామగ్రి అందించాడని చెబుతున్నారు. కాలిఫోర్నియా జైల్లో ఉన్న మరో కుట్రదారుడిని కలిసేందుకు ఇతడు తరచు రెనో నుంచి కాలిఫోర్నియా వెళ్లేవాడన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు భారతదేశానికి వెళ్లి, అక్కడ ఒక భారత ప్రభుత్వాధికారిని చంపడంతో పాటు ఉగ్రవాద దాడులు కూడా చేయాలని 2013 అక్టోబర్‌లో వీళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. 2013 నవంబర్ నెలలో బల్వీందర్ సింగ్ రెండు నైట్ విజన్ గాగుల్స్, ఒక ల్యాప్‌టాప్ కొని తన సహచరుడికి ఇచ్చాడు. అతడు శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు డిసెంబర్లో ప్రయత్నించాడు గానీ.. అమెరికా అధికారులు విమానాశ్రయంలోనే పట్టుకున్నారు. అతడిని విచారించగా బల్వీందర్ విషయం తెలిసింది. -
నోట్ల రద్దు.. తొలి ఫలితం వచ్చింది!
పెద్దనోట్ల రద్దు ఫలితంగా ఉగ్రవాదులకు నిధులు అందడం గణనీయంగా తగ్గిపోయిందని, దాంతోపాటు నకిలీనోట్ల రాకెట్లు, హవాలా వ్యవహారాలు కూడా గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం.. పెద్దనోట్ల రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 60 శాతం తగ్గాయి. డిసెంబర్ నెల మొత్తమ్మీద కశ్మీర్ లోయలో కేవలం ఒకే ఒక్క పేలుడు సంభవించింది. హవాలా వ్యాపారం కూడా సగానికి సగం తగ్గిపోయింది. హవాలా ఏజెంట్ల కాల్ ట్రాఫిక్ సగం పడిపోయిందని టెల్కోలు చెబుతున్నాయి. నకిలీ నోట్లు కూడా బాగా తగ్గాయని అంటున్నారు. ప్రధానంగా పాకిస్థాన్‌లో ప్రింట్ అయ్యే ఈ నకిలీ నోట్ల వ్యవహారానికి ఒక్కసారిగా చెక్ పడింది. కొత్త నోట్లలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లు, ఉపయోగించిన రంగులు వీటన్నింటినీ కాపీ చేయడానికి వాళ్లకు చాలా సమయం పడుతోంది. దాంతో ఇప్పట్లో నకిలీనోట్లు వచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. క్వెట్టా, కరాచీలలో ఉన్న సెక్యూరిటీ ప్రెస్‌లలో ఎంతోకాలం నుంచి భారత కరెన్సీ నోట్లకు నకిలీ నోట్లను పాకిస్థాన్ ముద్రిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నకిలీనోట్లు ఆగడంతో పాటు ఉగ్రవాదులకు నిధులు అందడం కూడా బాగా తగ్గింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాళ్లు రువ్వే ఘటనలు బాగా తగ్గిపోయాయి. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కొన్ని బృందాలు ఈ పెద్దనోట్లను స్థానిక కమాండర్లకు ఇచ్చి, వాళ్ల ద్వారా స్థానిక యువకులకు డబ్బులిచ్చి వారిని రెచ్చగొట్టి రాళ్లు రువ్వించేవి. ఇప్పుడు పెద్దనోట్లను రద్దు చేయడం, కరెన్సీ పెద్దమొత్తంలో అందుబాటులోకి రాకపోవడంతో ఇలా డబ్బులిచ్చి రెచ్చగొట్టడం కూడా తగ్గింది. -
నిఘా నిద్రపోతోందా..?
- వరుస ఉగ్ర దాడులు జరుగుతున్నా మేల్కోని రక్షణ వర్గాలు - భద్రతా లోపాలే కొంపముంచుతున్నాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: మొన్న పఠాన్‌కోట్.. నిన్న ఉడీ.. నేడు నగ్రోటా..! ఒకే ఏడాదిలో ఒకదాని వెంట ఒకటి ఉగ్రదాడులు!! ఎంత అప్రమత్తంగా ఉన్నా ముష్కర మూకలు ఎలా దాడులకు తెగబడుతున్నాయి? ఏకంగా పోలీసు దుస్తుల్లోనే వచ్చి రక్తపుటేర్లు ఎలా పారిస్తున్నాయి? ఇప్పుడు రక్షణ వర్గాలను, ఆ రంగ నిపుణుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఉగ్రవాదుల ఈ వరుస దాడులు భద్రతాపరమైన లోపాలను తేటతెల్లం చేస్తున్నాయని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్మీ యూనిట్లు, శిబిరాలపై దాడులు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడంలో రక్షణ శాఖతోపాటు భద్రతా బలగాలు విఫలమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. చొరబాట్లను కట్టుదిట్టంగా నియంత్రించడంతోపాటు యూనిట్లకు కాపలాగా ఉండే సెంట్రీ వ్యవస్థనూ ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పఠాన్‌కోట్‌లో ఏడుగురు, సెప్టెంబర్‌లో ఉడీ దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. ఇవి మరవకముందే తాజాగా నగ్రోటాలో ముష్కరులు మరోసారి దాడికి తెగబడి ఇద్దరు అధికారులతోపాటు ఏడుగురు జవాన్లను బలిగొన్న సంగతి తెలిసిందే. ఆ సిఫారసుల అమలు ఏది? జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో ఉగ్ర దాడి తర్వాత కేంద్రం ఒక కమిటీ నియమించింది. భద్రతాపరమైన లోపాలపై ఈ కమిటీ పలు సిఫారసులు చేసింది. అయితే అవి ఇప్పటికీ పూర్తిస్థారుులో అమలుకావడం లేదు. మాజీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోజ్ గత మేలో రక్షణమంత్రికి నివేదిక సమర్పించారు. అయినా భద్రతా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడం లేదు. ఇది మరిన్ని దాడులకు ఆస్కారమిస్తోంది. బలగాలపై ఒత్తిడి ఉందా? రక్షణ బలగాల్లో దీర్ఘకాలంగా ఒత్తిడి ఉంటోందని, దీనివల్ల వారు పూర్తిస్థారుులో భద్రత కల్పించేందుకు అవకాశం ఉండట్లేదని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ముష్కర మూకలకు కళ్లెం వేయాలంటే వైఫల్యాలను తక్షణమే అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పర్యవేక్షక వ్యవస్థపై సందేహాలు నగ్రోటా దాడి ఆపరేషన్‌కు వారం క్రితమే ముష్కరులు పక్కా రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ‘‘ఆర్మీ యూనిట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ధరించిన పోలీసు దుస్తులను భారత్‌లోనే కుట్టించారు. ఇది ఒక రోజులో జరిగే పని ఎంతమాత్రం కాదు. దీన్నిబట్టి చూస్తే ఉగ్రవాదులు ఇక్కడే కొంతకాలం మకాం పెట్టినట్లు తెలుస్తోంది’’ అని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇదే నిజమైతే మన ఇంటెలిజెన్స, పర్యవేక్షక వ్యవస్థపై కొన్ని సందేహాలు కలగకపోవన్నారు. ఉగ్రవాదులు ఇక్కడ తిష్ట వేస్తే వారి అనుపానులు గుర్తిస్తూ ఇంటెలిజెన్స ఎప్పటికప్పుడు బలగాలను అప్రమత్తం చేయాలి. కానీ ఇక్కడ అదేదీ జరగలేదని చెబుతున్నారు. -
క్రికెట్ జట్లకు షోయబ్ అక్తర్ వార్నింగ్
కరాచీ: పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి విదేశీ జట్లు వెనకడుగు వేస్తున్న సమయంలో అందుకు మరింత బలాన్నిస్తూ ఆ దేశ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తమ దేశంలో క్రికెట్ ఆడటం ఎంతమాత్రం సురక్షితం కాదని విషయాన్నితేల్చిచెప్పాడు. ఈ మేరకు పాక్ కు విదేశీ జట్లు రావొద్దని హెచ్చరికలు జారీ చేశాడు.క్వెట్టాలోని పోలీస్ శిక్షణా శిబిరంపై ఉగ్ర మూకలు నరమేధం సృష్టించి 62 మంది పోలీస్ క్యాడెట్లు ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటనపై తాజాగా మాట్లాడిన అక్తర్.. తమ దేశంలో సరైన రక్షణ లేదనే విషయాన్ని అంగీకరించాడు. 'మా దేశంలో సరైన భద్రత లేదు. ఇది విదేశీ జట్లకు ఎంతమాత్రం సురక్షితం కాదు. పాకిస్తాన్లో పరిస్థితులు చక్కబడేవరకూ ఏ జట్టు ఇక్కడకు రావడం అంత శ్రేయస్కరం కాదు. ఆ రిస్క్‌ను కొనితెచ్చుకోవద్దు. దేశంలోని రక్షణపై నెలకొన్న ఆందోళనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకు ఓపిక పట్టక తప్పుదు. మా దేశంలో విదేశీ క్రికెట్ జట్లు పర్యటించడానికి కొంత సమయం అయితే అవసరం' అని అక్తర్ పేర్కొన్నాడు. విదేశీ జట్లు తమ దేశంలో పర్యటించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రయత్నాలు చేయడం నిజంగా దురదృష్టకరమన్నాడు. తమ దేశంలో ఉగ్రదాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడకు రావాలంటూ విదేశీ జట్లను ఆహ్వానించడం ప్రస్తుతం సరైన చర్య కాదని షోయబ్ తెలిపాడు. త్వరలోనే పాక్‌లో సాధారణ పరిస్థితి నెలకొంటుదనే ఆశాభావం వ్యక్తం చేశాడు. -
పాక్ దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా?
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్ తో సంబంధాలపై చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పాక్ తీవ్ర చర్యలను, చేష్టలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే ఆ దేశ నటీనటలను ఇక్కడ ఆదరించొద్దని, పనిలో పనిగా పాక్-భారత్ సిరీస్ లకు విరామం ఇవ్వాలని వ్యాఖ్యానించిన గంభీర్ కు గంగూలీ మద్దతు తెలిపాడు. వాస్తవానికి ఇది చాలా దురదృష్టకరమైన అంశం అయినా సరే, పాకిస్తాన్ తో క్రికెట్ కొన్నేళ్లు నిలిపివేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో భారత్-పాక్ సంబంధాలపై నోరు విప్పాడు. సరిహద్దుల్లో తరచుగా పాక్ ఉగ్రదాడులకు తెగబడుతున్న కారణంగా కొన్ని సందర్భాలలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తన మనసులో మాట బయటపెట్టాడు. మన జవాన్లను చంపేస్తుంటే పాక్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం భావ్యమేనా అని దాదా ప్రశ్నించాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ ఇదివరకే ఈ విషయంపై మాట్లాడుతూ.. భారత్-పాక్ సిరీస్ లపై తుది నిర్ణయం సంబంధిత క్రీడా బోర్డులకు వదిలేస్తున్నామని చెప్పారు. కాగా, ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని గంభీర్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. -
'మోదీ విధానాలతో ఐక్యత ప్రశ్నార్థకం'
⇒ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు ⇒ సూర్యాపేటలో పార్టీ రాష్ట్రకమిటీ సమావేశాలు ప్రారంభం సూర్యాపేట: ప్రధాని నరేంద్రమోదీ అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో భారతదేశంలో ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి తిప్పికొట్టాలి.. కానీ అలా కాకుండా దేశ ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా వ్యవహరిస్తే సీపీఎం చూస్తూ ఉండదని హెచ్చరించారు. భారత పాలకులు సైన్యాన్ని అప్రమత్తం చేయడంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉడీలో ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంటే ఎన్డీయే ప్రతినిధి ప్రతిపక్షాలపై విరుచుకు పడడంలో అర్థం లేదన్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద దాడులను తిప్పికొట్టామని.. అయినా గోప్యంగా ఉంచామని ఓ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు దాడులు చేసేప్పుడు నిద్రపోయి.. అయిపోయాక మాట్లాడడం మోదీ, రక్షణశాఖ మంత్రులకే చెల్లుబాటవుతుందని ఎద్దేవా చేశారు. సరిహద్దుల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరముందని బీవీ రాఘవులు సూచించారు. -
సార్క్ సదస్సులో భారత్ పొల్గొనదు!
-
సార్క్ సదస్సులో భారత్ పొల్గొనదు!
త్వరలో జరగనున్న సార్క్ సమావేశాలకు భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. భారత్ బాటలో బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్తాన్ కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు సార్క్ దేశాలు ఈ సమావేశాలకు దూరం కావడం పాక్ కు నిజంగానే పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన ఉడీ ఉగ్రదాడికి నిరసగా భారత్ సార్క్ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు విదేశాంగశాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సార్క్ సమావేశాలు వచ్చే నవంబర్ లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ కు బుద్ధిచెప్పాలంటే ఇలాంటి చర్యలకు సిద్ధమవ్వాలన్నట్లు కేంద్రం సంకేతాలు పంపింది. భవిష్యత్తులో దౌత్యపరంగా దాయాది పాక్ కు ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉన్మాదానికి విరుగుడు ఉపేక్షించడమే
అవలోకనం భారత జాతీయ ప్రయోజనాల సంరక్షకులం మనమేనన్నట్టుగా మీడియాలో చాలా మందిమి నటిస్తుంటాం. కానీ రేటింగ్‌లకు మించిన ప్రయోజనాలేవీ మీడియాకు లేవు. మన యాంకర్లు ప్రదర్శించే ఆగ్రహావేశంలో చాలా వరకు ప్రేక్షకులు, దేశం కోరుకుంటున్నది అదేనని నమ్మడం వల్ల కలిగేదే. దేశం యుద్ధానికి దిగడం గురించి చర్చిస్తున్న సమయంలోనే, సమాజంలో పేరున్న ఒకరు తన కుమార్తెను హత్యగావించడానికి కూడా మీడియా అంతే ప్రాధాన్యం ఇస్తుంది. మీడియా వాళ్లు తమను తామే అంతగా పట్టించుకోరు. కాబట్టి ప్రభుత్వమూ పట్టించుకోకూడదు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌తో భారత్ ఉద్దేశపూర్వకంగానే మెతకగా ఉంటోందని నమ్మేవారు చాలా కాలంగా ఉన్నారు. మన దేశంపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు హింసాత్మకంగా ప్రతిస్పందించాలని వారి అభిప్రాయం. ముంబై దాడులలోవలే పాకిస్తానీల ప్రమేయం ఉన్నదని ప్రత్యక్షంగా వెల్లడైన సందర్భా లలో కూడా భారత్ ప్రతి చర్యకు పాల్పడలేదు. నేను ప్రస్తావిస్తున్న ఈ బృందం దృష్టిలో అది తప్పు. ఆ దాడితో సంబంధం ఉన్న తమ పౌరులను పాక్ విచారిం చడం సరిపోదని, భారత్ ఇంకా ఎక్కువ చేయాలని వారి ఆలోచన. మన ప్రభుత్వ క్రియారాహిత్యం ఉద్దేశపూర్వకమైనదని, పిరికితనమని, ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉన్నదని వారి భావన. భారత్‌లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నా యుద్ధానికి దిగరాదనే ఈ విధానాన్ని ‘వ్యూహాత్మక సంయమనం’ అంటారు. సంక్షోభాన్ని విషమింపజేయరాదని భావించడం ద్వారా భారత్ ఉద్దేశపూర్వకంగా తన ఆగ్రహాన్ని దిగుకుంటోందని ఈ సిద్ధాంతం చెబు తుంది. లాభనష్టాలను బేరీజు వేసి చూస్తే తేలే నిర్ధారణలు యుద్ధానికి అను కూలంగా లేకపోవడమే అందుకు కారణం. 2001లో జైషే మొహమ్మద్ పార్లమెం టుపై దాడికి పాల్పడినప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, 2008లో లష్కరే తోయిబా ముంబై దాడులకు బరి తెగించినప్పుడు మన్మోహన్సింగ్ ఈ మార్గం వైపే మొగ్గు చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలాకాలంగా ఏదో ఒకటి చేసి తీరాలనే ఈ బృందంలో ఒకరుగా ఉన్నారు. ఉడీ దాడి తదుపరి, తిప్పికొడతామన్న తన మునుపటి వాగ్దానాలకు ఆయన దూరంగా జరిగినట్టు లేదా తాను చేసి చూపుతానన్న క్రియాత్మక ప్రతిస్పందనకు తటపటాయిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందుకు చాలానే కారణాలు ఉండవచ్చు. ప్రధాని బాధ్యతలను స్వీకరించిన తర్వాత మునుపు తనకు తెలియని ఎన్నో విషయాలను ఆయన నేర్చుకుని ఉండటం అందుకు కారణం కావచ్చు. కారణం ఏదైనా, ఆయన తన మద్దతుదార్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. నిజానికి వారి దృష్టిలో మోదీ అత్యంత గౌరవనీయుడు. అయితే పాక్ సమస్యతో సతమతమయ్యే నేటి రోజులు అందుకు భిన్నమైనవి. విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నవారు మోదీ తన వాగ్దానాలను నెరవేర్చడం లేదని భావిస్తున్నారు. ఆయన ఏం చేయాలి? ప్రధానిగా మోదీకి ఉన్న సమాచారం ఈ విషయంపై వ్యాఖ్యానాలు చేస్తున్న వారి వద్ద లేదు. సాయుధ దళాలు, జాతీయ భద్రతా సలహాదారు, ఆర్థిక మంత్రి త్వశాఖల నివేదికలు ఆయన వద్ద ఉన్నాయి. అలాగే ఈ సంఘర్షణ యుద్ధంగా విస్తరిస్తే విదేశాల్లో కలిగే ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విదేశాంగ శాఖ నివేదిక, అది దేశంలో అంతర్గతంగా కలుగజేసే ప్రభావం గురించిన హోంశాఖ, గూఢచార వ్యవస్థల నివేదికలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. భారత్‌కు ఎంచు కోడానికి అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటనే దానికి సంబంధించిన అత్యు న్నత స్థాయి వివరాలను తెలుసుకునే అవకాశం అతి కొద్ది మందికే ఉంటుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మోదీ చేయాల్సిన పని ఒక్కటే... మీడియాను పట్టించుకోవడం మానే యడమే. నేను ముందే చెప్పినట్టు ఆయనకు ఉన్న సమాచారం దానికి లేదు. అయినా, ఆయనకు సలహాలు ఇవ్వకుండా, దిశా నిర్దేశన చేయకుండా... చెప్పినట్టు చేయకుంటే దుమ్మెత్తి పోయకుండా మనల్ని ఆపగలిగే దేమీ లేదు. భారత జాతీయ ప్రయోజనాల సంరక్షకులం మనమేనన్న ట్టుగా మనలో చాలా మందిమి నటిస్తుంటాం. కానీ రేటింగ్‌లకు మించిన ఉన్నత ప్రయోజనాలేవీ మీడియాకు లేవు. మనం అందుకు భిన్నంగా చెప్పుకున్నా నిజం మాత్రం అదే. మన యాంకర్లు ప్రదర్శించే ఆగ్రహావేశంలో చాలా వరకు ప్రేక్ష కులు, వారికి కొనసాగింపుగా దేశమూ కోరుకుంటున్నది అదేనని నమ్మడం వల్ల కలిగేదే. అది చాలా అర్థవంతమైనదే అయినా... దేశం యుద్ధానికి దిగడమనే అంశాన్ని గురించి చర్చిస్తున్న సమయంలోనే, సమాజంలోని ఒక ప్రముఖ వ్యక్తి తన కుమార్తెను హతమార్చిన ఘటనకు కూడా మీడియా అంత ప్రాధాన్యం ఇస్తుంది. మీడియా వాళ్లు తమను తామే అంతగా పట్టించుకోరు. కాబట్టి ప్రభుత్వం కచ్చితంగా పట్టించుకోకూడదు. ఇక మోదీ చక్కగా విస్మరించగలిగిన రెండో అంశం, సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతోందనేది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి మోదీ ఒక చాంపియన్. ఆయనకు రెండు కోట్ల మంది ట్విటర్ ఫాలోయర్లున్నారు. దాన్ని ఆయన అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సంప్రదాయక మీడియాకు తన పట్ల ఉన్న లేదా ఉన్నదనుకున్న పక్షపాత వైఖరిని తలకిందులు చేయడానికి సోషల్ మీడియా తోడ్పడిందని నిజంగానే ఆయన విశ్వసిస్తున్నారు. అయినా, ఆయన తన అనుయాయుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయనను యుద్ధానికి దిగమని ముల్లుగర్రతో పొడిచినట్టు... ఒకప్పటి కటువైన ప్రకటనల లింకులను వారు పోస్ట్ చేస్తున్నారు. ఉడీ దాడిపై తొలి స్పందన తదుపరి మోదీ రెండు లేదా మూడు రోజుల పాటూ ట్వీటింగ్ చేయకుండా గడిపేశారు. ఇలాంటి సమయాల్లో ఆయన ఇంకా ఎక్కువ సమయం కూడా దానికి దూరంగా ఉండగలగాలి. ఎట్టకేలకు ఈ దుమారం ఎలాగూ సద్దుమణిగి పోయేదే. కాబట్టి సామాజికమాధ్యమాల నుంచి, మీడియా నుంచి అందే అరకొర సమాచారంతో ఒక తీవ్ర చర్యను పరిగణనలోకి తీసుకోవడం తెలివితక్కువ పని అవుతుంది. నేను పని చేసిన ఒక వార్తా సంస్థ కొన్ని వారాల క్రితం నన్ను ‘దేశ వ్యతిరేకి’ అని ఆరోపించింది. ఉడీ ఉగ్రదాడి జరిగేసరికి నేను విదేశాల్లో ఉన్నాను. చానళ్లు అత్యుగ్ర రూపం దాల్చిన తొలి రెండు రోజులను నేను చూడలేకపోయాను. మా నాన్న నా గురించి ఆందోళన చెంది, ఫోన్లో అది వ్యక్తం చేశారు. వాస్తవం, టీవీ సెట్లో జరిగేదానికి భిన్నమైనదని నేనాయనకు చెప్పాను. స్విచ్ ఆఫ్ చేస్తే సరి, అదే పోతుంది. మోదీకైనా నేను చెప్పేది అదే. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఉగ్ర పాక్‌ను ఏకాకి చేయాలి
⇒ ఉగ్రదాడిపై హోం, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో రాజ్‌నాథ్ ⇒ రష్యా, అమెరికా పర్యటనల్ని రద్దుచేసుకున్న హోం మంత్రి న్యూఢిల్లీ/శ్రీనగర్: యూరిలో ఉగ్ర దాడిపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, దాన్ని ఒంటరి చేయాలంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. యూరిలోని సైనిక బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు కఠోర శిక్షణ పొందారని, అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడి వెనుక సూత్రధారుల్ని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు. 17 మంది సైనికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపంతో పాటు, గాయపడ్డవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రత్యక్ష సహకారం కొనసాగించడంపై రాజ్‌నాథ్ అసంతృప్తిని వెలిబుచ్చారు. దాడి అనంతర పరిస్థితిని సమీక్షించేందుకు రాజ్‌నాథ్ అత్యవసర భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదా రు అజిత్ డోవల్, హోం శాఖ, ఆర్మీ, పారామిలటరీకి చెందిన ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. సమావేశ వివరాల్ని ప్రధానికి వివరించానని రాజ్‌నాథ్ తెలి పారు. ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా, అమెరికా పర్యటనల్ని రాజ్‌నాథ్ వాయిదా వేసుకున్నారు. నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటన కోసం ఆదివారం రాత్రి రాజ్‌నాథ్ రష్యా వెళ్లాలి. అక్కడి నుంచి ఇండో-యూఎస్ అంతర్గత భద్రతా చర్చల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 26 నుంచి ఆరు రోజులు అమెరికాలో పర్యటించాలి. దాడి ఘటన తెలిసిన వెంటనే జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ .ఎన్.వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలతో మాట్లాడి పూర్తి వివరాల్ని తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలంటూ హోం కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, ఇతర అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ గోవా పర్యటనను మధ్యలోనే ముగించి ఆగమేఘాలపై శ్రీనగర్ చేరుకున్నారు. సైనికులపై దాడి, అనంతరం సైన్యం ప్రతిదాడిపై పరీకర్‌కు ఆర్మీ అధికారులు వివరించారు. శ్రీనగర్‌లోని 92 బేస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికుల్ని పరామర్శించారు. అమెరికా, బ్రిటన్ తీవ్ర సంతాపం భారత సైనికులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా ప్రకటించింది. బాధితులకు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జాన్ కిర్బీ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో పటిష్ట భాగస్వామ్యం ఏర్పాటుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలుపుతూ భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి సాగేందుకు, సూత్రధారుల్ని చట్టానికి పట్టిం చేందుకు బ్రిటన్ సిద్ధమని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
శంషాబాద్: కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో కూడా అలర్ట్ విధించారు. ఆక్టోపస్, సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. విమానాశ్రయంలోని ప్రధాన రహదారితో పాటు అన్ని రోటరీల వద్ద బలగాలను మోహరించారు. డాగ్స్క్వాడ్లతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. సైబరాబాద్ పోలీసులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ఆటగాళ్లపై ఉగ్రదాడులు జరగలేదు
రియోడిజనీరో: తమ దేశానికి చెందిన ఒలింపిక్ బృందంపై రియోలో తీవ్రవాదులు దాడి చేయడానికి కుట్ర పన్నినట్లు వచ్చిన వార్తలు నిరాధరమైనవేనని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని అధికారికంగా బ్రెజిల్ ప్రభుత్వమే వెల్లడించింది. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిపై విచారణ కొనసాగించిన ఆదేశ ఇంటలిజెన్స్ చీఫ్ క్రిస్టోఫే గోమార్ట్.. తమ ఒలింపిక్ బృందంపై బ్రెజిల్‌కు చెందిన వ్యక్తితో తీవ్రవాదులు దాడి చేయించేందుకు కుట్ర పన్నారని నివేదికలో పేర్కొన్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు. మరోవైపు తొలిసారి దక్షిణ అమెరికా ఖండంలో జరుగుతన్న ఈ ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ భారీ స్థాయిలో రక్షణను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 85 వేల మంది ఒలింపిక్స్‌కు సెక్యూరిటీగా ఉండనున్నారు. ఇప్పటికే ఆయుధాలతో కూడిన వాహనాలు, అంటి క్రాఫ్ట్ గన్స్‌తో సైనికులు.. ఒలింపిక్స్ జరిగే ప్రదేశాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బ్రెజిల్‌పై ఎలాంటి తీవ్రవాద దాడులు జరగకపోయినా.. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్‌కు అన్ని దేశాల నుంచి క్రీడాభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ రక్షణ చర్యలు చేపట్టారు. ఒలింపిక్స్ సంబంధించి ప్రతి చిన్న బెదరింపును కూడా చాలా సీరియస్‌గా తీసుకొని విచారిస్తున్నామని బ్రెజిల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది . -
రంజాన్ తర్వాత పేలుళ్లకు స్కెచ్!
► ఉగ్రవాదుల తొలి ప్లాన్ ఇదే ► ఐసిస్ ప్రతినిధి అబ్ మహ్మద్ ఆదేశాలతో మార్పు ► రంజాన్‌కు ముందు.. శని, ఆదివారాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ముష్కరులు ► ఎన్ఐఏ విచారణలో వెలుగుచూస్తున్న అంశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రంజాన్ తర్వాత మారణహోమం సృష్టించేందుకు ఉగ్రమూకలు ప్లాన్ వేశాయా? కానీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ(ఐసిస్) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వ్యూహం మార్చుకొని రంజాన్‌కు ముందే పేలుళ్లకు సిద్ధమయ్యారా? అవుననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) వర్గాలు! ముష్కరులు వాస్తవానికి రంజాన్ తర్వాత నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగుచూసింది. అయితే ఐసిస్ ప్రతినిధి అబ్ మహ్మద్ అల్ అద్నానీ సూచన మేరకు పేలుళ్లను వారం రోజుల ముందుకు మార్చారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేసిన ఐదుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు శనివారం దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. ఒక్కొక్కరిగా, బృందాలుగా కూర్చోబెట్టి వారిని విచారించారు. ముఖ్యంగా కుట్రలో కీలకంగా భావిస్తున్న మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ, హబీబ్ మహ్మద్ అలియాస్ యూసఫ్ గుల్షన్లను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఐసిస్ ఉగ్రవాది అబ్ మహ్మద్ అల్ అద్నానీ పాత్ర వెలుగు చూసింది. ఇతడి ప్రోద్బలంతోనే పేలుళ్లను వారం రోజుల ముందుకు మార్చినట్లు ఎన్ఐఏ అధికారులకు ముష్కరులు వెల్లడించారు. వాస్తవానికి రంజాన్ తర్వాత పేలుళ్లు జరపాలని భావించగా.. అబ్ మహ్మద్ మాత్రం తీవ్రంగా వాదించి వారం రోజులు ముందుగా అది కూడా శని, ఆదివారాల్లో జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. అందుకు అతడు 30 నిమిషాల నిడివి గల ఆడియోను ‘ఆన్లైన్’ ద్వారా పంపినట్లు అధికారులు గుర్తించారు. పేలుళ్లకు మొదట్లో విముఖత చూపిన వారు కూడా ఆ ఆడియో విన్న తర్వాత ఆసక్తి కనబర్చారు. దీంతో ఆ ఆడియోలో మహ్మద్ ప్రస్తావించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్మర్ కనుసన్నల్లో రిక్రూట్మెంట్లు సిరియాలో ఉన్న ఐసిస్ ఉగ్రవాది షఫీ ఆర్మర్ కనుసన్నల్లో పెద్దఎత్తున రిక్రూట్మెంట్లు జరిగినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన షఫీ ఆర్మర్ ఐసిస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు ఐసిస్‌కు అనుబంధంగా అన్సార్ ఉల్ తవ్హిద్ పి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)ని ఏర్పాటు చేసి యువతను ఆకర్షిస్తున్నాడు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు పంపుతూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. వీడియో కాలింగ్ ద్వారా బాంబుల తయారీ విధానంపై కూడా తర్ఫీదు ఇస్తున్నాడు. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో కొందరిని ఐసిస్ దిశగా దృష్టి మళ్లించినట్లు ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎల్కు చేరిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపించారు. బుధవారం పాతబస్తీలో పట్టుబడిన వారి నుంచి దాదాపు 40 సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్‌లతో పాటు పెద్ద మొత్తంలో రసాయన పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ పరికరాలలో నిక్షిప్తమైన సమాచారాన్ని వెలికితీయాలని ఎఫ్ఎస్ఎల్ అధికారులకు సూచించారు. అలాగే కోడింగ్ విధానంలో జరిగిన సంభాషణలపైనా అధ్యయనం చేయాలని ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కోరారు. ఇబ్రహీం సౌదీ టూర్‌పై ఆరా మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ 2 నెలల కిత్రం సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ పర్యటనలో ఎవరెవరితో సమావేశమయ్యాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. మారుపేర్లతో సౌదీకి వచ్చిన షఫీ ఆర్మర్.. ఇబ్రహీంతో చర్చించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఇటీవల ఎవరైనా హైదరాబాద్ వ చ్చారా? కశ్మీర్‌లోని వేర్పాటు వాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అని ముష్కరులను ప్రశ్నించారు. నేడు మహారాష్ట్రకు ఉగ్రవాదులు! తమ కస్టడీలో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం మహారాష్ట్రకు తీసుకువెళ్లాలని ఎన్ఐఏ అధికారులు యోచిస్తున్నారు. ఇబ్రహీం యాజ్దానీ మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అతడికి సహకరించిన వారితో పాటు అక్కడున్న పరిచయాలపై ఆరా తీయనున్నారు. అక్కడ్నుంచి ఇబ్రహీం రాజస్థాన్ లో పర్యటించిన ప్రాంతాలకు వెళ్లనున్నారు. -
సైబర్ క్రైం రేటు పెరుగుతోంది
ఇంటర్నెట్ ద్వారా ఆర్థిక నేరాలు, ఉగ్రవాద కార్యక్రమాలు విజయవాడలో దక్షిణ భారత స్థాయి సెమినార్ సాక్షి, విజయవాడ బ్యూరో: ఉగ్ర కార్యకలాపాల విస్తరణ, రిక్రూట్మెంట్ వంటి వాటిలో ఇంటర్నెట్ ప్రధాన భూమిక పోషిస్తుండటంతో సైబర్ క్రైంపై పోలీస్ శాఖ అప్రమత్తమైంది. సైబర్ క్రైం నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడ గేట్‌వే హోటల్లో గురువారం దక్షిణ భారత స్థాయి సెమినార్ నిర్వహించారు. నంబర్, చిరునామా తెలియకుండా ఇంటర్నెట్ ఫోన్‌కాల్ (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్-వివోఐపీ) గుర్తించి సైబర్ క్రైంకు చెక్ పెట్టే పద్ధతులపై అవగాహన కల్పించారు. ట్రూత్ ల్యాబ్, మైక్రోసాఫ్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖల్లో సైబర్ విభాగం, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి పోలీసులకు ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల సలహాదారు, ట్రూత్ ల్యాబ్ చైర్మన్ గాంధీ, డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ (హైదరాబాద్) ఎ.ఎస్.రామశాస్త్రి మాట్లాడారు. ఈ వర్క్‌షాప్‌లో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (వాషింగ్టన్ డీసీ-యూఎస్ఏ) ప్రతినిధి బెట్సీ బ్రోడెర్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్‌అండ్‌డి) రిటైర్డ్ డెరైక్టర్ జనరల్ ఎన్ఆర్ వాసన్లు మాట్లాడారు.