
ఆటగాళ్లపై ఉగ్రదాడులు జరగలేదు
రియోడిజనీరో: తమ దేశానికి చెందిన ఒలింపిక్ బృందంపై రియోలో తీవ్రవాదులు దాడి చేయడానికి కుట్ర పన్నినట్లు వచ్చిన వార్తలు నిరాధరమైనవేనని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని అధికారికంగా బ్రెజిల్ ప్రభుత్వమే వెల్లడించింది. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిపై విచారణ కొనసాగించిన ఆదేశ ఇంటలిజెన్స్ చీఫ్ క్రిస్టోఫే గోమార్ట్.. తమ ఒలింపిక్ బృందంపై బ్రెజిల్‌కు చెందిన వ్యక్తితో తీవ్రవాదులు దాడి చేయించేందుకు కుట్ర పన్నారని నివేదికలో పేర్కొన్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు.
మరోవైపు తొలిసారి దక్షిణ అమెరికా ఖండంలో జరుగుతన్న ఈ ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ భారీ స్థాయిలో రక్షణను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 85 వేల మంది ఒలింపిక్స్‌కు సెక్యూరిటీగా ఉండనున్నారు. ఇప్పటికే ఆయుధాలతో కూడిన వాహనాలు, అంటి క్రాఫ్ట్ గన్స్‌తో సైనికులు.. ఒలింపిక్స్ జరిగే ప్రదేశాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బ్రెజిల్‌పై ఎలాంటి తీవ్రవాద దాడులు జరగకపోయినా.. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్‌కు అన్ని దేశాల నుంచి క్రీడాభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ రక్షణ చర్యలు చేపట్టారు. ఒలింపిక్స్ సంబంధించి ప్రతి చిన్న బెదరింపును కూడా చాలా సీరియస్‌గా తీసుకొని విచారిస్తున్నామని బ్రెజిల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది .