పాకిస్తాన్లో మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన పోరులో 12 మిలిటెంట్లు హతమయ్యారు.
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన పోరులో 12 మిలిటెంట్లు హతమయ్యారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఉత్తర వజిరిస్తాన్ ప్రాంతంలో సైన్యం గతరాత్రి నిర్వహించిన ఈ ఆపరేషన్లో మిలిటెంట్లు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
ఈ ఘటనలో మిలిటెంట్ కమాండర్ హిజ్బుల్లా హతమైనట్లు సమాచారం. మిలిటెంట్లు దాగిఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు వారిపై దాడి చేశాయి. కాగా గత వారం జరిగిన ఎదురు కాల్పుల్లో 50మంది మిలిటెంట్లతో పాటు ఓ ఆర్మీ ఉన్నతాధికారితో పాటు నలుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.