న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కోహ్లి తన అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఏటా అవార్డులు అందజేస్తారు. ఆర్పీ-ఎస్‌జీ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ అవార్డులను అందజేస్తారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ‘ఆర్పీ-ఎస్జీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.
The RP-SG Indian Sports Honours has been postponed. At this heavy moment of loss that we all find ourselves in, we would like to cancel this event that was scheduled to take place tomorrow.
— Virat Kohli (@imVkohli) 15 February 2019
Comments
Please login to add a commentAdd a comment