sports awards
-
ఏపీలో తొలిసారిగా క్రీడాప్రతిభా పురస్కారాలు
కడప : రాష్ట్రంలో తొలిసారిగా పాఠశాల స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరచిన పాఠశాలలకు ‘క్రీడాప్రతిభా అవార్డు’లను అందజేయనున్నట్లు ఏపీ వ్యాయామ విద్య తనిఖీ అధికారి, ఏపీ ఎస్జీఎఫ్ కార్యదర్శి జి. భానుమూర్తిరాజు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్య, ఏపీ ఎస్జీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాలను ఈనెల 29వ తేదీన అన్ని జిల్లాల్లో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్జీఎఫ్ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన పాఠశాలలను ఐదింటిని ఎంపికచేసి అవార్డులను ప్రదానం చేస్తామని తెలిపారు. ఈనెల 18వ తేదీలోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తమ క్రీడాప్రగతికి సంబంధించిన సర్టిఫికెట్లు జిరాక్స్‌లతో ఆయా జిల్లాల్లో విద్యాశాఖాధికారి, ఎస్జీఎఫ్ కార్యదర్శులకు అందజేయాలన్నారు. 18, 19 తేదీల్లో స్రూటినీ, 21న ప్రాథమిక జాబితా, 22న అభ్యంతరాలు స్వీకరణ, 23న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. -
రోహిత్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే టీమ్ వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది. ఈ ఏడాదిగాను ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయిన రోహిత్ శర్మ ఊహించినట్లుగానే ఆ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోనున్నాడు. ఫలితంగా సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిల సరసన చేరాడు. అంతకుముందు ఈ ముగ్గురు మాత్రమే ఖేల్‌రత్న దక్కించుకున్న భారత క్రికెటర్లు. క్రీడా మంత్రిత్వ శాఖ ఈరోజు(శుక్రవారం) ప్రకటించిన స్పోర్ట్స్ అవార్డుల్లో రోహిత్‌తో పాటు మరో నలుగురు ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యారు. రోహిత్‌తో పాటు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ ఖేల్‌రత్న అందుకోనున్నారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందమ్ శర్మ నేతృత్వంలోని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ సిఫారసు చేసిన క్రీడా పురస్కారాల జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇక 27 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. అయితే రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు అర్జున అవార్డు పురస్కరాలు ఇవ్వడానికి కమిటీ నిరాకరించింది. గతంలోనే వీరు ఖేల్‌రత్న అవార్డులు తీసుకోవడంతో దానికంటే తక్కువైన అర్జున అవార్డును ఇప్పుడు ఇవ్వడం సరైనది కాదని భావించిన సదరు కమిటీ పెదవి విరిచింది. కాగా, ఆంధ్రప్రదేశ్ మహిళా మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం... 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరు సార్లు సీనియర్ నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. Government announces #NationalSportsAwards 2020. Awardees will receive their awards from President Ram Nath Kovind at a specially organized function through virtual mode from Rashtrapati Bhawan on #NationalSportsDay (29th August). pic.twitter.com/m4GRaI15Ea — All India Radio News (@airnewsalerts) August 21, 2020 -
జాతీయ క్రీడా అవార్డుల ప్రక్రియ ఆలస్యం
న్యూఢిల్లీ: ప్రతి యేటా ఏప్రిల్‌లోనే మొదలయ్యే జాతీయ వార్షిక క్రీడా పురస్కారాల ప్రక్రియ ఈ సంవత్సరం ఆలస్యం కానుంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగనుండటమే దీనికి ప్రధాన కారణం. కేంద్ర క్రీడా శాఖ ప్రతి ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తులు ఆహ్వానించేది. ‘లాక్‌డౌన్‌తో జాతీయ క్రీడా సమాఖ్యలతోపాటు క్రీడా మంత్రిత్వ శాఖలోని పలు కార్యాలయాల్లో ఇంటినుంచే పని జరుగుతోంది. దాంతో క్రీడా పురస్కారాల ప్రక్రియలో జాప్యం అనివార్యం కానుంది. వచ్చే నెలలో అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే అవకాశముంది’ అని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. -
తళుక్కుమన్న క్రీడాకారులు..
-
అర్జున అవార్డు అందుకున్న సాయిప్రణీత్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. (చదవండి : సాయి ప్రణీత్‌కు ‘అర్జున’) భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందాడు. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
కోహ్లి అవార్డుల కార్యక్రమం వాయిదా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కోహ్లి తన అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఏటా అవార్డులు అందజేస్తారు. ఆర్పీ-ఎస్జీ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ అవార్డులను అందజేస్తారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ‘ఆర్పీ-ఎస్జీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. The RP-SG Indian Sports Honours has been postponed. At this heavy moment of loss that we all find ourselves in, we would like to cancel this event that was scheduled to take place tomorrow. — Virat Kohli (@imVkohli) 15 February 2019 -
ఖేల్ రత్న మీద విమర్శలెక్కుపెట్టిన పంకజ్ అద్వానీ
క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ముగిసి వారం రోజులు గడుస్తున్నా.. అవార్డుల ఎంపిక మీద విమర్శలు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వడంపై పలువురు క్రీడాకారులు విమర్శలు గుప్పించారు. దీనిపై కర్నాటక రాష్ట్రానికి చెందిన పారాలంపియన్ హెచ్ ఎన్ గిరీష ఏకంగా కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే.. తాజాగా.. ఇండియన్ స్టార్ స్నూకర్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్రీడా అవార్డుల ఎంపిక పై విమర్శనాస్త్రాలు సంధించాడు. ఎంపిక పారదర్శకంగా జరగటం లేదని.. ఎంపిక కమిటీ పారదర్శకంగా వ్యవహరించడం లేదని అన్నాడు. కేంద్ర క్రీడా శాఖ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన మార్గదర్శకాల్లో స్పష్టత లేమే దీనికి కారణమని అభిప్రాయపడ్డాడు. దీనికి సానియా మీర్జా ఉదంతాన్నే వివరించాడు. ఎంపిక కమిటీ ఏర్పాటు చేసిన పాయింట్ల ఆధారంగా.. పారాలంపియన్ గిరీష.. సానియా మీర్జా కంటే ఎంతో ముందు ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే పాయింట్ల వ్యవస్థ సరిగా లేక పోవడమే ఇందుకు కారణమని అన్నాడు. మరో వైపు గిరీష సైతం ఇదే అంశాన్ని సవాలు చేస్తూ ఖేల్ రత్న అవార్డుపై కోర్టు కెక్కాడు. అవార్డుల కమిటీ ఇచ్చిన మార్గ దర్శకాల్లో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ప్రపంచ కప్ లు, ఛాంపియన్ షిప్ లలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే అవార్డులు అందుకునే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని రెజ్లింగ్ కోచ్ వినోద్ కుమార్ పేర్కొన్నాడు. అయితే ఖేల్ రత్నకు వ్యతిరేకంగా పంకజ్ వ్యాఖ్యలు మీడియాలో ఒక్కరోజు కూడా గడవక ముందే పంకజ్ తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చాడు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా ఆటతీరును తక్కువ చేసిన చూడలేమని.. ఖేల్ రత్నకు ఆమె అర్హురాలేనని అన్నాడు. ఐయామ్ హ్యాపీ ఫర్ సానియా అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్వీట్ చేయడం విశేషం. తన విమర్శ కేవలం కేంద్ర క్రీడాశాఖ, అవార్డుల ఎంపిక కమిటీ పారదర్శకత మీదనే అని వివరణ ఇచ్చుకున్నాడు. అంతే కాదు పంకజ్ అవార్డుల కమిటీ లోపాలను చూపుతూ.. మహిళా స్నూకర్ క్రీడాకారిణి విద్యా పిళ్లై ఉదంతాన్ని వివరించాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కలేనన్ని మెడల్స్, ట్రోఫీలు గెలుచుకున్నా.. ఇప్పటి వరకూ ఆమెను అర్జున అవార్డుకు కూడా ఎంపిక చేయకపోవటం పట్ల అసంతృప్తిని వ్యక్తంచేశాడు. క్రీడాఅవార్డులు ప్రకటించిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి దుమారాలు చలరేగటం సాధారణమే అయినా.. ఖేల్ రత్న వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లు లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. -
సానియాకు ఖేల్ రత్న, శ్రీకాంత్ కు అర్జున
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడా అత్యున్నత పురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'ను ఆమె దక్కించుకుంది. బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కు అర్జున అవార్డు దక్కింది. 17 మందికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్జున అవార్డులు ప్రకటించింది. అర్జున అవార్డు పొందిన క్రీడాకారులు వీరే... కిదాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్) రోహిత్ శర్మ (క్రికెట్) పి.ఆర్. శ్రీజేష్ (హాకీ) దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్) జీతూ రాయ్ (షూటింగ్) సందీప్ కుమార్ (విలువిద్య) మన్దీప్ జంగ్రా (బాక్సింగ్) బబిత (రెజ్లింగ్) బజరంగ్ (రెజ్లింగ్) స్వర్ణ్ సింగ్ విర్క్ (రోయింగ్) సతీష్ శివలింగం (వెయిట్ లిఫ్టింగ్) యుమ్నమ్ సంతోయి దేవి (వుషు) శరత్ గైక్వాడ్ (పారా సైలింగ్) ఎంఆర్ పూర్వమ్మ (అథ్లెటిక్స్) మన్జీత్ చిల్లర్ (కబడ్డీ) అభిలాషా మాత్రే (కబడ్డీ) అనూప్ కుమార్ యామా (రోలర్ స్కేటింగ్) -
వివాదాల్లో క్రీడా అవార్డులు