న్యూఢిల్లీ: ప్రతి యేటా ఏప్రిల్‌లోనే మొదలయ్యే జాతీయ వార్షిక క్రీడా పురస్కారాల ప్రక్రియ ఈ సంవత్సరం ఆలస్యం కానుంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగనుండటమే దీనికి ప్రధాన కారణం. కేంద్ర క్రీడా శాఖ ప్రతి ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తులు ఆహ్వానించేది. ‘లాక్‌డౌన్‌తో జాతీయ క్రీడా సమాఖ్యలతోపాటు క్రీడా మంత్రిత్వ శాఖలోని పలు కార్యాలయాల్లో ఇంటినుంచే పని జరుగుతోంది. దాంతో క్రీడా పురస్కారాల ప్రక్రియలో జాప్యం అనివార్యం కానుంది. వచ్చే నెలలో అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే అవకాశముంది’ అని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment