![Jammu Kashmir Police Averted Terror Attack In Pulwama - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/14/pulwama.jpg.webp?itok=RuCh6aT0)
పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు వస్తువులు
న్యూఢిల్లీ : జమ్మూ,కశ్మీర్ పోలీసులు పుల్వామా తరహా ఉగ్రవాద దాడి కుట్రను భగ్నం చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకోవటంతోపాటు పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేస్తున్నారు. పుల్వామా దాడి జరిగి నేటికి రెండేళ్లు అవుతున్న సందర్బంగా అదే తరహా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని మూడు రోజులక్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూ,కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పుల్వామా జిల్లాలో సుహాలి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి ఆరున్నర కేజీల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌నుంచి వచ్చిన మెసేజ్‌తో పుల్వామాలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు విచారణ సందర్భంగా సుహాల్ తెలిపాడు. చంఢీఘడ్‌లో ఖాజీ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ( అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ)
అంతేకాకుండా సాంబ జిల్లాలో 15 చిన్నచిన్న ఐఈడీలు, ఆరు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను డ్రోన్‌నుంచి పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై జమ్మూ,కశ్మీర్ డీజీపీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు జైషే ఈ మహ్మద్, లష్కర్‌లు ‘ది రెసిస్టంట్ ఫ్రంట్, లష్కర్ ఈ ముస్తఫా’ అనే రెండు కొత్త గ్రూపులను తయారు చేశాయి. గతవారం లష్కర్ ఈ ముస్తఫా చీఫ్ హిదయతుల్లాను ఆరెస్ట్ చేశాం. ఇతడు న్యూఢిల్లీలోని ఎన్‌ఎస్‌ఏ అజిత్ ధోవల్ ఆఫీసుపై రెక్కీ నిర్వహించాడు’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment