![UN Security Council strongly condemns Kabul terror attack - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/28/coun.jpg.webp?itok=Sjz3wbeX)
ఐక్యరాజ్యసమితి: కాబూల్‌లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పదుల సంఖ్యలో సామాన్య పౌరులు, చిన్నారులు, సైనికులను బలిగొన్న ఈ దాడులను శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు చాలా కీలకమైందనీ, అఫ్గాన్ భూభాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు గానీ, దాడి చేసేందుకు గానీ ఉపయోగించరాదని మండలి ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. భారత్ అధ్యక్ష స్థానంలో ఉన్న భద్రతా మండలి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఐసిస్–కె పాల్పడినట్లుగా చెబుతున్న ఈ దాడిలో పౌరులు, చిన్నారులు, ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గర్హనీయం’ అని పేర్కొంది. పౌరుల తరలింపులో సాయ పడుతున్న ఆర్మీని, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment