పాక్‌ వస్తువులపై 200% పన్ను పెంపు | India Hikes Import Duty On Pakistani Goods To 200% | Sakshi
Sakshi News home page

పాక్‌ వస్తువులపై 200% పన్ను పెంపు

Published Sun, Feb 17 2019 3:53 AM | Last Updated on Sun, Feb 17 2019 5:31 AM

India Hikes Import Duty On Pakistani Goods To 200% - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన చర్యలను కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి.

తాజా చర్యతో భారత్‌లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ‘పుల్వామా దాడికి ఆ దేశమే కారణమని భావిస్తూ అత్యంత ప్రాధాన్యం గల దేశం (ఎంఎఫ్‌ఎన్‌) హోదాను ఉపసంహరించుకున్నాం. దీంతోపాటు పాక్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని ఆర్థిక మంత్రి జైట్లీ ట్విట్టర్‌లో ప్రకటించారు. పాక్‌ నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానమైన తాజా పండ్లపై ప్రస్తుతం 50% వరకు, సిమెంట్‌పై 7.5% కస్టమ్స్‌ డ్యూటీ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement