అమృత్‌సర్‌ దాడి ఉగ్రచర్యే | Amarinder Singh suspects ISI hand in Amritsar 'terror' attack | Sakshi
Sakshi News home page

అమృత్‌సర్‌ దాడి ఉగ్రచర్యే

Published Tue, Nov 20 2018 5:10 AM | Last Updated on Tue, Nov 20 2018 5:10 AM

Amarinder Singh suspects ISI hand in Amritsar 'terror' attack - Sakshi

స్వర్ణదేవాలయంవద్ద పోలీసుల పహారా

అమృత్‌సర్‌: అమృత్‌సర్‌లోని నిరంకారీ భవన్‌లో భక్తులపై దాడి ఉగ్రచర్యేనని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఆదివారం దాడికి గురయిన ఆద్లివాల్‌లోని నిరంకారీ భవన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ ఘటనలో లభ్యమైన ఆధారాల సాయంతో బాధ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. దాడికి కారకులైన వారిపై సమాచారం అందించిన వారికి రూ.50లక్షల పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. ‘నిరంకారీ భవన్‌పై దాడి వెనుక పాకిస్తాన్‌ ప్రోద్బలం ఉంది.

ఈ దాడిలో వాడిన గ్రెనేడ్‌ పాక్‌ ఆర్మీ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారైన గ్రెనేడ్‌ మాదిరిగానే ఉంది’ అని అమరీందర్‌ అన్నారు. ‘ఇలాంటి హెచ్‌జీ–84 రకం గ్రెనేడ్‌ ఒక దానిని గత నెలలో ఉగ్ర స్థావరాలపై దాడిలో రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్నిబట్టి ఈ ఘటన ఐఎస్‌ఐ ప్రోద్బలంతో ఖలిస్తాన్‌ లేదా వేర్పాటువాదుల పనేనని భావిస్తున్నాం.’ అని చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement