![We Not Responsible For Amritsar Train Accident Says Indian Railway - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/20/railway.jpg.webp?itok=q3z-tmVB)
సాక్షి, న్యూఢిల్లీ : అమృత్‌సర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తమ తప్పేమిలేదని రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే ట్రాక్ పక్కన వందలాది మంది గుమ్మికూడి ఉంటారని తమకు ముందస్తుగా సమాచారం లేదని రైల్వే అధికారుల తెలిపారు. తమను సమాచారం లేకపోవడంతోనే రైల్ వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని రైల్వే డివిజన్ మేనేజర్ వివేక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని.. దీనిలో తమ తప్పేమి లేదని తెలిపారు. ప్రమాదంపై రైలు డ్రైవర్ మాట్లాడుతూ.. ట్రాక్ సమీపంలో వందల మంది గుమ్మిగూడి ఉన్నారని తనకు తెలిదని.. గ్రీన్ సిగ్నల్ ఉన్నందునే టైన్ వేగంగా వెళ్లిందని అన్నారు. దసరా వేడుకలు సందర్భంగా అమతృసర్ సమీపంలో శుక్రవారం జరిగిన దుర్ఘటనలో 61 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నిలుచుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిపై హవ్‌డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. కాగా ట్రాక్ పక్కన రావణ దహన కార్యక్రమాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంతో ఇప్పటి వరకు ఎవ్వరిపై కూడా కేసు నమోదు కాలేదు. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతులకు సంతాపం తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని సీఎంతో పాటు, కేంద్ర రైల్వే సహాయక మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. కాగా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో దసర ఉత్సవాలు జరగుతున్నాయని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక అధికారులపై రైల్వే శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పండగ రోజునే ప్రమాదం జరగడంతో దేశ వ్యాప్తంగా విషాదం నిండుకుంది.
Comments
Please login to add a commentAdd a comment