అమృత్‌సర్(పంజాబ్): అమృత్‌సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్ అధికారి సురీందర్ సింగ్ తెలిపారు.
ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించిన సీఎం.. గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment