చత్తీస్‌గఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య తరచుగా ఏదో ఒక వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఒక పోస్టర్ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్దూ గత కొన్ని రోజులుగా అమృత్ సర్ నుంచి పాటియాలకు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయసాగారు. కాగా, కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు పాటియాలా కంచుకోటలాగా భావిస్తారు. ఇప్పుడిదే వీరిద్దరి మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
ఈ క్రమంలో నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్‌సర్‌లో పలుచోట్ల పోస్టర్లు.. దానిపై సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని కూడా ప్రకటించారు. అదే విధంగా, షాహిద్ బాబా దీప్ సింగ్ సేవా సోసైటీ అనే ఒక ఎన్జీవో సంస్థ (గుమ్షుడా డి తలాష్) తప్పిపోయిన ఎమ్మెల్యేను వెతకండి అని పోస్టర్లను విడుదల చేసింది. అదే విధంగా, పాటియాలలో కూడా కొన్ని పోస్టర్లు వెలిశాయి. దీంతో వీరిద్దరి రచ్చ కాస్త కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది.
ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని పలు నివేదికలు కాంగ్రెస్‌కు చేరాయి. దీని వెనుక సిద్ధూ హస్తం ఉందని భావిస్తారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్‌ను నియమించింది. ఈ కమిటీకి మల్లి ఖార్జున్ ఖర్గేను నాయకత్వం వహించనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హరిష్ రావత్, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
చదవండి: ఇక్కడ నుంచి కదలరు.. ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్ వచ్చినా..
Comments
Please login to add a commentAdd a comment