మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజకీయ అరంగేట్రంపై సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో మాజీ క్రికెటర్లు చేరడం కొత్తేమి కాదు. వచ్చే ఏడాది పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఈ మాజీ క్రికెటర్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వినిపించగా, అవన్నీ పుకార్లేనని బజ్జీ తన ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాశారు. అయితే తాజాగా… పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
ఆ ఫోటోకి క్యాప్షన్‌గా… ”ఇలా జరిగే అవకాశం ఉంది” అని పెట్టేశారు. దీంతో బజ్జీ రాజకీయ అరంగేట్రం విషయంలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే క్రికెటర్ కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ లేదా హర్భజన్ సింగ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాకపోతే త్వరలో ఎన్నికల నేపథ్యం, డిసెంబరు 11న బీజేపీలో చేరడాన్ని తిరస్కరించిన కొద్ది రోజులకే, సిద్ధూతో హర్భజన్ సమావేశం లాంటి పరిణామాలు చూస్తుంటే బజ్జీ రాజకీయ ప్రవేశం ఖయంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ బజ్జీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందనే చెప్పాలి.
Picture loaded with possibilities …. With Bhajji the shining star pic.twitter.com/5TWhPzFpNl
— Navjot Singh Sidhu (@sherryontopp) December 15, 2021
చదవండి: బొమ్మై సర్కార్‌కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే.. అసెంబ్లీలోనే తీవ్ర విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment