ఆ వదంతులను తోసిపుచ్చిన క్రికెటర్‌ | Indian cricketer gives clarity | Sakshi
Sakshi News home page

ఆ వదంతులను తోసిపుచ్చిన క్రికెటర్‌

Dec 22 2016 3:01 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఆ వదంతులను తోసిపుచ్చిన క్రికెటర్‌ - Sakshi

ఆ వదంతులను తోసిపుచ్చిన క్రికెటర్‌

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత క్రికెటర్‌, ప్రముఖ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు కథనాలు వచ్చాయి.

కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదని వివరణ

న్యూఢిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత క్రికెటర్‌, ప్రముఖ ఆఫ్‌ స్పిన్నర్‌  హర్భజన్‌సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను హర్భజన్‌ సింగ్‌ తోసిపుచ్చారు. సమీప భవిష్యత్తులో తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘త్వరలో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. వదంతులు వ్యాప్తి చేయడాన్ని దయచేసి మానుకోండి’  అని హర్భజన్‌ ట్విట్టర్‌లో కోరారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరంలో జరగనున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ బీజేపీని వీడి త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బాటలోనే భజ్జీ కూడా కాంగ్రెస్‌లో చేరుతారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement