వినేశ్‌ ఫోగట్‌ అనర్హత: ‘కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు సెలవుల మీద వెళ్లారా?’ | punjab cm slams on coaches and physiotherapists over vinesh phogat disqualification | Sakshi
Sakshi News home page

వినేశ్‌ ఫోగట్‌ అనర్హత: కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు సెలవుల మీద వెళ్లారా?: పంజాబ్‌ సీఎం

Published Wed, Aug 7 2024 5:59 PM | Last Updated on Wed, Aug 7 2024 6:30 PM

punjab cm slams on coaches and physiotherapists over vinesh phogat disqualification

చంఢీఘఢ్‌: ప్యారిస్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. అనర్హత వేటుపై అభిమానులు, రాజకీయ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చూస్తూ.. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సింగ్‌ వినేశ్‌ ఫోగట్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చర్కీ దాద్రిలోని రెజ్లర్‌ ఇంటికి వెళ్లిన సీఎం మాన్‌.. అక్కడ వినేశ్‌ ఫోగట్‌ మామ మహావీర్‌ ఫోగట్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘రెజ్లర్‌ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల పని. ఇప్ప​డు ఆమెపై అనర్హత వేటుపడింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ సమస్యను కేంద్రం పరిష్కరించదా? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అభ్యంతరం తెలపలేదు. ఇంత పెద్ద స్థాయి ఈవెంట్‌లో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. వారంతా అక్కడికి సెలవుల కోసం వెళ్లారా? ’అంటూ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా మాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ప్రధాని మోదీ ఒక్క ట్వీట్‌ కూడా పెట్టలేదు. కానీ, ఆమెపై అనర్హత వేటు పడిన వెంటనే ‘ఎక్స్‌’లో ట్వీట్‌ పెట్టారు’విమర్శలు చేశారు.

 

మరోవైపు.. వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం చేయాలని ప్రతిపక్ష ఇండియా కూటమి  ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం పార్లమెంట్ ముందు ధర్నా చేశారు. ‘వినేశ్‌కు న్యాయం చేయాలి’అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కేవలం ట్వీట్‌ చేయటం సరికాదు.. ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్రీడలు, క్రీడాకారులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement