ప్యారిస్‌లో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌ తిరస్కరించా: వినేశ్‌ ఫోగట్‌ | Vinesh Phogat claims refused PM Modi call after Olympics setback | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌లో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌ తిరస్కరించా: వినేశ్‌ ఫోగట్‌

Published Wed, Oct 2 2024 4:35 PM | Last Updated on Wed, Oct 2 2024 5:49 PM

Vinesh Phogat claims refused PM Modi call after Olympics setback

ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్యారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఫైనల్‌ పోటీలో అనర్హతకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్‌ కాల్‌ వస్తే మాట్లాడటానికి నిరాకరించానని తెలిపారు. ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.

‘‘ప్యారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో నాపై అనర్హత వేటుపడిన సమయంలో నాకు ప్రధానిమోదీ నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. కానీ నేను మాట్లాడటానికి నిరాకరించా. కాల్ నేరుగా నాకు రాలేదు. అక్కడ ఉన్న భారత అధికారులు పీఎం మోదీ నాతో మాట్లాడాలనుకుంటున్నారని తెలియజేశారు. అయితే నేను సిద్ధంగానే ఉన్నా. అధికారులు కొన్ని షరతులు పెట్టారు. నా బృందం నుంచి ఎవరూ మాట్లాడవద్దని తెలిపారు. ప్రధాని మోదీ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారు.

నా భావోద్వేగాలు, కృషిని సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకోవటాన్ని నేను  ఇష్టపడలేదు. సంభాషణను ప్రచారం చేసే షరతు లేకుండా ప్రధాని నుంచి నిజమైన కాల్‌ వస్తే.. తాను ప్పకుండా అభినందించేదానిని. ఆయన నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే.. రికార్డ్ చేయకుండా కాల్ చేసి ఉండేవారు. అప్పుడు నేను ఆయనకు కృతజ్ఞుతగా ఉండేదాన్ని. కానీ పీఏం మోదీ కార్యాలయం షరతులు విధించింది.

నాతో మాట్లాడితే గత రెండేళ్ళ గురించి అడుగుతానని పీఎం మోదీకి తెలిసి ఉండవచ్చు. బహుశా అందుకే నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బృందం ఉండకూడదని అధికారులు సూచించారు.  ఇలా అయితే.. వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్‌ చేయడానికి అవకాశం ఉండదు. మాములుగా  మాట్లాడితే.. నేను ఒరిజినల్‌ కాల్‌ను బయటపెడతానని వారికి తెలుసు’’ అని అన్నారు.

100 గ్రాముల అధికా బరువుకారణంగా ఆమె ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం చేజార్చుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె భారత్‌కు తిరిగి వచ్చి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  హర్యానా  అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌.. ఆమెను జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దించిన విషయం తెలిసిందే.

చదవండి:  కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో పోలీసుల సోదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement