చంఢీగర్: ఇండియా కూటమికి డబుల్ షాక్ తగిలింది. పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని సీఎం మమతా బెనర్జీ చెప్పిన కొన్ని గంటల తర్వాత భగవంత్ మాన్ కూడా పొత్తుపై స్పష్టతనిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ వర్గం చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఒంటరిగానే పోటీ.. ఇండియా కూటమికి సీఎం మమత షాక్
ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె.
ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్‌లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు.
ఇదీ చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment