Navajot singh sidhu
-
కాంగ్రెస్ కు శత్రువు కాంగ్రెసే: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
-
కాంగ్రెస్ పార్టీలో చేరనున్న భారత మాజీ క్రికెటర్?
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజకీయ అరంగేట్రంపై సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో మాజీ క్రికెటర్లు చేరడం కొత్తేమి కాదు. వచ్చే ఏడాది పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఈ మాజీ క్రికెటర్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వినిపించగా, అవన్నీ పుకార్లేనని బజ్జీ తన ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాశారు. అయితే తాజాగా… పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోకి క్యాప్షన్‌గా… ”ఇలా జరిగే అవకాశం ఉంది” అని పెట్టేశారు. దీంతో బజ్జీ రాజకీయ అరంగేట్రం విషయంలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే క్రికెటర్ కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ లేదా హర్భజన్ సింగ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాకపోతే త్వరలో ఎన్నికల నేపథ్యం, డిసెంబరు 11న బీజేపీలో చేరడాన్ని తిరస్కరించిన కొద్ది రోజులకే, సిద్ధూతో హర్భజన్ సమావేశం లాంటి పరిణామాలు చూస్తుంటే బజ్జీ రాజకీయ ప్రవేశం ఖయంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ బజ్జీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందనే చెప్పాలి. Picture loaded with possibilities …. With Bhajji the shining star pic.twitter.com/5TWhPzFpNl — Navjot Singh Sidhu (@sherryontopp) December 15, 2021 చదవండి: బొమ్మై సర్కార్‌కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే.. అసెంబ్లీలోనే తీవ్ర విమర్శలు -
'సిద్దూ.. నీ పిల్లల్ని బార్డర్‌కు పంపి అప్పుడు ఇమ్రాన్‌ను ఎలాగైనా పిలుచుకో'
Gautam Gambhir slams Navjot Singh Sidhu: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ.. ‘పెద్దన్న’గా సంభోదించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సిద్దూ వాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ వివాదంపై స్పందించిన.. భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. సిద్దూపై తీవ్ర విమర్శలు చేశాడు. నీ కూతురు, కుమారుడిని సరిహద్దులకు పంపు.. ఆతరువాత మాట్లాడు అని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీ కుమారుడు లేదా కూతుర్ని సరిహద్దులకు పంపిన తర్వాతే తీవ్రవాద దేశాధినేతను పెద్దన్నగా పిలుచుకో.. అంటూ ట్విట్టర్ వేదికగా గంభీర్ మండిపడ్డాడు. అతడి పిల్లలు సైన్యంలో ఉండి ఉంటే, సిద్దూ ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్‌ను తన పెద్ద అన్న అని పిలిచేవాడా అని గంభీర్ ప్రశ్నించాడు. గత నెలలో కాశ్మీర్లో 40 మంది పౌరులు, సైనికులను చంపడంపై సిద్ధూ మాట్లాడలేదని.. ఇప్పుడు భారతీయ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గౌతీ పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే శనివారం పాక్ లోని కర్తార్‌పూర్ సాహిబ్ ను దర్శించుకున్న సిద్ధూ.. అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చొరవ వల్లే కర్తార్‌పూర్ కారిడార్ పునఃప్రారంభంమైంది అని సిద్ధూ తెలిపాడు. ఈ క్రమంలో పాక్ ప్రధాని గురించి మాట్లాడూతూ.. 'ఇమ్రాన్ ఖాన్ నాకు పెద్దన్న వంటి వారు. అతడు నాకు చాలా ప్రేమను ఇచ్చాడు. దీనిని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను..’ అని వ్యాఖ్యానించాడు. చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వచ్చే ఐపీఎల్ ఎక్కడంటే.. Send ur son or daughter to the border & then call a terrorist state head ur big brother! #Disgusting #Spineless — Gautam Gambhir (@GautamGambhir) November 20, 2021 -
పంజాబ్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పంజాబ్ క్యాబినెట్ మంత్రి రజియా సుల్తానా సిద్ధూబాటలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు మంత్రి మాలేర్ కోట్లా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, నవజ్యోతి సింగ్ విలువలు ఉన్న నాయకుడని ఆమె కొనియాడారు. పంజాబ్ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నేతగా సిద్ధూను రజియా సుల్తానా అభివర్ణించారు.. ఆయన బాటలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తానని తెలిపారు.. రజాయా సుల్తానాతో పాటు... పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ యోగిందర్ ధింగ్రా.. అదే విధంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ క్యాషియర్ గుల్జార్ ఇండర్ ఛహల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుస రాజీనామాలతో పంజాబ్‌లో కాంగ్రెస్ తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కాగా, గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్‌ల మధ్య పలు అంశాలలో బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా సార్లు ప్రయత్నించింది. ఈ క్రమంలో.. సిద్ధూకి కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ పదవి అప్పగించింది. కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ ఆ తర్వాత కూడా సిద్ధూ ఆరోపణలు చేస్తుండటంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని పంజాబ్ సీఎంగా ఎన్నుకున్నారు. అయితే, సిద్ధూ.. చరణ్ జిత్‌సింగ్ ఛన్నీ ఎన్నిక పట్ల అంతగా సానుకూలంగా లేరు. తాజాగా, ఛన్నీ చేసిన క్యాబినెట్ మార్పుల పట్ల కూడా తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు (మంగళవారం) సిద్ధూ కాంగ్రెస్ పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఆ పార్టీని వీడటం ఆ పార్టీని కలవర పరుస్తోంది. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు -
పంజాబ్‌లో మరోసారి రాజుకున్న పోస్టర్ వివాదం..
చత్తీస్‌గఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య తరచుగా ఏదో ఒక వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఒక పోస్టర్ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్దూ గత కొన్ని రోజులుగా అమృత్ సర్ నుంచి పాటియాలకు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయసాగారు. కాగా, కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు పాటియాలా కంచుకోటలాగా భావిస్తారు. ఇప్పుడిదే వీరిద్దరి మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్‌సర్‌లో పలుచోట్ల పోస్టర్లు.. దానిపై సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని కూడా ప్రకటించారు. అదే విధంగా, షాహిద్ బాబా దీప్ సింగ్ సేవా సోసైటీ అనే ఒక ఎన్జీవో సంస్థ (గుమ్షుడా డి తలాష్) తప్పిపోయిన ఎమ్మెల్యేను వెతకండి అని పోస్టర్లను విడుదల చేసింది. అదే విధంగా, పాటియాలలో కూడా కొన్ని పోస్టర్లు వెలిశాయి. దీంతో వీరిద్దరి రచ్చ కాస్త కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని పలు నివేదికలు కాంగ్రెస్‌కు చేరాయి. దీని వెనుక సిద్ధూ హస్తం ఉందని భావిస్తారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్‌ను నియమించింది. ఈ కమిటీకి మల్లి ఖార్జున్ ఖర్గేను నాయకత్వం వహించనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హరిష్ రావత్, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. చదవండి: ఇక్కడ నుంచి కదలరు.. ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్ వచ్చినా.. -
Blackday: దేశ జెండా మోసి అలసిపోయాం
సాక్షి, న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తైంది. కేంద్ర ప్రభుత్వం కిందటి ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నవంబర్ 26 తేదీ నుంచి రైతు సంఘాలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ బ్లాక్ డే నిర్వహించాలని సంఘాలు నిర్ణయించుకున్నాయి కూడా. దీంతో దేశ రాజధానికి నలువైపులా భారీగా పోలీసులు మోహరించారు. మొద్దు ప్రభుత్వం బ్లాక్‌డే సందర్భంగా రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఉద్యమం చేయబట్టి ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలలు దేశ జెండాను మోశాం. మా గళం వినిపించాం. కానీ, ఎవరూ స్పందించలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం మొద్దుగా వ్యవహరిస్తోంది’’ అని టికాయత్ మండిపడ్డాడు. నిరసనల సందర్భంగా ఎక్కడా గుంపులుగా చేరబోమని, బహిరంగ సమావేశాలు అసలే నిర్వహించమని ఆయన స్పష్టం చేశాడు. అయితే రైతులు మాత్రం ఎక్కడికక్కడే నల్ల జెండాల్ని ఎగరేసి నిరసన తెలపాలని టికాయత్ ఒక ప్రకటనలో పిలుపు ఇచ్చాడు. ఊరుకునేది లేదు రైతుల బ్లాక్ డే నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఢిల్లీలో కరోనా విజృంభణ, లాక్డౌన్ అమలులో ఉన్నందున ఎవరైనా గుంపులుగా మీటింగ్‌లు పెట్టినా, అక్రమంగా చెక్పాయింట్ల నుండి చొరబడేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. శాంతియుతంగా.. మరోవైపు నేడు బుధ పూర్ణిమ కావడంతో శాంతియుతంగా బ్లాక్‌డే నిర్వహించాలని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు ఇచ్చింది. సమాజంలో సత్యం, అహింస జాడ కరవైందని.. వాటిని పునరుద్ధరించేలా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే ఎక్కడికక్కడ శాంతియుతంగా బ్లాక్‌డే నిరసన తెలపాలని రైతులను కోరింది. ఈ నేపథ్యంలో ఇళ్లపైనే నల్లజెండాలు ఎగరేస్తూ రైతులు నిరసన తెలియజేస్తున్నారు. మద్ధతుగా ప్రతిపక్షాలు.. మే 26న బ్లాక్ డే నిర్వహించాలని వారం క్రితమే ఎస్కేఎం నిర్ణయించింది. ఈ నిరసనలకు తమ మద్ధతు ఉంటుందని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈమేరకు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక బ్లాక్‌డేకు మద్దతుగా కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలాలో, ఆయన కూతురు రబియా అమృత్‌సర్‌లో ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సర్కార్లకు నోటీసులు మరోవైపు, కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుండడంపై ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. -
'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి'
అమృత్సర్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. తాజగా తాను కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను సిద్దూ ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దమ్ముంటే అది నిరూపించాలని సీఎం అమరీందర్‌కు సవాల్ విసిరారు. దీంతో పంజాబ్ రాజకీయాల్లో వీరిద్దరి మధ్య రగులుతున్న వివాదం మరోసారి ఆసక్తికరంగా మారింది. సిద్దూ కాంగ్రెస్‌లో ఉంటూ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఆయన ఆప్‌లో చేరుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై సిద్దూ ట్విటర్ వేదికగా ధీటుగా బదులిచ్చారు. ''నేను ఇతర పార్టీ నేతలతో భేటీ అయినట్లు నిరూపిస్తారా? ఈరోజు వరకూ నేనెవర్నీ నాకు ఒక పోస్ట్ కావాలని అడగలేదు. ఇప్పటికే నన్ను చాలా మంది ఆహ్వానించి.. కేబినెట్ బెర్త్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా నేను పార్టీకి ద్రోహం తలపెట్టకూడదని వాటిని తిరస్కరించా. నేను కోరుకునేది కేవలం పంజాబ్ ప్రజల శ్రేయస్సు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిందే. అప్పటి వరకూ వేచి చూడండి'' అంటూ ట్వీట్ చేశారు. కాగా సిద్దూ తనకు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ ట్విటర్లో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సిద్ధూ కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. చదవండి: చర్చలకు సిద్ధం: ప్రధానికి రైతు సంఘాల లేఖ Prove one meeting that I have had with another Party’s leader ?! I have never asked anyone for any post till date. All I seek is Punjab’s prosperity !! Was invited & offered Cabinet berths many times but I did not accept Now, Our Esteemed High Command has intervened, Will wait... pic.twitter.com/bUksnEKMxk — Navjot Singh Sidhu (@sherryontopp) May 22, 2021 -
‘మీరు సారీ చెప్తారా.. దేవుడి లీల’
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. తర్వాత ఒకరికొకరు క్షమాపణలు కొరతారు. కొన్ని సార్లు ఎవరు తప్పు చేస్తే వారే ముందుగా సారీ చెప్తారు. వివాహ బంధంలో ఇవన్నీ సహజం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. అయితే తమ మధ్య గొడవలు వస్తే ముందుగా తానే సారీ చెప్తాను అంటున్నారు అందాల నటి ఐశ్యర్య రాయ్. అభిషేక్‌తో గొడవపడితే తానే ముందుగా క్షమాపణలు కోరతానని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఇది పాత వీడియో. దీనిలో కపిల్ శర్మ, ఐశ్యర్య రాయ్, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. ఇక వీడియో విషయానికి వస్తే కపిల్ శర్మ, ఐశ్వర్యని ఉద్దేశించి.. ‘అభిషేక్‌తో గొడవపడితే.. ముందుగా ఎవరు క్షమాపణలు కోరతారు’ అని ప్రశ్నిస్తాడు. వీరి సంభాషణ పూర్తి కాకముందే నవజోత్ మధ్యలో కల్పించుకుని.. ‘అసలు ఇలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. అభిషేకే ముందుగా సారి చెప్తాడు’ అంటారు. (చదవండి: అందం, అణకువల కలబోత) View this post on Instagram A post shared by @aishwariarai_georgia on Oct 20, 2020 at 12:32am PDT దాంతో ఐశ్యర్య ‘అలా ఏం కాదు. తనతో గొడవపడితే ముందుగా నేనే సారీ చెప్తాను. గొడవను కొనసాగించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేనే క్షమాపణ చెప్తాను’ అని తెలిపారు. ఈ సమాధానం విని కపిల్ శర్మ ఒక్క నిమిషం స్టన్ అవుతాడు. ‘మీరు సారీ చెప్తారా.. ఇంత అందమైన భార్య క్షమాపణలు కోరడం అంటే నిజంగా దేవుడి లీలే’ అంటాడు. దాంతో ఐశ్వర్యతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు. అభిషేక్, ఐశ్వర్యల వివాహం 2007లో జరిగింది. వీరికి ఓ కుమార్తె ఆద్యా ఉన్నారు. ఇక తాజాగా ఐశ్యర్య పుట్టిన రోజు సందర్భంగా అభిషేక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరిద్దరు గులాబ్‌జామూన్ అనే చిత్రంలో నటించనున్నారు. -
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్న సిద్దూ!
ఢిల్లీ : పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఆయన పార్టీని వీడతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజాగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్.. సిద్దూ రావాలనుకుంటే తమ పార్టీ ఆయనకు స్వాగతం పలుకుతుంది అనడంతో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టయింది. గురువారం జరిగిన ఓ సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ తరపున సిద్దూతో ఎవరైనా చర్చలు జరుపుతున్నారా అని ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. 2017లో బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన సిద్దూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ తర్వాత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో వచ్చిన విబేధాల కారణంగా పార్టీ సమావేశాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఏడాది క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయనను ఆహ్వానించింది. అయితే కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా అప్పుడు చేరలేదు. ఈ ఏడాది మార్చిలో ఆమ్ ఆద్మీ పంజాబ్ ఛీప్ భగవంత్ మన్ కూడా సిద్దూని తమ పార్టీలోకి ఆహ్వానించారు. (గుజరాత్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ) అప్పటి ఎన్నికల్లో సిద్దూ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పార్టీ మారే విషయంలోనూ కీలకంగా మారినట్టు కనబడుతోంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఐడి), బీజేపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 117 స్థానాల్లో 77 సీట్లు గెలిచి అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. (కరోనా చికిత్సకు తాజా మార్గదర్శకాలు) -
‘సిద్ధు.. ఎప్పుడు తప్పుకుంటావ్’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓడి పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు.. పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుని తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటావ్’ అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమేథీలో స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను సిద్ధు ఖండించారు. ‘అమేథీ కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోవడం అనే మాట కల. ఒకవేళ అదే జరిగితే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాన’ని సిద్ధు బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న వెల్లడించిన ఫలితాల్లో స్మృతి ఇరానీ.. 28 వేల మెజారిటీతో రాహుల్ గాంధీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు ‘సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటావ్’.. ‘రాజీనామ లెటర్ టైప్ చేయడం ప్రారంభించావా’.. ‘రాహుల్ ఓడిపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావ్.. ఇక బ్యాగ్ సర్దుకో.. ప్రపంచ కప్ వచ్చేస్తుందిగా.. నువ్వు బాగా మాట్లాడతావ్’.. ‘నువ్వు మాటల మనిషివని నాకు తెలుసు.. ఇక వెళ్లిపో’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. -
ఓటేసిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్
-
‘నా భార్య ఎప్పటికీ అబద్ధం చెప్పదు’
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తనకు అమృత్సర్ లోక్‌సభ నియోజకవర్గ టికెట్ రాకుండా అడ్డుపడ్డారని.. కాంగ్రెస్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నవజోత్ సింగ్ సిద్ధు తన భార్యకు మద్దతుగా నిలిచారు. సీఎం తన భార్యకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడటమే కాక, అమృత్ సర్ నుంచి పోటీ చేసేందుకు ఆమె నిరాకరించిందని చెప్పడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ.. ‘నా భార్య కౌర్ ధైర్యవంతురాలు.. నైతిక విలువలున్న మనిషి. తను ఎన్నడూ అబద్ధాలు చెప్పదు’ అని వ్యాఖ్యానించారు. గత ఏడాది దసరా పండుగ నాడు జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అమృత్సర్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని భావించిన అమరీందర్ సింగ్ తనకు అమృత్సర్ ఎంపీ టికెట్ ఇవ్వలేదని నవజోత్ కౌర్ ఆరోపించారు. అంతేకాక సీఎం మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. అమరీందర్ సింగ్ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. కానీ చదువుకుని.. ప్రజలకు సేవ చేయాలని భావించే తనలాంటి వారికి టికెట్లు ఇవ్వకుండా అబద్ధాలు చెప్తారని నవజోత్ కౌర్ విమర్శించారు. ఈ విమర్శలపై సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. టికెట్ల కేటాయింపు విషయం తన చేతిలో ఉండదని.. ఢిల్లీ హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక నవజోత్ కౌర్ చండీగఢ్ నుంచి పోటీ చేయాలని భావించారని.. అది పంజాబ్ కిందకు రాదని ఆయన తెలిపారు. అమృత్ సర్ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు కౌర్ సంసిద్ధత వ్యక్తం చేయగా.. అక్కడ సిట్టింగ్ అభ్యర్థి గుర్జిత్ సింగ్‌కు టిక్కెట్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఆయనో ఫిరంగి.. నేనో ఏకే 47’
సిమ్లా : రాఫెల్ రగడ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని అంత తేలిగ్గాం వదలడం లేదు. ఈ క్రమంలో పంజాబ్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి రఫెల్ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్ధు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 ఎన్నికల నాటికి గంగా పుత్రుడుగా ఉన్న నరేంద్ర మోదీ 2019 నాటికి రాఫెల్ ఏజెంట్‌గా మారిపోయారని ఆరోపించారు. అంతేకాక రాఫెల్ డీల్ విషయంలో ‘నరేంద్ర మోదీ బ్రోకరేజ్ తీసుకున్నారా లేదా అనే అంశాన్ని వదిలేస్తాను. అయితే ఈ విషయం గురించి దేశంలో ఎక్కడైనా సరే నాతో బహిరంగ చర్చకు మోదీ సిద్ధమా’ అని సిద్ధు ప్రశ్నించారు. అంతేకాక రాహుల్ గాంధీ ఓ ఫిరంగి అని తాను ఏకే 47 గన్ను లాంటి వాడినని పేర్కొన్నారు సిద్ధు. నరేంద్ర మోదీ చెప్పే ‘తినను.. తిననివ్వను’(అవినీతి గురించి) వ్యాఖ్యలపై ఎక్కడైనా ఎప్పుడైనా తాను చర్చకు సిద్ధమే అంటూ చాలెంజ్ చేశారు సిద్ధు. ఒక వేళ ఈ సవాలులో తాను ఓడిపోతే.. ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు సిద్ధు. -
‘ఒక్క సిక్స్‌తో మోదీని బౌండరీ దాటించాలి’
చండీగఢ్ : పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని కతిహార్‌లో మంగళవారం ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లింలంతా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ముస్లింలంతా ఒక్కటై కాంగ్రెస్ అభ్యర్ధి తారిఖ్ అన్వర్‌ను గెలిపించుకోవాలని పిలుపు ఇచ్చారు. ముస్లిం సోదరులు ప్రస్తుతం జరుగుతున్న కుట్రను అర్ధం చేసుకోవాలని, జనాభాలో 54 శాతం ఉన్న మీరు పంజాబ్‌లో పనులు చేసుకునేందుకు అక్కడికి వెళుతుంటారని, మీకు పంజాబ్‌లో ఎలాంటి సమస్యలున్నా మీకు సిద్ధూ అండగా ఉంటాడని చెప్పుకొచ్చారు. ఓవైసీ వంటి అభ్యర్ధులను పోటీకి నిలపడం ద్వారా ముస్లిం ఓట్లలో చీలిక ద్వారా గెలిచేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రను గమనించాలని కోరారు. ఎన్నికల్లో సిక్స్‌ను బాది మోదీని బౌండరీ వెలుపలకు నెట్టివేయాలని మాజీ క్రికెటర్ సిద్ధూ పిలుపు ఇచ్చారు. మీరంతా ఏకమైతే మీ అభ్యర్ధి (తారిఖ్ అన్వర్) గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కాగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన మాయావతి, యోగి ఆదిత్యానాధ్ సహా పలువురు నేతలపై ఈసీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
స్టార్ క్యాంపెయినర్ సిద్ధూకు ఫుల్ గిరాకీ!
సాక్షి, న్యూడిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్‌గా మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. గత డిసెంబర్లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున సిద్ధూ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించి.. కాంగ్రెస్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో మంచి వాగ్ధాటి ఉన్న సిద్ధూతో తమ రాష్ట్రాల్లో ప్రచారానికి పంపాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సిద్ధూను ప్రచారంలో విస్తృతంగా వాడుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీకి మంచి ఛరిష్మా, ప్రజాదరణ ఉండటంతో ఆమెతో యూపీతోపాటు ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హిందీ రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్లోనూ ప్రచారం చేయాల్సిందిగా సిద్ధూను కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా, టీవీ యాంకర్‌గా ప్రసిద్ధుడైన సిద్ధూ మంచి వాగ్ధాటి గల నేత. పరిస్థితులకు తగ్గట్టూ ప్రత్యర్థులపై పంచ్ డైలాగులు విసురుతూ.. ఆయన జనాన్ని ఆకట్టుకోగలరు. తన ప్రసంగశైలితో, డైలాగులతో హాస్యాన్ని పంచగలరు. దీంతోపాటు ప్రజలకు చక్కగా హిందీ అర్థమయ్యేలా మాట్లాడటంలో దిట్ట. దీంతో హిందీ రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయాలోనూ ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టాలని భావిస్తోంది. గత డిసెంబర్లో జరిగిన మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై సిద్ధూ సంధించిన వ్యంగ్యాస్త్రాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌ను కూడా పలు హిందీ రాష్ట్రాల్లో ప్రచారం చేయవల్సిందిగా కాంగ్రెస్ కోరుతోంది. యువ నాయకులైన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాధిత్యా సింధియాలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారబరిలోకి కాంగ్రెస్ దింపనుంది. పైలట్ రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సింధియా తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ ప్రచారం చేయనున్నారు. ఇక, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కొన్ని లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసే అవకాశముంది. -
సత్సంబంధాలనే కోరుకుంటున్నాం
కర్తార్‌పూర్: సిక్కు యాత్రికుల సౌలభ్యం కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో బుధవారం శంకుస్థాసన చేశారు. పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరుకుంటోందని చెప్పారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలనూ ఇరు దేశాల నాయకత్వాలు బలం, కృషితో పరిష్కరించుకోవచ్చన్నారు. ‘దేవుడు తమకు ఇచ్చిన అవకాశాలను భారత్, పాక్‌లు అర్థం చేసుకోవడం లేదు. నేను ఎప్పుడైనా భారత్‌కు వెళ్తే.. పాక్‌లోని రాజకీయ నేతలు భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నా పాక్ సైన్యం మాత్రం అలా జరగనివ్వదని నాకు చెబుతుంటారు. కానీ సైన్యంతో సహా మేమంతా భారత్‌తో సుహృద్భావాన్నే కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నా’ అని ఇమ్రాన్ అన్నారు. ఒకప్పుడు భీకర యుద్ధాలు చేసుకున్న ఫ్రాన్స్, జర్మనీలే ప్రస్తుతం శాంతియుత వాతావరణంలో సత్సంబంధాలను కలిగి ఉన్నాయనీ, భారత్–పాక్ మధ్య కూడా శాంతి, మంచి సంబంధాలు సాధ్యమేన న్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారను, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారను కలుపుతూ నాలుగు కిలో మీటర్ల రహదారిని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్, పాక్‌లు కలిసి నిర్మిస్తుండటం తెలిసిందే. ఇందుకోసం భారత్‌లో సోమవారమే శంకుస్థాపన జరగ్గా, పాక్ ఆ పనిని బుధవారం ప్రారంభించింది. శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్ బాదల్, హర్దీప్సింగ్ పురీ హాజరయ్యారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వద్దని సూచించినా వినకుండా ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం తెలిసిందే. ‘వీసా’పై నిర్ణయం తీసుకోవాలి: సుష్మ కర్తార్‌పూర్ కారిడార్‌లో ప్రయాణించే సిక్కు యత్రికులకు వీసా అవసరం ఉండదని వార్తలు వచ్చినప్పటికీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాటలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. యాత్రికులకు వీసా అవసరమో కాదో ఇంకా నిర్ణయించాల్సి ఉంద న్నారు. హైదరాబాద్‌లో సుష్మ మాట్లాడుతూ ఈ కారిడార్‌కు, పాక్‌తో చర్చలకు సంబంధం లేదని పేర్కొన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన సభలో ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తప్పుబట్టింది. దైవకార్యాన్ని ఇమ్రాన్ రాజకీయాలకు ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేసింది. కాగా, పలువురు ఖలిస్తాన్ విభజన వాద సిక్కులు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ ఖలిస్తాన్ నేత గోపాల్ దాస్.. పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాతో కరచాలనం కూడా చేశారు. అయితే గోపాల్ దాస్ పాకిస్తాన్‌లోని గురుద్వారల కమిటీలో సీనియర్ నేత అనీ, అన్ని సిక్కు మతపరమైన కార్యక్రమాలకూ ఆయనను ఆహ్వానిస్తారని ఓ అధికారి చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్యులందరితోనూ ఆర్మీ చీఫ్ కరచానలం చేశారనీ, భారత మీడియా ఈ అంశాన్ని భూతద్దంలో చూస్తోందన్నారు. సిద్ధూ పాక్‌లోనూ గెలవగలడు ఇరు దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్న సిద్ధూపై భారత్‌లో ఎందుకు విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్‌లో కూడా సిద్ధూ ఎంతో ప్రాచుర్యం పొందాడనీ, ఆ దేశంలోని పంజాబ్‌లో ఎన్నికల్లో నిలబడినా అతను గెలుస్తాడని ఖాన్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు సిద్ధూ భారత ప్రధాని అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిన అవసరం రాదనే తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కర్తార్‌పూర్ కారిడార్ కార్యరూపం దాల్చడానికి మీరే కారణమంటే మీరే కారణమంటూ ఇమ్రాన్ ఖాన్, సిద్ధూలు గతంలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా సిద్ధూ హాజరైనప్పుడు కర్తార్‌పూర్ కారిడార్ గురించి ఖాన్‌తో ఆయన మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. సీఎం సలహాను పెడచెవిన పెట్టి తన వ్యక్తిగత పర్యటన అంటూ పాక్‌కు వెళ్లిన సిద్ధూపై పంజాబ్‌లో ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్, బీజేపీ విమర్శలు గుప్పించాయి. ఇదీ కర్తార్‌పూర్ చరిత్ర 1522: సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తొలి గురుద్వారాను కర్తార్‌పూర్‌లో ఏర్పాటుచేశారు. మరణించేంత వరకు, 18 ఏళ్లపాటు ఆయన అక్కడే బోధనలు చేస్తూ కాలం గడిపారు. 1999: ప్రధాని వాజ్‌పేయి శాంతి ప్రయత్నాల్లో భాగం గా పాక్‌కు బస్సులో వెళ్లినప్పుడు ఈ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదించారు. 2000: భారత్ వైపు నుంచి ఓ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా భారత్‌లోని సిక్కులు వీసా, పాస్‌పోర్టు లేకుండానే కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించేలా అనుమతించేందుకు పాక్ అంగీకారం. 2018 ఆగస్టు: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరుస్తామని పాక్ ఆర్మీ చీఫ్ తనకు చెప్పినట్లు వెల్లడి. నవంబర్ 22: కర్తార్‌పూర్ కారిడార్‌లో భాగంగా డేరా బాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. నవంబర్ 26: భారత్‌వైపు కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శంకుస్థాపన. నవంబర్ 28: పాకిస్తాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్. -
‘సిద్ధును ఆపడం భావ్యం కాదనిపించింది’
ఇస్లామాబాద్ : సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్తాన్‌లోని నరోవాల్ జిల్లా శాఖర్‌గఢ్ వద్ద పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు(బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్‌లను పాక్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుష్మ, అమరీందర్ సింగ్‌లు ఆహ్వానాన్ని తిరస్కరించగా సిద్ధూ మాత్రం విలేకరులతో కలిసి మంగళవారమే పాక్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్- పాక్‌ల మధ్య శత్రుత్వాన్ని రూపుమాపేందుకు కర్తార్‌పూర్ కారిడార్ తోడ్పడుతుందని పేర్కొన్నారు. కాగా కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన కోసం సిద్ధు పాకిస్తాన్‌కు వెళ్లడంతో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై స్పందించిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... పాక్ పర్యటనను మానుకోవాల్సిందిగా సిద్ధూను కోరాననీ, అయితే అక్కడికి వెళ్లడానికే నిర్ణయించుకున్నట్లు సిద్ధూ తనకు చెప్పారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఆయన అలా వెళ్తున్నప్పుడు ఆపడం భావ్యం కాదేమోనని ఆగిపోయానన్నారు. ఇక భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ సాహిబ్‌ను, పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ ఇరు దేశాలూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మిస్తుంచనున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లోని డేరా బాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు మొత్తం 2 కిలో మీటర్ల దూరాన్ని భారత్ నిర్మించేందుకు సోమవారమే శంకుస్థాపన జరగ్గా, పాక్ వైపునా రెండు కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులను ఇమ్రాన్ ఖాన్ బుధవారం ప్రారంభించనున్నారు. -
‘నా స్థానంలో కోహ్లీ ఉంటే ఏం చేసేవాడు..?’
చండీఘఢ్ : ‘ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ వచ్చి కోహ్లి.. నేను నిన్ను హగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు విరాట్ కోహ్లి నాకిష్టం లేదని చెప్పగలరా’ అంటూ మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ ప్రశ్నించారు. ఆసియా కప్‌లో భాగంగా నిన్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా సిద్దూ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హజరైన సిద్దూ ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్న విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవ్‌జోత్ ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఇప్పుడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మన క్రికెటర్లు మేం పాకిస్తాన్ ఆటగాళ్ల మొహం చూడం అని చెప్పి వారికి తమ వెన్ను చూపగలరా’ అంటూ ప్రశ్నించారు. అలానే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చి ‘హాయ్ కోహ్లి.. మీరంటే నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని కౌగిలించుకోవాలని అనుకుంటున్నాను.. అంటే అప్పుడు కోహ్లి అందుకు ‘నాకిష్టం లేదు’ అని చెప్పి మొహం తిప్పుకుని వెల్లలేరు కదా’ అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే తనకు ఎదురయ్యాయని అందుకే తాను పాక్ ఆర్మీ చీఫ్‌ని ఆలింగనం చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. గత నెల పాకిస్తాన్ ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి హజరైన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సిద్దూ ఈ విషయం గురించి స్పందిస్తూ అతనే నా ముందుకు వచ్చి ఒకప్పుడు క్రికెటర్ కావాలని అనుకున్నట్లు చెప్పారు. అంతే కాదుసిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది’ అని సిద్ధూ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
సొంత ప్రభుత్వంపై సిద్ధు సంచలన వ్యాఖ్యలు!
చండీఘడ్ : సుమారు 8 వేల అక్రమ కాలనీల నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానంపై పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించింది ప్రజా సమస్యలపై నోరు మెదపకుండా ఉండటానికి కాదని’ సిద్ధు వ్యాఖ్యానించారు. ప్రతీ ప్రజా ప్రతినిధి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలన్నారు. బాస్ నిర్ణయానికే ప్రాధాన్యం ఉంటుంది.. కేబినెట్ సమావేశంలో భాగంగా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవపోవడాన్ని ప్రస్తావిస్తూ.. అక్రమ కాలనీల క్రమబద్ధీకరణను పూర్తిగా వ్యతిరేకించానని, అయితే ప్రభుత్వానికి బాస్‌గా ఉన్న సీఎం తీసుకునే నిర్ణయాలే అంతిమంగా చెల్లుబాట అయినప్పటికీ వాటి కోసం తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. విమర్శలు వస్తున్నాయంటే నేను ఎంతో కొంత నిజాయితీగా పనిచేస్తున్నానే అర్థం కదా అంటూ సిద్ధు చమత్కరించారు. కాగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో సిద్ధు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ అండదండలు పుష్కలంగా ఉన్న సిద్ధు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు పర్యాటక, సాంస్కృతిక, స్థానిక సంస్థలు వంటి అంతగా ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. -
సిద్దూ వ్యాఖ్యలపై మండిపడ్డ టీకాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని పంజాబ్ కాంగ్రెస్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఖండించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ఒక వైపే సిధ్దూ వినడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సిద్ధూ మరోసారి ఇక్కడికి వస్తే తాము నిజాలు చూపిస్తామన్నారు. ఆయన ప్రభుత్వం పర్యటనలో ఉన్నారని, పార్టీకి సంబంధించినది కాకపోవడంతో అవగాహన లేదని వ్యాఖ్యానించారు. సిధ్దూ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్ దృష్టి తీసుకెళ్లినట్టు శ్రవణ్ వెల్లడించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోంది శ్రవణ్ పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కొల్లాపూర్‌లో అక్రమంగా ఇసుక దందా జరుగుతోందని అరోపించారు. కొండూరులో ఎలాంటి లైసెన్స్ లేకుండా దొంగచాటుగా ఇసుక అమ్ముతున్నారన్నారు. జూపల్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ మాఫియాలో ఉన్నారని ఆయన విమర్శించారు. తామ పార్టీ నేతలు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదన్నారు. పందికొక్కుల్లా తినడం కోసబా తెలంగాణ తెచ్చుకుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనింగ్ బాగుందని పక్క రాష్ట్రాల వారితో పొగిడించుకుంటున్నారని మండిపడ్డారు. సర్కార్‌కు చారాణ.. టీఆర్ఎస్ పెద్దలకు బారాణ వెళ్లే విధంగా ఈ వ్యవహారం జరుగుతోందన్నారు. కేటీఆర్‌కు నీతి నిజాయితీ, తెలంగాణ సోయి ఉంటే.. ఇలా దొంగ ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోవడాన్ని పట్టించుకోవాలని సూచించారు. -
తెలంగాణ ఇసుక పాలసీ అద్భుతం
-
టీకాంగ్రెస్‌ను ఇరుకున పెట్టిన సిద్ధూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశారు. రాష్ట్రంలోని ఇసుక పాలసీని పంజాబ్‌లో అమలు చేసేందుకు కాళేశ్వరం పరిధిలోని ఇసుక రీచ్‌లను గురువారం అధికారుల బృందంతో కలిసి సిద్దూ క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని సిద్దు ప్రసంశించారు. ఇసుక అక్రమాలకు తెలంగాణ సర్కార్ అడ్డుకట్ట వేసిందని కితాబిచ్చారు. ఇలాంటి విధానమే పంజాబ్‌లో అమలు చేస్తామని సిధ్దు వివరించారు. అయితే సిద్ధూ పర్యటన కాంగ్రెస్ నాయకులకు ఇపుడు తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్చగా కొనసాగుతోందని, సర్కారు కనుసన్నల్లోనే ఇసుక మాఫియా జరుగుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్‌కు ముఖ్యంగా ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించింది. అయితే పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సిద్దూ ఇసుక విధానం బాగుందని, తెలంగాణ సర్కార్‌పై ప్రశంసలు కురిపించడం.. రాష్ట్ర నేతలకు మింగుడు పడటం లేదు. తెలంగాణలో సిద్ధూ పర్యటన వద్దంటూ టీ కాంగ్రెస్ ఇంతకుముందే అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. కానీ టీ కాంగ్రెస్ అభ్యంతరాలను తోసిపుచ్చి మరీ సిధ్దూ ఇక్కడ పర్యటించి పార్టీని ఇరుకున పెట్టారు. -
నాపై కేసు కోర్టులో ఉంది..స్పందించను
హైదరాబాద్ : కాంగ్రెస్ వ్యక్తిగా కాదు భారతీయునిగా మాత్రమే మాట్లాడుతున్నానని, తనపై ఉన్న కేసు కోర్టులో ఉందని,దానిపై స్పందించదలచుకోలేదని పంజాబ్ మంత్రి , మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా తాను దేశానికి ఎంతో సేవ చేశానని చెప్పారు. పాలిటిక్స్ అంటేనే తనకు అత్యంత ఇష్టమని, రాజకీయాలను ఒక ప్రొఫెషనల్‌గా కాకుండా ఒక మిషన్‌గా భావిస్తానని అన్నారు. ప్రజల జీవితాలను మార్చే విధంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటానని వెల్లడించారు. తెలంగాణలో ఇసుక పాలసీ అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. అక్రమాలు అరికట్టడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఆదాయం ఎన్నో రెట్లు పెరిగిందని తెలంగాణ ఇసుక పాలసీ నిరూపించిందని చెప్పారు. రెండు నదులు ఉన్న తెలంగాణలో ఇసుక రాబడి రూ.1300 కోట్లు ఉంటే 4 నదులు ఉన్న పంజాబ్ రాబడి ఎంత ఉండవచ్చునో అర్థం అవుతుందని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ మాఫియాను అరికట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమాలకు అడ్డుకట్టవేయగలిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రేటు నిర్ణయించడం వల్ల సామాన్యులకు లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు. పాలసీ అమలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా విధానం మాత్రం సూపర్ అని కితాబిచ్చారు. ఇదే విధానాన్ని పంజాబ్‌లో అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. -
‘ఆయన రోజుకు 50 సార్లు చస్తారు’
చండీగఢ్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అకాలీదళ్ నేతకు క్షమాపణలు చెప్పడంతో పార్టీకి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే పంజాబ్ పార్టీ చీఫ్, ఎంపీ భగవంత్ మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేజ్రీపై విమర్శలు గుప్పించారు. ‘పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ ఈరోజు హత్య చేశారు. ఎవరైతే అకాలీదళ్ నేత బిక్రం సింగ్ మజితియాపై ఇన్నాళ్లూ ఆరోపణలు చేశారో వారే నేడు క్షమాపణలు చెప్పారు. దాని ఫలితంగా పంజాబ్‌లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవడమే కాకుండా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజలను మోసంతో చేయడంతో పాటు, అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ విశ్వాసం కోల్పోయారు. పార్టీ అధినేతగా ఉన్నవారే పూర్తిగా లొంగిపోయినపుడు ఇకపై డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు ఎలా మాట్లాడగలరు? ధైర్యవంతులు ఒకేసారి మరణిస్తారు. కానీ కేజ్రీవాల్ వంటి పిరికివాళ్లు రోజుకు యాభైసార్లు చస్తారంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్షమాపణ వల్ల ఆప్ మానసికంగా హత్యకు గురైందని సిద్ధూ సానుభూతి వ్యక్తం చేశారు. మొదట ఢిల్లీ నుంచే పంజాబ్‌లో చక్రం తిప్పాలని అనుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు నిస్సహాయ జూదగాడిగా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు. డ్రగ్స్ మాఫియాలో అకాళీ దళ్ నేత బిక్రం సింగ్ మజితియా హస్తం ఉందంటూ ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ తాజాగా ఆయనకు క్షమాపణలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. -
ఇక పెంపుడు జంతువులపై పన్ను!
సాక్షి, ఛండీగఢ్ : పెంపుడు జంతువుల మీద పన్ను విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు స్థానిక మీడియాలు కథనం ప్రచురించాయి. రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ నేతృత్వంలోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నలను లేదా నంబర్లను వాటికి కేటాయించటంగానీ, అవసరమైతే జంతువుల్లో మైక్రో చిప్‌లను అమరుస్తామని ప్రభుత్వం ప్రకటించటం విశేషం. కుక్క, పిల్లి, గుర్రం, పంది, బర్రె, ఆవు, ఏనుగు, ఒంటె, గుర్రం.. ఇలా పెంచుకునే జంతువులన్నీ తాజా ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఇది వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు. పంచాయితీలను మినహాయించి అన్ని మున్సిపాలిటీలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 200 నుంచి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ పన్ను కట్టకపోతే మున్సిపల్ అథారిటీలు వాటిని స్వాధీనం చేసుకునే వెసులుబాలు కల్పించారు. అయితే దీనికి న్యాయ పరమైన చిక్కులు ఎదరయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా.. అసలు ఈ చట్టం అమలులోకి వచ్చిందా? అన్నది తేలాల్సి ఉంది. నోటిఫికేషన్లో స్పష్టత లేనందునే ఈ సమస్య ఉత్పన్నమైందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క జంతు ప్రేమికులు ఈ నిబంధనలపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సరదాగా ఇంట్లో పెంచుకునే జంతువులపై పన్నులు విధించటమేంటని కొందరు నిలదీస్తుంటే.. డెయిరీ ఫామ్‌లు నిర్వహించే వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో గోవా, కేరళలోనూ ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలే చేయగా.. నిరసనలు వ్యక్తం కావటంతో వెనకడుగు వేశాయి.