
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. తర్వాత ఒకరికొకరు క్షమాపణలు కొరతారు. కొన్ని సార్లు ఎవరు తప్పు చేస్తే వారే ముందుగా సారీ చెప్తారు. వివాహ బంధంలో ఇవన్నీ సహజం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. అయితే తమ మధ్య గొడవలు వస్తే ముందుగా తానే సారీ చెప్తాను అంటున్నారు అందాల నటి ఐశ్యర్య రాయ్. అభిషేక్‌తో గొడవపడితే తానే ముందుగా క్షమాపణలు కోరతానని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఇది పాత వీడియో. దీనిలో కపిల్ శర్మ, ఐశ్యర్య రాయ్, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. ఇక వీడియో విషయానికి వస్తే కపిల్ శర్మ, ఐశ్వర్యని ఉద్దేశించి.. ‘అభిషేక్‌తో గొడవపడితే.. ముందుగా ఎవరు క్షమాపణలు కోరతారు’ అని ప్రశ్నిస్తాడు. వీరి సంభాషణ పూర్తి కాకముందే నవజోత్ మధ్యలో కల్పించుకుని.. ‘అసలు ఇలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. అభిషేకే ముందుగా సారి చెప్తాడు’ అంటారు. (చదవండి: అందం, అణకువల కలబోత)
దాంతో ఐశ్యర్య ‘అలా ఏం కాదు. తనతో గొడవపడితే ముందుగా నేనే సారీ చెప్తాను. గొడవను కొనసాగించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేనే క్షమాపణ చెప్తాను’ అని తెలిపారు. ఈ సమాధానం విని కపిల్ శర్మ ఒక్క నిమిషం స్టన్ అవుతాడు. ‘మీరు సారీ చెప్తారా.. ఇంత అందమైన భార్య క్షమాపణలు కోరడం అంటే నిజంగా దేవుడి లీలే’ అంటాడు. దాంతో ఐశ్వర్యతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు. అభిషేక్, ఐశ్వర్యల వివాహం 2007లో జరిగింది. వీరికి ఓ కుమార్తె ఆద్యా ఉన్నారు. ఇక తాజాగా ఐశ్యర్య పుట్టిన రోజు సందర్భంగా అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరిద్దరు గులాబ్‌జామూన్ అనే చిత్రంలో నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment