మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ(పాత చిత్రం)
హైదరాబాద్ : కాంగ్రెస్ వ్యక్తిగా కాదు భారతీయునిగా మాత్రమే మాట్లాడుతున్నానని, తనపై ఉన్న కేసు కోర్టులో ఉందని,దానిపై స్పందించదలచుకోలేదని పంజాబ్ మంత్రి , మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా తాను దేశానికి ఎంతో సేవ చేశానని చెప్పారు. పాలిటిక్స్ అంటేనే తనకు అత్యంత ఇష్టమని, రాజకీయాలను ఒక ప్రొఫెషనల్‌గా కాకుండా ఒక మిషన్‌గా భావిస్తానని అన్నారు. ప్రజల జీవితాలను మార్చే విధంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటానని వెల్లడించారు. తెలంగాణలో ఇసుక పాలసీ అద్భుతంగా ఉన్నదని కొనియాడారు.
అక్రమాలు అరికట్టడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆదాయం ఎన్నో రెట్లు పెరిగిందని తెలంగాణ ఇసుక పాలసీ నిరూపించిందని చెప్పారు. రెండు నదులు ఉన్న తెలంగాణలో ఇసుక రాబడి రూ.1300 కోట్లు ఉంటే 4 నదులు ఉన్న పంజాబ్ రాబడి ఎంత ఉండవచ్చునో అర్థం అవుతుందని చెప్పారు. ట్రాన్స్‌పోర్ట్ మాఫియాను అరికట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమాలకు అడ్డుకట్టవేయగలిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రేటు నిర్ణయించడం వల్ల సామాన్యులకు లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు. పాలసీ అమలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా విధానం మాత్రం సూపర్ అని కితాబిచ్చారు. ఇదే విధానాన్ని పంజాబ్‌లో అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment