న్యూజెర్సీ : ఈస్టర్‌డే రోజు భారత్‌కి పొరుగు దేశమైన శ్రీలంకలో ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబోలోని ఎనిమిది చోట్ల బాంబులు పేల్చడంతో 359 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయపడిన విషయం తెలిసిందే. మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్‌టీటీఈ తుడిచిపెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది.
శ్రీలంకలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సాయి దత్త పీఠం సభ్యులు ప్రగాఢ సంతాపం తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధించారు. ఈ సందర్భంగా న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు అమరులైన వారికి నివాళులర్పించారు. ఫ్రాంక్లిన్ టౌన్‌షిప్ నుండి శ్రీలంకకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హఛ్చి మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని అన్ని మతాలవారూ ఖండించాలని శ్రీలంక ప్రజల కోసం సాయి దత్త పీఠం నిర్వహించిన క్రొవ్వొత్తి ప్రదర్శన, మౌన ప్రదర్శనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ యార్క్‌లో శ్రీలంక అంబాసిడర్‌కు చెబుతానని వివరించారు. సుమారు 200 మంది భక్తులు క్రొవ్వొత్తి ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు.
సాయిదత్త పీఠంలో శ్రీలంక మృతులకు నివాళి
Published Fri, Apr 26 2019 2:11 PM | Last Updated on Fri, Apr 26 2019 2:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment