Newjercy
-
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురండి: సీఎం రేవంత్
న్యూజెర్సీ/తెలంగాణ: రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చాను. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఇది ప్రారంభం మాత్రమే.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుంది. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తాం. ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగింది. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు.వచ్చినా అది ఉండనే ఉండదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాం. అబద్ధాలకోరుల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తాం. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతాం. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్‌తో పాటు, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. -
Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్ అడ్రస్..
సమస్యతో పాటు పరిష్కారం కూడా మన వెన్నంటే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేసేవారే ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. అందుకు సరైన ఉదాహరణ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. తెలంగాణలోని ఖమ్మం జిల్లావాసి ఝాన్సీరెడ్డి విద్య, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. పురుషాధిక్య ప్రపంచమైన రియల్ ఎస్టేట్ రంగంలో తన సత్తా చాటడంతో పాటు, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల ఉన్నతికి పాటుపడుతూ, పుట్టిన గడ్డకు సాయమందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఝాన్సీరెడ్డిని పలకరిస్తే ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ‘‘నా శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే, ఏ పనిని ఎంచుకున్నా అందులో సంపూర్ణ విజయాన్ని సాధించేదాకా వదలను. నేను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో పెద్దనాన్నతో పాటు అమెరికా వెళ్లిపోయాను. అక్కడే టెన్త్ పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చాను. పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. సాధారణంగా భర్త వెంట భార్య అమెరికా వెళ్లడం చూస్తుంటాం. కానీ, నా విషయంలో ఇది రివర్స్ అయ్యింది. మా వారు కార్డియాలజిస్ట్ కావడం, మేం న్యూజెర్సీలో సెటిల్ అవడం... ఏడాదిలోనే జరిగిపోయాయి. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి కుటుంబంతో పాటు వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను. అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తి ఎక్కువ. అదే సమయంలో బ్యాంకు కూడా ఫైనాన్సింగ్ క్లాసెస్ ఆఫర్ చేసింది. దీంతో సాయంత్రాలు చదువుకుంటూ, పగటి వేళ ఉద్యోగం చేశాను. ప్రమోషన్లు వచ్చాయి. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్స్టాప్ పడింది. ఈ సమయంలోనూ ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. అమెరికా.. రియల్ ఎస్టేట్ డాక్టర్‌గా మా వారి సంపాదన బాగానే ఉంది. దీంతో ఓ చిన్న స్థిరాస్తి కొనుగోలు చేశాం. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ స్థిరాస్తిని కేవలం పెట్టుబడిగానే ఎందుకు చూడాలి, ఇదే వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అనుకున్నాను. కానీ, ఈ రంగంలో మహిళలు ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ఇండియా–అమెరికా ఏ దేశమైనా ఈ రంగంలో మహిళల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టచ్చు. అంతటా పురుషాధిపత్యమే. చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని తెలుసు. అయినా, పాతికేళ్ల క్రితం ‘రాజ్ ప్రాపర్టీస్’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాను. ఎందుకొచ్చిన రిస్క్ అన్నవారూ ఉన్నారు. విమర్శలనే కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. కొద్దికాలంలోనే ఈ రంగంలో మంచి పేరు సాధించాను. తెలుగు మహిళల కోసం.. అమెరికాలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక తెలుగువారి సమస్యలు బాగా తెలుసు. అందులోనూ తెలుగు అసోసియేషన్స్‌కు వచ్చిన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. దేశం మారుతున్నా మగవారి మనస్తత్వాలు, భావాలు మారడం లేదు. దీంతో తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాంటి వాటన్నింటికి పరిష్కారంగా ఒక సంస్థ ఉండాలనుకున్నాను. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల కోసం ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థను నాలుగేళ్ల్ల క్రితం ఏర్పాటు చేశాను. ఇందులో నిష్ణాతులైన మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందించాలన్నదే లక్ష్యం. మనలోని సమర్థత ఏంటో మనకే బాగా తెలుసు. ఏ రంగంలో మనం సమర్థవంతంగా రాణించగలమో గ్రహించి, ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడు అవకాశాలు కూడా వాటంతటవే వస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ వెళ్లడంలోనే మన విజయం దాగుంటుంది. దీంతో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో పాటు మన చుట్టూ ఉన్న కొందరికైనా సాయం అందించగలం’’ అని వివరించారు ఈ ప్రవాస భారతీయురాలు. (చదవండి: నాట్య దీపిక.. దీపికారెడ్డి) పుట్టిన గడ్డకు సాయం అనుకున్న విజయాలను సాధించాను. పుట్టినగడ్డకు కొంతైనా సేవ చేయాలని.. ఖమ్మం జిల్లాలోని మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలో స్కూల్ భవనాలు కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాను. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాను. వీటితోపాటు లైబ్రరీ, గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాను. పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించాను. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
సాయిదత్త పీఠంలో శ్రీలంక మృతులకు నివాళి
న్యూజెర్సీ : ఈస్టర్డే రోజు భారత్‌కి పొరుగు దేశమైన శ్రీలంకలో ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబోలోని ఎనిమిది చోట్ల బాంబులు పేల్చడంతో 359 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయపడిన విషయం తెలిసిందే. మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్టీటీఈ తుడిచిపెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది. శ్రీలంకలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సాయి దత్త పీఠం సభ్యులు ప్రగాఢ సంతాపం తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధించారు. ఈ సందర్భంగా న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు అమరులైన వారికి నివాళులర్పించారు. ఫ్రాంక్లిన్ టౌన్షిప్ నుండి శ్రీలంకకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హఛ్చి మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని అన్ని మతాలవారూ ఖండించాలని శ్రీలంక ప్రజల కోసం సాయి దత్త పీఠం నిర్వహించిన క్రొవ్వొత్తి ప్రదర్శన, మౌన ప్రదర్శనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ యార్క్‌లో శ్రీలంక అంబాసిడర్‌కు చెబుతానని వివరించారు. సుమారు 200 మంది భక్తులు క్రొవ్వొత్తి ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. -
మిస్ ఇండియా ‘వరల్డ్‌వైడ్’గా శ్రీ సైనీ
వాషింగ్టన్: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటం భారతీయ అమెరికన్ యువతి శ్రీ సైనీ(22)కి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో శనివారం జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా, బ్రిటన్‌కు చెందిన అనూషా సరీన్ మొదటి, రెండో రన్నర్ అప్స్‌గా ఎంపికయ్యారు. శ్రీ సైనీకి 12 ఏళ్ల వయస్సులోనే గుండె చికిత్స జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా డ్యాన్స్ చేయవద్దని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు. -
ఇక తిరుగు ప్రయాణం
బాలీవుడ్ మీటూ ఉద్యమంలో బాగా వినిపించిన పేరు తనుశ్రీ దత్తా. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా అప్పుడు నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దేశంలో మీటూ ఉద్యమానికి పునాది వేశారామె. ఆ తర్వాత చాలా మంది తారలు మీటూ ఉద్యమంలో తమ గొంతు వినిపించారు. ఈ కారణంగా కొందరు డైరెక్టర్లు తమ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తనుశ్రీ దత్తా తిరిగి న్యూజెర్సీ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ‘‘మీటూ’ గురించిన వార్తలు ప్రతిరోజూ దినపత్రిక మొదటి పేజీలో రావని నాకు అవగాహన ఉంది. కానీ జరిగిన పరిణామాలు భవిష్యత్‌లో కొందరు మహిళలకైనా మేలు చేస్తాయన్న నమ్మకం ఉంది. ఓ నెల రోజులు గడుపుదామని ముంబై వచ్చాను. ఐదు నెలలు గడిచిపోయాయి. ఇక నా ఫ్యూచర్ అక్కడే అనుకుంటున్నా. అందుకే న్యూజెర్సీ తిరుగు ప్రయాణం అవుతున్నా’’ అని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు. -
అమెరికాలో మొదటి 'జికా' మామ్!
న్యూ జెర్సీః పుట్టబోయే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు జికా వైరస్ వల్ల వస్తున్నాయని వైద్య నిపుణులు ముందే గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్లో తల చిన్నగా ఉండి, మెదడు లోపంతో పిల్లలు పుట్టినట్లు అంచనా కూడ ఉంది. కాగా తాజాగా అమెరికాలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి జికా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్థారణ చేశారు. న్యూజెర్సీ లోని ఆసుపత్రిలో జికా వైరస్ తో ఉన్నతల్లి ప్రసవించిగా ఆమెకు చిన్న తలతో ఉన్న శిశువు జన్మించినట్లు వైద్యాధికారులు గుర్తించారు. స్పష్టంగా జికా వైరస్ లక్షణాలు కలిగిన ఇటువంటి కేసు అమెరికా ట్రై స్టేట్స్ లో ఇదే మొదటిసారి అని ఇడా సీగల్ నివేదించింది. దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి సోకి, కలకలం రేపుతున్న జికా వైరస్... మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది.అయితే ఈ వైరస్ వల్ల ఇతరుల్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా గర్భిణులకు సోకితే మాత్రం పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తుతాయంటూ వైరస్ ను నిలువరించేందుకు డబ్ల్యూహెచ్ వో భారీ కసరత్తు చేస్తోంది. ఈడిస్ ఈజిప్టె రకం దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నజికా వైరస్... సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా... గర్భిణిలపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం అమెరికాలో జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద సవాలుగా మారింది. మైక్రో సెఫలి వ్యాధి బారినపడ్డ బిడ్డ.. అమెరికాలోని న్యూజెర్సీ ఆస్పత్రిలో జన్మించింది. ఇలా జికా వైరస్ సోకిన తల్లి ఆమెరికాలోని ఆస్పత్రిని సందర్శించడం ఇదే మొదటిసారి అని హాకెన్‌సాక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధికారులు అంటున్నారు. అయితే ఆ తల్లి.. పూర్తి వైద్య సంరక్షణ అందుకుందని చెప్పిన అధికారులు.. ఆమె గోప్యతను గౌరవిస్తూ... ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను వెల్లడించలేదు. అయితే ఆమె హోండురాస్ కు చెందిన 31 ఏళ్ళ వయసున్న మహిళ అని ఓ వార్తా పత్రిక వెల్లడింరగా... గర్భం ప్రారంభ దశలోనే ఆమె.. దోమకాటు వల్ల జికా బారిన పడిందని ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. అల్ట్రా సౌండ్ టెస్ట్ లో లోపాలు కనిపించడంతో వైద్యులు 35 వారాల గర్భంతో ఉన్న ఆమెకు మంగళవారం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డ.. తక్కువ బరువుతోపాటు, మైక్రోసెఫలీ వ్యాధి కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తల్లికి గర్భంతో ఉన్న సమయంలో శరీరంపై కొద్దిపాటి రాష్ తప్పించి.. మిగిలిన ఎటువంటి లక్షణాలు కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు.