
తనుశ్రీ దత్తా
బాలీవుడ్ మీటూ ఉద్యమంలో బాగా వినిపించిన పేరు తనుశ్రీ దత్తా. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా అప్పుడు నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దేశంలో మీటూ ఉద్యమానికి పునాది వేశారామె. ఆ తర్వాత చాలా మంది తారలు మీటూ ఉద్యమంలో తమ గొంతు వినిపించారు. ఈ కారణంగా కొందరు డైరెక్టర్లు తమ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు తనుశ్రీ దత్తా తిరిగి న్యూజెర్సీ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ‘‘మీటూ’ గురించిన వార్తలు ప్రతిరోజూ దినపత్రిక మొదటి పేజీలో రావని నాకు అవగాహన ఉంది. కానీ జరిగిన పరిణామాలు భవిష్యత్‌లో కొందరు మహిళలకైనా మేలు చేస్తాయన్న నమ్మకం ఉంది. ఓ నెల రోజులు గడుపుదామని ముంబై వచ్చాను. ఐదు నెలలు గడిచిపోయాయి. ఇక నా ఫ్యూచర్ అక్కడే అనుకుంటున్నా. అందుకే న్యూజెర్సీ తిరుగు ప్రయాణం అవుతున్నా’’ అని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment