రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..! | Tanushree Dutta Announces Her Bollywood Comeback | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించిన నటి

Published Tue, Nov 10 2020 12:46 PM | Last Updated on Tue, Nov 10 2020 12:51 PM

Tanushree Dutta Announces Her Bollywood Comeback - Sakshi

తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో సహా నటుడు నానాపటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్‌ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. 

యూఎస్‌ డిఫెన్స్‌లో ఉద్యోగం వదులుకున్నాను
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో.  ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్‌ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్‌ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్‌. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్‌లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్‌ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు)

Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

సౌత్‌లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం
ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్‌కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్‌ ఆఫీస్‌లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్‌ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్‌లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement