US Department of Defense
-
త్వరలోనే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం
న్యూఢిల్లీ: ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొడుతూ క్షిపణులతో దాడి చేయగల అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ రకం 31 సాయుధ డోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్ వచ్చే ఏడాది మార్చికల్లా ఒప్పందాన్ని ఖరారుచేసుకోనుంది. కొనుగోలు కోసం భారత్ పంపిన ‘అభ్యర్థన లేఖ’ను అమెరికా రక్షణ శాఖ ఆమోదించిన నేపథ్యంలో త్వరలోనే అమెరికా, భారత ఉన్నతాధికారులు తుది దశ చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో గగనతలంలో నిరంతర నిఘా, మెరుపు దాడుల కోసం ఈ డ్రోన్లను భారత్ వినియోగించనుంది. ఈ భారీ డ్రోన్ సరిహద్దులతోపాటు శత్రు దేశాల సైనిక వాహనాలపై నిఘాతోపాటు వాటిని వెంటాడి క్షిపణులతో దాడిచేయగలదు. ఏకబిగిన 35 గంటలపాటు గాల్లోనే ఉండగలదు. 450 కేజీల బరువైన బాంబులు అమర్చిన క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇంతటి అత్యాధునికమైన డ్రోన్లను త్రివిధ దళాల్లో దశలవారీగా ప్రవేశపెట్టాలని భారత్ తలపోస్తోంది. అందులోభాగంగానే ఈ డీల్ కుదుర్చుకుంటోంది. అమెరికా రక్షణరంగ దిగ్గజ సంస్థ జనరల్ ఆటమిక్స్ ఈ డ్రోన్లను తయారుచేస్తోంది. 31 డ్రోన్లకు మొత్తంగా రూ.25,000 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఒక్కో డ్రోన్‌ను ఎంతకు కొనాలనే ధర, ఇతరత్రా విషయాలు ఇంకా ఖరారుకాలేదు. తుది చర్చల్లో వీటిపై నిర్ణయాలు తీసుకునే వీలుంది. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన తొలి అనుమతిని లోని రక్షణరంగ కొనుగోళ్ల మండలి ఆమోదించిన విషయం విదితమే. -
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్‌పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్‌నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్‌కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్‌లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మోదీ పర్యటన భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒరవడిని నిర్దేశిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా రక్షణ సహకారం, భారత్‌లో స్వదేశీ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతి విషయంలో భారీ, చరిత్రాత్మక, ఉత్తేజభరిత ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటన ప్రారంభిస్తారు. నాలుగు రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఈ నెల 22న ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. మోదీ రాకవల్ల భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి (ఇండో–పసిఫిక్ భద్రతా వ్యవహారాలు) ఎలీ రట్నార్ చెప్పారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక సందర్భం అవుతుందన్నారు. -
అమెరికా ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా చౌధరి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ రవి చౌధరి చరిత్ర సృష్టించారు. అమెరికా రక్షణ శాఖలో ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఈయనే. రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌లోని ఈ అత్యున్నత పదవికి రవి చౌధరిని నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన సిఫారసును సెనేట్ 65–29 ఓట్ల తేడాతో బుధవారం ఆమోదించింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన డజనుకు పైగా సభ్యులు సైతం రవి చౌధరికి మద్దతివ్వడం విశేషం. రవి అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో 1993–2015 నుంచి 22 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్ స్టాఫ్ అసైన్మెంట్లు వంటి వైవిధ్యమైన అంశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ)లోని అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి డైరెక్టర్ కూడా వ్యవహరించారు. సి–17 పైలట్‌గా అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధ విధుల్లో పాలుపంచుకున్నారు. సిస్టమ్స్ ఇంజినీర్ కూడా అయిన చౌధరి నాసాలోనూ పనిచేశారు. -
చట్టాలకు లోబడే నేవీ ఆపరేషన్స్: పెంటగాన్
వాషింగ్టన్: భారత్‌లోని లక్షద్వీప్ సమీపంలో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ని చేపట్టడాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సమర్థించుకుంది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ఎఫ్‌ఓఎన్‌ఓపీలో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత్ పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ తీవ్ర అభ్యంతరం తెలపడంపై అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. ‘మాల్దీవులకు సమీపంలో ఆ దేశ ఈఈజెడ్ పరిధి లోపల ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సాధారణ ఆపరేషన్స్ చేపట్టడం ద్వారా నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్ఛను, హక్కులను నిర్ధారించాం’ అని తెలిపారు. (చదవండి: భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య) -
ట్రంప్ సంచలన నిర్ణయం..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖా మంత్రి మార్క్ ఎస్పర్‌ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ ‘మార్క్ ఎస్పర్‌ని తొలగిస్తున్నాం. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఎస్పర్ స్థానంలో క్రిస్టోఫర్ సీ మిల్లర్ తాత్కాలిక రక్షణ మంత్రిగా తక్షణమే బాధ్యతలు చేపడతారని ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్ర డైరెక్టర్‌గా సెనెట్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసిందని తెలిపారు. ఇక ట్రంప్ నాలుగేళ్ల అధ్యక్ష కాలంలో ఎస్పర్ నాల్గవ పెంటగాన్ చీఫ్‌గా పని చేశారు. కాగా బాధ్యతలు స్వీకరించిన 16 నెలల తర్వాత ఎస్పర్‌ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. గతంలో పౌర అశాంతిని అరికట్టడానికి ఫెడరల్ దళాలను మోహరించాలని ఎస్పర్ ఒత్తిడి చేయడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హింస కొనసాగుతున్నప్పుడు అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను వేగంగా ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ ఉత్తర్వులను ఎస్పర్ నెమ్మదిగా అమలు చేశారు. దాంతో ఆగ్రహంతో ఉన్న ట్రంప్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ట్రంప్ చర్యలు చాలామందికి షాక్ ఇచ్చాయి. ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్... మరో 10 వారాలపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ట్రంప్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరిని ఇంటికి పంపిస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు. (బైడెన్ విక్టరీ: చైనా ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక అధ్యక్ష ఎన్నికల తీర్పును అంగీకరించని ట్రంప్ దానని కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎస్పర్ స్థానంలో నియమితులైన క్రిస్టోఫర్ మిల్లర్ దాదాపు 31 ఏళ్ల పాటు సైన్యంలో పని చేశాడు. 2001 అఫ్ఘనిస్తాన్‌లో, 2003లో ఇరాక్‌లో మోహరించిన ప్రత్యేక బలగాల్లో పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ రహస్య ఆపరేషన్లు, ఇంటిలిజెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. 2018-2019లో ఆయన తీవ్రవాద నిరోధకత, ట్రాన్స్‌నేషనల్ థ్రెట్స్ విభాగంలో వైట్ హౌస్ సలహాదారుగా పనిచేశాడు. 2019 నుంచి ప్రత్యేక కార్యకలాపాల కోసం రక్షణ సహాయ కార్యదర్శిగా ఉన్నారు. -
రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!
తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. యూఎస్ డిఫెన్స్‌లో ఉద్యోగం వదులుకున్నాను ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్‌ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు) View this post on Instagram Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞 A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Nov 7, 2020 at 10:52pm PST సౌత్‌లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్‌కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్‌లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్‌లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. -
భారత్‌పై నిఘా పెట్టలేదు
వాషింగ్టన్: భారత్ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్ పరీక్షపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణశాఖ ఖండించింది. భారత్ ఏ–శాట్ ప్రయోగాన్ని చేపడుతుందన్న విషయం తమకు ముందుగానే తెలుసని అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్.డబ్ల్యూ.ఈస్ట్‌బర్న్ చెప్పారు. ‘ప్రయోగం గురించి మాకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రయోగం కోసం నిర్ణీత ప్రాంతంలో విమానాల రాకపోకలను భారత్ నిషేధించింది. ఈ విషయాన్ని ముందురోజే చెప్పింది’ అని అన్నారు. 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని గత గురువారం∙ఏశాట్ క్షిపణి కూల్చివేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అయితే ఈ ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాలకే అమెరికాకు చెందిన ‘ఆర్సీ–135ఎస్ కోబ్రా బాల్’ నిఘా విమానం బంగాళాఖాతంపై ప్రయాణిస్తూ వివరాలను సేకరించింది. మోదీపై బీఎస్ఎఫ్ జవాన్ పోటీ ఛండీగఢ్: జవాన్లకు నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ రెండేళ్ల క్రితం వీడియో పోస్ట్ చేసి ఉద్యోగం కోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్‌బహదూర్ యాదవ్ వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, ఒకవేళ గెలుపొందితే సాయుధ బలగాల్లో అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని ఆయన శుక్రవారం చెప్పారు. అవినీతి గురించి గళం విప్పినందుకే తనకు ఉద్వాసన పలికారని అన్నారు. నియంత్రణ రేఖ వెంట విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ 2017లో యాదవ్ ఆన్లైన్లో పోస్ట్ పెట్టగా, క్రమశిక్షణా చర్యల కింద ఆర్మీ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌పోర్టులోనే కూలిన ఫైటర్ జెట్
దుబాయి: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం యూఎస్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. విమానం ఎయిర్‌పోర్టులో దిగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు ఎటువంటి ప్రకటనా చేయలేదు. మృతులు, నష్టంపై స్పందించేందుకు నిరాకరించారు. ఘటన కారణంగా విమానాశ్రయంలోకి రాకపోకలను నిలిపివేశారు. పర్షియన్ సింధుశాఖలో సౌదీ అరేబియా పొరుగున ఉండే బహ్రెయిన్ దేశం ఒక దీవి. ఇక్కడ అమెరికా నావికా దళ స్థావరం ఉంది. నేవీ అధికారులు కూడా ఈ ఘటనకు కారణాలను వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎన్ఎస్జీకి భారత్ సిద్ధం: అమెరికా
వ్యతిరేకించిన చైనా, పాక్ వాషింగ్టన్: అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్ఎస్జీ)లో భారత్ చేరేందుకు సిద్ధమైందని అమెరికా తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. అయితే, భారత్‌కు ఈ సభ్యత్వం ఇవ్వొద్దని చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా అభ్యంతరం తెలిపాయి. క్షిపణి సాంకేతిక నియంత్రణకు అవసరమైన సంపత్తిని భారత్ సమకూర్చుకున్నందున సభ్యత్వానికి సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం తెలిపారు. ఎన్ఎస్జీలో కొత్త సభ్యులు చేరికనేది ప్రస్తుత సభ్యదేశాల మధ్య అంతర్గత వ్యవహారమన్నారు. అయితే, ఎన్ఎస్జీలో భారత్ చేరికను అడ్డుకోవాలని తాము 48 సభ్యదేశాల అభిప్రాయాన్ని కోరినట్టు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై భారత్ సంతకం పెట్టాలని, తమతోపాటు ఇతర ఎన్ఎస్జీ సభ్య దేశాలు కోరుతున్నాయంది. భారత్ సరిహద్దుల్లో ‘డ్రాగన్’ నీడ.. చైనా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకున్నదని, భారతదేశ సరిహద్దులో మరింత మంది సైనికులను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. -
ఆ సైట్‌ను హ్యాక్ చేస్తే 1,50,000 డాలర్లు
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ (డీవోడి) తన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో పరీక్షించాలనుకుంటోంది. దీని కోసం హ్యాకర్లను ఆహ్వానిస్తోంది. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్‌చేసి అందులో లోపాలను కనిపెట్టిన వారికి 1,50,000 డాలర్ల రివార్డును ప్రకటించింది. తమ ఈ ‘బగ్ బౌంటీ ప్రోగ్రామ్’ ఏప్రిల్ 18వ తేదీ నుంచి ప్రారంభమై మే నెల 12వ తేదీ వరకు కొనసాగుతోందని, ఈ మధ్యకాలంలోనే హ్యాకర్లు తమ సైట్‌ను హ్యాక్ చేయాల్సి ఉంటుందని రక్షణ మంత్రి ఆశ్ కార్టర్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. అమెరికా సామాజిక భద్రత నెంబర్ ఉన్న హ్యాకర్లు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలని, వారి నేర చరితను పరిశీలించేందుకు కూడా అంగీకరించాలని షరతు విధించారు. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను కనుగొనేందుకు ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇలాంటి బగ్ బౌంటీ పోటీలను నిర్వహించాయి. ఇటీవల ఊబర్ సంస్థ కూడా తమ టాక్స్ యాప్‌లో లోపాలను కనుగొనేందుకు ఇలాంటి పోటీనే ఆహ్వానించి పదివేల డాలర్ల రివార్డును ప్రకటించింది. -
ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు
న్యూయార్క్: ప్యారీస్ నుంచి న్యూయార్క్ వస్తున్న ఎయిర్ ఫ్రాన్స్ ప్యాసింజర్ జెట్ విమానానికి రెండు అమెరికా ఫైటర్ విమానాలు(యూఎస్ ఎఫ్-15) తోడుగా వెళ్లాయి. ప్యారిస్ విమానంలో కెమికల్ ఆయుధాలు ఉన్నాయని ఓ ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన ఎఫ్ బీఐ వెంటనే రెండు ఫైటర్ విమానాలను ఫ్రాన్స్ విమానం దిగే జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా పంపించింది. దీనిపై ఎఫ్‌బీఐ వివరణ ఇస్తూ ముందస్తుగా బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఇలా చేశామని, ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. ఫ్రాన్స్ విమానం కూడా సురక్షితంగానే దిగిందని, అనంతరం తనిఖీలు నిర్వహించామని వివరించారు.