ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు | Air France jet escorted by US fighters after chemical weapons threat | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు

Published Tue, May 26 2015 8:43 AM | Last Updated on Sat, Aug 25 2018 3:23 PM

ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు - Sakshi

ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు

న్యూయార్క్: ప్యారీస్ నుంచి న్యూయార్క్ వస్తున్న ఎయిర్ ఫ్రాన్స్ ప్యాసింజర్ జెట్ విమానానికి రెండు అమెరికా ఫైటర్ విమానాలు(యూఎస్ ఎఫ్-15) తోడుగా వెళ్లాయి. ప్యారిస్ విమానంలో కెమికల్ ఆయుధాలు ఉన్నాయని ఓ ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన ఎఫ్ బీఐ వెంటనే రెండు ఫైటర్ విమానాలను ఫ్రాన్స్ విమానం దిగే జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా పంపించింది.

దీనిపై ఎఫ్బీఐ వివరణ ఇస్తూ ముందస్తుగా బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఇలా చేశామని, ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. ఫ్రాన్స్ విమానం కూడా సురక్షితంగానే దిగిందని, అనంతరం తనిఖీలు నిర్వహించామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement