escort
-
కూతురు ముందే పిస్టల్‌తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘గోలీ కొట్టుకుంటా’.. అంటూ రెండుమూడు రోజులుగా సన్ని హితుల వద్ద చెపుతున్న రాచకొండ ఏఆర్ ఎస్సై మహ్మద్ ఫజల్ అలీ (59) పిస్టల్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న అలీ, తన చిన్న కుమార్తెతో కలసి ఆదివారం ఉదయం డ్యూటీలో చేరడానికి వచ్చి, ఆమె సమక్షంలోనే ఉసురు తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆర్థిక కారణాల నేపథ్యంలో అలీ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఫజల్ అలీ రాచకొండ కమిషనరేట్‌లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసినా.. భర్తలతో విడాకులు తీసుకున్న వీళ్లు ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ఓ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న కుమార్తె వివాహం చేయాలని భావించిన అలీ.. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు కేవలం రెండేళ్లు మాత్రమే సర్విసు ఉండటంతో బ్యాంకు అధికారులు రుణ దరఖాస్తును తిరస్కరించారు. రెండు వారాల క్రితం బ్యాంకు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఫజల్ అలీ, రుణం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. నోట్ బుక్‌లో రాసుకుని.. ఈ క్రమంలో రెండుమూడు రోజులుగా తన సన్నిహితులు, సహోద్యోగుల వద్ద ఆర్థిక ఇబ్బందులు, రుణం సమస్య గురించి చెప్పుకుంటున్న ఫజల్ అలీ నిరాశతో ‘గోలీ కొట్టుకుంటా’అంటూ వాపోయారు. ఓ నోట్ బుక్‌లోనూ తన ఆర్థిక పరిస్థితుల విషయం రాసి ఆ పేజీని తన వెంట ఉంచుకున్నారు. ఆదివారం ఉదయం చిన్న కుమార్తె ఫాతిమాను తీసుకొని శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్దకు డ్యూటీ కోసం వచ్చారు. ముందుగా ఆ సమీపంలో ఒక హోటల్ వద్ద కూతురిని దించి మంత్రి ఇంటికి వెళ్లారు. డ్యూటీ ఎక్కిన తర్వాత తన సర్వీస్ పిస్టల్ (9 ఎంఎం క్యాలిబర్) తీసుకొని కుమార్తె ఉన్న చోటుకి వచ్చారు. వీడియో తీయా ల్సిందిగా కుమార్తెకు చెప్పి తన సెల్‌ఫోన్ ఇచ్చారు. కొన్ని మాటలు నవ్వుతూ చెప్పిన అలీ, ఆపై ఫోన్ తీసుకుని, ఆమెను వెళ్లమని చెప్పారు. కుమార్తె వెనక్కు తిరిగిన వెంటనే ఫోన్ జేబులో పెట్టుకుని పిస్టల్‌తో తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకున్నారు. కుడి చెవిపై నుంచి దూసుకుపోయిన తూటా ఎడమ వైపు నుంచి బయటకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అలీ కుటుంబీకులకు అప్పగించారు. కాగా, ఫజల్ అలీ తండ్రి ఇబ్రహీం అలీ కూడా గతంలో హైదరాబాద్‌లో ఏఆర్ ఎస్ఐగా పనిచేశారు. ఆయన కూడా ఇలాగే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంతో 1986లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్ఐ ఫజల్ మృతి పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫజల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
-
ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్ జెట్స్ సాయంతో ఖతార్‌కు
విశ్వవ్యాప్తంగా యమ క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ సమరానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే సాకర్ సమరంలో పాల్గొననున్న 32 జట్లు ఖతార్‌కు చేరుకున్నాయి. ఇక నవంబర్ 20 నుంచి గోల్స్ వర్షం మొదలుకానుంది. ఇదిలా ఉంటే ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పోలాండ్ జట్టు ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌తో రావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బహుశా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే ఒక జట్టు ఎస్కార్ట్‌తో రావడం ఇదే తొలిసారి అనుకుంటా. పోలాండ్ ఇలా ఎస్కార్ట్‌తో రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై తొమ్మిది నెలలు కావొస్తున్నప్పటికి ఇప్పటికి మిస్సైల్ దాడులు జరగుతూనే ఉన్నాయి. అయితే పోలాండ్ రష్యా-ఉక్రెయిన్లకు బార్డర్ దేశంగా ఉంది. పోలండ్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్ జరగనున్న ఖతార్‌కు వెళ్లాలంటే ఈ రెండు దేశాల ఎయిర్‌బేస్‌ను దాటుకొని వెళ్లాల్సిందే. ఈ మధ్యనే ఉక్రెయిన్-పోలాండ్ బార్డర్లో రష్యా జరిపిన దాడిలో ఇద్దరు పోలాండ్ వ్యక్తులు కూడా మృతి చెందారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పోలాండ్ దేశం తమ ఫుట్‌బాల్ టీం ఖతార్‌కు వెళ్లాలంటే ఎస్కార్ట్ తప్పనిసరన్న విషయాన్ని గుర్తించింది. అందుకే ఖతార్‌కు బయలుదేరిన పోలాండ్ జట్టు విమానానికి ఫైటర్ జెట్-16ను ఎస్కార్ట్‌గా పంపింది. మధ్యలో విమానం వెళ్లగా.. ఇరువైపులా ఫైటర్ జెట్స్-16 ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఇది చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఇక విమానం ఖతార్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫైటర్ జెట్స్ మళ్లీ పోలాండ్‌కు చేరుకున్నాయి. ఇదే విషయాన్ని పోలాండ్ ఫుట్‌బాల్ టీమ్ తమ ట్విటర్లో వీడియో రూపంలో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం కారణంగా భయపడిన పోలాండ్ జట్టు ఎలాగోలా ఎస్కార్ట్ సాయంతో ఖతార్‌లో అడుగుపెట్టింది. ''ఫిఫా చరిత్రలోనే ఒక జట్టు ఇలా ఎస్కార్ట్‌తో వెళ్లడం ఇదే తొలిసారి'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో పోలాండ్ జట్టు గ్రూప్-సిలో ఉంది. ఇదే గ్రూప్‌లో మెక్సికో, అర్జెంటీనా, సౌదీ అరేబియాలు కూడా ఉన్నాయి. కాగా పోలాండ్ వచ్చే మంగళవారం మెక్సికోతో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఉన్న రాబర్ట్ లెవాండోస్కీ పోలాండ్ జట్టు కెప్టెన్‌గా ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న రాబర్ట్ లెవాండోస్కీనే జట్టుకు పెద్ద బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత నవంబర్ 26న సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇక చివరగా నవంబర్ 30న మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనాతో మ్యాచ్ ఆడనుంది. 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశకు చేరిన పోలాండ్ మళ్లీ ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేకపోయింది. Do południowej granicy Polski eskortowały nas samoloty F16! ✈️ Dziękujemy i pozdrawiamy panów pilotów! 🇵🇱 pic.twitter.com/7WLuM1QrhZ — Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022 ✈️ #KierunekKatar 🇵🇱 pic.twitter.com/1dFSxFt5ka — Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022 చదవండి: 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది' FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు' -
చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన... వీడియో వైరల్
చైనాలో అధికార కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ 20వ జాతీయ సదస్సు ఈనెల 16న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ ముగింపు వేడుకలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐతే అనుహ్యంగా చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ముగింపు వేడుకుల నుంచి నిష్క్రమించి బయటకు వచ్చేశారు. అకస్మాత్తుగా హు జింటావో పైకి లేచి సెక్యూరిటీ సాయంతో బయటకు వెళ్లిపోవడంతో అక్కడున్నవారంతా షాక్‌తో అయోమయంగా చూస్తుండిపోయారు. అదీగాక ఆయన గత ఆదివారం కాంగ్రెస్ పార్టీ సదస్సు ప్రారంభ వేడుకలో కూడా కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపించారు. ఇదిలా ఉండగా..ఐదేళ్లకు ఒకసారి జరిగే కాంగ్రెస్ పార్టీ సదస్సు రాజ్యంగ సవరణలతో ముగిసింది. ఆ సదస్సులో తన పార్టీ రాజ్యంగ సవరణలో తైవాన్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం వ్యతిరేకించటంవంటి తీర్మానాన్ని ప్రధానంగా పొందుపరిచింది. అంతేగాదు ఆ సమావేశంలో ముచ్చటగా మూడోసారి జిన్‌పింగ్‌కి అధికారం కట్టబట్టేందుకు పార్టీ సిద్దమైంది కూడా. ఈ మేరకు పార్టీ సెంట్రల్ కమీటీ తోపాటు పార్టీ సభ్యులందరూ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఐతే ఈ ముగింపు వేడుకలో మాజీ అధ్యక్షుడు హు జుంటావో నిష్క్రమించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది Drama in China as former president Hu Jintao is escorted out of the closing ceremony pic.twitter.com/AzsqUJWuFx — Dan Banik (@danbanik) October 22, 2022 (చదవండి: జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం) -
అప్పు వంకతో నీచమైన పనులు
తనకు బాకీ పడ్డ సొమ్మును తీర్చేందుకు ఓ అమ్మాయికి దారుణమైన పనిని అప్పగించింది ఓ యువతి. ఒకరోజులో 17 మందితో.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితురాలు ఆ పని చేసింది. విషయం బాధితురాలి తల్లిదండ్రుల దృష్టికి చేరడంతో.. కోర్టుకు చేరుకుంది ఈ అఘాయిత్యం. ఇంగ్లండ్‌లో వ్యభిచారం చట్టవిరుద్ధమైన చోట ఎస్కార్ట్ ఏజెన్సీలు వెలుస్తుంటాయి. డబ్బు తీసుకుని క్లయింట్లకు తోడును అందించడం ఈ ఏజెన్సీల పని. అలాంటి ఏజెన్సీలో పనిచేస్తోంది 23 ఏళ్ల జార్జియా అలియాస్ టైలర్ జో వాకర్. ఇన్స్టాగ్రామ్ ద్వారా సదరు టీనేజర్‌తో పరిచయం పెంచుకుంది. ఆపై ఆర్భాటాల ద్వారా ఆ టీనేజర్‌ను ఎట్రాక్ట్ చేసింది. సుందర్ల్యాండ్లోని తన అపార్ట్‌మెంట్‌కు రావాల్సిందిగా యువతిని ఆహ్వానించింది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది సదరు యువతి. ఇందుకోసం ట్యాక్సీ, ఇతర ఖర్చులను కూడా వాకరే భరించింది. ఆపై యువతిని అభ్యంతరకరంగా చిత్రీకరించింది. ఆపై యువతి వయసును 18 ఏళ్లుగా చెబుతూ.. ఫొటోలతో సహా ఎస్కార్ట్ఏజెన్సీ ప్రొఫైల్‌లో అప్లోడ్ చేసింది. దీంతో క్లయింట్లు వాకర్ ఇంటికి రాగా.. యువతి భయంతో పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే బాకీ తీర్చకపోతే వ్యక్తిగత ఫొటోల్ని బయటపెడతానని బెదిరించింది వాకర్. పైగా తాను చెప్పినపని చేస్తే తక్కువ టైంలో బోలెడంత డబ్బు వస్తుందని టీనేజర్‌కు ఆశపెట్టింది. అలా రెండు వారాల్లో 30 మందితో బలవంతంగా చేయికూడని పనులు చేయించింది. వచ్చిన సొమ్ములో 700 పౌండ్లను వాకర్ తీసుకోగా.. 3000 పౌండ్లు మాత్రం యువతికే ఇచ్చింది. దీంతో మురిసిపోయిన యువతి లగ్జరీ ఐటెమ్స్‌తో ఇంటికి చేరుకుంది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. అసలు విషయం ఆరా తీయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నేరం ఒప్పుకున్న వాకర్‌కు 16 నెలల జైలు శిక్ష, అక్కడి చట్టాల ప్రకారం.. నిరుద్యోగ భృతి కింద అందాల్సిన వేతనంలోనూ రెండేళ్లపాటు కోత విధిస్తున్నట్లు న్యూక్యాజిల్ క్రౌన్ కోర్టు Newcastle Crown Court తీర్పు ఇచ్చింది. అంతేకాదు వాకర్‌ను మరోసారి వ్యభిచారం వైపు మళ్లకుండా చూడాలంటూ ఆమె తరపు న్యాయవాదిని జడ్జి ఆదేశించింది. -
క్యుబోటా చేతికి ఎస్కార్ట్స్
న్యూఢిల్లీ: వ్యవసాయ పరికరాల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్‌లో జపనీస్ భాగస్వామి క్యుబోటా కార్పొరేషన్ మెజారిటీ వాటాను పొందనుంది. ఇందుకు రూ. 10,000 కోట్లవరకూ పెట్టుబడులను వెచ్చించనుంది. ఇందకు రెండు సంస్థలూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిలో భాగంగా తొలుత ఎస్కార్ట్స్‌లో క్యుబోటా దాదాపు రూ. 1,873 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా 5.9 శాతం అదనపు వాటాను పొందనుంది. దీంతో క్యుబోటా కార్ప్ వాటా 14.99 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం 9.09 శాతం వాటాను కలిగి ఉంది. ఫలితంగా ఎస్కార్ట్స్‌కు సంయుక్త ప్రమోటర్‌గా క్యుబోటా ఆవిర్భవించనుంది. తాజా ఒప్పందం ప్రకారం క్యుబోటాకు ఫ్రిఫరెన్షియల్ పద్ధతిలో 93.64 లక్షల షేర్లను ఎస్కార్ట్స్ జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 2,000 ధరలో వీటి జారీ ద్వారా రూ. 1,873 కోట్లు సమకూర్చుకోనుంది. ఆపై ఎస్కార్ట్స్ వాటాదారులకు క్యుబోటా ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెబీ నిబంధనల్లో భాగంగా పబ్లిక్ నుంచి 26% వాటా కొనుగోలును చేపట్టవలసి ఉంటుంది. ఇందుకు షేరుకి రూ. 2,000 ధరలో రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. దీంతో ఎస్కార్ట్స్‌లో 44.80% వాటాను క్యుబోటా సొంతం చేసుకోనుంది. తదుపరి ఎస్కార్ట్స్ బెనిఫిట్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు ఎస్కార్ట్స్లోగల వాటాను రద్దు చేయనుంది. వెరసి క్యుబోటా వాటా 53%కి బలపడనుంది. పేరు మార్పు: కంపెనీ పేరును ఎస్కార్ట్స్ క్యుబోటా లిమిటెడ్‌గా సవరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఎస్కార్ట్స్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీయంగా గల భాగస్వామ్య అనుబంధ సంస్థలను ఎస్కార్ట్స్‌లో విలీనం చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో క్యుబోటా వాటా 54–55 శాతానికి చేరనుంది. కాగా.. ఎస్కార్ట్స్‌లో 11.6 శాతం వాటాను కలిగిన ప్రస్తుత ప్రమోటర్ నందా కుటుంబం ఎలాంటి వాటానూ విక్రయించడంలేదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం నందా కుటుంబం, ఎస్కార్ట్స్ బెనిఫిట్ ట్రస్ట్‌లకు సంయుక్తంగా 36.59 శాతం వాటా ఉంది. తాజా వార్తలతో ఎస్కార్ట్స్ షేరు దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,803 వద్ద ముగిసింది. -
3.4% తగ్గిన ఎస్కార్ట్స్ విక్రయాలు
దేశీయంగా వ్యవసాయ పనులకు ఇంజనీరింగ్, పరికరాలనందించే ప్రముఖ కంపెనీ ఎస్కార్ట్స్ విక్రయాలు 3.4 శాతం తగ్గాయని సోమవారం ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా మే నెలలో ట్రాక్టర్ విక్రయాలు 3.4 శాతం క్షీణించి 6,594 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మేనెలలో 6,827 యూనిట్ల విక్రయాలు జరిపినట్లు బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. గతేడాది మేనెలలో ట్రాక్టర్ల అమ్మకాలు దేశీయంగా 6,488 యూనిట్లు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య తగ్గి 6,454 యూనిట్లకు చేరింది. ఎగుమతులు 58.7శాతం తగ్గి గతేడాది నమోదైన విక్రయాలు 339 యూనిట్ల నుంచి 140 యూనిట్లకు పడిపోయిందని కంపెనీ వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సకాలంలో రుతుపవనాలు రావడం వల్ల వ్యయసాయ పనులు మొదలవడంతో ట్రాక్టర్ల విక్రయాలు పెరుగుతాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. కాగా స్టాక్ మార్కెట్లో గత నాలుగురోజులుగా ఈ కంపెనీ షేర్లు జోరుగా ర్యాలీచేసి 32 శాతం పెరిగాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఎస్కార్ట్స్ కంపెనీ షేరు 7.3 శాతం లాభపడి రూ.968.50 వద్ద ట్రేడ్ అవుతోంది. -
షేన్‌వార్న్ మరో ‘సెక్స్’బాగోతం
లండన్ : ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ స్పిన్ బౌలర్ షేన్‌వార్న్ శృంగార పురుషుడనే ప్రపంచానికి తెల్సిందే. ఈ విషయంలో ఆయన ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన తన అజ్ఞాత (బయటి ప్రపంచానికి ఇంకా ఆమె పేరు తెలియదు) ప్రేయసి ఒకరు 19 ఏళ్ల డవీనా, 27 ఏళ్ల పాప్పిలనే ఇద్దరు సెక్స్ వర్కర్లను నేరుగా ఇంటికి తీసుకరాగా నలుగురు కలిసి సరస సల్లాపాల్లో మునిగి తేలారట. పైగా షేన్ వార్న్ తన పడక గది కిటికీ తలుపులు తెరచి ఉంచడంతో ఇరుగు పొరుగు వారి దృశ్యాలను చూసినంత సేపు చూసి చివరకు ఓ స్థానిక టీవీ ఛానల్‌కు ఫిర్యాదు చేశారట. టీవీ బృందం పరుగెత్తుకొచ్చే సరిగా ఇద్దరు సెక్స్ వర్కర్లను తీసుకొని ఆ అజ్ఞాత ప్రేయసితో తన కారులో ఉడాయించారట. ఈ బాగోతమంతా లండన్ వాయువ్య ప్రాంతంలోని షేన్‌వార్న్‌కు చెందిన 30 కోట్ల రూపాయల విలువైన ‘మైడా వాలే’ నివాసంలో జరిగిందట. ఈ వార్తా కథనాన్ని ప్రచురించిన ‘ది సన్’ పత్రిక డవీనా రెండు గంటలకు 40 వేలు, పొప్పి ప్రతి రెండు గంటలకు 50 వేల రూపాయలు చార్జి చేస్తారని తెలిపింది. డవీనాకు మార్కెట్లో ‘పాకెట్ రాకెట్’ అని పాప్పిని ‘పార్టీ గర్ల్’ అని పిలుస్తారట. షేన్‌వార్న్ తన జీవితంలో ఇప్పటికే పలువురు అమ్మాయిలను ప్రేమించారు. వారిలో ఒకరిద్దరిని పెళ్లి చేసుకొని వదిలేశారు. మిగతా వారిని పెళ్లి చేసుకోకుండానే వదిలేశారు. స్త్రీ లోలుడన్న కారణంగానే ఆయన కొన్నిసార్లు ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. షేన్ వార్న్ వ్యక్తిగత జీవితంలోని విచ్చలవిడితనం వల్ల కాకుండా, తెల్లార్లు శృంగార లీలల్లో పాల్గొంటూ నిద్ర మత్తుతో క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టడమే అందుకు ప్రధాన కారణమని తోటి క్రికెటర్లు చెబుతారు. ఆయన కూడా తన శృంగార లీలల గురించి ఎప్పుడూ దాచుకోలేదు. ‘నేనేమి నేరం చేయడం లేదు. ఎవరికేమీ అన్యాయం చేయడం లేదు. నాకు అందమైన అమ్మాయిలతో శృంగారమంటే మహా పిచ్చి. అమ్మాయిల అనుమతితోనే నేను వారితో గడుపుతాను’ అని షేన్ పలు సందర్భాల్లో తన గురించి తాను చెప్పుకున్నారు. ‘లవ్ ఐలాండ్’ పోటీల్లో పొల్గొన్న 21 ఏళ్ల లూసి డన్లాన్ను ఈ ఏడాది మొదట్లో ‘ఇన్స్టాగ్రామ్’లో చూసి ముచ్చటపడ్డారు. ఆ తర్వాత అనతి కాలంలోనే వారిద్దరు కలిసి తిరగడం చూసిన ప్రజలు ఆశ్చర్య పడ్డారు. షేన్‌వార్న్ పెద్ద కూతురుకంటే లూసి వయస్సులో చిన్నదట! షేన్‌వార్న్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు 1993లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రముఖ బౌలర్‌గా గుర్తింపు పొందారు. 1995లో సైమన్ కల్లాహన్ను షేన్ పెళ్లి చేసుకున్నారు. 2003లో నిషేధిత డ్రగ్ వాడడంతో క్రికెట్ టీమ్ నుంచి తప్పించారు. అందుకని ఆయన ఆ ఏడాది వరల్డ్ కప్ సిరీస్‌లో ఆడలేక పోయారు. 2005లో సైమన్‌కు షేన్ విడాకులు 2006లో కెరీర్లో 703 వికెట్లు తీసుకొన్న షేన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 2011లో లిజ్ హర్లీతో రెండేళ్లు ప్రేమాయణం నడిపారు. 2014లో ‘ప్లే బాయ్’ మోడల్ ఎమిలీ స్కాట్‌తో ప్రేమాయణం. 2019లో అజ్ఞాత ప్రేయసితో సంసారం. -
పరువు నష్టం దావా వేసిన ట్రంప్ భార్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌ను ఇటీవల కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థల్లో ప్రచురితమైన కథనాలు తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. మెలానియా ట్రంప్ గత జీవితం, ఆమె అమెరికాకు వచ్చి ట్రంప్ భార్యగా మారిన క్రమం లాంటి తదితర వివరాలను వెల్లడిస్తూ ఇటీవల 'డెయిలీ మెయిల్'లో కథనం ప్రచురితమైంది. ఓ స్లోవేకియన్ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ డెయిలీ మెయిల్ ఈ కథనాన్ని ప్రచురించింది. అందులో.. గతంలో మెలానియా ట్రంప్ మోడలింగ్ చేసిన ఏజెన్సీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు మోడలింగ్ ఏజెన్సీ సంపన్నులకు మహిళలను సరఫరా చేసేదంటూ డెయిలీ మెయిల్ ఆరోపణలు చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మెలానియా డెయిలీ మెయిల్‌తో పాటు అలాటి కథనాన్నే ప్రచురించిన మరో మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశారు. డెయిలీ మెయిల్ వెల్లడించిన కథనం వంద శాతం అసత్యమని.. అది తన వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉందని మెలానియా ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై మేరీలాండ్‌లోని మోంట్గోమరీ కోర్టులో గురువారం పరువునష్టం దావా వేసినట్లు ఆమె ప్రతినిథి చార్లెస్ హార్డర్ తెలిపారు. 150 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఆమె డిమాండ్ చేశారు. మెలానియా పరువునష్టం దావా వేసిన రెండు గంటల్లోనే డెయిలీ మెయిల్ తన కథనాన్ని ఉపసంహరించుకోవడం విశేషం. అంతేకాదు.. తాము ప్రచురించిన కథనం ఉద్దేశం మెలానియా 'ఎస్కార్ట్'గా పనిచేశారని కాదని డెయిలీ మెయిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
మంత్రికి తప్పిన ప్రమాదం
డిచ్పల్లి (నిజామాబాద్): రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ఆదిలాబాద్ జిల్లాలో జరుగనున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరారు. కాన్వాయ్ వాహనాలు 44వ నెంబరు జాతీయ రహదారిపై డిచ్పల్లి మండలంలోని టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్ సమీపంలోకి చేరుకున్నాయి. అదే సమయంలో కాన్వాయ్ ముందుగా కర్నూలు నుంచి నిర్మల్‌కు వెళుతున్న బొలెరో వాహనం వెనుక టైరు అకస్మాత్తుగా ఊడి పోవడంతో ఆ వాహనం రోడ్డుపై నిలిచి పోయింది. వెనక నుంచి వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం రోడ్డుపై నిలిచి పోయిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనకనే మంత్రి జోగు రామన్న వాహనం ఉంది. మంత్రి కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పక్కకు తప్పించి సడన్‌బ్రేక్ వేసి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎస్కార్ట్ వాహనంలో ఉన్న పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తన వాహనం దిగిన మంత్రి ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సుదర్శన్‌ను, ఏఆర్ఎస్సై భూమన్న, సిబ్బందిని పలకరించి ఏవైనా దెబ్బలు తగిలియా అని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిచ్పల్లి ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాను అర్జంటుగా ఆదిలాబాద్ వెళ్లాల్సి ఉందని, ఎస్కార్ట్ వాహనం విషయం చూసుకోమని డిచ్పల్లి పోలీసులకు చెప్పిన మంత్రి కాన్వాయ్‌లో ఇతర వాహనాలు వెంట రాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం ముందు భాగం ధ్వంసమైంది. -
ఎక్కడా ఇబ్బందులు రావొద్దు
► పకడ్బందీగా టెట్ నిర్వహించాలి ► అధికారులతో సమీక్షించిన ఏజేసీ మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఈనెల 22న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్ అదికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్సు హాల్లో టెట్ నిర్వహణకు ఎంపిక చేసిన రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 171పరీక్ష కేంద్రాల్లో 64,828 మంది అభ్యర్థులు టెట్ రాస్తున్నారని, రెండు పేపర్లకు జరిగే ఈ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకరోజు ముందుగానే కేటాయించిన కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పరీక్షకు పోలీస్స్టేషన్ల నుంచి పేపర్లను తీసుకెళ్లి పరీక్ష అనంతరం పేపర్లను తిరిగి డీఈఓ కార్యాలయంలో సమర్పించే వరకు బాధ్యతగా ఉండాలని సూచించా రు. మొదటి పేపర్ పూర్తి కాగానే వెంటనే సంబంధిత రూట్ అధికారులు పేపర్లను సెంటర్ల వారీగా సేకరించి ఎస్కార్ట్ సహాయం తో డీఈఓ కార్యాలయానికి చేర్చాలన్నారు. రెండో పేపర్‌కు సంబంధించిన బాధ్యతను కూడా తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఈఓ విజయలక్ష్మీబాయి, నాగర్‌కర్నూల్ డిప్యూటీ ఈఓ రవీందర్ పాల్గొన్నారు. ఠాణాలకు టెట్ ప్రశ్నపత్రాలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్ష పత్రాలను జిల్లా కోషాధికారి కార్యాలయం నుంచి పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లకు శుక్రవారం తరలించారు. అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలి ఈ నెల 22న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరె న్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఇన్విజిలేటర్ల, ప్రత్యేకాధికారుల, రూట్ అధికారుల నియామకం వంటి విషయాలపై చర్చించారు. -
‘డీసెంట్’గా మోసం
ఒకరిని అరెస్టు చేసిన నగర సైబర్‌క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: మేల్/ఫీమేల్ ఎస్కార్ట్ సర్వీసెస్‌లో అవకాశాలు కల్పిస్తామని ఓ దినపత్రికలో ప్రకటనలు ఇచ్చి డబ్బులు తీసుకొని నిరుద్యోగులను మోసం చేసిన ఒకరిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్‌రావు కథనం ప్రకారం...ఫ్రెండ్షిప్, మేల్/ఫీమేల్ ఎస్కార్ట్‌లో అవకాశాలతో పాటు ఫ్రెండ్షిప్ పరిచయాలు పెంచుతామని బోయిన్‌పల్లిలోని డీసెంట్ సర్వీసెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ క్లబ్ పేరిట ఓ దినపత్రికలో నిందితుడు మీర్‌పేటకు చెందిన గోవింద్ వెంకట రమణ ప్రకటన ఇచ్చాడు. దీని పట్ల ఆకర్శితుడైన సికింద్రాబాద్ లాల్పేటకు చెందిన గోపు శ్రీనివాస్ సదరు ఫోన్ నంబర్లో సంప్రదించగా పల్లవి పేరు గల అమ్మాయి మెంబర్షిప్ కోసం రూ.3,600 డిపాజిట్ చేయాలని సూచించడంతో అతను వారు చెప్పిన బ్యాంక్ ఖాతాలో నగదు జమచేశాడు. దీంతో ఆమె దీక్ష అనే అమ్మాయితో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇవ్వడంతో శ్రీనివాస్ దీక్షను సంప్రదించగా మలక్‌పేట ఎస్బీఐ ఖాతాలో రూ.పదివేలు డిపాజిట్ చేయాలని సూచించింది. ఆ తర్వాత వారికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని రావడంతో మోసపోయినట్లు గుర్తించిన శ్రీనివాస్ నగర సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితుడు గోవింద్ వెంకట రమణను మీర్‌పేట బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తన భార్య కృపారాణి ఫోన్లో మాట్లాడి మెంబర్షిప్ ఫీజు కట్టిస్తుందని, సాహెబ్‌నగర్‌కు చెందిన హుమంత్ రాజ్, ఢిల్లీ వాసి ఆశుతోష్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించుకొని వారికి కమిషన్ ఇచ్చేవాడినని. డబ్బులు డ్రా చేసుకున్నా తర్వాత 20 శాతం కమిషన్ ఇస్తున్నట్లు నిందితుడు వెల్లడించాడు. -
ఎస్కార్ట్ కళ్లుగప్పి నిందితుడి పరార్
నెల్లూరు(క్రైమ్): కాలకృత్యాలు తీర్చుకు వస్తానని చెప్పి ఎస్కార్ట్ కళ్లుగప్పి ఓ నిందితుడు పరారైన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై మోరూరుకు చెందిన జి.మురళీని ఈ ఏడాది జనవరిలో సూళ్లూరుపేట రైల్వే పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతను మైనర్ కావడంతో రిమాండ్ నిమిత్తం తిరుపతిలోని జువైనల్ హోమ్‌కు తరలించారు. నెల్లూరు జువైనల్ కోర్టులో వాయిదా ఉండటంతో నెల్లూరు పోలీసులు నిందితునితో పాటు మరో ఇద్దరు జువైనల్స్‌ను తిరుపతి నుంచి గురువారం తీసుకొచ్చారు. తిరిగి తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మురళీ కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని చెప్పి గోడచాటుకు వెళ్లి ఉడాయించాడు. దీంతో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు
న్యూయార్క్: ప్యారీస్ నుంచి న్యూయార్క్ వస్తున్న ఎయిర్ ఫ్రాన్స్ ప్యాసింజర్ జెట్ విమానానికి రెండు అమెరికా ఫైటర్ విమానాలు(యూఎస్ ఎఫ్-15) తోడుగా వెళ్లాయి. ప్యారిస్ విమానంలో కెమికల్ ఆయుధాలు ఉన్నాయని ఓ ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన ఎఫ్ బీఐ వెంటనే రెండు ఫైటర్ విమానాలను ఫ్రాన్స్ విమానం దిగే జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా పంపించింది. దీనిపై ఎఫ్‌బీఐ వివరణ ఇస్తూ ముందస్తుగా బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఇలా చేశామని, ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. ఫ్రాన్స్ విమానం కూడా సురక్షితంగానే దిగిందని, అనంతరం తనిఖీలు నిర్వహించామని వివరించారు.