Air France
-
కరోనా : 7500 ఉద్యోగాల కోత
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయుక్తంగా 7,500 ఉద్యోగ కోతలను శుక్రవారం ప్రకటించాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, భవిష్యత్తులో విమాన ప్రయాణ అవకాశాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో సంక్షోభంలో పడిన సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఫ్రాన్స్ 6500 మందిని, హాప్లో వెయ్యిమందిని తొలగించనున్నామని వెల్లడించాయి. ఎయిర్ ఫ్రాన్స్‌లో మొత్తం 41వేలమంది ఉద్యోగులుండగా, హాప్లో 2400మంది పనిచేస్తున్నారు. కరోనా సంక్షోభంతో మూడు నెలల్లో తమ ట్రాఫిక్ 95 శాతం పడిపోయిందని, దీంతో రోజుకు 15 మిలియన్ యూరోల నష్టం వచ్చిందని ఎయిర్ ఫ్రాన్స్ ప్రకటించింది. 2024 వరకు కోలుకునే ఆశలు కూడా లేవని తెలిపింది. ఉద్యోగాల కోతపై యూనియన్లు ఆందోళనకు దిగాయి. సిబ్బంది ప్రతినిధులతో చర్చల అనంతరం 2022 నాటికి ఈ తొలగింపులు ఉంటాయని యాజమాన్యం శుక్రవారం రాత్రి ప్రకటించింది. కోవిడ్-19 ఒక సాకు మాత్రమేనని ఆందోళనకారుడు, హాప్ ఉద్యోగి జూలియన్ లెమరీ మండిపడ్డారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీయడానికి బదులు, సంస్థ పునర్నిర్మాణం, బెయిల్ అవుట్ ప్యాకేజీపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. -
పారిస్ టూ ముంబై మధ్యలో ఇరాన్..
న్యూఢిల్లీ : పారిస్ నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఫ్రాన్స్ సబ్సిడరీకి చెందిన ఎయిర్‌బస్ ఏ 340 దుబాయ్ వెళుతూ ఇరాన్లో గంటల కొద్దీ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలతో విమానం ఇరాన్ నగరం ఇస్ఫహాన్‌లో ల్యాండయింది. ప్రయాణీకులు అందరూ క్షేమంగానే ఉన్నారని, అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారని ఇరాన్ వార్తాసంస్థ పేర్కొంది. విమానాన్ని స్ధానిక మెయింటెనెన్స్ బృందం చెక్ చేసిందని గురువారం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుందని ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది. దుబాయ్ నుంచి ఇతర ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల్లో ప్రయాణీకులను ముంబై చేరవేస్తామని తెలిపింది. కాగా గత ఏడాది డిసెంబర్లో సైతం నార్వేకు చెందిన ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ దుబాయ్ నుంచి ఓస్లో వెళుతూ ఇరాన్లో అత్యవసరంగా ల్యాండయింది. -
ఫ్రాన్స్ ఎయిర్‌లైన్స్‌తో జెట్ ఒప్పందం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ విమాన సర్వీసులను మరింత విస్తరించే లక్ష్యంతో జె ట్ ఎయిర్వేస్ మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఎయిర్ ఫ్రాన్స్ కేఎల్ఎం, డెల్టా ఎయిర్ లైన్స్‌తో భారీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. యూరోప్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు గాను ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జెట్ ఛైర్మన్ నరేష్ గోయెల్ , ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్ఎం చీఫ్ జెఎం జనైల్లాక్ బుధవారం భారతదేశంలో కోడ్ భాగస్వామ్యంపై అధికారిక ప్రకటన చేశారు. కనెక్టివిటీని మరింత విస్తరించుకునే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే ప్రకటించారు. అయితే ఈ రెండు ఎయిర్‌లైన్స్ ఈక్విటీ వాటాను ప్రకటించలేదు అలాగే ఇతిహాద్‌తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో అంతర్జాతీయ రవాణాదారులు మార్గాల్లో విస్తరిస్తున్నామనీ ,తమకు గల్ఫ్ ఒక ముఖ్యమైన మార్కెట్‌గా కొనసాగుతుంది. దాని కార్యకలాపాలను తగ్గించదని జెట్ ఛైర్మన్ నరేష్ గోయెల్ విలేకరులకు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి ట్రేడింగ్‌లో జెట్‌ఎయిర్‌వేస్ కౌంటర్ బాగా లాభపడింది. కాగా ఇండియన్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్లో ఇతిహాద్ సహా మూడు పెద్ద గల్ఫ్ సంస్థలు 24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ గ్రూప్ ప్రస్తుతం 115 విమానాల విమానాలను నిర్వహిస్తుండగా, ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్ఎం 34 విమానాల విమానాలను కలిగి ఉంది. -
అట్లాంటిక్‌పై భయానక ప్రయాణం
ప్యారిస్ : వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. అందులో వందల మంది ప్రయాణికులు.. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణం.. హఠాత్తుగా ఇంజిన్ ఫెయిల్.. ఒక్కసారిగా ప్రయాణికులు పరిస్థితి ఊహించుకోండి.. అందులో మీరుంటే? ఇది ఇంకా భయానకం. సరిగ్గా ఇటువంటి ప్రయాణమే ఎయిర్ ఫ్రాన్స్-380 ప్రయాణికులకు ఎదురైంది. ప్యారిస్ నుంచి లండన్ మీదుగా.. లాస్ ఎంజెల్స్‌కు వెళుతోంది. సరిగ్గా లండన్ హీత్రూ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుని... అట్లాంటిక్ మీదుగా లాస్ ఎంజిల్స్‌కు వెళుతోంది. అప్పుడు ఫ్లయిట్ భూమికి 35 వేల అడుగుల ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో ఒక పక్షి.. అంతే వేగంగా వచ్చి ఫ్లయింట్ ఇంజిన్‌ను ఢీ కొట్టింది. ఒక్కసారిగా విమానం కుదుపుకు గురయింది.. ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. పక్షి ఢీ కొట్టిన కొన్ని క్షణాలకూ ఇంజిన్ పై భాగం మొత్తం డ్యామేజ్ అయింది.. ఏం జరుగుతుందో గుర్తించే లోపే.. అందకీ అర్థమయింది. ప్రమాదాన్ని అంచనా వేసిన పైలెట్ ఫ్లయిట్‌ని కెనడాలోని గూస్ బే ఎయిర్‌పోర్టుకు మళ్లించాడు.. అయితే అంత దూరం ప్రయాణించదనుకుని.. దగ్గర్లోని గడ్డి మీద అత్యంత సురక్షితంగా ఎయిర్ ఫ్రాన్స్‌ని ల్యాండ్ చేశాడు. పక్షి ఢీ కొట్టిన తరువాత ఇంజిన్ ఫొటోలు, ల్యాండింగ్ సమయంలో.. అక్కడే ఉన్న ఒక వ్యక్తి తీసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి. -
అట్లాంటిక్‌పై భయానక ప్రయాణం
-
'బాంబు' భయంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
'బాంబు' భయంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నైరోబి: 'బాంబు' భయంతో ఎయిర్ ఫ్రాన్స్ విమానం కెన్యా తీరప్రాంత నగరం మొంబాసాలో అత్యవసరంగా దిగింది. మారిషస్ నుంచి పారిస్ వెళుతున్న బోయింగ్ 777 ఎయిర్‌ఫ్రాన్స్ విమానం (463)లో లావెటరీలో అనుమానాస్పద పరికరం కనిపించింది. దీనిని బాంబుగా అనుమానించిన పైలట్లు మొంబాసాలోని మొయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని, ఇందుకు ఎయిర్పోర్ట్ అధికారులు అంగీకరించడంతో శనివారం అర్ధరాత్రి 12.37 గంటల సమయంలో విమానం అత్యవసరంగా దిగిందని పోలీసులు తెలిపారు. విమానంలో 459 మంది ప్రయాణికులు, 14మంది సిబ్బంది ఉన్నారు. విమానం శనివారం రాత్రి మారిషస్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరింది. లావెటరీలో పేలుడు పదార్థంలాంటి పరికరం ఉండటంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాత అనుమానిత పరికరాన్ని విమానం నుంచి బయటకు తీసుకెళ్లి పరీక్షలు జరుపుతున్నారు. బాంబు నిర్వీర్య బృందాలు ఈ పరికరాన్ని పరిశీలిస్తున్నాయి. -
ఫ్రాన్స్ విమానానికి తోడుగా అమెరికా విమానాలు
న్యూయార్క్: ప్యారీస్ నుంచి న్యూయార్క్ వస్తున్న ఎయిర్ ఫ్రాన్స్ ప్యాసింజర్ జెట్ విమానానికి రెండు అమెరికా ఫైటర్ విమానాలు(యూఎస్ ఎఫ్-15) తోడుగా వెళ్లాయి. ప్యారిస్ విమానంలో కెమికల్ ఆయుధాలు ఉన్నాయని ఓ ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన ఎఫ్ బీఐ వెంటనే రెండు ఫైటర్ విమానాలను ఫ్రాన్స్ విమానం దిగే జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా పంపించింది. దీనిపై ఎఫ్‌బీఐ వివరణ ఇస్తూ ముందస్తుగా బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఇలా చేశామని, ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. ఫ్రాన్స్ విమానం కూడా సురక్షితంగానే దిగిందని, అనంతరం తనిఖీలు నిర్వహించామని వివరించారు.