ప్యారిస్ : వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. అందులో వందల మంది ప్రయాణికులు.. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణం.. హఠాత్తుగా ఇంజిన్ ఫెయిల్.. ఒక్కసారిగా ప్రయాణికులు పరిస్థితి ఊహించుకోండి.. అందులో మీరుంటే? ఇది ఇంకా భయానకం. సరిగ్గా ఇటువంటి ప్రయాణమే ఎయిర్ ఫ్రాన్స్-380 ప్రయాణికులకు ఎదురైంది. ప్యారిస్ నుంచి లండన్ మీదుగా.. లాస్ ఎంజెల్స్‌కు వెళుతోంది. సరిగ్గా లండన్ హీత్రూ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుని... అట్లాంటిక్ మీదుగా లాస్ ఎంజిల్స్‌కు వెళుతోంది. అప్పుడు ఫ్లయిట్ భూమికి 35 వేల అడుగుల ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో ఒక పక్షి.. అంతే వేగంగా వచ్చి ఫ్లయింట్ ఇంజిన్‌ను ఢీ కొట్టింది. ఒక్కసారిగా విమానం కుదుపుకు గురయింది.. ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. పక్షి ఢీ కొట్టిన కొన్ని క్షణాలకూ ఇంజిన్ పై భాగం మొత్తం డ్యామేజ్ అయింది.. ఏం జరుగుతుందో గుర్తించే లోపే.. అందకీ అర్థమయింది. ప్రమాదాన్ని అంచనా వేసిన పైలెట్ ఫ్లయిట్‌ని కెనడాలోని గూస్ బే ఎయిర్‌పోర్టుకు మళ్లించాడు.. అయితే అంత దూరం ప్రయాణించదనుకుని.. దగ్గర్లోని గడ్డి మీద అత్యంత సురక్షితంగా ఎయిర్ ఫ్రాన్స్‌ని ల్యాండ్ చేశాడు. పక్షి ఢీ కొట్టిన తరువాత ఇంజిన్ ఫొటోలు, ల్యాండింగ్ సమయంలో.. అక్కడే ఉన్న ఒక వ్యక్తి తీసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి.