ఎన్‌ఎస్‌జీకి భారత్ సిద్ధం: అమెరికా
వ్యతిరేకించిన చైనా, పాక్
వాషింగ్టన్: అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ చేరేందుకు సిద్ధమైందని అమెరికా తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. అయితే, భారత్‌కు ఈ సభ్యత్వం ఇవ్వొద్దని చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా అభ్యంతరం తెలిపాయి. క్షిపణి సాంకేతిక నియంత్రణకు అవసరమైన సంపత్తిని భారత్ సమకూర్చుకున్నందున సభ్యత్వానికి సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం తెలిపారు. ఎన్‌ఎస్‌జీలో కొత్త సభ్యులు చేరికనేది ప్రస్తుత సభ్యదేశాల మధ్య అంతర్గత వ్యవహారమన్నారు. అయితే, ఎన్‌ఎస్‌జీలో భారత్ చేరికను అడ్డుకోవాలని తాము 48 సభ్యదేశాల అభిప్రాయాన్ని కోరినట్టు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై భారత్ సంతకం పెట్టాలని, తమతోపాటు ఇతర ఎన్‌ఎస్‌జీ సభ్య దేశాలు కోరుతున్నాయంది.
భారత్ సరిహద్దుల్లో ‘డ్రాగన్’ నీడ.. చైనా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకున్నదని, భారతదేశ సరిహద్దులో మరింత మంది సైనికులను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది.