
క్యూ3లో 5.6 శాతం తగ్గుదల
10.9 బిలియన్ డాలర్లుగా నమోదు
ఏప్రిల్–డిసెంబర్ మధ్య 27% అప్
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2024–25, క్యూ3)లో ఎఫ్‌డీఐలు 5.6 శాతం తగ్గి 10.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో దేశంలోకి 11.55 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ..
→ 2024–25 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 13.6 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. వార్షికంగా 43 శాతం పెరిగాయి.
→ ఏప్రిల్–డిసెంబర్ తొమ్మిది నెలల కాలానికి చూస్తే 27 శాతం ఎగసి, 40.67 డాలర్లను తాకాయి. 2023–24 ఇదే కాలంలో దేశంలోకి వచి్చన ఎఫ్‌డీఐల విలువ 32 బిలియన్ డాలర్లు.
→ ఈక్విటీ పెట్టుబడులు, తిరిగి ఇన్వెస్ట్ చేసిన లాభాలు, ఇతర మూలధన పెట్టుబడులు తొలి తొమ్మిది నెలల్లో 21.3 శాతం వృద్ధితో 62.48 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 51.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
→ భారీగా ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టబడులు వెచి్చంచిన దేశాల్లో సింగపూర్ (12 బిలియన్ డాలర్లు), అమెరికా (3.73 బి.డాలర్లు), నెదర్లాండ్స్ (4 బి.డాలర్లు), యూఏఈ (4.14 బి.డాలర్లు), సైప్రస్ (1.8 బి.డాలర్లు) నిలిచాయి.
→ మారిషస్, జపాన్, యూకే, జర్మనీ నుంచి ఎఫ్‌డీఐలు క్షీణించాయి.
→ రంగాల వారీగా చూస్తే, సేవల రంగ కంపెనీలకు తొలి 9 నెలల్లో అత్యధికంగా 7.22 బిలియన్ డాలర్లు లభించాయి.
→ పునరుత్పాదక రంగం 3.5 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఆకర్షించింది.
→ మహారాష్ట్ర అత్యధికంగా 16.65 బిలియన్ డాలర్లను చేజిక్కించుకోగా, తర్వాత స్థానాల్లో కర్నాటక (4.5 బిలియన్ డాలర్లు), గుజరాత్ (5.56 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment