పసిడి డిమాండ్‌కు ధరల చెక్‌ | India gold demand drops 5percent in June quarter | Sakshi
Sakshi News home page

పసిడి డిమాండ్‌కు ధరల చెక్‌

Jul 31 2024 5:59 AM | Updated on Jul 31 2024 7:57 AM

India gold demand drops 5percent in June quarter

జూన్‌ త్రైమాసికంలో భారత్‌ డిమాండ్‌ 5 శాతంపైగా డౌన్‌

149.7 టన్నులుగా నమోదు

భారీ ధరల నేపథ్యం– ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక  

ముంబై: భారత్‌లో పసిడి పరిమాణం డిమాండ్‌ ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికిపైగా పతనమైంది. 2023 ఇదే కాలంతో పోలి్చతే డిమాండ్‌ పరిమాణం 158.1 టన్నుల నుంచి 149.7 టన్నులకు పడిపోయింది. అధిక ధరలు, దీనితో కొనుగోళ్లు త్గగడం దీనికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) జూన్‌ త్రైమాసిక గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదిక పేర్కొంది. 

ఈ నెల 23వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ కస్టమ్స్‌ సుంకాలను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు భారీగా పడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి డిమాండ్‌కు ఏమాత్రం దోహదపడిందన్న అంశం ఆగస్టు త్రైమాసికంలో తెలియనుంది. తాజా డబ్ల్యూజీసీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 

→ జూన్‌ త్రైమాసికం డిమాండ్‌ పరిమాణంలో తగ్గినా.. విలువలో మాత్రం 17 శాతం పెరిగి రూ.82,530 కోట్ల నుంచి రూ.93,850 కోట్లకు ఎగసింది.  
→ 24 క్యారెట్ల గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ.74,000 దాటితే, సగటు ధర ఇదే కాలంలో రూ.52,191.60 నుంచి రూ.62,700.50కు ఎగసింది. (దిగుమతి సుంకం, జీఎస్‌టీ మినహా). అంతర్జాతీయంగా చూస్తే, ఔన్స్‌ (31.1గ్రాములు) ధర ఇదే కాలంలో 1,975.9 డాలర్ల నుంచి 2,338.2 డాలర్లకు ఎగసింది. (అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయర్క్‌ కమోడిటీ ఎక్సే్చంజ్లో జూలై 16వ తేదీన   ఔన్స్‌ ధర ఆల్‌టైమ్‌ హై 2,489 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే) 
→ ఇక జూన్‌ త్రైమాసికంలో ఆభరణాలకు పరిమాణ డిమాండ్‌ 17 శాతం పడిపోయి 128.6 టన్నుల నుంచి 106.5 టన్నులకు చేరింది.  
→ ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ మాత్రం ఇదే కాలంలోలో 46 శాతం పెరిగి 29.5 టన్నుల నుంచి  43.1 టన్నులకు ఎగసింది.  
→ రీసైకిల్డ్‌ గోల్డ్‌ పరిమాణం 39 శాతం తగ్గి 37.6 టన్నుల నుంచి 23 టన్నులకు పడింది.  
→ దిగుమతులు 8 శాతం పెరిగి 182.3 టన్నుల నుంచి 196.9 టన్నులకు ఎగసింది.

గ్లోబల్‌ డిమాండ్‌ 4 శాతం అప్‌
మరోవైపు అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ జూన్‌ త్రైమాసికంలో 4 శాతం పెరిగి 1,207.9 టన్నుల నుంచి 1,258.2 టన్నులకు ఎగసింది. హోల్‌సేల్, స్పాట్‌సహా సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఈటీఎఫ్‌ అవుట్‌ఫోస్‌లో మందగమనం దీనికి కారణం. గోల్డ్‌ సరఫరా 4 శాతం పెరిగి 929 టన్నులుగా 
ఉంది.

ఎదురుగాలిలోనూ ముందుకే.. 
బంగారానికి ఎదురుగాలి వీసే అవకాశం ఉంది. అయినప్పటికీ,  గ్లోబల్‌ మార్కెట్‌లో కూడా మార్పులు జరుగుతున్నాయి, ఇవి బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తాయి. డిమాండ్‌ను మరింత పెంచుతాయి.  
– లూయిస్‌ స్ట్రీట్, డబ్ల్యూజీసీ సీనియర్‌ మార్కెట్స్‌ విశ్లేషకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement