
నా బంగారం ఆభరణాలను విక్రయించాలనుకుంటున్నాను? మూలధన లాభానికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుందా? – ప్రణయ్
ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణానికి తగినట్టుగా కొనుగోలు ధరను సర్దుబాటు చేయడం. కానీ, బంగారు ఆభరణాలకు ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఆభరణాలను విక్రయించగా వచ్చిన లాభంపై పన్ను ఎంత చెల్లించాలన్నది.. వాటిని ఎంత కాలం పాటు కొని ఉంచుకున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్లకుపైగా ఉంచుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంపై 12.5% పన్ను పడుతుంది. రెండేళ్లలోపు విక్రయిస్తే ఆ మొత్తం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఇది మీ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు మీ మొత్తం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, ఆ మేరకు పన్ను చెల్లించాలి. ఆభరణాలు వారసత్వంగా మీకు సంక్రమించినా లేక బహుమతి రూపంలో వచ్చినా.. అప్పుడు ఆ ఆభరణం కొన్న అసలు తేదీ, అప్పటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్ అప్
పెట్టుబడులపై ఎలా..?
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే.. లాభం మొత్తం వార్షికాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1, ఆ తర్వాత విక్రయిస్తే.. హోల్డింగ్ పీరియడ్ (ఉంచిన కాలం) ఏడాదికి మించితే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఆభరణాల హోల్డింగ్ పీరియడ్ ఏడాదిలోపు ఉంటే లాభం మొ త్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఫండ్స్ లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే, వచి్చన లాభం వార్షి కాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1 తర్వాత విక్రయిస్తే, హోల్డింగ్ పీరియడ్ రెండేళ్లకు పైన ఉంటే లాభంపై 12.5% పన్ను చెల్లించాలి. ఆలోపు ఉంటే లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment