
ఒమన్, ఖతార్, సింగపూర్, యూఏఈ వంటి దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువగా ఉన్నాయని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది.
2024 నవంబర్ 16 నాటికి భారతదేశంలో బంగారం ధరలు రూ.75,650 (24 క్యారెట్ల 10గ్రా), రూ.69,350 (22 క్యారెట్ల 10గ్రా)గా ఉన్నాయి. నవంబర్ 1వ తేదీ ధరలతో పోలిస్తే.. ప్రస్తుత ధరలు చాలా క్షీణించినట్లు తెలుస్తోంది.
యూఏఈలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,204. సింగపూర్‌లో రూ.76,805, ఖతార్‌లో రూ.76,293, ఒమన్‌లో రూ.75,763గా ఉంది. ఈ ధరలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువే అని స్పష్టంగా అర్థమవుతోంది.
భారత్‌లో బంగారం తగ్గుదలకు కారణం
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. బంగారం ధర తగ్గడానికి కారణం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగియడం, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గుదల కూడా గోల్డ్ రేటు తగ్గడానికి దోహదపడింది.
ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్
భారతదేశంలో బంగారం మీద పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఒమన్, ఖతార్, సింగపూర్, యుఏఈ వంటి దేశాల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇది కూడా అక్కడ బంగారం ధరల పెరుగుదలకు కారణం అయింది.