సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. జాబ్స్ అంటూ, స్టాక్ మార్కెట్స్ అంటూ, బంధువులు అంటూ.. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మహిళను మోసం చేసి రూ. 1.94 లక్షలు కాజేశారు.
కర్ణాటకలోని ఉడుపికి చెందిన అర్చన అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం వెతుకుతుండగా.. అమెజాన్ జాబ్‌లను ఆఫర్ చేస్తున్నట్లు ఒక ప్రకటన చూసింది. ఇది చూసి ఆ ప్రకటన మీద క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్ చాట్‌కు తీసుకెళ్లింది. స్కామర్‌లు.. రిక్రూటర్‌లుగా నటిస్తూ, ఆమెకు ఉత్సాహం కలిగించే ఆఫర్‌ను అందించారు.
అధిక మొత్తంలో లాభాలను పొందాలంటే.. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు సూచించారు. ఇది నిజమని నమ్మి.. అక్టోబర్ 18 నుంచి 24 మధ్య సుమారు రూ. 1.94 లక్షలను వివిధ యూపీఐ ఐడీలకు బదిలీ చేసింది. అయితే చివరకు రిటర్న్‌లు రాకపోవడంతో.. మోసపోయామని గ్రహించింది. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు
స్కామర్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవానికి ఎప్పుడూ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్, లింక్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకుండా ఉండాలి. అవతలి వ్యక్తి అనుమానంగా అనిపిస్తే తప్పకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment