టెక్నాలజీని ఉపయోగించుకుని స్కామర్లు కొత్త ఎత్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో, స్టాక్ మార్కెట్ స్కీమ్ పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బంధువుల పేరుతో మోసాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. దీనికి సంబంధించిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కనుక్కుని.. బంధువుల మాదిరిగా ఫోన్ చేసి చాలా మర్యాదగా, బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ డబ్బు బదిలీ చేయాలని, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి.. నిన్ను అడిగి తీసుకోమన్నారని, అందుకే నెంబర్ కూడా ఇచ్చారని నమ్మిస్తారు. ఇది నమ్మి డబ్బు బదిలీ చేశారో మీరు తప్పకుండా మోసపోయినట్టే.
ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..
ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?
మీకు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే మీ బంధువా? లేదా తెలిసిన వ్యక్తా? అని ముందుగానే ద్రువీకరించుకోవాలి.
స్కామర్ ఎప్పుడూ మిమ్మల్ని తొందర పెడుతూ.. మీకు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడు, కాబట్టి మీరు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీకు తెలియని వ్యక్తులతో.. ఆర్థిక విషయాలను లేదా వ్యక్తిగత విషయాలను చర్చించకూడదు. ఎదుటి వారి మాటల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమం.
జరుగుతున్న మోసాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ఆ విషయాలను తెలిసిన వాళ్లకు చెబుతూ.. వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉండటం శ్రేయస్కరం.
Comments
Please login to add a commentAdd a comment