China Foreign Ministry
-
భారత సరిహద్దులపై చైనా కొత్త విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: చైనా విదేశాంగ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన క్విన్ గ్యాంగ్ భారత్‌తో సంబంధాలు, సరిహద్దు సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా న్యూఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని బీజింగ్ చూస్తోందని తెలిపారు. వాంగ్ యీ స్థానంలో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే యూఎస్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ‘ప్రపంచం పట్ల చైనా ధోరణి’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ మ్యాగజైన్లో భారత్-చైనా సరిహద్దు అంశాలను ప్రస్తావించారు క్విన్ గ్యాంగ్. సరిహద్దుల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఇరు వర్గాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. అమెరికాపై మండిపడ్డారు క్విన్. తైవాన్ విషయంలో అమెరికా, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులకు జపాన్‌లు కారణమని పేర్కొన్నారు. చైనా అభివృద్ధి అంటే శాంతిని పరిరక్షించేందుకు బలమైన దళాన్ని సిద్ధం చేయటం తప్పా.. వారు చెబుతున్నట్లు భౌగోళిక స్థితిని మార్చే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలకు కారణం చైనా కాదని, తైవాన్ వేర్పాటువాదులు, విదేశీ శక్తులు అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో చైనా రాయబారిగా పని చేశారు 56 ఏళ్ల క్విన్ గ్యాంగ్. విదేశాంగ మంత్రిగా పదోన్నతి కల్పించిన క్రమంలో వాషింగ్టన్ నుంచి చైనాకు పయణమయ్యారు. 13వ జాతీయ ప్రజా కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆయనను విదేశాంగ మంత్రిగా నియమించింది. క్విన్ గ్యాంగ్‌కి అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చైనా నూతన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. వాషింగ్టన్-బీజింగ్ సంబంధాలు, ఇరు దేశాల మధ్య సమచారా మార్పిడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదీ చదవండి: పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి -
సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. ఏమందంటే?
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల నడుమ ఘర్షణ తెలెత్తడంతో మరోమారు సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఈ నెల 9న చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. మన సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనికుల ఘర్షణ తర్వాత తొలిసారి స్పందించింది చైనా. భారత్ సరిహద్దులో పరిస్థితులు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించింది. ‘మాకు ఉన్న సమాచారం మేరకు చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు పక్షాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. తవాంగ్ సెక్టార్లో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది సేపటికే చైనా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు
బీజింగ్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భంగపాటు ఎదురైంది. భారత్–చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను చైనా తిరస్కరించింది. భారత్–చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ తొలిసారి స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్–చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. పరస్పరం చర్చించుకోవడానికి, అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి రెండు దేశాల మధ్య సరిహద్దు సంబంధిత అధికార యంత్రాంగం, కమ్యూనికేషన్ చానళ్లు ఉన్నాయని స్పష్టం చేశారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోగల సామర్థ్యం రెండు దేశాలకు ఉందన్నారు. భారత్–చైనా మధ్య మధ్యవర్తిగా పనిచేస్తానంటూ గురువారం చెప్పిన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కూడా ఆదే విషయం పునరుద్ఘాటించారు. మిలటరీ ఉద్రిక్తతలపై ట్రంప్–మోదీ చర్చించుకోలేదు తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్–మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 4న ట్రంప్–మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని, ఆ తర్వాత ఇరువురు నేతలు ఎప్పుడూ చర్చించుకోలేదని వెల్లడించాయి. తాను మోదీతో మాట్లాడానని, భారత్–చైనా మధ్య ఉద్రిక్తతల విషయంలో ఆయన మంచి మూడ్‌లో లేరని ట్రంప్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనం’ ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ ద్వారా ఈ ఏడాది చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనకూడదని స్థానికులు నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సైతం తెలియజేశారు. కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో అడుగుపెట్టడం ప్రమాదకరమని గిరిజన వ్యాపారుల సంఘం నాయకుడు, భారత్–చైనా వ్యాపార్ సంఘటన్ ప్రతినిధి విశాల్ గార్బియాల్ చెప్పారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ప్రతియేటా జూన్ నుంచి అక్టోబర్ వరకు జరుగుతుంది. -
భారత్‌తో యుద్ధంలో మీకే మద్దతు: చైనా!
పాక్ మీడియా కథనాలు.. సమర్థించని చైనా న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు చైనా అండగా నిలబడుతుందని వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆ దేశం మరోసారి నిరాకరించింది. ’ఒకవేళ విదేశీ దాడి జరిగితే, మా దేశం పాకిస్థాన్‌కు పూర్తిగా మద్దతునిస్తుంది’ అని లాహోర్‌లోని చైనా రాయబారి యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రచురించింది. ’కశ్మీర్ విషయంలో మేం ఇప్పుడు, భవిష్యత్తులోనూ పాకిస్థాన్‌కు అండగా ఉంటాం. భారత ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లోని నిరాయుధలైన కశ్మీరీలపై అరాచకాలకు పాల్పడటం సరికాదు. కశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు పరిష్కరించాలి’ అని యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ కథనాలపై స్పందించడానికిగానీ, వీటిని సమర్థించడానికిగానీ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు. బీజింగ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ’ మీరు ప్రస్తావించిన విషయం గురించి నాకు తెలియదు. సంబంధిత విషయం మీద చైనా వైఖరి సుస్పష్టంగా, స్థిరంగా ఉంది’ అని పేర్కొన్నారు. ’కశ్మీర్ అంశాన్ని చాలాకాలంగా నలుగుతున్న అంశంగా మేం భావిస్తున్నాం. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరుపక్షాలు దీనిని శాంతియుతంగా పరిష్కరించుకుంటారని మేం భావిస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ పాకిస్థాన్ మీడియా కథనాలను సమర్థించడానికి చైనా ఒప్పుకోలేదు. కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్‌కు తాము మద్దతుగా ఉంటామని న్యూయార్క్‌లో నవాజ్ షరీఫ్‌తో భేటీ సందర్భంగా చైనా ప్రధాని లీ కెకియాంగ్ పేర్కొన్నట్టు డాన్ పత్రిక ప్రచురించింది. ఈ కథనాన్ని చైనా సమర్థించలేదు. -
ఎన్ఎస్జీకి భారత్ సిద్ధం: అమెరికా
వ్యతిరేకించిన చైనా, పాక్ వాషింగ్టన్: అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్ఎస్జీ)లో భారత్ చేరేందుకు సిద్ధమైందని అమెరికా తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. అయితే, భారత్‌కు ఈ సభ్యత్వం ఇవ్వొద్దని చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా అభ్యంతరం తెలిపాయి. క్షిపణి సాంకేతిక నియంత్రణకు అవసరమైన సంపత్తిని భారత్ సమకూర్చుకున్నందున సభ్యత్వానికి సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం తెలిపారు. ఎన్ఎస్జీలో కొత్త సభ్యులు చేరికనేది ప్రస్తుత సభ్యదేశాల మధ్య అంతర్గత వ్యవహారమన్నారు. అయితే, ఎన్ఎస్జీలో భారత్ చేరికను అడ్డుకోవాలని తాము 48 సభ్యదేశాల అభిప్రాయాన్ని కోరినట్టు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై భారత్ సంతకం పెట్టాలని, తమతోపాటు ఇతర ఎన్ఎస్జీ సభ్య దేశాలు కోరుతున్నాయంది. భారత్ సరిహద్దుల్లో ‘డ్రాగన్’ నీడ.. చైనా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకున్నదని, భారతదేశ సరిహద్దులో మరింత మంది సైనికులను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది.