ఎయిర్‌పోర్టులోనే కూలిన ఫైటర్‌ జెట్‌ | US Fighter Jet Crash Lands at Bahrain International Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులోనే కూలిన ఫైటర్‌ జెట్‌

Published Sat, Aug 12 2017 6:09 PM | Last Updated on Sat, Aug 25 2018 3:23 PM

ఎయిర్‌పోర్టులోనే కూలిన ఫైటర్‌ జెట్‌ - Sakshi

ఎయిర్‌పోర్టులోనే కూలిన ఫైటర్‌ జెట్‌

దుబాయి: బహ్రెయిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం యూఎస్‌ మిలటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కూలిపోయింది. విమానం ఎయిర్‌పోర్టులో దిగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు ఎటువంటి ప్రకటనా చేయలేదు. మృతులు, నష్టంపై స్పందించేందుకు నిరాకరించారు.

ఘటన కారణంగా విమానాశ్రయంలోకి రాకపోకలను నిలిపివేశారు. పర్షియన్‌ సింధుశాఖలో సౌదీ అరేబియా పొరుగున ఉండే బహ్రెయిన్‌ దేశం ఒక దీవి. ఇక్కడ అమెరికా నావికా దళ స్థావరం ఉంది. నేవీ అధికారులు కూడా ఈ ఘటనకు కారణాలను వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement