
చర్చలు జరపకపోవడమూ విదేశీ విధానమేనా?
అవలోకనం
భారత్‌ను ఏ పార్టీ పాలిస్తోంది అనే దాంతో నిమిత్తం లేకుండా... పాకిస్తాన్ లేదా మరే దేశంతోనైనా వ్యవహరించడానికి మనకున్న అవకాశాలు మూడంటే మూడు మాత్రమే. అవి: చర్చలు, మధ్యవ ర్తిత్వం లేదా యుద్ధం. ఇవి తప్ప నాలుగో అవకాశం లేదు. చర్చలు జరపకపోవడం కూడా ఒకరకమైన విదేశీ విధానమేనని బీజేపీ తనకుతానుగా అభిప్రాయానికి వచ్చేసినట్లుంది. కానీ అది వాస్తవం కాదు. అది ఆ పార్టీ ఆగ్రహం లేదా చికాకుకు ప్రతిఫలనం మాత్రమే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్ విధానాన్ని ఎలా నిర్వహిస్తే బాగుం టుంది? భావోద్వేగ రహితంగా ఈ అంశాన్ని పరిశీలిద్దాం. సాధారణంగా విదేశీ విధానం కొంతమంది నిపుణుల ప్రత్యేక రంగంగా ఉంటుంది. న్యూజిలాండ్, నార్వే లేక నైజీరియా దేశాలతో భారత విదేశీ విధాన రూపురేఖలపై మీకు లేదా నాకు నిజంగానే ఏమీ తెలీదు. పైగా మనం దాన్ని పెద్దగా లెక్కించం కూడా. ఇలాంటి అంశాలపై ప్రజలకు అంతగా ఆసక్తి లేకపోవడం వల్లే, కొంతమంది నిపుణులు, రాజకీయ నేతలు రూపొందించే నివేదికలకు కాస్త సౌలభ్యం ఉంటుంది. ఇలాంటి దేశాలతో భారత్ వ్యవహార శైలిలో మార్పు చోటు చేసుకున్న ట్లయితే ఆ మార్పులను తీసుకురావడం చాలా సులభంగానే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో విదేశీ విధానం ప్రజా పరిధిలోకి వెళుతుంటుంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికన్ విదేశీ విధానం అనివార్యంగా దాని ఎన్నికల రంగంలోకి ప్రవేశించింది. ఏళ్లపాటు అమెరికా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన దేశాల వ్యవహారాల్లోకి అమెరికా దూకుడుగా జోక్యం చేసుకోవలసి వచ్చింది.
అల్‌కాయిదా దాడులకు వ్యతిరేకంగా అమెరికన్లు ప్రతీకారాన్ని డిమాండ్ చేయడంతో అమెరికా యుద్ధంలో అడుగుపెట్టింది. ఆ సమయంలో జాగరూ కతతో మెలగాలని సలహా ఇచ్చిన రాజకీయనేతలు (హిల్లరీ క్లింటన్ వంటివారు) యుద్ధాన్ని ప్రతిఘటించ లేకపోయారు. నాటి సైనిక చర్యల ఫలితం ఇప్పటికీ మనపై ప్రభావం చూపుతూనే ఉంది. అది భిన్నమైన విషయం అనుకోండి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే మన విధానం ఏ క్షణంలోనైనా సరే ప్రజా పరిధిలోకే వెళ్లిపోతుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ శక్తులు, పాక్ సైన్యం గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న చర్యల వల్ల భారత్‌కు కలిగిన నష్టం తొలికారణం. ఇదొక నిరంతర కథన రీతిలా సాగిపోతూనే ఉంటోంది. దీనిపై ప్రజాసక్తి అనేది (అనేక టీవీ చర్చల్లో ప్రతిబింబిస్తున్నట్లుగా) పూతమందులాగా పాక్‌స్తాన్‌పై మన విధానాన్ని ప్రేరేపిస్తూనే ఉంటోంది.
మరోవైపున చూస్తే, ఉగ్రవాదం భారత్‌కు అంత పెద్ద సమస్య కాదు. కశ్మీర్, ఈశాన్య భారత్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని సంఘర్షణలను పక్కన బె డితే, 2015లో ఉగ్రవాదానికి మన దేశంలో 13 మంది మాత్రమే బైలైనారు. 2014లో నలుగురు, 2013లో 25 మంది, 2012లో ఒకరు మాత్రమే ఉగ్రవాద బారిన పడ్డారు. సైనిక చర్యల్లో హతులైన ఉగ్రవాదులు కూడా ఈ సంఖ్యల్లోనే భాగమ య్యారు. ఈ డేటా ప్రకారం చేస్తే ఏ రకంగా చూసినా, భారతీయులకు ఉగ్రవాదం ప్రధాన సమస్య కాదు. లెక్కలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే, ప్రతి ఏటా పోషకాహార లేమితో అయిదు లక్షల మంది భారతీయ పిల్లలు చనిపోతున్నారు.
ఇన్ని లక్షల మంది పిల్లల మరణాల్లో కొన్నయినా మనల్ని ప్రభావితం చేసిన ట్లయితే శిశు మరణాల వంటి ఘటనలపై మన ఆగ్రహం మరింతగా పెరిగి వుండేది. ఇకపోతే, ఉగ్రవాదాన్ని, మన పాకిస్తాన్ పాలసీని ప్రజా పరిధిలోకి తీసుకొచ్చిన రెండో కారణం కూడా ఉంది. పాకిస్తాన్‌తో గత ప్రభుత్వాలు మెతకవైఖరితో వ్యవహరించాయంటూ బీజేపీ, ప్రత్యేకించి మన ప్రధాని పదే పదే చెబుతూ రావటం కూడా ప్రజాభిప్రాయంపై తనదైన ప్రభావం చూపింది.
పాకిస్తాన్‌పై ‘గట్టి వైఖరి’ (బీజేపీ చేపడితే) మన సమస్యలన్నింటికీ పరిష్కా రం లభిస్తుంది. నిజమేనా? జరుగుతున్న పరిణామాలు దీనికి కాదనే సమాధా నాన్ని ఇస్తున్నాయి. ఇది అనివార్యం కూడా. భారత్‌ను ఏ పార్టీ పాలిస్తోంది అనే దాంతో నిమిత్తం లేకుండా... పాకిస్తాన్ లేదా మరే దేశంతోనైనా వ్యవ హరించ డానికి మనకున్న అవకాశాలు మూడంటే మూడు మాత్రమే. అవి: చర్చలు, మధ్య వర్తిత్వం లేదా యుద్ధం. యుద్ధం ద్వారా పాకిస్తాన్ లొంగిపోయేటట్లు మనం ఒత్తిడి చేయగలం. వివాదాలను పరిష్కరించవలసిందిగా మూడో పార్టీ లేదా పక్షాన్ని మనం కోరగలం. లేదా మనమే నేరుగా పాక్‌తో చర్చలు జరపగలం. ఇవి తప్ప నాలుగో అవకాశం లేదు. చర్చలు జరపకపోవడం కూడా ఒకరకమైన విదేశీ విధానమేనని బీజేపీ అభిప్రాయానికి వచ్చేసినట్లుంది.
కానీ అది వాస్తవం కాదు. అది ఆ పార్టీ ఆగ్రహం లేదా చికాకుకు ప్రతిఫలనం మాత్రమే. మనం ఏం కోరుకుంటున్నామో దాన్ని ఇలాంటి వైఖరి సిద్ధింపచేయదు. ఇటీవల పఠాన్‌కోట దాడుల తర్వాత బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉందని చెప్పడం ద్వారా దేన్నీ సాధించలేము. పాకిస్తాన్‌నుంచి మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని కోరుకోవలసిన అవసరం ఉంది కాబట్టి పాక్‌తో మనం చర్చించవలసి ఉంటుంది: అదేమిటంటే, పాక్ జాతీయులు మన పౌరులను చంపకుండా హామీ పొందవలసి ఉంటుంది. మనకు అవసరమైన మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, మధ్యాసియా ప్రాంతాలకు ప్రవేశ సౌలభ్యం కూడా మనకు అవసరం. కాని ఇవి అప్రధానమైన ట్టివే.
మనముందు ప్రస్తుతానికి ఉన్న మూడు అవకాశాల్లో యుద్ధం పరిష్కారమే కాదు. పొఖ్రాన్‌లో మనం చేసిన తప్పిదమే దీనిక్కారణం. 1988 సంవత్సరానికి ముందు పాకిస్తాన్ కంటే ఎక్కువగా సాంప్రదాయిక ఆయుధాలు మనవద్దే ఉండేవి. అమితమైన వ్యయంతోనే వీటిని సాధించామనుకోండి. మనం అణు పరీక్షలను నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత సాయుధ సన్నద్ధం చేసేలా నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఒత్తిడి కలిగించాం. మన చర్య ఫలితంగా వాళ్లు చాగైలో అణు పరీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితిని కొని తెచ్చాము. ఇప్పుడు నిజంగానే మనం ఆకాంక్షించినప్పటికీ, పాకిస్తాన్‌ను స్వల్ప స్థాయి లేదా మెరుపుదాడుల ద్వారా కూడా మనం ఇక ఎన్నటికీ శిక్షించలేం. పరిమిత దాడులను ప్రబోధిస్తున్న వారు అవి క్రమంగా పెరగవన్న హామీని ఇవ్వలేరు. పైగా అతి స్వల్పమైన సైనిక ప్రతిష్టను సాధించడం కోసం మన జీవితా లతో జూదమాడగల అత్యంత ప్రభావిత నేత మనకు అవసరముంటుంది.
ఇక మూడోపార్టీ మధ్యవర్తిత్వానికి భారత్ వ్యతిరేకం కాబట్టి మనకిప్పుడు చర్చించడం అనే ఒకే ఒక్క అవకాశం ఉంది. ముంబై, పఠాన్‌కోట్‌లలో జరిగిన ట్లుగా స్పష్టమైన ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నప్పటికీ మనం చర్చలు జరపా ల్సిందే. మన ప్రయోజనం రీత్యానే చర్చలను మనం కొనసాగించాల్సి ఉంది. చర్చించకపోవడం అనేది ఉగ్రవాదాన్ని ఆపివేయదు. అదే చర్చలు జరపడంవల్ల అన్నికాలాల్లోనూ పౌరుల ప్రాణాలను బలిగొంటున్న మతిహీనమైన కాల్పుల ఘటనలను తగ్గించటంతోపాటు అనేక ప్రయోజనాలను మనం సాధించవచ్చు.
‘గట్టి వైఖరి’ అనే భావనను ప్రధాని మోదీ మన మీడియాలోనూ, సాధారణ ప్రజానీకంలోనూ బాగానే ప్రచారంలో పెట్టగలిగారు. స్వయంగా తానే కనుగొన్నట్లుగా ఇప్పుడాయన దీనికి బాధ్యత వహించాలి. సమస్యను స్పష్టంగా చిత్రించి, మనకున్న అవకాశాలను ఆయన నేరుగా ప్రజలకు వివరించగలిగితే.. పాకిస్తాన్‌తో వ్యవహరించేటప్పుడు మనకు నాలుగో అవకాశం కూడా ఉందని మనలో ముందునుంచీ పాదుకుని ఉన్న అభిప్రాయాన్ని మార్చివేయగలరు. తద్వారా భార తీయుల అపార విశ్వసనీయతను ప్రధాని అట్టిపెట్టుకోగలరు. పాత అభిప్రా యాన్ని సమర్థవంతంగా తప్పించడంలో ఆయనకు ఎలాంటి సమస్యా ఎదురు కాదు కూడా.
ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com