Pathankot
-
బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
పఠాన్‌కోట్: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా నుంచి అమృత్సర్ వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు పఠాన్‌కోట్ సమీపంలో శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దుల్లోని మమూన్ కాంట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పఠాన్‌కోట్-చంబా జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులుఉండగా.. చంబా నుంచి అమృత్‌సర్‌కు వెళుతోంది. -
పఠాన్‌కోట్‌లో అనుమానితులు.. భద్రతా సంస్థలు అప్రమత్తం
జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంతో తరచూ ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్- పాక్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో 48 గంటల్లో తొమ్మిది మంది అనుమానితులు కనిపించడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.తొలుత బమియల్ నియోజకవర్గంలోని చోడియా గ్రామంలో ఒక మహిళ ముగ్గురు అనుమానితులను చూశారు. అదే గ్రామంలో ఇద్దరు అనుమానితులు కనిపించారు. ఇదేవిధంగా జమ్ము-కథువా సరిహద్దుకు ఆనుకుని ఉన్న చక్రాల్ గ్రామంలో ఇద్దరు యువకులు.. నలుగురు అనుమానితులను గమనించారు. దీంతో వీరు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శాటిలైట్తోనూ, డ్రోన్ల ద్వారా కూడా ఆ ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. భద్రతా సంస్థల అధికారులు ఆ ప్రాంతంలో క్యాంప్ నిర్వహిస్తున్నారు.చక్రాల్ గ్రామానికి చెందిన రఘువీర్ సింగ్, రిషు కుమార్ అనే యువకులు తమకు నలుగురు అనుమానితులు కనిపించినట్లు పోలీసులకు తెలిపారు. వారంతా నల్లటి దుస్తులు ధరించి, ముఖాలకు మాస్క్‌లు పెట్టుకుని, చెరుకు తోటల్లో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు, ఆపరేషన్ గ్రూప్ కమాండో, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇది సాయంత్రం వరకు కొనసాగింది. అయితే నిందితుల జాడ ఇంకా లభించలేదు. మరోవైపు పంజాబ్ పోలీస్ బోర్డర్ రేంజ్ డీఐజీ తాజాగా ఆర్మీ అధికారులతో సమావేశమై పలు భద్రతా అంశాలపై చర్చించారు. -
Anny Divya: దివ్యమైన విజయం
స్త్రీల కలలు తరచు సామాజిక నిబంధనల మధ్య పరిమితం అవుతుంటాయి. అలాంటి ప్రపంచంలో అనీ దివ్య అసమానతలను ధిక్కరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో పుట్టి, విజయవాడలో పెరిగిన అనీ దివ్య... బోయింగ్ 777 ను నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్‌గా పేరు పొందింది. ‘మహిళా కమాండర్లలో అతి పిన్నవయస్కురాలిగా చేరాలని కలలు కనలేదు. కానీ, అభిరుచి, అంకితభావం ఆమె కలను సాకారం చేశాయి’ అని చెప్పే ముప్పై ఏడేళ్ల దివ్య... మహిళా శక్తి అంటే ఏమిటో తన విజయగాధ ద్వారా మనకు పరిచయం చేస్తుంది. ‘అమ్మాయిలు పెద్దగా కలలు కనడానికి వీలులేని ప్రదేశం నుండి వచ్చాను’ అని చెప్పే దివ్య 11వ తరగతి వరకు సాధారణ విద్యార్థిని. ఆమె తన కలను సాకారం చేసుకోవడానికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం తప్పనిసరి అని తెలుసుకుంది. అడ్డంకులను అధిగమించాలని నిశ్చయించుకుని, సవాల్‌ను ఎదుర్కొంది. అదే సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. దీంతో ఆమె కలలు స్పష్టంగా ఉన్నాయి అని కుటుంబ సభ్యులకూ అర్ధమైంది. కానీ, ముందుకు వెళ్లే మార్గం సులభంగా లేదు. అందుకు తగినంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. కానీ, ఆమె తండ్రి ఫ్లయింగ్ స్కూల్ ఫీజు కోసం రుణం తీసుకున్నాడు. దీంతో ఆమె అసలు ప్రయాణం మొదలైంది. 17 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చేరింది. 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా నిలిచింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో కో–పైలట్‌గా చేరింది. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్ కోసం లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. పైలట్‌గానే కాదు కెప్టెన్ దివ్య మోటివేషనల్ స్పీకర్ కూడా. విమానయాన రంగంలో తన అనుభవాలు, సవాళ్లను వేదికలపై స్పీచ్లుగా ఇచ్చింది. ముంబై రిజ్వీ లా కాలేజీ నుండి ఎల్ఎల్బీ పట్టా కూడా పొందింది. ఎగతాళి చేసేవారు ‘‘నాన్న ఆర్మీలో ఉద్యోగి అవడంతో మా కుటుంబం పఠాన్‌కోట్‌లో ఉండేది. నేను అక్కడే పుట్టాను. నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు. అలా, నా స్కూల్ చదువు మొత్తం విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక ఉండేది. ఇది తెలిసి ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. పిల్లల్లో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కావా లనే అనుకునేవారు. అదృష్టవశాత్తు నా ఎంపికకు నా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. అయితే, పైలట్ కావాలనే నా నిర్ణయాన్ని బంధువులు, కుటుంబ స్నేహితులు వ్యతిరేకించేవారు. ఇది అమ్మాయిలకు తగిన వృత్తిగా అనుకునేవారు కాదు. సవాల్‌గా తీసుకున్నాను.. ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చు. కానీ, ఇంగ్లీషులో మాట్లాడటం అనేది సమస్యగా ఉండేది. దీంతో ట్రైనింగ్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ తోటి వారి హేళనకు గురయ్యాను. ఒక చిన్న పట్టణం నుండి వెళ్లడం, ఇంగ్లీషులో పట్టులేకపోవడంతో మొదటి రోజు నుండి సవాళ్లు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సీనియర్లు క్లాస్ బయటకు పిలిచి ర్యాగ్ చేసేవారు. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అందుకు సెలవుల్లో నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆంగ్లంలో మాట్లాడటానికి మంచి పట్టు సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి స్కాలర్షిప్ కూడా వచ్చింది. సాధించినప్పుడే మన శక్తి బయటకు తెలుస్తుంది ప్రపంచంలోనే బి777 మహిళా కమాండర్లలో అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. నడిచొచ్చిన దారిని చూసుకుంటే అన్నింటిని ఎలా అధిగమించాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఎవరి ప్రయాణమూ అంత సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మనలోని ఆత్మ విశ్వాసం బయటకు కనిపిస్తుంది. కలలు సామాజిక అంచనాలకు, ఆర్థిక పరిమితులకు పరిమితం కాదని ఆ శక్తి గుర్తు చేస్తుంది. ఒక చిన్న పట్టణం నుండి ఏవియేషన్ కమాండింగ్ ఎత్తుల వరకు ఎదగడంలో నా బలహీనతలపై చాలా పోరాటం చేశాను’’ అని వివరిస్తుంది కెప్టెన్ అనీ దివ్య. -
పాక్ సరిహద్దు జిల్లాల్లో కార్డన్ సెర్చ్
సాక్షి, ఢిల్లీ : కశ్మీర్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశముందన్న సమాచారంతో పంజాబ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం భారీ కార్డన్ సెర్చ్ చేపట్టారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఆపరేషన్‌లో ఐదు వేల మంది పోలీసులు, బీఎస్ఎఫ్, మిలిటరీ నిఘా వర్గాలు, ఎన్ఐఎకు చెందిన సాయుధ బలగాలు పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్‌కు పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఈశ్వర్ సింగ్, అడిషనల్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాకేశ్ చంద్రలు నేతృత్వం వహిస్తున్నారని పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా శనివారం తెలియజేశారు. ఈ బలగాలు అనుమానాస్పద ప్రాంతాల గురించి పరస్పరం సమాచారాన్ని పంచుకుకుంటాయని డీజీపీ వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత నెలలో పాకిస్తాన్‌లోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు 8 డ్రోన్ల ద్వారా దాదాపు 80 కిలోల పేలుడు పదార్ధాలు, ఆయుధాలను పంజాబ్ సరిహద్దుల్లో విడిచిపెట్టిందని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ను ఇతర సరిహద్దు ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని ప్రతీ ఆసుపత్రిలో 8 బెడ్లను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచాలని జిల్లా అధికారులు ఆదేశించారని పఠాన్‌కోట్ మెడికల్ ఆఫీసర్ భూపీందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఉపశమనం లభించింది; ఇది సరిపోదు!
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచారం కేసులో పఠాన్కోర్టు వెలువరించిన తీర్పును జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి స్పందించారు. ‘ కథువా కేసులో తీర్పుతో కాస్త ఉపశమనం లభించింది. ఈ గొప్పదనమంతా.. క్రైమ్‌బ్రాంచ్ టీమ్‌ను ముందుండి నడిపించిన ఐజీపీ ముజ్తాబా, ఎస్ఎస్పీ జాలా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు నవీద్, శ్వేతాంబరి, లాయర్ దీపికా రజావత్, తాలిబ్లకే దక్కుతుంది. వీరంతా ప్రాణాలు పణంగా పెట్టిమరీ నిజాలను వెలుగులోకి తెచ్చారు. చిన్నారికి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. ఎనిమిదేళ్ల చిన్నారికి మత్తు పదార్థాలు ఇచ్చి, పలుమార్లు అత్యాచారం జరిపి, పాశవికంగా హత్య చేసిన క్రూరులకు చట్టంలోని లోపాలు ఆయుధం కాకూడదు. హేయమైన నేరానికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష అమలు కావాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ శిక్ష సరిపోదు.. ‘ఈ తీర్పును స్వాగతిస్తున్నా. అయితే దోషులకు జీవిత ఖైదు సరిపోదు. అంతకంటే కఠినమైన శిక్షను అమలు చేయాలి. నిందితులకు మద్దతుగా నిలిచిన కొంతమంది రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. బాధిత కుటుంబాన్ని, పోలీసులు, లాయర్లను బెదిరించిన వారిని ఏమనాలో అర్థం కావడం లేదు’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. చదవండి : ఏదో ఒకరోజు నన్ను కచ్చితంగా చంపేస్తారు కాగా కశ్మీర్‌లోని కథువాలో గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలికపై కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో బాధితురాలి తరఫున వాదిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడంతో..ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో దీపికా సింగ్ రజావత్ చిన్నారి తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు తెలపడం, ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు చెలరేగడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. -
కథువా అత్యాచారం, హత్య కేసులో తుది తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ స్పెషల్ కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌ల, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. అయితే సాంజీ రామ్ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దోషులకు న్యాయస్థానం మధ్యాహ్నం శిక్షలు ఖరారు చేయనుంది. చదవండి: కథువా కేసు.. వాళ్ల పనే! కాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. మొత్తం ఎనిమిదిమంది నిందితులు ఉండగా.. వారిలో ఏడుగురిపై అత్యాచారం, హత్య అభియోగాలపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. మైనర్ మాత్రం ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో పఠాన్‌కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
భారత్‌కు ఉగ్రదాడి హెచ్చరికలు..!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్రదాడికి పాల్పడేందుకు ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థలపై గత కొంత కాలం నుంచి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతీకారంగా ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతాదళాల సమాచారం. పాక్ సరిహద్దులోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై 2016లో భారీ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి దాడికి ఆల్‌ఖైదా వ్యూహాలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత సంస్థ జైషే మహ్మద్ చర్యలను భారత్ ఇటీవల తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకేనేందుకు ఆల్‌ఖైదాకు జైషే మహ్మద్ సహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా బలగాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. సరిహద్దు వెంబడి పహారాను పటిష్టంచేసింది. కాగా నేడు దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదినం కావడంతో మసీదుల వద్ద భారీ బందోబస్తులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. -
కథువా కేసు.. వాళ్ల పనే!
ఎనిమిదేళ్ల చిన్నారి కిరాతకంగా హత్యాచారానికి గురైన కేసులో నిందితుడి తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘోరం వెనుక ఉంది జిహాదీలే తప్ప.. తన క్లైయింట్లు కాదని వ్యాఖ్యానించాడు. పథాన్‌కోట్ జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సాంజీ రామ్ స్టేట్మెంట్ను నమోదు చేయగా.. ఆ మరుసటి రోజే సాంజీరామ్ తరపు న్యాయవాది అంకుర్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. (నోరు విప్పిన సాంజిరామ్.. అందుకే చంపా!) ‘ఇది ముమ్మాటికీ జిహాదీల పనే. జమ్ము కశ్మీర్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం వాళ్ల ఎజెండా. అందుకే బాలికను క్రూరంగా చంపి అక్కడ పడేశారు. నా క్లైయింట్లకు ఏ పాపం తెలీదు. కుట్రపూరితంగా వారిని ఇరికించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపడితే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ మేరకు గవర్నర్ వోహ్రాను కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని అంకుర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ ఘటన తర్వాత నోమాదిక్ తెగ వారికి ప్రభుత్వ స్థలాల్లో ఆశ్రయాలను ఏర్పాటు చేసుకునేందుకు అప్పుడు సీఎంగా ఉన్న మెహబూబా ముఫ్తీ ఇచ్చిన ఆదేశాలు.. ఇప్పటికీ కొనసాగటంపై అంకుర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. తక్షణమే ఆ ఆదేశాలను రద్దు చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు అంకుర్ తెలిపాడు. (‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు) అయితే న్యాయ నిపుణులు మాత్రం అంకుర్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై నేరారోపణలు నమోదు అయ్యాక.. (నిందితుడి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు కూడా...) న్యాయవాది అంకుర్ ఇలా ఎలా వ్యాఖ్యలు చేయగలుగుతున్నారని వారు మండిపడుతున్నారు. కథువాకు సమీపంలోని ఓ గ్రామంలో నోమాదిక్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి.. వారంపాటు పైశాచికంగా లైంగిక దాడి చేసి మరీ హతమార్చారు. ఈ ఘటన కథువా కేసుగా ప్రప్రంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
కథువా కేసులో కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ‘కథువా కేసును పఠాన్‌కోట్ జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నాం ఈ కేసులో ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను రహస్య విచారణ చేపట్టాలని ఆదేశించింది(ఇన్-కెమెరా ప్రోసీడింగ్స్). ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించుకునేందుకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జూలై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మమ్మల్ని కాల్చిచంపండి:‘కథువా’ బాలిక తల్లి అందుకే చిన్నారిని చంపాం: సాంజిరామ్ 8 ఏళ్ల చిన్నారిని ఆలయంలో బంధించి అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితోసహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జమ్ము కశ్మీర్ నుంచి ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధిత బాలిక తండ్రి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. మరోపక్క నిందితులు మాత్రం ఆ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగానే దర్యాప్తు జరుపుతున్నారంటూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తాజాగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్ కామాంధులకు మరణశిక్ష.. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం -
పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ వద్ద హై అలర్ట్
-
పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం: హై అలర్ట్..!
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం చెలరేగింది. గత రాత్రి పోలీసుల తనిఖీల్లో సైనిక దుస్తులతో కూడిన ఒక బ్యాగ్ దొరకడం అలజడి సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు సోమవారం హై అలర్ట్ జారీ చేశారు. ఆర్మీ, స్వాత్ కమాండోల ఆధ్వర్యంలో ఉమ్మడిగా భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమున్ ఆర్మీ కంటోన్మెంట్‌కు సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ దొరకడంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మూడు సైనిక దుస్తులను కొనుగొన్నామని పోలీసులు తెలిపారు. వీటిపై జమ్మూ అని రాసివుందని సీనియర్ పోలీస్ అదికారి ఒకరు చెప్పారు. వీటిని ఒక గోనె సంచిలో కుక్కి ఉండగా కనుగొన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సైన్యాన్ని, స్వాత్ కమాండోలను మోహరించామన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా మే 4న మిలిటరీ బేస్‌కు కూతవేటు దూరంలో అనుమానాస్పదంగా పడివున్న నాలుగు సంచులను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఒక మొబైల్ టవర్ బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో 7గురు జవాన్లు అసువులు బాయగా, దాదాపు 37మంది పౌరులు క్షతగాత్రులైన సంగతి తెలిసిందే -
భారత ఆర్మీ స్థావరం వద్ద తీవ్ర కలకలం!
అనుమానాస్పద బ్యాగులు లభించడంతో హై అలర్ట్ పఠాన్ కోట్ ఆర్మీ స్థావరానికి కొన్ని అడుగుల దూరంలోనే రెండు అనుమానాస్పద బ్యాగులు దొరకడం తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం పఠాన్ కోట్ లోని మమూన్ కంటోన్మెంట్ కు సమీపంలో రెండు అనుమానాస్పద బ్యాగులు దొరికాయి. వాటిని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ నిపుణులు ఆ బ్యాగులను తెరిచి చూడగా.. అందులో అనుమానాస్పదరీతిలో రెండు మొబైల్ టవర్ బ్యాటరీలు దొరికాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి హై అలర్ట్ ప్రకటించారు. గత మంగళవారం ఓ స్కార్పియో వాహనం బారికేడ్లను ఢీకొట్టి.. పోలీసులను తప్పించుకొని పోయింది. అనంతరం ఆ వాహనాన్ని గురుదాస్ పూర్ జిల్లాలో వదిలేశారు. ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబరుతో ఉన్న ఆ వాహనంలో ఐదారుగురు అనుమానిత వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారని గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
సరిహద్దు వద్ద చొరబాటుదారుడి కాల్చివేత
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుదారుడిని సరిహద్దు భద్రత దళాలు కాల్చి చంపాయి. మంగళవారం పంజాబ్‌లోని పటాన్‌కోట్ బమియల్ సెక్టార్లో ఈ ఘటన జరిగింది. సరిహద్దు వద్ద గస్తీ నిర్వహిస్తున్న జవాన్లు జరిపిన కాల్పుల్లో చొరబాటుదారుడు అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు చెప్పారు. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి అక్రమంగా వచ్చాడని తెలిపారు. గతేడాది పాకిస్తాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు ఇదే ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై దాడి చేశారు. -
పఠాన్‌కోట్‌లో మళ్లీ టెన్షన్
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోకి చొరబడేందుకు కుట్రపన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తంకావడంతో ముప్పు తప్పింది. భారత జవాన్ల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పఠాన్‌కోట్‌లో భారత భద్రత దళాలు గస్తీ పెంచాయి. రోడ్లు, కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. జనవరిలో పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టగా, ఏడుగురు భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
పఠాన్ కోట్ వద్ద పాక్ బోటు స్వాధీనం
పఠాన్‌కోట్: బెలూన్లు, పావురాలు, బోట్లు ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి భారత్ భూభాగంలోకి, భారత జలాల్లోకి అడుగుపెడుతూ గుబులు రేపుతున్న అంశాలివి. మొన్నటికి మొన్న గుజరాత్ తీరంలోకి దూసుకొచ్చి ఆందోళన సృష్టించిన పాక్ కు చెందిన బోటు ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈసారి మాత్రం పఠాన్ కోట్ ప్రాంతంలో.. అది కూడా ఖాళీ బోటు. పటాన్ కోట్ సెక్టార్ లో రావినది ప్రవాహానికి కొట్టుకొచ్చిన పాక్ కు చెందిన ఓ ఖాళీ బోటును అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ బోటులో ఏమీ లేదని, ఖాళీదని బలగాలు చెప్పాయి. నదిలో ప్రవాహం పెరిగిన కారణంగా ఈ బోటు కొట్టుకొచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నెల(అక్టోబర్ 2)న జాతీయ తీర ప్రాంత గస్తీ దళం గుజరాత్ తీరంలో ఓ బోటును అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిదిమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, వారు మత్య్సకారులని గుర్తించారు. పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిన తర్వాత ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్న విషయం తెలిసిందే. -
మోదీకి పాక్ 'పావురం' లేఖ
-
మోదీకి పాక్ 'పావురం' లేఖ
పఠాన్‌కోట్: పంజాబ్- పాకిస్థాన్ సరిహద్దు వద్ద పావురం లేఖలు కలకలం రేపుతున్నాయి. పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోగల సింబాల్ పోస్ట్ వద్ద.. పాక్ వైపు నుంచి వచ్చిన బూడిద రంగు పావురాన్ని ఆదివారం బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ఆ పావురం కాళ్లకు కట్టి పంపిన ఉర్దూ లేఖలో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. 'మోదీజీ మీ(ఇండియా)తో యుద్ధం చేయడానికి ఇక్కడి యువకులందరూ సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నాటి(1971 యుద్ధంనాటి) వాళ్లకింద లెక్కకట్టకండి..' అని రాసి ఉన్నట్లు పంజాబ్ పోలీసులు చెప్పారు. పావురాన్ని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. (సరిహద్దుల్లో పాక్ గాలిబుడగల దుమారం!) కాగా, శనివారం కూడా ఇదే తరహాలోగురుదాస్‌పూర్‌లోని ఘేసల్ గ్రామం గాలిబుడగలకు కట్టిన లేఖలు పాక్ నుంచి ఇండియాకు వచ్చి వాలాయి. గురుదాస్‌పూర్‌లోని ఘేసల్ గ్రామంలో రెండు బెలూన్ లేఖలను గుర్తించిన పోలీసులు.. ఆ లేఖలో 'మోదీజీ, సహనం అనే కత్తులు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి' అని ఉర్దూలో రాసిఉన్నట్లు చెప్పారు.సెప్టెంబర్ 23న కూడా పంజాబ్‌లో హోషియార్పూర్ జిల్లాలో ఉర్దూలో రాసి ఉన్న ఉత్తరంతో ఉన్న ఓ తెల్ల పావురాన్ని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
పఠాన్ కోట్లో హై అలర్ట్
-
పఠాన్ కోట్లో హై అలర్ట్
పంజాబ్ : పఠాన్‌కోట్‌లో ఆర్మీ అధికారులు మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు సమాచారం అందటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అనుమానితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా పంజాబ్ సరిహద్దు వద్ద మంగళవారం ఆర్మీ దుస్తులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తున్నట్లు పోలీసులకు ఫోన్లో సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు వందలమంది భద్రతా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ముష్కరులు దాడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. నగర్ ఎస్ఎస్బీ క్యాంప్‌పై దాడి చేశారు. దీనికి ప్రతిగా భారత భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగింది. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
పఠాన్‌కోట్‌లో హై అలర్ట్
గుర్దాస్పూర్ : ఉగ్ర కదలికల సమాచారం నేపథ్యంలో పఠాన్‌కోట్, గుర్దాస్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు శనివారం హైఅలర్ట్ ప్రకటించాయి. పఠాన్‌కోట్ లేదా గుర్దాస్పూర్ ప్రాంతాల్లో ఓ ట్రక్ సంచరిస్తుందంటూ శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ నుంచి వచ్చిన అనుమానాస్పద ఫోన్ కాల్‌తో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టీస్ టీమ్ (ఎస్డబ్ల్యూఏటీ), బీఎస్ఎఫ్కు చెందిన 400 మంది సిబ్బందితో పంజాబ్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆయా ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టారు. ముఖ్యంగా బటాలా పట్టణాన్ని ఆర్మీ, బీఎస్ఎఫ్ దళాలు జల్లెడ పట్టాయి. పఠాన్‌కోట్, గుర్దాస్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. -
పఠాన్‌కోట్‌లో హై అలర్ట్
పఠాన్‌కోట్: ఉగ్రవాదులు మరోసారి పంజాబ్ సరిహద్దు జిల్లాలు పఠాన్‌కోట్, గురుదాస్ పూర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఈ రెండు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా బటాలా పట్టణంలో శనివారం ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బంది భారీ ఎత్తున మోహరించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన నిఘా వర్గాలు ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసానికి కుట్రపన్నినట్లు గుర్తించారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. -
పఠాన్‌కోట్‌పై మరో ఉగ్రదాడి?
జమ్మూ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై జనవరి 2న జరిగిన ఉగ్ర దాడిని భారత్ ఇంకా మర్చిపోలేదు. అలాంటి దాడి మరొకటి జరిగే అవకాశం ఉందనీ, కొంతమంది ఉగ్రవాదులు ఇంకా పఠాన్‌కోట్ పరిసర గ్రామాల్లోనే దాగి ఉన్నారని చెప్పి పార్లమెంటరీ స్థాయీ సంఘం బాంబు పేల్చింది. సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోం శాఖ ఈ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉగ్రవాదులు గ్రామాల్లో దాక్కున్న విషయం తమకు గ్రామస్థుల ద్వారా తెలిసిందనీ, పఠాన్‌కోట్‌పై మరోసారి దాడి జరిగే అవకాశం గురించి ప్రభుత్వానికి తెలియజేశామని కమిటీ.. ప్రభుత్వానికి తెలిపింది. దీంతో స్థావరం వద్ద భద్రత పెంచారు. -
పఠాన్ కోట్‌ను మరిపించేలా మరో దాడి!
చండీగఢ్: భారత వైమానిక దళ స్థావరం పఠాన్‌కోట్‌పై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆ దాడిని మరిపించేలా మరో దాడిని చేసేందుకు కుట్రలు పన్నింది. ఈసారి దాడిని భారీ స్థాయిలో చేయాలని, దానికి పఠాన్ కోట్-2 అని పేరును కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ లో ఉన్న స్లీపర్ సెల్స్‌తో అన్ని ముఖ్యనగరాల్లో రెక్కీ నిర్వహిస్తోందని తెలిసింది. ఈ దాడిలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతోపాటు ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన కమాండర్ అవాయిస్ మహ్మద్ త్వరలోనే మలేషియాకు పంపిస్తున్నారట. అక్కడే అతడికి మలేషియా నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ఫేక్ పాస్ పోర్టులు ఇస్తారని తెలిసింది. ఇతడు పాకిస్థాన్‌కు చెందిన ఓకారా ప్రాంతవాసి అని తెలిపింది. ఇతడే ఇండియాలో రెండోసారి జరపబోయే దాడులకు నేతృత్వం వహిస్తాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థ హెచ్చరించింది. -
మరో సెల్ఫీ విషాదం.. బాలుడి మృతి
సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అలాంటి సంఘటనే ఆదివారం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట సెల్ఫీ తీసుకుంటూ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో తీవ్రంగా గాయపడ్డ యువకుడు నేటి సాయంత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి... పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్ సింగ్ కాంట్రాక్టరు. ఆయన వద్ద ఓ లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. ఈ క్రమంలో శుక్రవారం బంధువు ఇంట్లో శుభకార్యానికి భార్యతో సహా వెళ్లాడు. జరిగే దారుణాన్ని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఇంట్లో ఉన్న వారి 15 కుమారుడు ఏళ్ల రమన్‌దీప్ సింగ్ తన తండ్రి రివాల్వర్ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.. రివాల్వర్‌ను కణతకు ఆనించుకుని సెల్ఫీకి ఫోజిస్తూ.. ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై నొక్కడంతో రివాల్వర్ పేలింది. పేలుడు శబ్ధం విన్న చుట్టుపక్కల వాళ్లు తీవ్రంగా గాయపడ్డ రమన్ దీప్ ను ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రులు కూడా ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చి కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డారు. రెండు రోజులపాటు లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో ప్రాణాలతో పోరాడిన రమన్ దీప్ నేటి సాయంత్రం మృతిచెందాడు. రమన్ దీప్ ఇకలేడన్న వార్త విన్న బంధువులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
రివాల్వర్‌తో సెల్ఫీ తీసుకోబోయి...
పంజాబ్: సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి. అలాంటిదే ఓ ఘటన శుక్రవారం పఠాన్‌కోట్‌లో జరిగింది. అయితే కుర్రాడి అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది. పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్ సింగ్ కాంట్రాక్టరు. అతని వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. శుక్రవారం తెలిసిన వారింట్లో శుభకార్యానికి భార్యను తీసుకొని వెళ్లాడు. ఇంట్లోనే ఉన్న అతని కుమారుడు, 15 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ సొరుగులోంచి రివాల్వర్ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. రివాల్వర్‌ను కణతకు ఆనించుకొని సెల్ఫీకి ఫోజిచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై వేలుపడి రివాల్వర్ పేలింది. తుపాకీ శబ్ధం విన్న ఇరుగుపొరుగు వచ్చి చూడగా అమన్‌దీప్ గాయపడి ఉన్నాడు. అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. -
జైషే తీవ్రవాది మసూద్‌పై చర్చిద్దాం: చైనా
మాస్కో: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను యునైటెడ్ నేషన్స్ నిషేధ జాబితా1267లో చేర్చాలనే ఇండియా ప్రతిపాదనకు చైనా వ్యతిరేకత చూపడంపై రష్యా, ఇండియా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, చైనా మంత్రితో చర్చించారు. భారత్‌తో పాటు చైనాలో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయని వాటిని ఆపాలంటే ఇరుదేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చైనా సానుకూలతను చూపిందని, ఈ అంశంపై చర్చలు జరగాలని ఇరువర్గాలు భావించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. గత జనవరిలో పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండియా మసూద్‌ను నిషేధిత టెర్రరిస్టు జాబితాలో చేర్చాలని యూఎన్‌ను కోరింది. కాగా, మసూద్‌ను యూఎన్ జాబితాలో చేర్చేంతలా టెర్రరిస్టు కాదని, భారత్ కోరికను ఆపాలని చైనా యూఎన్‌ను కోరిన విషయం తెలిసిందే. -
'55 నిమిషాలు నడవడానికే సరిపోయింది'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ అధికారులు భారత అధికారులపై ఆరోపణలు చేశారు. పఠాన్ కోట్‌పై దాడిని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులే చేశారని భారత అధికారులు ఆధారాలు చూపించలేకపోయారని అన్నట్లు పాక్ కు చెందిన మీడియా వర్గాలు చెప్పాయి. పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొంతమంది అధికారులు మార్చి 29న పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారత ఎన్ఐఏ అధికారులు తమకు కేవలం 55 నిమిషాలు మాత్రమే ఎయిర్ బేస్‌లోకి అనుమతించారని, ప్రధాన మార్గం నుంచి కాకుండా ఏదో ఇరుకైనా మార్గం నుంచి తమను తీసుకెళ్లారని, వారిచ్చిన ఆ గడువు కేవలం నడిచేందుకు సరిపోయింది తప్ప ఆధారాలు సేకరించేందుకు వీలుకాలేదని అన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్ఐఏ అధికారులు మాత్రం మొత్తం ఘటనను పాక్ దర్యాప్తు బృందానికి వివరించామని, ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాన్ని కూడా చూపించామని అంటున్నారు. కొన్ని ఆధారాలు కూడా వారు స్వీకరించినట్లు చెబుతున్నారు. -
'ఎయిర్ బేస్‌లోకి పాక్ టీంకు అనుమతి'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు వస్తున్న పాకిస్థాన్ బృందానికి భారత్ స్వేచ్ఛను ఇచ్చింది. అవసరం అయిన ప్రతిచోట దర్యాప్తు చేసేందుకు వారికి అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు స్పష్టం చేశారు. 'పఠాన్ కోట్ దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా భారత్‌కు వస్తున్న పాకిస్థాన్ బృందం విషయంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు. మార్చి 27న వారు భారత్ వస్తున్నారని చెప్పారు. దాడి జరిగిన కీలక స్థావరం పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లోకి అనుమతిస్తారా అని ప్రశ్నించగా ఎక్కడ అవసరం అయితే అక్కడకు అనుమతిస్తామని చెప్పారు. -
భారత్ పై మరిన్ని దాడులకు తెగబడతాం!
ఇస్లామాబాద్: భారత్‌పై మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పాకిస్థాన్ ఉగ్రసంస్థలు హెచ్చిరిస్తున్నాయి. పఠాన్ కోట్ తరహాలో మరికొన్ని ఉగ్రదాడులకు పాల్పడుతామని నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దువా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ భారత్‌కు ఉగ్ర హెచ్చరికలు పంపాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా వ్యవహించాడని సయీద్ పై అభియోగాలున్నాయి. భారత్ కేవలం పఠాన్‌కోట్ కు ఒకవైపు మాత్రమే చూసిందని ఇంకా దాడులకు పాల్పడబోతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో బుధవారం చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సయీద్ భారత్‌ను రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. పాక్ తరహాలో భారత్ మారణహోమం సృష్టించలేదని.. పఠాన్‌కోట్ ఘటనలాంటివి పాక్ వల్ల సాధ్యం అంటూ గత నెలలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. కశ్మీర్ మిలిటెంట్ నాయకుడు, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ప్రజల్ని రెచ్చగొట్టే అంశాలపై మాట్లాడాడు. జనవరి 2న పఠాన్ కోట్ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని సలావుద్దీన్ గతంలోనే ప్రకటించాడు. ఐక్యరాజ్యసమితి 2008 లో జేయూడీని ఉగ్రవాద పార్టీగా ప్రకటిస్తూ సయీద్ ను ఉగ్రవాదిగా గుర్తించింది. సయీద్‌ను పట్టిస్తే దాదాపు 63 కోట్లు చెల్లిస్తామంటూ అదే ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. -
పఠాన్‌కోట్ కంటోన్మెంట్లో పాక్ గూఢచారి!
వ్యక్తిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు పఠాన్‌కోట్: ఉగ్రవాద దాడులకు గురైన పఠాన్‌కోట్ కంటోన్మెంట్లో ఓ భారత జాతీయుడిని పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి అతను ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని నిఘా సంస్థలు సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకున్నారు. పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌లోని భారత ఆర్మీ 29 డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఇష్రాద్ అహ్మద్ సహాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను ఐఎస్ఐకు అండర్ కవర్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని తాజాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతని స్మార్ట్ ఫోన్లో పఠాన్‌కోట్ లోని సున్నితమైన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు లభించాయని నిఘావర్గాలు నివేదించినట్టు సమాచారం. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దేశంలోనే అతి పెద్ద ఆర్మీ స్థావరం. వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. గత నెలలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎయిర్‌బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ దీనిని ఇటీవలికాలంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల జరిగిన ఉగ్రవాద దాడికి, ఇష్రాద్కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాదుల నుంచి అందిన సూచనల మేరకే అతను నడుచుకున్నట్టు అనుమానిస్తున్నారు. -
పాటియాలలో మరోసారి కలకలం!
పాటియాల : పఠాన్‌కోట్ సంఘటన మరవకముందే పంజాబ్‌లో మరోసారి కలకలం రేగింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి కారును అపహరించుకు వెళ్లారు. పాటియాలలోని దష్మిష్ నగర్లో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పఠాన్‌కోట్ రైల్లో ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు
పఠాన్‌కోట్: పఠాన్‌కోట్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ఆప్ఘనిస్తాన్ పౌరుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును ప్రారంభించారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై కొన్ని వారాల కిందట జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పఠాన్ కోట్ పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి వెళ్లింది. అన్ని రకాల కదలికలను పోలీసులు పసిగడుతున్నారు. అదీ కాకుండా ఈ మంగళవారం పఠాన్ కోట్ రైల్వే స్టేషన్లో బాంబు ఉన్నట్లు అలికిడి వినిపించడంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్కడ ఏం లేదని గుర్తించారు. పోలీసులు, బలగాలు ఇదే అప్రమత్తతను కొనసాగిస్తున్న నేపథ్యంలోనే అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ అఫ్ఘనిస్తాన్ వ్యక్తి పట్టుబడ్డాడు. -
పఠాన్‌కోట్‌లో 'బాంబు' కలకలం
-
పఠాన్‌కోట్‌లో 'బాంబు' కలకలం
పటాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ రైల్వేస్టేషన్లో మంగళవారం అనుమానాస్పద బ్యాగ్ లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పద బ్యాగును గుర్తించిన వెంటనే పట్టణంలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, బ్యాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అనుమానాస్పద బ్యాగును తనిఖీ చేస్తోంది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్రవాద హెచ్చరికలతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు చనిపోగా.. ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో ఏ చిన్న ఘటన జరిగినా స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. -
రికార్డు జెండా..
- 343 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ - అమర సైనికులకు ఘన నివాళి వెంకటాపురం(వరంగల్ జిల్లా) దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికులకు నివాళులు ఆర్పిస్తూ వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జోహర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 343 మీటర్ల జాతీయజెండాతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్ నుండి గ్రామంలోని చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. పఠాన్కోటిలో అమరులైన వీరసైనికులకు 343 మీటర్ల జాతీయ పతకాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆనంతరం జోహర్ పాఠశాలలో పఠాన్‌కోట్ లో మరణించిన ఆరుగురు వీరసైనికుల చిత్రపటాలను ఉంచి, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీతో పాటు ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, సీఆర్పీఎఫ్ ఎస్సై చరణ్‌సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ జాహీద్, సర్పంచ్ మహ్మద్ రహీమొద్దిన్ తదితరులు పాల్గొన్నారు. -
పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం..
-
పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం.. ఢిల్లీలో హై అలర్ట్
పఠాన్‌కోట్: ఉగ్రవాద దాడి నుంచి కోలుకుంటున్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. ఆచూకీ లేకుండా పోయిన క్యాబ్ డ్రైవర్ విజయక్ కుమార్ మరణించాడు. హిమాచల్ ప్రదేశ్‌లో అతని శవాన్ని పోలీసులు గుర్తించారు. ముగ్గురు అనుమానితులు విజయ్‌కుమార్‌ను చంపి కారుతో పరారయినట్టు భావిస్తున్నారు. ఈ ముగ్గురు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు సమాచారం. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపడుతున్నారు. పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఇటీవల ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు దాడికి ముందు ఎస్పీ కారును హైజాక్ చేశారు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్‌ను చంపి కారుతో పరారు కావడంతో ఇది ఉగ్రవాదుల చర్యే అని పోలీసులు భావిస్తున్నారు. -
మరోసారి ఉగ్ర కలకలం
పఠాన్ కోట్: పంజాబ్ లోని మరోసారి ఉగ్ర కలకలం రేగింది. పఠాన్ కోట్ కు సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి అక్రమ చొరబాబుదారుడిని బీఎస్ఎఫ్ సైనికులు హతమార్చారు. మృతుడు పాకిస్థాన్ దేశస్తుడిగా అనుమానిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు సరిహద్దు దాటి మనదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని నిలువరించేందుకు ప్రయత్నించినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. అయితే వారు వెనక్కు తగ్గకపోవడంతో కాల్పులు జరిపినట్టు తెలిపాయి. వీరిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పాకిస్థాన్ వైపు పారిపోయారని పేర్కొన్నాయి. ఈ నెల ఆరభంలో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అమృతసర్ లోని సీనియర్ పోలీసు అధికారి సాల్వీందర్ సింగ్ నివాసంతో పాటు పంజాబ్ లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. -
మసూద్ అజర్ అరెస్ట్ అబద్ధమా?
అవునంటున్న పాక్ అధికార వర్గాలు ‘పఠాన్‌కోట్’ దర్యాప్తు వివరాలనూ వెల్లడించని పాక్ న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ అరెస్ట్ విషయంలో పాకిస్తాన్ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. మసూద్ అజర్‌ను అరెస్ట్ చేయలేదని, ఆయన భద్రత నిమిత్తమే గృహ నిర్బంధంలో ఉంచామని ఇప్పటికే పంజాబ్ న్యాయశాఖ మంత్రి స్పష్టం చేయగా.. పఠాన్‌కోట్ దాడి దర్యాప్తులో భాగంగా అజర్‌ను అరెస్ట్ చేశారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సంబంధిత అధికారులు తాజాగా కుండబద్దలు కొట్టారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం కట్టుకథేనని నిఘా వర్గాల సమాచారం అధారంగా తేల్చిచెప్పారు. దాడి విషయంలో జైషేపైగానీ, ఆ సంస్థకు సంబంధించిన వారిపైగానీ కేసులు పెట్టినట్లుగా పాక్ ఇంతవరకు భారత్‌కు చెప్పలేదు. జైషే సంస్థకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు మాత్రమే పాక్ పేర్కొంది. మరోవైపు, పఠాన్‌కోట్ దాడిపై పాక్ అట్టహాసంగా ప్రారంభించిన దర్యాప్తు వివరాలను పాక్ వెల్లడించడం లేదు. గురుదాస్‌పూర్ ఎస్పీకి లై-డిటెక్టర్ పరీక్ష పఠాన్‌కోట్ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌పై లై-డిటెక్టర్ పరీక్ష జరిపేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ప్రత్యేక కోర్టు సోమవారం అనుమతించింది. మూడు రోజుల్లోగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ పరీక్షకు సల్వీందర్ కూడా అంగీకరించారని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. బీఎస్ఎఫ్ అధికారులపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ పంజాబ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు బీఎస్ఎఫ్ అధికారుపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడికి సంబంధించి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సరిహద్దుల వెంబడి దేశంలోకి ప్రవేశించేందుకు ఏమైనా లోపాలు సాయపడ్డాయా అనే అంశాన్ని తేల్చేందుకు ఈ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు చెప్పారు. -
'మేం పని పూర్తయ్యాకే స్పందిస్తాం'
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన దర్యాప్తుపై ఇప్పుడే స్పందించబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. అలా చేయడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొంది. పఠాన్ కోట్ లోని భారత వైమానిక స్థావరంపై ఈ నెల(జనవరి) 2న పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ పోలీసు అధికారులు పలువురు ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే, ఈ దర్యాప్తునకు సంబంధించి గత రెండు రోజులుగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే కొందరు మీడియా ప్రతినిధులు దర్యాప్తుపై ప్రశ్నించగా పాకిస్థాన్ న్యాయశాఖమంత్రి రాణా సనావుల్లా స్పందించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు తాము ఏ విధంగాను స్పందించబోమని ఆయన స్పష్టం చేశారు. విచారణ బృందం వారిపని వారు చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందికలిగించకుండా ఉండాలంటే ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. -
ఆ ముగ్గురికీ ముఖాముఖి ప్రశ్నలు?
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దాడికి ముందు తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, వదిలిపెట్టారని చెప్పిన పంజాబ్ ఎస్పీ సల్వీందర్‌ను నాలుగో రోజైన గురువారం సైతం ప్రశ్నించింది. ఆయనతో పాటు కిడ్నాపైనట్లు చెప్తున్న వంట మనిషిని.. వారిద్దరూ కిడ్నాప్‌కు గురయ్యేముందు సందర్శించినట్లు చెప్తున్న దర్గా సంరక్షకుడు సోమ్రాజ్ను ప్రశ్నించింది. కిడ్నాప్ పూర్వాపరాలకు సంబంధించి ఎస్పీ చెప్తున్న మాటల్లో పొంతన లేకపోవటం.. ముగ్గురు చెప్తున్న అంశాలూ పరస్పర విరుద్ధంగా ఉండటంతో మరింత స్పష్టత కోసం సల్వీందర్‌సింగ్, మదన్‌గోపాల్, సోమ్‌రాజ్‌లు ముగ్గురినీ కలిపి కూర్చోబెట్టి ప్రశ్నిస్తామని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. తాను పంజ్ పీర్ దర్గాకు తరచుగా వెళ్లేవాడినని ఎస్పీ చెప్తుంటే.. పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు తొలిసారిగా ఆయన ఆ దర్గాకు రావటం చూశానని, అంతకుముందు ఎన్నడూ రావటం చూడలేదని సోమ్రాజ్ చెప్తున్నాడు. ఎస్పీకి నిజనిర్ధారణ పరీక్ష నిర్వహించే అంశంపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. దీనానగర్ దాడితో పోలికలు... ఇదిలావుంటే.. పంజాబ్‌లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి.. దానికి కొన్ని నెలల ముందు అదే రాష్ట్రంలోని దీనానగర్‌లో ఒక పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రదాడికి పోలికలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. గత ఏడాది జూలై 27న సైనిక దుస్తుల్లో భారీ ఆయుధాలతో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు దీనానగర్‌లో ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించటంతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. వారి దాడిలో ఒక ఎస్పీ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పోలీసు బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ హతమయ్యారు. ఈ కేసును పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిని ఎన్ఐఏకు అప్పగించేందుకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌బాదల్ ఇటీవల నిరాకరించారు. -
'ఆ విషయం సైనికునికే వదిలేయాలి'
-
'ఆ విషయం సైనికునికే వదిలేయాలి'
న్యూ ఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాద దాడి ఘటనపై ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్ మూడు రోజులు సాగిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాల మధ్య పూర్తి సహకారం ఉందని దల్బీర్ సింగ్ తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కి ఉండటం వలన వారిని బయటకు రప్పించాల్సి రావడం, ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం మూలంగా కొంత సమయం తీసుకున్నామన్నారు. అయినా ఉగ్రవాదులను ఏరివేయడానికి ఎంత సమయం తీసుకుంటారనే విషయం యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికునికే వదిలేయాలని దల్బీర్ సింగ్ స్పష్టం చేశారు. నిఘా వర్గాల వైఫల్యం వలనే ఉగ్రదాడి జరిగిందన్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఇంటలిజెన్స్ వర్గాలకు చిక్కకుండా ఉగ్రవాదులు ఎలా వచ్చారనే విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోందన్నారు. ఈ దాడి ఘటన మనం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతోందన్నారు. -
పంజాబ్‌లో మళ్లీ కలకలం!
చండీగఢ్: పంజాబ్ లోని ఫిరోజ్‌పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల సంచారం మంగళవారం కలకలం సృష్టించింది. పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేసిన్లో ఇటీవలే పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ విషయం అందరికీ విదితమే. మళ్లీ కొన్ని రోజుల్లోనే ఆర్మీ దుస్తువుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్దాస్పుర్ లోని టిబ్రి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫిరోజ్‌పుర్ పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న జిల్లా. గుర్దాస్పుర్ నుంచి ఫిరోజ్‌పుర్ కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఉగ్రవాద చర్యలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని అనుమానాస్పద వ్యక్తులున్న భవనాన్ని చుట్టుముట్టారు. ఫిరోజ్పుర్లో హైఅలర్ట్ పరిస్థితి నెలకొంది. ప్రత్యేక బలగాలను, అదనపు పోలీసు సిబ్బందిని అక్కడికి తరలించినట్లు సమాచారం. ఆర్మీ సిబ్బంది ప్రస్తుతం ఆ భవనం సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరోజ్పుర్తో పాటు గుర్దాస్పుర్ జిల్లాలోనూ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. చెరకు పంట పొలాల్లో, సమీప గ్రామాల్లో పోలీసులు, ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుర్దాస్పుర్ స్థానికుడు ఇద్దరు ఆర్మీ దుస్తువులు ధరించిన ఇద్దరిని చూసినట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆర్మీ దుస్తువుల్లో వచ్చి పఠాన్‌కోట్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మృతిచెందడంతో పాటు 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
పంజాబ్‌లో మళ్లీ కలకలం!
-
పఠాన్‌కోట్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం..
-
చర్చలు జరపకపోవడమూ విదేశీ విధానమేనా?
అవలోకనం భారత్‌ను ఏ పార్టీ పాలిస్తోంది అనే దాంతో నిమిత్తం లేకుండా... పాకిస్తాన్ లేదా మరే దేశంతోనైనా వ్యవహరించడానికి మనకున్న అవకాశాలు మూడంటే మూడు మాత్రమే. అవి: చర్చలు, మధ్యవ ర్తిత్వం లేదా యుద్ధం. ఇవి తప్ప నాలుగో అవకాశం లేదు. చర్చలు జరపకపోవడం కూడా ఒకరకమైన విదేశీ విధానమేనని బీజేపీ తనకుతానుగా అభిప్రాయానికి వచ్చేసినట్లుంది. కానీ అది వాస్తవం కాదు. అది ఆ పార్టీ ఆగ్రహం లేదా చికాకుకు ప్రతిఫలనం మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్ విధానాన్ని ఎలా నిర్వహిస్తే బాగుం టుంది? భావోద్వేగ రహితంగా ఈ అంశాన్ని పరిశీలిద్దాం. సాధారణంగా విదేశీ విధానం కొంతమంది నిపుణుల ప్రత్యేక రంగంగా ఉంటుంది. న్యూజిలాండ్, నార్వే లేక నైజీరియా దేశాలతో భారత విదేశీ విధాన రూపురేఖలపై మీకు లేదా నాకు నిజంగానే ఏమీ తెలీదు. పైగా మనం దాన్ని పెద్దగా లెక్కించం కూడా. ఇలాంటి అంశాలపై ప్రజలకు అంతగా ఆసక్తి లేకపోవడం వల్లే, కొంతమంది నిపుణులు, రాజకీయ నేతలు రూపొందించే నివేదికలకు కాస్త సౌలభ్యం ఉంటుంది. ఇలాంటి దేశాలతో భారత్ వ్యవహార శైలిలో మార్పు చోటు చేసుకున్న ట్లయితే ఆ మార్పులను తీసుకురావడం చాలా సులభంగానే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో విదేశీ విధానం ప్రజా పరిధిలోకి వెళుతుంటుంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికన్ విదేశీ విధానం అనివార్యంగా దాని ఎన్నికల రంగంలోకి ప్రవేశించింది. ఏళ్లపాటు అమెరికా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన దేశాల వ్యవహారాల్లోకి అమెరికా దూకుడుగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. అల్‌కాయిదా దాడులకు వ్యతిరేకంగా అమెరికన్లు ప్రతీకారాన్ని డిమాండ్ చేయడంతో అమెరికా యుద్ధంలో అడుగుపెట్టింది. ఆ సమయంలో జాగరూ కతతో మెలగాలని సలహా ఇచ్చిన రాజకీయనేతలు (హిల్లరీ క్లింటన్ వంటివారు) యుద్ధాన్ని ప్రతిఘటించ లేకపోయారు. నాటి సైనిక చర్యల ఫలితం ఇప్పటికీ మనపై ప్రభావం చూపుతూనే ఉంది. అది భిన్నమైన విషయం అనుకోండి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే మన విధానం ఏ క్షణంలోనైనా సరే ప్రజా పరిధిలోకే వెళ్లిపోతుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ శక్తులు, పాక్ సైన్యం గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న చర్యల వల్ల భారత్‌కు కలిగిన నష్టం తొలికారణం. ఇదొక నిరంతర కథన రీతిలా సాగిపోతూనే ఉంటోంది. దీనిపై ప్రజాసక్తి అనేది (అనేక టీవీ చర్చల్లో ప్రతిబింబిస్తున్నట్లుగా) పూతమందులాగా పాక్‌స్తాన్‌పై మన విధానాన్ని ప్రేరేపిస్తూనే ఉంటోంది. మరోవైపున చూస్తే, ఉగ్రవాదం భారత్‌కు అంత పెద్ద సమస్య కాదు. కశ్మీర్, ఈశాన్య భారత్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని సంఘర్షణలను పక్కన బె డితే, 2015లో ఉగ్రవాదానికి మన దేశంలో 13 మంది మాత్రమే బైలైనారు. 2014లో నలుగురు, 2013లో 25 మంది, 2012లో ఒకరు మాత్రమే ఉగ్రవాద బారిన పడ్డారు. సైనిక చర్యల్లో హతులైన ఉగ్రవాదులు కూడా ఈ సంఖ్యల్లోనే భాగమ య్యారు. ఈ డేటా ప్రకారం చేస్తే ఏ రకంగా చూసినా, భారతీయులకు ఉగ్రవాదం ప్రధాన సమస్య కాదు. లెక్కలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే, ప్రతి ఏటా పోషకాహార లేమితో అయిదు లక్షల మంది భారతీయ పిల్లలు చనిపోతున్నారు. ఇన్ని లక్షల మంది పిల్లల మరణాల్లో కొన్నయినా మనల్ని ప్రభావితం చేసిన ట్లయితే శిశు మరణాల వంటి ఘటనలపై మన ఆగ్రహం మరింతగా పెరిగి వుండేది. ఇకపోతే, ఉగ్రవాదాన్ని, మన పాకిస్తాన్ పాలసీని ప్రజా పరిధిలోకి తీసుకొచ్చిన రెండో కారణం కూడా ఉంది. పాకిస్తాన్‌తో గత ప్రభుత్వాలు మెతకవైఖరితో వ్యవహరించాయంటూ బీజేపీ, ప్రత్యేకించి మన ప్రధాని పదే పదే చెబుతూ రావటం కూడా ప్రజాభిప్రాయంపై తనదైన ప్రభావం చూపింది. పాకిస్తాన్‌పై ‘గట్టి వైఖరి’ (బీజేపీ చేపడితే) మన సమస్యలన్నింటికీ పరిష్కా రం లభిస్తుంది. నిజమేనా? జరుగుతున్న పరిణామాలు దీనికి కాదనే సమాధా నాన్ని ఇస్తున్నాయి. ఇది అనివార్యం కూడా. భారత్‌ను ఏ పార్టీ పాలిస్తోంది అనే దాంతో నిమిత్తం లేకుండా... పాకిస్తాన్ లేదా మరే దేశంతోనైనా వ్యవ హరించ డానికి మనకున్న అవకాశాలు మూడంటే మూడు మాత్రమే. అవి: చర్చలు, మధ్య వర్తిత్వం లేదా యుద్ధం. యుద్ధం ద్వారా పాకిస్తాన్ లొంగిపోయేటట్లు మనం ఒత్తిడి చేయగలం. వివాదాలను పరిష్కరించవలసిందిగా మూడో పార్టీ లేదా పక్షాన్ని మనం కోరగలం. లేదా మనమే నేరుగా పాక్‌తో చర్చలు జరపగలం. ఇవి తప్ప నాలుగో అవకాశం లేదు. చర్చలు జరపకపోవడం కూడా ఒకరకమైన విదేశీ విధానమేనని బీజేపీ అభిప్రాయానికి వచ్చేసినట్లుంది. కానీ అది వాస్తవం కాదు. అది ఆ పార్టీ ఆగ్రహం లేదా చికాకుకు ప్రతిఫలనం మాత్రమే. మనం ఏం కోరుకుంటున్నామో దాన్ని ఇలాంటి వైఖరి సిద్ధింపచేయదు. ఇటీవల పఠాన్‌కోట దాడుల తర్వాత బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉందని చెప్పడం ద్వారా దేన్నీ సాధించలేము. పాకిస్తాన్‌నుంచి మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని కోరుకోవలసిన అవసరం ఉంది కాబట్టి పాక్‌తో మనం చర్చించవలసి ఉంటుంది: అదేమిటంటే, పాక్ జాతీయులు మన పౌరులను చంపకుండా హామీ పొందవలసి ఉంటుంది. మనకు అవసరమైన మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, మధ్యాసియా ప్రాంతాలకు ప్రవేశ సౌలభ్యం కూడా మనకు అవసరం. కాని ఇవి అప్రధానమైన ట్టివే. మనముందు ప్రస్తుతానికి ఉన్న మూడు అవకాశాల్లో యుద్ధం పరిష్కారమే కాదు. పొఖ్రాన్‌లో మనం చేసిన తప్పిదమే దీనిక్కారణం. 1988 సంవత్సరానికి ముందు పాకిస్తాన్ కంటే ఎక్కువగా సాంప్రదాయిక ఆయుధాలు మనవద్దే ఉండేవి. అమితమైన వ్యయంతోనే వీటిని సాధించామనుకోండి. మనం అణు పరీక్షలను నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత సాయుధ సన్నద్ధం చేసేలా నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఒత్తిడి కలిగించాం. మన చర్య ఫలితంగా వాళ్లు చాగైలో అణు పరీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితిని కొని తెచ్చాము. ఇప్పుడు నిజంగానే మనం ఆకాంక్షించినప్పటికీ, పాకిస్తాన్‌ను స్వల్ప స్థాయి లేదా మెరుపుదాడుల ద్వారా కూడా మనం ఇక ఎన్నటికీ శిక్షించలేం. పరిమిత దాడులను ప్రబోధిస్తున్న వారు అవి క్రమంగా పెరగవన్న హామీని ఇవ్వలేరు. పైగా అతి స్వల్పమైన సైనిక ప్రతిష్టను సాధించడం కోసం మన జీవితా లతో జూదమాడగల అత్యంత ప్రభావిత నేత మనకు అవసరముంటుంది. ఇక మూడోపార్టీ మధ్యవర్తిత్వానికి భారత్ వ్యతిరేకం కాబట్టి మనకిప్పుడు చర్చించడం అనే ఒకే ఒక్క అవకాశం ఉంది. ముంబై, పఠాన్కోట్లలో జరిగిన ట్లుగా స్పష్టమైన ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నప్పటికీ మనం చర్చలు జరపా ల్సిందే. మన ప్రయోజనం రీత్యానే చర్చలను మనం కొనసాగించాల్సి ఉంది. చర్చించకపోవడం అనేది ఉగ్రవాదాన్ని ఆపివేయదు. అదే చర్చలు జరపడంవల్ల అన్నికాలాల్లోనూ పౌరుల ప్రాణాలను బలిగొంటున్న మతిహీనమైన కాల్పుల ఘటనలను తగ్గించటంతోపాటు అనేక ప్రయోజనాలను మనం సాధించవచ్చు. ‘గట్టి వైఖరి’ అనే భావనను ప్రధాని మోదీ మన మీడియాలోనూ, సాధారణ ప్రజానీకంలోనూ బాగానే ప్రచారంలో పెట్టగలిగారు. స్వయంగా తానే కనుగొన్నట్లుగా ఇప్పుడాయన దీనికి బాధ్యత వహించాలి. సమస్యను స్పష్టంగా చిత్రించి, మనకున్న అవకాశాలను ఆయన నేరుగా ప్రజలకు వివరించగలిగితే.. పాకిస్తాన్‌తో వ్యవహరించేటప్పుడు మనకు నాలుగో అవకాశం కూడా ఉందని మనలో ముందునుంచీ పాదుకుని ఉన్న అభిప్రాయాన్ని మార్చివేయగలరు. తద్వారా భార తీయుల అపార విశ్వసనీయతను ప్రధాని అట్టిపెట్టుకోగలరు. పాత అభిప్రా యాన్ని సమర్థవంతంగా తప్పించడంలో ఆయనకు ఎలాంటి సమస్యా ఎదురు కాదు కూడా. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ
-
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ
పఠాన్‌కోట్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ పఠాన్‌కోట్ చేరుకున్నారు. ఇటీవల ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను ఆర్మీ, ఉన్నతాధికారులు.. మోదీకి వివరించారు. ఎయిర్‌బేస్‌ను మోదీ పరిశీలించారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. -
పఠాన్‌కోట్ దాడికి పాకిస్థాన్‌లోనే పథక రచన..!
-
'నా పొలం మీదనుంచే ఉగ్రవాదులు వెళ్లారనుకుంటా'!
బమియాల్: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోని బమియాల్ సెక్టార్లో పంటపొలాల నుంచి పఠాన్ కోట్ కు వచ్చినట్లు తెలిసింది. ఉల్లిగడ్డ, గోధుమ పంట పొలాల మధ్యలో నుంచి వారు వచ్చినట్లుగా స్పష్టమవుతోంది. 400 మీటర్ల నిడివిలో రెండు పాద ముద్రలు గుర్తించినట్లు ఆ పొలం యజమాని జస్పాల్ సింగ్ పక్కో ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ఆ పాదముద్రలు చూసి అనుమానించిన అతడు తన ఫోన్లో ఫొటోలు తీసుకొని వెళ్లి సమీపంలోని పోలీస్ స్టేషన్లో చూపించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న జాతీయ భద్రతా సంస్థకు ఈ రైతు ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది. అతడు ఎన్ఐఏ అధికారులకు ఏం చెప్పాడంటే..'డిసెంబర్ 31న సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో నా పొలానికి నీళ్లు పెట్టి వెళ్లాను. ఉదయాన్నే వచ్చి చూడగా బూటు ముద్రలు గుర్తించాను. ఆ సమయంలోనే ఇక్కాగర్ సింగ్ చనిపోయినట్లు నాకు తెలిసింది. నాకెందుకో అనుమానం వేసింది. ఆ బూటుగుర్తులు కూడా సాధారణంగా గ్రామస్తులుగానీ, బీఎస్ఎఫ్ జవాన్లుగానీ, ఆర్మీగానీ వేసుకొనేవాటితో పోలిస్తే చాలా పెద్దగా ఉన్నాయి. వెంటనేవాటిని ఫొటోలు తీసుకొని పోలీసుల వద్దకు వెళ్లాను' అని అతడు అధికారులకు వివరించాడు. -
'ఆలస్యమైనా ఎందుకో ఆరోజు దర్గా తెరిపించారు'
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరం పై దాడికి సంబంధించి విచారణ పలు అనుమానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దాడికి కొద్ది గంటలముందు కిడ్నాప్ కు గురైన గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ ఇప్పటికే చెప్పిన కథనంలో పొంతన లేని అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతుండగా ఈ ఘటన నేపథ్యంలో చెప్తున్న కొందరు ఇస్తున్న వివరణలు సల్వీందర్ సింగ్ ఏదైనా తప్పు చేశారా అనే అనుమానాలను పెంచుతున్నాయి. తాను పంజ్ పిర్ దర్గాకు తరుచుగా వెళ్లొస్తుంటానని, అలా వెళ్లొస్తున్న క్రమంలోనే తనను కిడ్నాప్ చేశారని చెప్పగా.. ఆ దర్గాను చూసుకునే సోమ్ అనే వ్యక్తి మాత్రం సల్వీందర్ సింగ్ ను తానెప్పుడు ఆ దర్గా వద్ద చూడలేదని అన్నారు. అయితే, డిసెంబర్ 31, రాత్రి 8.30 గంటలకు సల్వీందర్ తనకు ఫోన్ చేశారని, దర్గాను తెరిచి ఉంచాలని కోరాడని, అయితే అప్పటికే సమయం ముగిసినందున అది సాధ్యం కాదని చెప్పగా, తాను ఒక అధికారిగా చెప్తున్నానని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి దర్గాను తెరిచి ఉంచేలా చేశారని చెప్పాడు. అదే రోజు ఆయన స్నేహితుడు రాజేశ్ వర్మ కూడా రెండు సార్లు దర్గాకు వచ్చాడని తెలిపారు. అంతేకాకుండా ఆ ఆలయానికి అత్యంత సమీపంలో కొన్ని పాకిస్థాన్ కాలిబూట్ల గుర్తులు ఉన్నాయని, అది సరిహద్దుకు అతి సమీపంలో ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే గుర్తించింది. ఈ అనుమానాలు మరింత బలపడితే ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. చాలా లాజిక్స్ కూడా సల్వీందర్ సింగ్ పరోక్షంగా పాక్ ఉగ్రవాదులకు సహకరించారేమోనని అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. -
అవును.. లోపాలున్నాయ్!
-
అవును.. లోపాలున్నాయ్!
పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడికి అవి తోడ్పడ్డాయి: పరీకర్ ♦ అక్కడ ఉగ్రవాదులెవరూ లేరు.. అయినా కూంబింగ్ కొనసాగుతోంది ♦ ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో వచ్చారు.. ఆపరేషన్ కష్టమైంది ♦ పఠాన్‌కోట్‌ను సందర్శించాక మీడియాతో రక్షణమంత్రి వెల్లడి పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని లోపాలు దోహదం చేశాయని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ అంగీకరించారు. సుదీర్ఘ రక్షణగోడ ఉన్న ఎయిర్‌బేస్ లోపలికి ఉగ్రవాదులు ఎలా చొరబడగలిగారన్నది ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. అయితే భద్రతకు సంబంధించిన ప్రతి విషయాన్నీ బాహాటంగా చర్చించలేమన్నారు. పరీకర్ మంగళవారం ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్రవాదులందరినీ నిర్మూలించటం జరిగిందని.. అయితే స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ‘ఇప్పుడు లోపల అనుమానిత ఉగ్రవాది ఎవరూ లేరు. అయితే.. కూంబింగ్ ఆపరేషన్లు పూర్తయ్యే వరకూ దీనిని నిర్ధారణగా చెప్పను. ఈ ఆపరేషన్లు బుధవారం పూర్తికావచ్చు’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఉగ్రదాడిలో చనిపోయిన ఏడుగురు సైనిక సిబ్బందిలో.. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన ఫతేసింగ్, కుల్వంత్సింగ్ల కుటుంబ సభ్యులను కూడా ఆయన మంగళవారం కలిశారు. పరీకర్ ఏమన్నారంటే.. ► శనివారం ఉదయం 3:30 గంటలకు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. సోమవారం రాత్రి 7:30 గంటలకు ఆ ముష్కరులు చివరిసారిగా తారసపడ్డారు. ఆ తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్లు కూంబింగ్ కోసమే. ఆ ప్రాంతంలో చాలా బాంబులున్నాయి.. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవటంలో జాప్యం జరుగుతోంది. చివరి ఉగ్రవాది మృతదేహం బూబీ ట్రాప్(బాంబుల వల) కావచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆ మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇప్పటికే ఒకరిని బూబీ ట్రాప్‌లో కోల్పోయాం.. మరింత మందిని కోల్పోరాదు. రిస్కు తీసుకోలేం. ► ఉగ్రవాదులు ఏకే47 రైఫిల్లు, మోడిఫైడ్ అండర్ గ్రెనేడ్ బారెల్ లాంచర్లు, పిస్టళ్లు, స్విస్, కమాండో కత్తులు, -50 కిలోల బుల్లెట్లు, డజన్లకొద్దీ మేగజీన్లు, మోర్టార్ల వెంట తెచ్చారు. వారిపై ఆపరేషన్ చాలా కష్టంతో కూడుకున్నది. మూడు వేల మంది కుటుంబాలు, ఐదారు దేశాలకు చెందిన విదేశీ ట్రైనీలు (శిక్షణ కోసం వచ్చిన వారు) ఉన్న ఈ స్థావరంలోని ఆస్తులన్నిటినీ సురక్షితంగా ఉంచుకోవటంపైనే తొలుత దృష్టి కేంద్రీకరించటం జరిగింది. స్థావరంలోని అన్ని ఆస్తులూ.. వ్యూహాత్మక ఆస్తులు, భవనాలు, సిబ్బంది కుటుంబాలను రక్షించుకోవటం జరిగింది. ఉగ్రవాదులు దాక్కున్న భవనం ఒక్కటే దెబ్బతిన్నది. ► ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఏడుగురు భద్రతా సిబ్బందినీ అమరులుగా పరిగణిస్తాం. యుద్ధ పరిస్థితుల్లో చనిపోయిన సైనిక మృతులకు లభించే అన్ని ప్రయోజనాలూ వారికి వర్తిస్తాయి. మృతుల్లో గరుడ్ కమాం డో మినహా ఎవరూ ఆపరేషన్‌లో చనిపోలేదు. ఐదుగురు ఢిఫెన్స్ సెక్యూరిటీ కోర్ సిబ్బంది దురదృష్టవశాత్తూ చనిపోయారు. వారిలో జగదీశ్చంద్ర ఒక ఉగ్రవాదితో ప్రత్యక్షంగా కలబడి అతడిని హతమార్చాడు. వీరు అత్యుత్తమ త్యాగం చేసిన అమరులు. ► భద్రతకు సంబంధించి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. కానీ.. భద్రత విషయంలో రాజీపడటం జరిగిందని నేననుకోను. దర్యాప్తులు పూర్తయ్యాక అన్ని అంశాలూ స్పష్టమవుతాయి. భద్రతకు సంబంధించిన ప్రతి వివరాన్నీ బహిరంగంగా చర్చించలేం. ఈ దాడికి పాకిస్తాన్‌తో లింకు ఉందా అంటే.. ఉగ్రవాదులు ఉపయోగించిన కొన్ని పరికరాలు పాక్‌లో తయారయినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది దర్యాప్తులో ఉన్న అంశం కనుక దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించటం సరికాదు. ► సైన్యం, వాయుసేన, ఎన్ఎస్జీలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశాయి. ఈ మూడు విభాగాలు భవిష్యత్తులో సంయుక్త శిక్షణ చేపట్టాలి. ఉగ్రవాదులపై దాడికి సైన్యానికి చెందిన ప్రత్యేక బలగాలను కాకుండా ఎన్ఎస్జీని ఎంచుకోవటంపై విమర్శలు సరికాదు. ఎన్ఎస్జీలో సగం మంది సైన్యం నుంచే ఉన్నారు. అన్ని ఆయుధాలనూ ఆర్మీయే అందించింది. వారు కలసి సజావుగా పనిచేశారు. హతులైన ఉగ్రవాదుల్లో నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. రెండు మృతదేహాలు గుర్తుపట్టటానికి వీలు లేనంతగా కాలిపోయాయి. శరీరభాగాలు రెండు ప్రాంతాల నుంచి లభించాయి. కాగా, ఆపరేషన్ పూర్తవటంతో మంగళవారం రాత్రి ఎయిర్‌బేస్‌లోకి మీడియా ప్రతినిధులను అనుమతించారు. ఆ ప్రాంత దృశ్యాలు పోరాటానికి అద్దంపట్టాయి. మూగబోయిన తుపాకులు ఉగ్రదాడి నేపథ్యంలో 3 రోజుల పాటు తుపాకీ కాల్పులు, పేలుళ్లతో నాలుగో రోజు మంగళవారం ఎట్టకేలకు శాంతించింది. సైనిక చర్య.. సోమవారం రాత్రి ఆరో ఉగ్రవాదిని ఎదురు కాల్పుల్లో హతమార్చినట్లు భావిస్తున్నప్పటికీ.. భద్రతా బలగాలు ఈ స్థావరం పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకునేందుకు అణువణువూ గాలిస్తూ కూంబింగ్ చేస్తున్నాయి. . శనివారం తెల్లవారుజామున ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటం.. అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు వారిని నిలువరించి ఎదురు దాడికి దిగటం తెలిసిందే. శనివారమే నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఆదివారం, సోమవారమూ కొనసాగిన సైనిక చర్యలో మరో ఇద్దరు ఉగ్రవాదులను హతవుర్చారు. అయితే.. ఎయిర్‌బేస్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎంతమంది అనేది కచ్చితంగా తెలియటం లేదు. ఈ నేపథ్యంలో స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు. -
చర్యలా...చర్చలా త్వరగా తేల్చండి..
న్యూఢిల్లీ: పంజాబ్ లో పఠాన్‌కోట్ భారత వైమానిక దళ స్థావరం వద్ద టెర్రర్ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ భారత్ పొరుగుదేశం పాకిస్థాన్ పై ఒత్తిడిని తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. సకాలంలో చర్యలు తీసుకోండి...లేదంటే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఉండవని తేల్చి చెబుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ఒక వివరణ పత్రాన్ని పంపించింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్ లో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన రెండుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో జరగాల్సిన శాంతి చర్చలు ఉండవని పేర్కొంది. ఈ ఉగ్రదాడి వెనుక ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ హస్తం ఉందని భారత్ నమ్ముతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఆ దేశానికి సమర్పించింది. పంజాబ్ లోని బహావల్పూర్ సహా వివిధ ప్రాంతాల నుండి పాకిస్తాన్ కు వెళ్లిన అనేక ఫోన్ కాల్స్ ను తాము ట్రేస్ చేశామని, వాటిలో కొన్ని సంక్షిప్తంగానూ, కొన్ని దీర్ఘంకానూ సాగాయని భారత్ తెలిపింది. ఉగ్రవాదుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను పాక్ కు అందించింది. పాకిస్థాన్ నిజంగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్, తదితర నేతలను అరెస్ట్ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. కాగా పంజాబ్ లోని మోహాలిలో అదుపులోకి తీసుకున్న అష్ఫాక్ అహ్మద్, హఫీజ్ అబ్దుల్ షకుర్, ఖాసింజాన్ నుంచి మారణాయుధాలు, భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఓ పాకిస్తాన్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
మీ కప్పు టీ వల్ల.. ఏడుగురు అమరులయ్యారు!
ముంబై: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్‌ను నమ్మవద్దని తాము గతంలోనే ప్రధాని మోదీని హెచ్చరించామని గుర్తుచేసింది. ఇప్పటికైనా మోదీ ప్రపంచాన్ని ఏకం చేసే పనిని మాని.. భారత్‌పై దృష్టి పెట్టాలని ఘాటుగా సూచించింది. మన సరిహద్దులు సురక్షితంగా లేవని తాజా ఉగ్రవాద దాడి స్పష్టం చేస్తున్నదని, దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో ఉన్నా సోషల్ మీడియాలో అమరులకు నివాళులర్పించడం మినహా జాతీయ స్థాయిలో ఎలాంటి పని జరుగడం లేదంటూ శివసేన తన అధికార పత్రిక 'సామ్నా'లో తీవ్రపదజాలంతో ధ్వజమెత్తింది. ' నవాజ్ షరీఫ్‌తో కప్పు చాయ్ పంచుకున్నందుకు ప్రతిఫలంగా ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. మన సరిహద్దులు సురక్షితంగా లేవని, మన అంతర్గత భద్రత విధ్వంసపూరితంగా ఉందని తాజా ఘటన రుజువు చేస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులతో భారత ఆత్మగౌరవాన్ని పాకిస్థాన్ తుత్తునియలు చేసింది' అని శివసేన మండిపడింది. గతవారం లాహోర్‌లో నవాజ్ షరీఫ్ ఇంటికి ప్రధాని మోదీ అతిథిగా వెళ్లినా.. పాకిస్థాన్ మరోసారి మనల్ని మోసం చేసిందని, పాకిస్థాన్ నిజంగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్‌ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేసింది. -
భారత్‌పై దాడులు ప్రపంచానికి హెచ్చరికే..!
వాషింగ్టన్: భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగడంపట్ల అమెరికాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ప్రపంచానికి ఉగ్రవాదం నుంచి భారీ ముంపు పొంచి ఉందనడానికి ఇదొక హెచ్చరికలాంటిదని అన్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపైనా, మరోపక్క, అఫ్గానిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపైన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీలో కాంగ్రెస్ నేత బ్రాడ్ షెర్మాన్(61) ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్లో పర్యటించిన మూలంగానే ఈ దాడి జరిగిందని ఊహాగానాలు వెలువడుతున్నాయని, అయినా, ఆ రెండు దేశాల నేతల ఏ మాత్రం వీటికి వెరువకుండా పరిష్కార మార్గాలకోసం ముందుకు వెళ్లాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంకోసం చిన్న మూలాన్ని కూడా వదిలిపెట్టవద్దని, దాన్ని రూపుమాపి ఇరు దేశాలకు న్యాయం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్, పాకిస్థాన్ కు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహకారం అందించాలని కోరారు. ఈ దాడులు ప్రపంచ దేశాలకు మరో హెచ్చరిక అనే విషయం ఏ మాత్రం మర్చిపోకూడదని చెప్పారు. -
ఉగ్ర వేట
-
ఆధారాలను పరిశీలిస్తున్నాం: పాక్
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్ అందించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పాక్ కార్యాలయం తెలిపింది. దాడి ట్‌పై దాడి దురదృష్టకరమని.. జవాన్లు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొంటూ భారత ప్రభుత్వానికి, ప్రజలకు పాక్ తీవ్ర సంతాపం తెలిపింది. అలాగే.. సుస్థిర చర్చల ప్రక్రియలకు భారత్, పాక్‌లు కట్టుబడి ఉండాలని ఆకాంక్షించింది. మరోవైపు.. పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల ఫోన్ కాల్ రికార్డుల వివరాలు, పాక్‌లోని వారి సూత్రధారుల మొబైల్ నంబర్లు, వారు సరిహద్దుకు ఆవలి నుంచి వచ్చినట్లు ఆధారాలను.. మున్ముందు ఇరు దేశాల అధికారులు భేటీ అయినపుడు పాక్‌కు తప్పనిసరిగా అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
జాతీయ భద్రతనా.. నోబెల్ బహుమతా?
మీకేం కావాలో నిర్ణయించుకోవాలంటూ మోదీకి కాంగ్రెస్ వ్యంగ్య సూచన న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడిని ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ విరుచుకుపడింది. పఠాన్‌కోట్ ఘటనపై ప్రధాని మోదీ స్పందనను తప్పుబట్టిన కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యానికి ఇదో ఉదాహరణ అని దుయ్యబట్టింది. దేశంలో అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉందని సోమవారం పార్టీ చీఫ్ సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌కు చెందిన మాజీ కేంద్రమంత్రి మనీశ్ తివారీ ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ పలు ట్వీట్లు చేశారు. ‘ మియా మోదీ.. మీకు నోబెల్ బహుమతి కావాలా? జాతీయ భద్రత కావాలా? త్వరగా నిర్ణయించుకోండి. మీరేం కోరుకుంటున్నారు? మరిన్ని ఉగ్రదాడులనా? తక్షణమే పాక్‌తో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను రద్దు చేయండి’ అని డిమాండ్ చేశారు. పఠాన్‌కోట్ దాడిపై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. కాగా, దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మూడు కేసులను నమోదు చేసింది. -
‘పఠాన్‌కోట’ చెబుతున్నదేమిటి?
స్క్రిప్టు ఏ కొంచెమూ మారలేదు. భారత్-పాక్‌లు రెండూ చర్చలకు సిద్ధపడుతున్న సమయంలో ఉగ్రవాదులు యథాప్రకారం రెచ్చిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ పర్యటనకెళ్లి పదిరోజులు కాకుండానే పాకిస్థాన్‌వైపు నుంచి మన దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోటలో ఉన్న వైమానిక దళ స్థావరంపై శనివారం తెల్లారుజామున దాడికి దిగారు. ఏడుగురు భద్రతా సిబ్బందిని కాల్చిచంపడంతోపాటు 20మంది జవాన్లను గాయపరిచారు. ఉగ్రవాది మృతదేహం వద్దనున్న గ్రనేడ్‌ను నిర్వీర్యం చేయబోతూ ఒక లెఫ్టినెంట్ కల్నల్ కన్నుమూశారు. సోమవారం కూడా వైమానిక దళ స్థావరంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నదంటే ఇది ఏ స్థాయి దాడో అర్ధమవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో అఫ్ఘానిస్థాన్లోని భారత్ కాన్సుల్ జనరల్ కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం పంజాబ్‌లోనే మరోచోట ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకుని వారినుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నగరంలోకి కొందరు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం చెబుతోంది. ఈ ఉదంతాలన్నీ గమనిస్తే ఉగ్రవాదుల వ్యూహం ఎంత పకడ్బందీగా ఉన్నదో తెలుస్తుంది. దాడులకు అవసరమైన మనుషుల్ని సమీకరించి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అందజేసి, మారణాయుధాలిచ్చి పంపడం సాధారణ వ్యక్తులకూ, సంస్థలకూ సాధ్యంకాని పని. ఇరు దేశాలమధ్యా చర్చలు సాగడం ఇష్టంలేని పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలోని శక్తుల ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. ప్రస్తుత దాడికి కారణంగా భావిస్తున్న జైషే మహమ్మద్ సంస్థతో ఐఎస్ఐకి ఉన్న సాన్నిహిత్యం జగద్వితం. వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుందనుకునే ఆ స్థావరంలోకి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ప్రవేశించడాన్ని తేలిగ్గా తీసుకోలేం. వాస్తవానికి డిసెంబర్ 31నాడే ఉగ్రవాదులు అక్కడికి ప్రవేశించి ఉండొచ్చునని, వారు రెండు బృందాలుగా విడిపోయి సమయం కోసం కాచుక్కూర్చున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైమానిక దళ స్థావరంలో ఉన్న అత్యంత విలువైన యుద్ధ విమానాలను ధ్వంసం చేసి, తీవ్ర నష్టం కలిగించడంతోపాటు మన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. దీన్ని నిలువరించడంలో మన భద్రతా బలగాలు ప్రశంసనీయమైన పాత్రే పోషించాయి. అయితే సైనిక దుస్తుల్లో ఉన్నంతమాత్రానే ఉగ్రవాదులు స్థావరంలోకి ప్రవేశించగలగడం, వారి ఆనుపానుల్ని భద్రతా బలగాలు సకాలంలో పసిగట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కశ్మీర్, పంజాబ్ కలిసేచోట ఉన్న పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం అత్యంత కీలకమైనది. ఆ ప్రాంతంలో పటిష్టమైన ఫెన్సింగ్‌తోపాటు అటు పాక్ బలగాలూ, ఇటు భారత్ బలగాలూ నిరంతరం పహరా కాస్తుంటాయి. అయినా 2013 సెప్టెంబర్‌తో మొదలుపెట్టి ఇప్పటికి అయిదుసార్లు ఆ ప్రాంతంనుంచే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారు. పాక్ సైన్యం పుట్టించిన ఐఎస్ఐ ప్రాపకంతోనే ఇదంతా జరుగుతున్నది కనుక ఉగ్రవాదులు అటు నుంచి ఫెన్సింగ్ దాటడం కష్టమేమీ కాదు. కానీ ఇటు మన బీఎస్ఎఫ్ జవాన్ల అప్రమత్తత ఏమైపోయింది? మొదటిసారంటే తప్పిదమని సరిపెట్టుకోవచ్చు. కానీ పదే పదే అదే పునరావృతం కావడం ఆశ్చర్యకరం. ఆ సరిహద్దుల్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి అక్కడ అన్ని రకాలైన నిఘా వ్యవస్థలనూ ఏర్పాటు చేసి ఉంటే ఇది జరిగేది కాదు. ఇంతేకాదు...గురుద్వారాలో ప్రార్థనల కోసం వెళ్లి తిరిగొస్తున్న గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారని తెలిసినప్పుడు వెనువెంటనే అటు పోలీసులూ, ఇటు సైన్యం అప్రమత్తం కావాల్సింది. అది జరగలేదు. తనపై ఎవరో దాడిచేసి, కొట్టి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ చెప్పినప్పుడు ఉన్నతాధికారులకు అది నమ్మశక్యంగా కనబడలేదు. అది ఉగ్రవాదులపనేనని నిర్ధారించుకోనేసరికి దాదాపు 15 గంటల సమయం వృథా అయింది. వెంటనే ఆ పని జరిగితే పఠాన్‌కోట ఉదంతాన్ని నివారించగలిగేవారు. ఎస్పీ స్థాయి ఉన్నతాధికారే అబద్ధం చెబుతున్నారని భావించడమే కాదు...ఆయనకు వంత పాడుతున్నాడని ఎస్పీ సహాయకుడొకరిని పోలీసులు చావబాదారు! ఎస్పీ చెప్పింది నమ్మకపోవడానికి కారణమేం లేదు. మొన్న జూలై నెలలో అదే ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. అసలు ఉగ్రవాదులు తాము కిడ్నాప్ చేసింది ఎస్పీ స్థాయి అధికారినని తెలియక వదిలేశారా లేక మరే ఇతర కారణమైనా ఉన్నదా అనే కోణంలో మాత్రం దర్యాప్తు జరగవలసి ఉంది. ఇరు దేశాలూ చర్చలకు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా, అందుకు తేదీలు ఖరారైనప్పుడల్లా ఉగ్రవాదులు బరితెగించడం రివాజుగా మారింది. ఎప్పటిలానే పఠాన్‌కోట దాడిని సైతం పాక్ ఖండించింది. అయితే ఇది సరిపోదు. దాడి వెనకున్నవారి ఆచూకీని పాక్ రాబట్టగలగాలి. ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన చర్చలను తక్షణం నిలిపేయాలని మన దేశంలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాద దాడులు ఆగితే తప్ప చర్చలు సాధ్యంకాదని పాకిస్తాన్‌కు చెప్పాలని సలహా ఇస్తున్నారు. కానీ అది తెలివైన పనికాదు. నిజానికి ఇప్పుడే చర్చల అవసరం ఎక్కువుంది. దాడుల సందర్భంగా సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాదులిచ్చిన సమాచారాన్నీ, ఎస్పీ ఫోన్నుంచి పాక్‌లోని కుట్రదారులతో ఉగ్రవాదులు సాగించిన సంభాషణల్నీ, వాటికి సంబంధించిన నంబర్లనూ అందించి వాటి ఆధారంగా సూత్రధారులను పట్టుకోవాలని ఒత్తిళ్లు తీసుకురావాలి. అంతర్జాతీయంగా ఉగ్రవాద బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ విషయమై ప్రపంచ దేశాలు కూడా పాక్‌ను వదిలిపెట్టవు. ఉగ్రవాద దాడులతో చర్చలకు ఆటంకం కల్పించడంద్వారా సమస్యలు అపరిష్కృతంగా ఉండేలా...వాటి మూలాలు వెల్లడికాకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నామని పాక్ భద్రతా వ్యవస్థలోని ఒక వర్గం నమ్ముతూ ఉండొచ్చు. అలాంటి శక్తుల ఎత్తు పారకుండా చేయడమే మన లక్ష్యం కావాలి. మన ప్రధాని మోదీ అన్నట్టు ‘మానవాళికే శత్రువులు’గా పరిణమించిన ఉగ్రవాదులను తుదముట్టించడానికి ఇది చాలా అవసరం. -
అమరవీరులకు సలాం
-
ఆపరేషన్ పఠాన్‌కోట్
-
ఢిల్లీలో జైషే ఉగ్రవాదులు!
-
భారత్-పాక్‌ల మధ్య మైత్రి తమ ఉనికికే ప్రమాదం
-
ఎయిర్‌బేస్‌లో కమాండో ఆపరేషన్
-
మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతం
-
పఠాన్‌కోట్‌లో ఆపరేషన్ కొనసాగుతూనే..!
పఠాన్‌కోట్/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం ఆదివారం ఉదయం కూడా కాల్పులతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌లో నక్కిన ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతున్నదని, ఇప్పటికే సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను జవాన్ల నుంచి వేరుచేసిన బలగాలు.. వారిని ఏరివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్రంలోని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పటివరకు ఎయిర్‌బేస్‌లో ఎంతమంది ఉగ్రవాదులను ఏరివేశారు, ఇంకా ఎంతమంది నక్కి ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులతో కమాండోల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడి విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నది అధికారికంగా సరైన సమాచారం అందకపోవడం సందిగ్ధతకు దారితీస్తోంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు చనిపోయినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో నలుగురు శనివారం హతమయ్యారని ప్రకటించింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడటంతో మళ్లీ కలకలం రేగింది. శనివారం ఉదయం పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని దీటుగా తిప్పికొట్టిన బలగాలు నలుగురిని హతమార్చాయి. అయినా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ శనివారంతో ముగియలేదు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో దాగి ఉన్నట్టు తేలడం.. ఆదివారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడంతో బలగాలు మరో ఆపరేషన్ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఐదో ఉగ్రవాది మధాహ్నం హతమవ్వగా.. మరికొంత ప్రతిఘటన అనంతరం ఆరో ఉగ్రవాది కూడా మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఎయిర్ బేస్ లో ఆదివారం ఉదయం గ్రనేడ్ పేలిన ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తీసుకొచ్చిన గ్రనేడ్ నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది. -
ఐదో ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్
-
పాక్ నెంబర్‌తోనే ట్యాక్సీ బుక్ చేశారు!
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరం (ఎయిర్‌బేస్)పై దాడి చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగుచూస్తున్నాయి. తమను పంపిన పాకిస్థాన్ సూత్రధారులతో ఉగ్రవాదులు నిత్యం ఫోన్లో మాట్లాడుతూ వచ్చారని, అంతేకాకుండా పాక్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి ఉగ్రవాదుల కోసం ఓ ట్యాక్సీ కూడా బుక్ చేశారని తాజాగా తేలింది. భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు మొదట టయోటా ఇన్నోవా కారులో ప్రయాణించారు. ఈ కారు డ్రైవర్‌కు పాక్‌లోని సూత్రధారులు ఫోన్ చేసి వాహనం బుక్ చేసుకున్నారు. అయితే డ్రైవర్‌కు మొదటినుంచి పాక్ స్మగ్లర్లు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? లేక అది పాక్ మొబైల్ నెంబర్ అని తెలియకపోవడం వల్ల అతను ఉగ్రవాదులను తన వాహనంలో ఎక్కించుకున్నాడా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. పఠాన్‌కోట్‌లోని ఓ కీలక ప్రదేశం వరకు తమను తీసుకెళ్లి దింపాలని ఉగ్రవాదులు డ్రైవర్‌ను కోరారు. అయితే మధ్యలోనే ఇన్నోవా వాహనం పాడవ్వడంతో ఉగ్రవాదులు ఎస్పీకి చెందిన మహేంద్ర ఎస్యూవీ వాహనాన్ని హైజాక్ చేశారు. అందులో ఉన్న ఎస్పీని, ఆయన వంటవాణ్ని చితకబాది వదిలేశారు. వారితోపాటు ఉన్న మరో నగల వ్యాపారిని బందీగా పట్టుకొని కొంతదూరం వెళ్లాక అతన్ని గొంతు కోసి వదిలేశారు. ఈ క్రమంలోనే వారి మొబైల్ ఫోన్‌ను దొంగలించిన ఉగ్రవాదులు దానినుంచి మూడుసార్లు పాక్‌లోని తమ సూత్రధారులకు ఫోన్ చేశారు. వారు ఫోన్ చేసిన ఈ నెంబర్ నుంచే అంతకుముందు ఇన్నోవా డ్రైవర్‌కు కాల్ వచ్చింది. ఆ తర్వాత ఒక ఉగ్రవాది తన కుటుంబానికి ఫోన్ చేసి తాను ఆత్మాహుతి దాడిలో పాల్గొనబోతున్నట్టు చెప్పాడు. ఈ వివరాలన్నీ క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకొస్తున్న భద్రతా సంస్థలు ఉగ్రవాదుల వెనుక ఉన్న కీలక సూత్రధారులను గురించి కచ్చితమైన ఆధారాలు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
చాంపియన్ షూటర్ ఫతేసింగ్ కు కేంద్ర మంత్రి నివాళి
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడిలో అమరుడైన అంతర్జాతీయ ఛాంపియన్ షూటర్, సుబేదార్ మేజర్ ఫతేసింగ్(51) మృతిపట్ల కేంద్ర క్రీడాశాఖమంత్రి సర్బానంద సోనోవాల్ నివాళులర్పించారు. మేజర్ ఫతేసింగ్ మృతిపట్ల ట్విట్టర్లో విచారం వ్యక్తం చేశారు. ఫతేసింగ్ 1995నాటి తొలి కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు, ఒక రజత పతకం గెలిచారు. డోగ్రా రెజిమెంట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఫతేసింగ్ డిఫెన్స్ సెక్యూరిటీ కోర్లో విధులు నిర్వహిస్తున్నారు. మేజర్ చేసిన సేవల్ని పేర్కొంటూ ఆయనకు సెల్యూట్ అని ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు. పాక్ ముష్కరులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం దాడులు జరుపుతుండగా, ఉగ్రవాదులను తుదముట్టించే ఆపరేషన్‌లో ఆయన కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. దేశం ఒక గొప్ప రైఫిల్ షూటర్, కోచ్‌ను కోల్పోయిందంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. 2009లో డోగ్రా రెజిమెంట్ లో సుబేదార్ మేజర్ పదవి నుంచి 2009లో రిటైర్ అయ్యారు. అనంతరం డిఫెన్స్ సర్వీస్‌లో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. -
అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారంగానే..!
పఠాన్‌కోట్: గురుదాస్‌పుర్ వాసి అయిన రాజేశ్ వర్మ అదృష్టవంతుడనే చెప్పాలి. శుక్రవారం ఉదయం ఆయనను నలుగురు సాయుధ ఉగ్రవాదులు అపహరంచుకుపోయారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. చనిపోయి ఉంటాడని భావించి వదిలేసి పోయారు. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డ ఆయన.. పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరితీయబడ్డ అఫ్జల్ గురు మరణానికి ప్రతీకారంగా తాము పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడుతున్నట్టు ఉగ్రవాదులు తెలిపారని ఆయన చెప్పారు. 'మిత్రుడైన ఎస్పీ సల్విందర్‌సింగ్, ఆయన వంటమనిషితో కలిసి మేం సరిహద్దుల సమీపంలోని నోరాత్ జైమాల్‌సింగ్ బ్లాక్‌కు వెళ్లి నివాళులర్పించాం. అనంతరం తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ ఉగ్రవాదులు మా వాహనాన్ని అడ్డగించారు. ఆర్మీ యూనిఫాంలు ధరించి.. భారీ ఆయుధాలతో ఉన్న వారు మమ్మల్ని బలవంతంగా వారి వాహనాల్లో ఎక్కించుకున్నాను. మా ముగ్గురిని తాళ్లతో బంధించి తీవ్రంగా కొట్టారు' అని ప్రస్తుతం ఆస్పత్రి బెడ్ మీద కోలుకుంటున్న రాజేశ్ వర్మ తెలిపారు. 'అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే మేం ఎయిర్‌బేస్‌పై దాడి చేయబోతున్నామని వారు చెప్పారు. 'మీరు అఫ్జల్ గురును చంపారు. మేం ప్రతీకారం తీర్చుకుంటాం' అని ఉగ్రవాదులు పదేపదే చెప్పారు. వారి వద్ద భారీ ఆయుధాలతోపాటు, జీపీఎస్ నావిగేషన్ సిస్టం కూడా ఉంది. ఎయిర్‌బేస్ ఎక్కడుందో కూడా వారికి స్పష్టంగా తెలుస' అని ఆయన చెప్పారు. ' ఆ తర్వాత ఎస్పీని, అతని వంటవాడిని వదిలేశారు. నన్ను మాత్రం వెంట తీసుకెళ్లి నిత్యం కొడుతూ పోయారు. ఎయిర్‌బేస్ కొంత దూరంలో నా గొంతు కత్తితో కోసి.. చనిపోయి ఉంటానని భావించి వాహనం నుంచి కింద పడేసి పోయారు. కానీ నేను మాత్రం బతుకడానికి ప్రయత్నించారు. రక్తస్రావం కాకుండా గొంతు చుట్టు వస్త్రాన్ని కట్టుకున్నాను. ఆ తర్వాత సమీపంలోని గురుద్వారలోకి పరుగెత్తికెళ్లి అక్కడ ఉన్న వారి ద్వారా మా కుటుంబసభ్యులకు ఫోన్ చేయించాను. వారు నన్ను ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలు దక్కాయి' అని ఆయన వివరించారు. పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. దాడికి దిగిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. -
ఎన్ఎస్జీ, గరుడ కమాండోల మోహరింపు
-
పంజాబ్‌లో ఉగ్రదాడి: నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది. రెండు రోజుల క్రితమే ఎయిర్‌బేస్‌లోకి నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలర్డ్ ప్రకటించింది.