పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడి దాడులకు పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు.. దేశ రాజధాని ఢిల్లీనీ లక్ష్యంగా ఎంచుకున్నారు. జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఢిల్లీలోకి చొరబడ్డారని, వీరు భారీ దాడులకు, వీఐపీలను బందీలుగా పట్టుకునేందుకు కుట్ర పన్నారని నిఘా విభాగం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది