సాల్వీందర్ నివాసంలో సోదాలు
పఠాన్ కోట్: పంజాబ్ లోని మరోసారి ఉగ్ర కలకలం రేగింది. పఠాన్ కోట్ కు సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి అక్రమ చొరబాబుదారుడిని బీఎస్ఎఫ్ సైనికులు హతమార్చారు. మృతుడు పాకిస్థాన్ దేశస్తుడిగా అనుమానిస్తున్నారు.
ముగ్గురు వ్యక్తులు సరిహద్దు దాటి మనదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని నిలువరించేందుకు ప్రయత్నించినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. అయితే వారు వెనక్కు తగ్గకపోవడంతో కాల్పులు జరిపినట్టు తెలిపాయి. వీరిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పాకిస్థాన్ వైపు పారిపోయారని పేర్కొన్నాయి. ఈ నెల ఆరభంలో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అమృతసర్ లోని సీనియర్ పోలీసు అధికారి సాల్వీందర్ సింగ్ నివాసంతో పాటు పంజాబ్ లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.