పఠాన్‌కోట్: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా నుంచి అమృత్‌సర్ వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు పఠాన్‌కోట్ సమీపంలో శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దుల్లోని మమూన్ కాంట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పఠాన్‌కోట్-చంబా జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులుఉండగా.. చంబా నుంచి అమృత్‌సర్‌కు వెళుతోంది.
Comments
Please login to add a commentAdd a comment